తెలుగుదేశం పార్టీ గళం పట్టాభి. వైసీపీ అవినీతి, అక్రమాలపై గర్జించే అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఆ వాయిస్ ని తట్టుకోలేక వైసీపీ దా-డు-లు చేయించింది. నీచమైన ట్రోలింగ్ పాల్పడింది. అయినా ఒక్క ఇంచు కూడా తగ్గని నిజాయితీ, టిడిపి పట్ల నిబద్ధతతో కూడిన నైజం పట్టాభిది. దాడులతో భయపెట్టలేకపోయారు. అక్రమకేసులతో లొంగదీసుకోలేకపోయారు. బూతులతో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనుకున్నారు. తెలుగుదేశం పట్టాభి పంతం ముందు నిలవలేకపోయారు. అందుకే ఇప్పుడు పరువునష్టం పేరుతో పట్టాభి గళానికి కళ్లెం వేయాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. సంకల్ప్ సిద్ధి సంస్థ కేసులో పట్టాభి చేసిన తనపై చేసిన ఆరోపణలతో పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఈ కేసుని వంశీ దాఖలు చేశారు. సంకల్ప్ సిద్ధి గొలుసుకట్టు స్కీం పేరుతో దాదాపు వెయ్యి కోట్లకు పైగానే దోచేసిన మోసగించిన దానిపై కేసులు నమోదయ్యాయి. సంకల్పసిద్ధి భాగస్వాములైన గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్‌లు కొడాలి నాని, వల్లభనేని వంశీల బినామీలని పట్టాభి ఆరోపించారు. సంకల్పసిద్ధిలో పెట్టిన సొమ్ముని వల్లభనేని వంశీ, కొడాలి నాని వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లోనే డీజీపీని కలిసి వంశీ ఫిర్యాదు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని వల్లభనేని పట్టాభికి నోటీసులు పంపించారు. తాజాగా పరువునష్టం దావా వేశారు.
news
ఫ్లాష్.. ఫ్లాష్... జగన్ ఢిల్లీ విమానం అత్యవసర లాండింగ్...
జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లైట్ టెక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే, ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ వెంటనే మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేసింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం రావటంతో, ఫ్లైట్ మళ్ళీ వెనక్కు వచ్చేసింది. గాల్లో చక్కర్లు కొట్టి, కొద్ది సేపటికి కిందకు దిగేసింది. అయితే అప్పటికే జగన్ కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. జగన్ ఫ్లైట్ తిరిగి రావటంతో, సెక్యూరిటీకి ఒక్కసారి అర్ధం కాలేదు. మళ్ళీ జగన్ కాన్వాయ్ తిరిగి వచ్చింది. జగన్ మళ్ళీ తిరిగి తాడేపల్లి వెళ్లిపోయారని చెప్తున్నారు. మరి మళ్ళీ ఢిల్లీ వెళ్తారో లేక, ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందో చూడాలి మరి.
బాంబు పేల్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంత విధేయుడి పై కూడా జగన్ నిఘా ఎందుకు పెట్టారు?
ఇటీవల కాలంలో వైసీపీ కీలక నేతలపై వైసీపీ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేయడం నెల్లూరు నుంచి ఆరంభమైంది. ముందుగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అసమ్మతి గళం ఎత్తారు. ఆ తరువాత నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్కారు తీరుని ఎండగట్టారు. వెనువెంటనే సీఎం నుంచి పిలుపురావడం, తాడేపల్లిలో తలంటడం జరిగిపోయాయి. అయితే మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోను ట్యాప్ చేస్తున్నారని, ఈ విషయం తెలుసుకుని వారికి ఏం కావాలనుకుంటున్నారో అవే మాట్లాడుతున్నానంటూ కుండబద్దలు కొట్టారు. తన దగ్గర చాలా సిమ్‌లు ఉన్నాయని, చేతనైతే వాటిని కూడా ట్యాప్ చేయండి అంటూ సవాల్ విసిరారు. అవసరమైతే నా ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం తెలియడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై చాలా రోజులుగా వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని అర్థమవుతోంది. ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కోటంరెడ్డి కలిశారు. అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన ఎమ్మెల్యేలు అందరిపైనా నిఘా ఉందని ప్రచారం సాగుతోంది.
తారకరత్న కోలుకోవాలని ఎన్టీఆర్ ఫ్యామిలీ.. చనిపోతే రాజకీయం చేయొచ్చని పేటీయం సైకోల ప్రార్థనలు
వైసీపీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తారకరత్న పైకి పోతాడంటూ నవ్వుతూ పైశాచిక ప్రకటన చేశారు. నారా వారి పాదయాత్ర ఆరంభంలో నందమూరి వారసుడు గుండెపోటుతో పోవడం శుభసూచకమంటూ వికృతానందాన్ని బయటపెట్టుకున్నాడు. మరోవైపు నందమూరి కుటుంబంలో ఎవరికి వారుగానే ఉండే వాళ్లంతా ఒక్కసారిగా తమ ఇంటి బిడ్డ కోలుకోవాలని ప్రార్థనలు, పరామర్శలకు వచ్చారు. నందమూరి తారకరత్న రాజకీయంగా పెద్ద అనుభవం లేదు. సినిమా స్టార్‌గానూ పెద్దగా పేరుప్రతిష్టలు లేవు. అన్న నందమూరి తారకరామారావు మనవడిగానే ఈ రెండు రంగాలకీ పరిచయం అయ్యాడు. ఇటీవల కాలంలో రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరిచాడు. యువగళం పాదయాత్రకి నెల రోజుల ముందే సంఘీభావం ప్రకటించాడు. పాదయాత్రలోనూ పాల్గొన్నాడు. తనకు తెలుగుదేశం టికెట్ ఇస్తే పోటీచేస్తానంటూ ఆసక్తి కనబరిచాడు. మామయ్య చంద్రబాబుని మించిన నాయకుడు లేడంటూ తెలుగుదేశంపైనా, సీబీఎన్ నాయకత్వంపైనా అచంచల విశ్వాసం ప్రకటించాడు. అంతలోనే హార్ట్ ఎటాక్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే నందమూరి-నారా కుటుంబాలన్నీ తారకరత్న కోసం నిద్రాహారాలు మాని ప్రార్థనలు చేస్తున్నారు. నేరుగా బెంగళూరు చేరుకుని ఆస్పత్రిలో తారకరత్నని చూసి వస్తున్నారు. మామ చంద్రబాబు, మేనత్త పురందేశ్వరి, బాబాయ్ బాలయ్య, అన్నయ్య మోహన కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బ్రాహ్మిణి,, ప్రణతి, నందమూరి సుహాసిని, మామయ్యలు, అత్తయ్యలు, బాబాయ్‌లు ఒకరేమిటి నందమూరి-నారా కుటుంబాలు మొత్తం తారకరత్న కోసం ఒక్కటయ్యారు. సినిమాలు, వ్యాపారాలు వేరువేరుగా ఉన్నా.. కష్టమొస్తే మేమంతా ఒక్కటేనని ఎన్టీఆర్ కుటుంబం తారకరత్న విషయంలో చాటిచెప్పారు.