gas subsidy 25032016

ప్రతి నెల మన ఇంట్లో సమస్య...గ్యాస్ వాడు వచ్చి బండ వేసి వెళ్ళినాక, మన ఎకౌంటులో డబ్బులు పడ్డాయో లేదు SMS చెక్ చేసుకుంటూ ఉంటాం. ఆ SMS వచ్చేదాకా నిద్రపట్టదు. టైం కి డబ్బులు పడక పొతే, ఇక టెన్షన్ మొదలవుద్ది. గ్యాస్ వాడికి ఫోన్ చేస్తే బ్యాంకు వాళ్ళని అడగమంటారు. బ్యాంకు వాళ్ళని అడిగితే గ్యాస్ వాళ్ళని అడగమని చెప్తారు. ఏమి చెయ్యాలో తెలియదు, ఎవర్ని అడగాలో తెలీదు. ఇది తెలుసుకోవటం చాలా ఈజీ.

ఈ సమస్య ముఖ్యంగా కొత్తగా బ్యాంకు ఎకౌంటు తెరిసిన వాళ్ళకి, లేకపోతె రెండు ఎకౌంటులు ఉన్నవాళ్ళకి వస్తుంది. మన ఆధార్‌ నంబర్‌ జత చేసి ఉంటాం కాబట్టి, ఒకో సారి వేరే ఎకౌంటులో పడుతుంది. కాబట్టి రెండు ఎకౌంటులు చూసుకోవాలి. అది ఏ ఎకౌంటులో పడుతుందో మీ మొబైల్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. మొబైల్‌లో*99*99# నొక్కితే, మీ ఆధార్‌ నంబరు అడుగుతుంది. అంతే మీ ఆధార్‌ నంబరు చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానమైందో.. చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది.

అప్పటికీ సమస్య పరిష్కారం అవ్వకపోతే:
18002333555 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదివ్వొచ్చు. తెలుగులో మాట్లాడేవాళ్ళు కుడా ఉంటారు. 18002333555 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి, తెలుగు కోసం 3 నొక్కి ఎంపిక చేసుకోవాలి.. ఆ తరవాత ఏ గ్యాస్‌ సంస్థ అనేది నంబరు ద్వారా ఇవ్వాలి.. ఇండియన్‌ గ్యాస్‌ కోసం 1 నొక్కాలి, హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీ) కోసం 2, భారత గ్యాస్‌ కోసం 3 నొక్కాలి.. ఇప్పుడు రాయితీ సమస్య అయితే 1, ఇతర సమస్యల కోసమైతే 2 నొక్కి వేచి ఉండాలి.. సంబంధిత గ్యాస్‌ సంస్థ ప్రతినిధి మీతో మాట్లాడుతారు.. మన సమస్య చెప్పి ఫిర్యాదు నంబరు (ఎస్‌ఆర్‌ నంబరు) తీసుకోవాలి. ఆ నంబరు మన మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది.

suresh raina suiside 25032016

రూమర్ కాదు నిజం. టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. మొహంపై మూత్రం పోసి సీనియ‌ర్లు ర్యాంగింగ్ చేయ‌డంతో రైనా సూసైడ్‌కు ప్ర‌య‌త్నించాడు. కాని రైనాకు ప్రాణాపాయం ఏమీలేకుండా పోయింది.

అదేంటి, రైనా హాయిగా సౌతాఫ్రికా మ్యాచ్ కోసం ప్రాక్టీసు చేసుకుంటుంటే, ఇదేంటి సొల్లు రాస్తున్నారు అనుకుంటున్నారా. రైనా సూసైడ్‌కు ప్ర‌య‌త్నించింది, సీనియ‌ర్స్ ర్యాంగింగ్ చేసింది నిజం. కాని అది ఇప్పుడు కాదు, ఇప్పటి సీనియ‌ర్లు కాదు. ఇదంతా జరిగింది రైనా 13 ఏళ్ళ అప్పుడు అంట. ఈ విషయం రైనా స్వయంగా చెప్పాడు. రైనా లక్నోలో ని స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు తీవ్ర వత్తిడికి గురియ్యేవాడు అంట. ఒక రోజు నిద్రలో ఉన్నప్పుడు, మొహంపై మూత్రం పోసి సీనియ‌ర్లు ర్యాంగింగ్ చేసారు అంట. ఇంకో సందర్భంలో హాకీ బ్యాట్ తో కొట్టారు అంట. ఆ సమయంలో తీవ్ర వత్తిడి గురియిన రైనా ఆత్మహత్యకి పాల్పడ్డాడు అంట. కాని లక్కీగా ప్రాణాపాయం నుంచి బయటపడి, టీంఇండియా స్టార్ బాట్స్ మాన్ అయ్యాడు.

