flags india 24032016

ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకునే దేశాధినేత లేదా ప్రధానమంత్రి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఎవరైనా అడిగితే, ఎక్కువ జీతం తీసుకునే ప్రధాని అమెరికా అధ్యక్షుడు అని టఖామని చెప్తారు. కాని ఎక్కువ జీతం తీసుకునే జాబితాలో సింగపూర్ ప్రధాని మొదటి స్థానంలో ఉన్నారు.

సింగపూర్ ప్రధాని లీ షైన్ లూంగ్ సంవత్సరానికి రూ.1.7 కోట్ల డాలర్లు అంటే, రూ.11.4 కోట్లు జీతం తీసుకుంటున్నారు. హాంకాంగ్ ప్రధాని ల్యూంగ్ చెన్ యుంగ్, ఏడాదికి 5.3 లక్షల డారల్లను తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు. రూ.4 లక్షల డాలర్లు జీతం తీసుకుంటూ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా మూడో స్థానంలో ఉన్నారు.

మన భారత ప్రధాని టాప్ 20లో కుడా లేరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జీతం ఏడాదికి రూ.19.2 లక్షలు.

akshya patra 24032016

మనం ఇంట్లో నలుగురికి అన్నం వండటానికి, మన ఇంట్లో ఆడవాళ్లు పొద్దున్నే 6 గంటలకి మొదలుపెడితే, మధ్యానం 12 అవుద్ది వంట చెయ్యటానికి, ఇంట్లో పనులు అవ్వటానికి. అలాంటిది రోజుకి పదిహేను లక్షల మందికి అన్నం పెడుతుంది  అక్షయపాత్ర. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడా  అక్షయపాత్ర ద్వారా మధ్యన భోజన పధకం అందిచాలి అనుకుంటుంది.

అసల ఏంటి ఈ అక్షయపాత్ర ?

ఇస్కాన్‌ వ్యవస్థాపకులు భక్తి వేదాంత, ఒక రోజు మాయపురలో ఓ భక్తి కార్యక్రమానికి హాజరుయ్యి, కార్యక్రమం ముగిసాక, రెస్ట్ తీసుకున్తున్నారు. ఇంతలో ఎదో గొడవ, వెళ్లి చుస్తే ఎంగిలి ఆకులలో అన్నం కోసం, కుక్కలతో పాటు, కొంత మంది అనాధ పిల్లలు కొట్టుకుంటున్నారు. ఆ దృశ్యంలో నుంచి, భక్తి వేదాంత మనసులోంచి పుట్టిందే ఈ అక్షయపాత్ర. అలా 1997లో 1500 మందితో మొదలుయ్యి లక్షమందికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది ఇస్కాన్‌ సంస్థ. అక్షయపాత్రకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన మధ్యాహ్న భోజన పథకం వరంగా మారింది. మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చులో 65 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. మిగిలిన 35 శాతం నిధుల కోసమే అక్షయపాత్ర విరాళాలను సేకరిస్తోంది.

అంత మందికి వంట ఎలా వండుతారో తెలుసా ?
అక్షయపాత్ర దేశంలోనే అతిపెద్ద వంటశాల. ఆత్యాధునికమైన స్టీం కుకింగ్‌ విధానాన్ని అనుసరిస్తురు. వంద కేజీల అన్నం పదిహేను నిమిషాలు, పన్నెండువేల లీటర్ల సాంబారు పది నిమిషాలలో వండొచ్చు. అక్షయపాత్ర వంటశాలకి 50 వేల మంది నుంచి లక్షన్నర మందికి భోజనాన్ని వండే సామర్థ్యం ఉంది. కేవలం గంట వ్యవధిలోనే లక్ష మందికి వంట పూర్తవుతుంది. వండే సమయంలోనే కాకుండా పాత్రలలోకి మార్చినా, వాహనాలలోకి తరలించినా ఎక్కడా ఎవరూ అహారాన్ని ముట్టుకునేది ఉండదు. కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. యంత్రాలే అన్నీ చేసుకుపోతాయి.

15 ఏళ్ల ప్రస్థానంలో 15 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్న అక్షయపాత్ర మరో నాలుగేళ్లలోనే 50 లక్షల మందికి అన్నం పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

ఈ వీడియో చూడండి, ఎంత సులువుగా అంత మందికి వంట వండుతున్నారో.

