krishna jilla 04042016 1 1

ఇంజనీరింగ్ పూర్తీ చేసుకుని, అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ, డాలర్లు సంపాదిస్తూ కెరీర్ సెట్ చేసుకున్నవాళ్ళు, మన ఆంధ్రలో, ముఖ్యంగా కృష్ణా జిల్లలో ఇంటికి ఒకరు ఉంటారు. అలాంటి కోవలోకే వస్తాడు మన నాగ శ్రీధర్. కాని ఈయన స్టొరీ కొంచెం భిన్నంగా ఉంటది. గూగుల్ లాంటి కంపనీలో పీక్ స్టేజిలో ఉన్నా, ఆయన చేసిన పని, చాల మంది నేటి యువతకు ఆదర్శం.

కటారు నాగ శ్రీధర్, ప్రపంచంలోనే చాలా మంది ఉపయోగించే "గూగుల్ అలర్ట్స్" సృష్టికర్త. కృష్ణా జిల్లా, గంపలగూడెంకి చెందిన మన ఆంధ్రా కుర్రాడు, గూగుల్ లో పని చేసి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని, ఇప్పుడు అమెరికాలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందా, ఈ స్టొరీ చదవండి. CNNకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన కృష్ణా జిల్లా కుర్రాడు చెప్పిన కబుర్లు.

krishna jilla 04042016 2

అయన నాన్నగారు స్కూల్ ప్రిన్సిపాల్ అవ్వటంతో, క్రమశిక్షణగా పెరిగాడు. 2000వ సంవత్సరంలో, తన 25వ సంవత్సరంలో, అప్పుడే KLCEలో ఇంజనీరింగ్ చేసి, గూగుల్ లో చేరినప్పుడు, ఉన్న 40 మంది ఇంజనీర్లలో మనవాడు ఒకడు. "గూగుల్ అలర్ట్స్" టూల్ తాయారు చేసినప్పుడు, ముందు తన మేనేజర్ కి నచ్చలేదు అంట. అప్పుడు గూగుల్ ఫౌండర్స్ దెగ్గరకి వెళ్లి, తన టూల్ ని చూపించి, వాళ్ళని ఆకర్షించారు. 2003లో "గూగుల్ అలర్ట్స్" లాంచ్ అయ్యి, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది.

krishna jilla 04042016 3

అలా 8 ఏళ్ళు గూగుల్ లో పని చేసాక, తనకి ఆ జాబ్ మీద విసుకువచ్చి, కంప్లీట్ గా కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. కొన్నాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీసిన, చివరకి తను కొనుక్కన 320 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 320 ఎకరాల భూమి కొన్నప్పుడు, ఒక 5 ఏళ్ళు ఆగి, అమ్మేద్దాం అనుకున్నాడు అంట. కాని అతనికి మన కృష్ణా జిల్లా పంట పొలాలు, గుర్తుకు వచ్చి, తను కోల్పోయిన ఆనందాన్ని, తను కొనుక్కున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, హయిగా ఉన్నాడు. తనతో పాటు, ఇంకో ఎనిమిది మందికి ఉపాది కల్పిస్తూ సంవత్సారానికి 2.5 మిలియన్ డాలర్లు వ్యవసాయం మీద సంపాదిస్తున్నాడు.

అంతే కాదు, ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చేస్తున్నాడు.

vamsi gannvaram 04042016

వల్లభనేని వంశీ, కృష్ణా జిల్లలో ఒక ఊపు ఊపిన యూత్ లీడర్. పార్టీలో వైరి వర్గాన్ని ఎదురుకుని, చంద్రబాబు దెగ్గర మార్కులు కొట్టిన ఎమ్మెల్యే. అమరావతికి, తాత్కాలిక రాజధాని విజయవాడకు గేట్-వే అయిన గన్నవరం నియోజికవర్గనికి ఎమ్మెల్యే అయన వంశీ, తన పనితనంతో నియోజకవర్గ ప్రజలు మన్ననలు అందుకుని ముందుకి సాగుతున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కుడా వంశీ నియోజికవర్గంలోనే ఉంది. పోలవరం కుడి కాలువ కోసం రైతులని ఒప్పించటంలోను , గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ లోను వంశీ సక్సెస్ అయ్యి మంచి మార్కులు కొట్టేసారు.

అయితే వంశీకి మరిన్ని కష్టాలు అభివ్రుది రూపంలో వచ్చాయి. గన్నవరం నియోజికవర్గంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టింది. అవి అన్ని, వంశీకి తలనొప్పిగా మారాయి. అనేక ప్రాజెక్ట్లలో భూసేకరణ ఇప్పుడు ఇబ్బంది అయ్యింది. ప్రాజెక్టులన్నీ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆశ ఉన్నప్పటికీ, ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతులలో అసంతృప్తే వంశీని ఇబ్బంది పెడుతుంది.

  • ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం భూసేకరణ
  • ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం ఏలూరు కెనాల్ మళ్లింపు
  • ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్ల కోసం భూసేకరణ
  • బైపాస్ రోడ్డు కోసం భూసేకరణ
  • మెట్రోడిపో కోసం నిడమానూరులో భూసేకరణ.
  • హైవే విస్తరణ కోసం భూసేకరణ
  • మల్లవల్లిలో ఎమ్యూజ్‌మెంట్ పార్క్ కోసం భూసేకరణ
  • గన్నవరం-కంకిపాడు మధ్యలో పారిశ్రామిక మండలి కోసం భూసేకరణ
  • బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో వ్యవసాయజోన్

అయితే వంశీ మాత్రం చంద్రబాబు, అధికారుల చొరవతో, తను అన్ని సమస్యలు ప్రజలకు చెప్పి, వారిని ఒప్పించి, మంచి package ఇప్పించి, ప్రజల మద్దతతో అన్ని సవ్యంగా పూర్తీ చేస్తాను అనే ధీమాతో ఉన్నారు.

kerala lottery 2796151f

ఇదేదో సినిమా సీన్ అనుకోమాకండి, ఇది నిజం. అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యకు రూ.65లక్షల కేరళా లాటరీ వరించింది. అయన వృత్తి యాచకుడు. లాటరీలో రూ. 65లక్షల రావడంతో పొన్నయ్యకి పట్టపగ్గాలు లేవు.

పొన్నయ్య అనంతపురంలో కులీ పని చేసుకుని బ్రతికేవాడు. ఐతే, ప్రమాదవసాత్తు ఆయన కాలు పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని పోషించటం కోసం కేరళకు వలస వెళ్లి అక్కడ బిక్షగాడిగా మారాడు. వచ్చిన సొమ్ముతో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు. మిగిలిన దాంతో లాటరీ టికెట్లు కొంటాడు.

కేరళలో ఈ లాటరీ టికెట్లు ప్రభుత్వ అనుమతితో జరుగుతాయి. పొన్నయ్య లాటరీ కుడా పోలీసులు అధ్వర్యంలో దెగ్గర ఉండి పూర్తీ చేసారు. పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో ఆ డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసులు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య.

అయితే ఇంత డబ్బు వచ్చినా, యాచక వృత్తి మాత్రం మానను అంటున్నాడు.

{youtube}a1wZafd66m4|500|250|1{/youtube}

tdp akarash balayya 04042016

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష కు వైఎస్సార్సీపీ నుంచి చాలామంది MLAలు జంప్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ టీడీపీ ఆపరేషన్ ఆకర్షలో, భుమాను లాగిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు జ్యోతుల నెహ్రూని టీడీపీలోకి తీసుకురావటానికి బాలయ్య ముఖ్య పాత్ర పోషించిరు అని సమాచారం.

జ్యోతుల నెహ్రూ PAC పదవి దక్కలేదు అని, అలాగే జగన్ వ్యవహారసైలితో అసంతృప్తిగా ఉన్నారు అని తెలియగానే, బాలయ్య రంగంలోకి దిగి జ్యోతులతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. తరువాత యనమల వెళ్లి వ్యవహారం చక్కబెట్టారు.

assembly ap contituency 01042016

ఎప్పటినుంచో నియోజకవర్గాల పెంపు పై ఒక క్లారిటీ వచ్చేసినట్టే వుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వున్న 175 స్థానాలను 225 స్థానాలకు పెంచే అవకాశం వుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం వుంది.2 0 1 9 నాటికి 225 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం వుంది. ప్రతి 2.19 లక్షల జనాభా కి ఒక నియోజక వర్గం ఏర్పాటు. గుంటూరు లో కొత్త గా మరో 5 నియోజక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. అందులో గుంటూరు సెంట్రల్, పిడుగురాళ్ళ, పెదకాకాని, చెరుకుపల్లి, నకరికల్లు వున్నాయి. ఇప్పటికే 17 నియోజక వర్గాలు వున్న గుంటూరు జిల్లా లో కొత్త గా ఏర్పడే 5 నియోజకవర్గాలతో కలిపి 22 నియోజక వర్గాలు అవనున్నాయి. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగం గా అప్పటివరకు వున్న 19 నియోజక వర్గాలను 17 కి కుదించారు. దుగ్గిరాల,కూచినపూడి నియోజకవర్గాలను రద్దు చేశారు.

అప్పటి వరకు జనరల్ గా వున్న ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వు అయ్యింది. త్వరలో మారనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో లోక్ సభ సీట్ల స్వరూపమే మారిపోయే అవకాశం వుంది. ఒక్కో లోక్ సభ స్థానం లో 9 అసెంబ్లీ నియోజక వర్గాలు వుండే విధం గా పునర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్ సభ స్థానానికి 7 అసెంబ్లీ నియోజక వర్గాలు వున్నాయి. కొత్త గా ఏర్పడే 5 నియోజక వర్గాల్లో ఒకటి ఎస్సీ రిజర్వు అయ్యే అవకాశం వుంది. ఇప్పటికే 3 ఎస్సీ రిజర్వు స్థానాలు వున్నాయి. మాచెర్ల, వినుకొండ లలో ఒకటి ఎస్టీ అయ్యే అవకాసం వుంది. ప్రత్తిపాడు జనరల్ అయితే పొన్నూరు ఎస్సీ రిజర్వు అయ్యే అవకాశం వుంది, నియోజకవర్గాల పునర్విభజన ఖరారు కావటం తో రాజకీయ ఆశావాహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.