chandrababu car 220322016

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఈ కారు పై అందరూ ఆరాతీస్తున్నారు. అలాని ఇదేదో ఆక్సిడెంట్ చేసి వెళ్ళిపోతున్న కార్ అనుకునేరు. ఆత్రుత అంతా ఆ కార్ నెంబర్ ప్లేట్ మీద. కొంత మంది అది చంద్రబాబు కార్ అని, పుకార్లు పుట్టిస్తున్నారు. కాని చంద్రబాబు మనస్తత్వం తెలిసిన వాళ్ళు, ఆయన ఇలాంటివి ప్రోత్సహించారు, అది ఎవరిదో అభిమానిది అయి ఉంటింది అని చెప్తున్నారు.

అలా అని ఈ కార్ ఎదో హై-ఎండ్ కార్ అనుకుంటారేమో, అది ఒక స్కోడా ఆక్టేవియా మోడల్ కార్. అసల విషయం అంతా నెంబర్ ప్లేట్ లోనే ఉంది. AP7 CN అనే రిజిస్ట్రేషన్ కి, ఆ కార్ మీద C అంటే చంద్రబాబు అని, N అంటే నాయుడు అని రాసి ఉంది. RTA నిబంధనలు ప్రకారం నెంబర్ ప్లేట్ అలా ఉండకుడడు అని అధికారాలు చ్పెతున్నారు. ఆ కార్ తెలుగుదేశం నాయకులదా, అభిమానులదా అనే విషయం తెలేయాల్సి ఉంది. పోలీసులు కుడా ఈ విషయం మీద అరా తీస్తున్నారు.

balayya into tamil politics

నందమూరి బాలకృష్ణ, తెలుగు ప్రజలకి బాగా తెలిసిన ఈ పేరు ఇప్పుడు తమిళ రాజకీయ నేతల నోట్లో కుడా నానుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాజకీయాల్లో కూడా తండ్రికి తగ్గ తనుయుడిగా వారసుడిగా బాలయ్యకి కావలసినంత ఫాలోయింగ్ ఉంది. మొన్నటి వరకు కేవలం సినిమాలకి పరిమితం అవుతూ,అవసరమైనప్పుడు పిలవకుండానే వచ్చి తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు బాలయ్య.

బాలయ్య పసుపు కండువా వేస్తే చాలు ఆరోజు అక్కడ జనం ఈలలు వేసి పూలుజల్లుతూ జై బాలయ్య అంటూ స్వాగతం పలికేవారు అది బాలయ్య రేంజ్.స్వయంగా రాజకీయ అపర చాణక్యుడుగా పిలవబడే బాలయ్య బావ చంద్రబాబు సైతం బావమరిది సాయం చాలా సార్లు తీసుకున్నాడు. బ్రతికుండగా ఎన్టిఆర్ స్వయంగా బాలయ్య గొప్పతనం, రాజకీయాల్లో బాలయ్య చేసిన మ్యాజిక్ ఏంటో స్వానుభూతి పొంది.పార్టీ నాయకులకి బాలయ్యని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

అలాంటి బాలయ్య రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుండో కోరుకుంటున్న అభిమానుల కోరిక మొన్న జరిగిన తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో నిజం చేశాడు బాలయ్య. అయితే మంత్రి పదవి బాలయ్య పాదాల వద్దకు వచ్చిన తను ప్రస్తుతం ఉన్న పర్స్తితిలో దాన్ని తీసుకుని న్యాయం చేయలేను అని తెలిసి ఏ పదవి తీసుకోకుండా ఆగిపోయాడు బాలయ్య. అది బాలయ్య గొప్పతనమో మంచి తనమా అనేది పక్కన పెడితే బాలయ్య ఒక నటుడిగా, నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా, ఒక తండ్రిగా, భర్తగా ఇలా అనేక బాధ్యతలు సమర్దవంతంగా నిర్వహిస్తుంది. అయితే తమిళనాడులో పుట్టి పెరిగా అంటూ అనేక ఫంక్షన్ లలో చెప్పిన బాలయ్య కోసం ఇప్పుడు తమిళులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

త్వరలో రానున్న తమిళ ఎన్నికల్లో బాలయ్యని వాడుకోవాలని ఆశగా చూస్తుంది తెలుగుదేశం మిత్ర పక్షం అయిన బీజేపి. ఇప్పటికే అక్కడ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన బీజేపి తాజాగా విశాల్ మీద అసలు పెట్టుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల సరిహద్దు, తెలుగువారు ఎక్కువగా ఉండే చోట బాలయ్య ఇమేజ్ ని వాడుకుని సుమారు 10 సీట్లు అయిన కొట్టొచ్చు, పైగా బాలయ్య ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ విజయం తప్పక వరిస్తుంది అని ఆసతో ఉన్నారంట తమిళ బీజేపినాయకులు. ఎలాగు మిత్రపక్షమే కాబట్టి బాలయ్య కూడా కొంచెం సహకరించే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే విషయం పై కేంద్ర నాయకులూ త్వరావు బాబు ద్వారా బాలయ్యని సంప్రదించే అవసకాశం ఉంది. చూద్దాం మరి నటసింహం ఏమంటాడో? తమిళ తంబీలకి చేయ్యిచ్చి ఆడుకుంటాదో లేక కుదరదని సున్నితంగా తిరస్కరిస్తాడో.

sreenu vaitla house for sale

శ్రీను వైట్ల అంటే కామెడీ కి కేరాఫ్ అడ్రస్ . కామెడీ ని నమ్ముకోని పైకి వచ్చిన అతి తక్కువ మంది దర్శకులలో శ్రీను వైట్ల ఒకడు . శ్రీను వైట్ల తీసిన మొదటి సినిమా “నీ కోసం “ కి నాలుగు నంది అవార్డ్స్ రావటం గమనార్హం. అన్ని నంది అవార్డ్స్ వచ్చిన కాని శ్రీను వైట్ల కి వెంట వెంటనే సినిమా ఛాన్స్ లు రాలేదు. ఆతర్వాత ఆనందం ,సొంతం వంటి చిన్న సినిమాలతో తనలోని కామెడీ టాలెంట్ ని బయట పెట్టి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు . ఆతర్వాత రచయిత కోన వెంకట్ తో కలిసి మాటలు రాయటం మొదలు పెట్టాడు . వెంకి,దుబాయి శ్రీను, డీ ,రెడీ,నమో వేంకటేశ ,దూకుడు,బాద్ షా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలు ఇండస్ట్రీ కి అందించారు.