{youtube}aziKmC7ZLpM|500|250|1{/youtube}

china conins 1

మనం ఎక్కడికి వెళ్ళిన, మార్కెట్లో చిల్లర ఇమ్మని అడుగుతారు. చిల్లర లేకపోతె చిరాకు పడతారు వ్యాపారస్తులు. ఇక బస్సు కండక్టర్లు అయితే సరే సరి. కాని చైనాలో చిల్లర అంటే హడలి పోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, చైనాకు చెందిన ఓ మహిళ కొన్ని సంవత్సరాలు నుంచి సంపాదించిన ఈ చిల్లరను ఇప్పటి వరకు ఇంట్లోనే దాచుకుంది. అయితే, ఇప్పుడు బ్యాంకులో వేయాలన్న ఐడియా వచ్చింది. వెంటనే ఆ చిల్లరను మూటల్లో సర్దేసి వాటిని ట్రక్కులో వేసుకుని బ్యాంకుకు బయలుదేరింది. ఇంతకీ ట్రక్ ఎందుకు అనుకుంటున్నారా ? ట్రక్ ఎందుకంటే అమె దాదాపు 1.2 కోట్ల విలువ చేసే చిల్లరను డిపాజిట్‌ చెయ్యాలి అనుకుంటుంది.

బ్యాంకు వాళ్ళు మాత్రం అంత చిల్లరను లెక్కపెట్టటం మా వల్ల కాదు, వాటిని దాచే స్థలం తమ వద్ద లేవు అని చేతులు ఎత్తేసారు. ఏ బ్యాంకులో ప్రయత్నించినా అందరూ ఇలాగే చేతులెత్తేశారు.

చివరకు ఆమె ప్రయత్నం ఫలించి, అగ్రికల్చర్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకు ఆ చిల్లరను తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఆ డబ్బును వారం రోజుల పాటు తమ బ్యాంకు సిబ్బంది అందరి చేతా లెక్కించి డిపాజిట్‌ చేసుకుందట. ఆ బ్యాంకు ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉండడం, వారికి చిల్లరతోనే ఎక్కువ పని ఉండడం వల్ల ఆ బ్యాంకు అంత చిల్లర తీసుకుందట.

china conins 2

cow muslim 24032016

అఫక్‌ అలీ అలియాస్ మున్న, Etawah జిల్లలో నివసించే ఈ 55 ఏళ్ళ ముసల్మాన్ ఆవులు అంటే అమితమైన ఇష్టం. అయన పదిహేనేళ్ల వయసున్నప్పటి నుంచి ఆవులంటే అమితమైన ప్రేమ. తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి అయింది. అయన భార్యకు ఆవులు అంటే చిరాకు అంట, ఆవులు ఇంట్లో ఉంచటం ఇష్టం లేదు. ఆవులని అమ్మయేమని రోజు గొడవ పాడేది. మున్నా మాత్రం ససేమీరా అనేవాడు. ఒక రోజు గొడవ పెద్దది అయింది. అయన భార్య ‘నీకు ఆవులు కావాలో నేను కావాలో తేల్చుకో’ అని చెప్పింది. మున్నా నాకు ఆవులే కావాలి అని చెప్పాడు. దీంతో అయన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ ఘటన జరిగి 13 ఏళ్ళు. ఇప్పటికి భార్య తిరిగి రాలేదు. కాని మున్నా 14 ఆవులతో తనకి ఇష్టమైన పని చేస్తుకుంటూ ఆవుల్ని సంరక్షిస్తున్నారు. ఇటీవల కొన్ని గో సంరక్షణ సంస్థలు వారిపై దాడులు చేస్తున్న నేపథ్యంలో మున్నా తన కథను మీడియాతో పంచుకున్నారు. ‘నేను నా భార్యను వదులుకుంది మరో స్త్రీ కోసం కాదు. ఆవుల కోసం..’ అని గర్వంగా చెప్పాడు.

55 ఏళ్లలోనూ ఆవులకు ఆయన చేస్తున్న సేవ ప్రశంసనీయమన్నారు. గోమాతను అమ్మగా చూసే మన దేశంలో, ఇలాంటి ఘటనలు ఏంతో ఊరటను ఇస్తాయు.