siva ajith cinema 24032016

వేదాళంసినిమా తో భారి విజయం అందుకుని, ఆ విజయాన్ని ఆస్వాదించడానికి  కొంచెం విశ్రాంతి తీసుకున్న కోలివుడ్ స్టార్ హీరో అజిత్ ఇప్పుడు తన తదుపరి  చిత్రంపై దృష్టి సారించారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం .. ఇది వరకు వీరి ఇద్దరి కాంబినేషన్ లో " వీరం " , " వేధాలమ్"  వంటి భారి విజయాన్ని అందుకున్న సినిమాలు వచ్చాయి.. దీనితో  వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రంగా అజిత్ 57వ సినిమా నిలువనుంది. స్ర్కిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కోలీవుడ్‌ టాక్‌. మే 1 వ తేది అజిత్ పుట్టినరోజు..ఆ సందర్బంగా చిత్రం గురించిన  అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు...అయితే డైరెక్టర్  వెట్రి ఈ సినిమా కి  సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టనుండడం విశేషం .. సత్య జ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై టీజీ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. 

virat kohli at stamford bridge 25032016

విరాట్ కోహ్లీ, చాలా కొద్ది వ్యవధిలో, సచిన్ అంత పేరు తెచ్చుకున్నాడు, క్రికెట్లో. యవతను ప్రస్తుతం కోహ్లీ మానియా ఊపేస్తుంది. 27 ఏళ్ల కోహ్లీ ఏంతో దూకుడుతో ప్రత్యర్ధిని గడగడలాడిస్తాడు. అలాంటి కోహ్లికి ఒక విషాద గాధ ఉంది. దానికి రిలేటెడ్ గా అతను దరించే జర్సీ నంబర్ 18 వెనుకు ఉన్న కధ ఇది.

విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ. అందరిలాగే అతనికి నాన్న అంటే అమితమైన ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లి, తండ్రి సూచనలు తెసుకునేవాడు. విరాట్ ను భారత జట్టు ఆటగాడిగా చూడాలని కోరిక. విరాట్ కు అప్పుడు 18 ఏళ్ళు, 2006లో డిల్లి తరుపున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. కాని పిడుగులాంటి వార్త, తండ్రి చనిపోయాడు అని కబురు వచ్చింది. కాని మ్యాచ్ మధ్యలో ఉంది, అతని టీం క్లిష్ట పర్తిస్తితిలో ఉంది. ఒక పక్క తండ్రి అంత్యక్రియలకు హాజరుకమ్మని ఫోన్స్, మరో పక్క మ్యాచ్. కోహ్లికి తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. తండ్రి ఆశయాన్ని నిలబెట్టటానికి, మ్యాచ్ అడతతానికి నిర్ణయించుకుని, బాధని దిగమింగి, బాటింగ్ కు దిగాడు. 90 పరుగలు చేసి, తన టీం ని ఫాలో ఆన్ నుండి గట్టెక్కించాడు. ఆ వెంటనే కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

తండ్రి మరణించినపుడు కోహ్లీ వయసు ‘18’. అందుకే తన పద్దెనిమిదో వ ఏట తండ్రి మరణించాడని గుర్తుగా కోహ్లీ ఎప్పుడూ ‘18’ నంబర్ జర్సీ నే ధరిస్తుంటాడు.
అలాగే మన క్రికెటర్స్ లో , సచిన్ 10, ద్రావిడ్ 19, గంగూలీ 99, ధోని 7, సెహ్వాగ్ 00 నెంబర్ల జర్సీ నే ధరించేవారు

exam copy leader 24032016

అసలకే పరీక్షల సీజన్, రోజు వార్తల్లో రకరకాలుగా పిల్లలు కాపీ కొట్టి, పట్టుబడే వార్తలు వింటున్నాం. కాని ఇక్కడ మీరు చదువుతున్నది ఒక వింత వార్త. ఓ మాజీ MLA పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. MLAగా పని చేసిన అయన, ఇలా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ లా చదువుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు అటెండ్ అయ్యారు. కానీ కాపీ కొడుతూ స్క్వాడ్ కి దొరికి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కుడా పట్టుబడ్డారు. వీళ్ళ ఎక్షమ్ పేపర్ లాక్కుని, కేసు బుక్ చేసారు.