గత కొంత కాలంగా, ఏపి, తెలంగాణా మధ్య, ఏమి లేని సమస్యను సృష్టించి, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటూ, పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తూ, హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని పై , ఏపి ప్రభుత్వం టెండర్లు పిలవటంతో, తెలంగాణా రాష్ట్రం అభ్యంతరం చెప్పటంతో, దీని పై కీలక పరిణామం చోటు చేసుకుంది. టెండర్లు పిలవటం వెంటనే నిలిపి వేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు, లేఖ రాసింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్ళద్దు అంటూ, ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆపేయాలి అంటూ, ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించాలని, తెలంగాణా ప్రభుత్వం రాసిన లేఖను కూడా, కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు, జత చేసి పంపించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్ళద్దు అని, కృష్ణా రివర్ బోర్డు తెలిపింది. డీపీఆర్ లేకుండా, ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా చేస్తారు అంటూ, కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.

దీనికి సంబంధించి ఏపి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ కు, కృష్ణా రివర్ బోర్డు సభ్యడు, హరికేష్ మీనా లేఖ రాసారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని లేఖలో తెలిపారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ నిర్మించాలి అంటే, అపెక్స్ కౌన్సిల్ లో అనుమతి తప్పనిసరి అని తెలిపింది. కృష్ణా బోర్డు అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్ట్ కడితే, తెలంగాణాలోని నాలుగు జిల్లాలు ఏడాది అయిపోతాయని, దాన్ని ఆపేయాలని, కేసిఆర్ కేంద్రానికి లేఖ రాసారు. దీంతో కేసిఆర్ ఫిర్యాదుకు స్పందించి, ఏపికి ముందుకు వెళ్లొద్దు అని కేంద్రం చెప్పింది. అయితే ఇక్కడ, కేసిఆర్, జగన్ కు మంచి రిలేషన్ ఉంది. ఏపికి, ముఖ్యంగా రాయలసీమకు ఇబ్బందిగా మారిన కాళేశ్వరం ఓపెనింగ్ కు కూడా జగన్ వెళ్ళారు. మరి ఇప్పుడు కేసిఆర్ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారో, జగన్ ఎందుకు కేసిఆర్ తో కలిసి, ఈ సమస్య సవ్యంగా సాగిపోయేలా ఎందుకు చూడలేదో మరి.

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ పదవీ కాలం, మరో సారి పొడిగించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇప్పటికే నీలం సాహనీ పదవి మరో మూడు నెలలు పొడిగించాలని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నీలం సహానీ పదవీ కాలం జూన్ 30తో ముగిసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త సీయస్ వద్దని, ఆమెను కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆరు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రం మూడు నెలలు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో, చీఫ్ సెక్రటరీ నీలం సహానీ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపధ్యంలో, మరోసారి ఆమె పదవీ కాలం పొడిగించాలని కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాసింది. చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ, 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె సుదీర్ఘ కాలం, సర్వీస్ లో అనే పదవుల్లో పని చేసారు. నల్గొండ, జాయింట్ కలెక్టర్ గా, మచిలీపట్నంలో అసిస్టంట్ కలెక్టర్ గా నీలం సహానీ పని చేసారు.

శిశు సంక్షేమ శాఖతో పాటు, మునిసిపల్ శాఖలో కూడా ఉన్నత పదవుల్లో పని చేసారు. 2019 నవంబర్ నెలలో ఎపి చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటికే ఒకసారి ఆమె బాధ్యతలు పొడిగించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో క-రో-నా వైరస్ అధికంగా ఉన్న సమయంలో, ఆమెనే కొనసాగించాలని, కొత్త వారు అయితే సెటిల్ అవ్వటం కష్టం అని లేఖలో రాసారు. మరో మూడు నెలలు అనుమతి కోరారు. అయితే ఈ సారి మాత్రం పొడిగింపు కష్టం అని తెలుస్తుంది. కేంద్రంలో పని చేస్తున్న హెల్త్ సెక్రటరీ ప్రతీసూడాన్ పదవీ కాలం ఏప్రిల్ తో ముగియటంతో, క-రో-నా దృష్టిలో పెట్టుకుని పొడిగించారు. ఇప్పుడు ఆమె పదవీ కాలం ముగుస్తు ఉండటంతో, పొడిగింపు లేదని కేంద్రం చెప్పటంతో, ఆమె రిటైర్ కానుకున్నారు. కేంద్రంలో ఉన్న వారికే పొడిగింపు లేకపోతే, రాష్ట్రంలో పని చేస్తున్న వారికి పొడిగింపు ఇచ్చే అవకాసం లేదని తెలుస్తుంది. చూద్దాం కేంద్రం ఏమి చేస్తుందో.

ప్రభుత్వంలో అనేక జీవోలు విడుదల అవుతూ ఉంటాయి. పరిపాలనకు సంబంధించి నిర్ణయాలు, అపాయింట్మెంట్లు, బడ్జెట్ విడుదల, ఖర్చులు, బిల్లులు, ఇలా అనేకం ప్రతి రోజు జీవొల రూపంలో విడుదల అవుతూ ఉంటాయి. అయితే సహజంగా ఈ జీవోలు ఆయా శాఖల ప్రధాన కార్యదర్శి కాని, ముఖ్య కార్యదర్శి కాని, కార్యదర్శి స్థాయిలో ఉన్న అధికారి కానీ, ఈ జీవోలు విడుదల చేస్తూ ఉంటారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఈ జీవోల రూపంలో అమలులోకి వస్తాయి. అయితే ఈ మధ్య వచ్చే జీవోలు చాలా వరకు ప్రవీణ్ ప్రకాష్ పేరుతోనే వస్తున్నాయి. దీని పై చర్చ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు జీఏడీలో మరో కలకలం రేగింది. ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, డీజీపీ పేరుతొ జీవో విడుదల అయ్యింది. నిన్న డీజీపీ పేరు మీద విడుదల అయిన జీవో చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా వర్గాలు కూడా, పొరపాటున, వచ్చింది ఏమో అనుకుని, ఎంక్వయిరీ చేసారు కూడా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్రమ మద్యం, అక్రమ ఇసుక, లాంటివి నిరోధించటానికి, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అనే ఒక కొత్త శాఖ, పోలీస్ డిపార్టుమెంటుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. వీళ్ళు, రాష్ట్ర సరిహద్దులతో పాటుగా, రాష్ట్రంలో అనేక చోట్ల, వాహనాలు తనిఖీ చేస్తూ, అక్రమ మద్యం పట్టుకుంటున్న వార్తలు, ఈ మధ్య మనం తరుచు వార్తల్లో చూస్తున్నాం. ఈ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అనే సంస్థను, సియం పర్యవేక్షించే, జీఏడీ విభాగం కిందకు తెస్తూ ఇచ్చిన జీవో, డీజీపీ గౌతం సవంగ్ ఇవ్వటం, చర్చకు దారి తీసింది. ఈ శాఖకు వివిధ ఆర్ధికా పరమైన కార్యక్రమాలు నిర్వచించే వీలులో భాగంగా, దీన్ని జీఏడీలోకి తెచ్చారు. అయితే, దీనికి సంబంధించి జీవో, ఎప్పుడు లేని విధంగా ఒక డీజీపీ ఇవ్వటం, చర్చకు దారి తీసింది. ఈ పరిణామం పై సచివాలయంలోని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య చర్చ జరుగుతుంది. ఇక ముందు ముందు, ఎవరు జీవోలు రిలీజ్ చేస్తారో అని చర్చించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై, సిబిఐ విచారణ ముమ్మరం చేసింది. గత పదమూడు రోజులుగా సిబిఐ విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే పులివెందులలో వైఎస్ వివేక ఇంటికి వెళ్లి, హత్య జరిగిన తీరు సీన్ రీ-కన్స్ ట్రక్షన్ చేసిన సిబిఐ, అక్కడ వాచ్మెన్ తో పాటుగా, డ్రైవర్ ఇతరులును ఇప్పటికే సిబిఐ విచారణ చేసింది. మరో పక్క కీలక ఆధారాలు, కూడా సిబిఐ రాబట్టింది. ఇక ఇప్పటి వరకు అందరికంటే, వైఎస్ వివేక కూతురు, వైఎస్ సునీతను విచారిస్తూ, ఆవిడ దగ్గర నుంచి, ఎవరెవరి మీద అనుమానం ఉంది, ఎందుకు అనుమానం అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రిందట వైఎస్ సునీతను, ఏడు గంటల పాటు విచారణ చేసారు. ఆమె చెప్పిన ఆధారాలు ప్రకారం, అనుమానాలు ప్రకారం, నిన్న వైఎస్ కుటుంబ సన్నిహితుడు, అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన, శివశంకర్‌ రెడ్డిని నిన్న విచారణ చేసారు.

అయితే ఈ రోజు మళ్ళీ వైఎస్ సునీతను విచారణకు పిలివటం, ఆవడిను ఉదయం నుంచి విచారణ చెయ్యటం ఆసక్తి రేపుతుంది. అంతే కాకుండా, ఈ రోజు వైఎస్ సునీత వస్తూ, ఆమె చేతిలో ఒక నల్ల బ్యాగు తీసుకు రావటంతో, ఆమె ఏమి ఆధారాలు తీసుకు వచ్చారు అనే అంశం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. హత్య కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో, వైఎస్ సునీత వచ్చినట్టు తెలుస్తుంది. ఆమె ఏమి ఆధారాలు చెప్పారు ? ఎవరికీ సంబందించిన ఆధారాలు అనే విషయం చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 15 మంది పై అనుమానం వ్యక్తం చేస్తూ, వైఎస్ సునీత హైకోర్టు లో అఫిడవిట్ వేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే కొంత మందిని విచారణ చేసిన సిబిఐ , త్వరలోనే అతి కీలకమైన వ్యక్తులను విచారణ చేయ్యనుంది. ఇప్పటికే, రెండు సిట్ లు విచారణ చేసి, ఎవరు చంపారు అనేది తేల్చలేక పోయారు. ఇప్పటికైనా, సిబిఐ, అసలు చంపింది ఎవరు ? ఎందుకు చంపారు అనే వాస్తవాలు తెలుస్తాయో లేదో.

Advertisements

Latest Articles

Most Read