దూకుడు సినిమా అప్పుడు మంచిన మనస్పర్ధలు వళ్ళ ఆగడు సినిమా కి కోన వెంకట్ దూరం అయ్యాడు. అప్పటి నుండి శ్రీను వైట్ల చేసిన సినిమాలు ఆగడు ,బ్రూస్లీ అన్ని డిజాస్టర్లు గా నిలిచాయి. ఆగడు దెబ్బకి వైట్ల కి సినిమా ఛాన్స్ లు ఇచ్చేవారే కరువు అయ్యారు .అలాంటి టైం లో రాంచరణ్ పిలిచి మరీ బ్రూస్లీ సినిమా ఇచ్చాడు కాని దాన్ని కూడా వైట్ల వినియోగించుకోలేక పోయాడు.

తాజాగా వైట్ల ఎంతో ఇష్టం తో కట్టించుకున్న ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు తాజా గా శ్రీను వైట్ల కి ఒక్క సినిమా ఆఫర్ కూడా లేకపోవటం వాళ్ళ కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తనకు ఇష్టం అయ్యిన ఇంటిని అమ్మకాని పెట్టాడు. ఇదంతా గమనిస్తున్న సినిమా పెద్దలు పాపం వైట్ల అనుకుంటున్నారు. బయట నుండి చూస్తున్న సినిమా ప్రేక్షకులు మాత్రం అలాంటి చెత్త సినిమాలు తీసి జనాల మీదకి వదిలితే ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నారు.

ఈ ఇంటి విషయం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ మారింది . దీని పై శ్రీను వైట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.

pawan on ali 1

పవన్ కళ్యాణ్ తన సొంత కథ ,స్క్రీన్ ప్లే తో పాటు నిర్మాణ బాధ్యతలు వేసుకొని మరి సర్దార్ సినిమాని బాబి దర్శకత్వంలో నటిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా పవన్ సొంత కథ కావటం తో పాటు, గబ్బర్ సింగ్ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత అదే పేరుతో వస్తున్న సినిమా కావటం తో ఎరోస్ సంస్థ భారి మొత్తంలో 80 కోట్లు చెల్లించి మరీ ఈ సినిమాని దక్కించుకుంది. ఎరోస్ సంస్థ ఈ సినిమాని తెలుగు, హింది బాషలలో ప్రపంచలోని 42 దేశాలలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియో వేడుకలో ఆలీ ఎప్పటి లాగే తన నోటి దూలని స్టేజి మీద మరోసారి నిరూపించుకున్నాడు.

ఎప్పటి నుండో ఫిలింనగర్ తో పాటు సామాన్య ప్రేక్షకుడికి ఉన్న ఒక డౌట్ ని ఈ రోజు లేవనెత్తాడు. అది ఏంటంటే పవర్ స్టార్ ఇంతకు ముందు తన దర్శకత్వం లో తీసిన జాని దారుణంగా పరాజయం పాలు అవ్వటం తో దర్శకత్వానికి దూరం గా ఉన్నాడు. అయితే తనలో దర్శకత్వం కోరిక చావలేదు అని అందుకే బాబి లాంటి చిన్న దర్శకునికి సర్దార్ గబ్బర్ సింగ్ వంటి పెద్ద ప్రాజెక్ట్ ని అప్పగించి తన కోరిక తీర్చుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు అని కాని అది నిజం కాదు అని ఆలీ చెప్పటం ఇప్పుడు మరల చర్చనీయాంశం గా మారింది.

ఆలీ ఏ ఉద్దేశం తో మాట్లాడాడో తెలియదు కాని ఇప్పుడు జనాల్లోకి మాత్రం చాల వరకు ఈ సినిమాని పవన్ తెరకెక్కించాడు అనే అనుమానం దావలంగా వ్యాపించింది. ఇప్పుడు సర్దార్ సినిమా ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చిన అది పవన్ వేలు పెట్టటం వల్లే పోయింది అని అందరు అనుకోక మానరు. ఆలీ ఏం చేసిన అది చాలా చెత్తగా జనాల్లోకి వెళ్తుంది అనేది ఎన్నో సార్లు రుజువు అయ్యింది. ఈ రోజు ఆలీ మాటలు విన్న జనాలు ఆలీ ఈ జన్మలో మారడు అంటున్నారు .ఇంతకీ ఆలి పవన్ గురించి నిజమే చెప్పాడా?లేక రూమర్ లకి ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో నిజం చెప్పాడా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

chiru pavan movie finalised

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరో . రాజకీయాలకు దూరం అయ్యిన తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు చిరు . అయితే తాజాగా చిరు కత్తి సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. కాని చిరు తదుపరి చిత్రం కూడా ఖరారు అయ్యింది . అది కూడా ఎవ్వరు ఎప్పుడు ఊహించని కాంబినేషన్ లో ఉండబోతుంది.

పవన్ తానూ సినిమాల నుండి త్వరలో రిటైర్మెంట్ తీసుకున్న విషయం చెప్పాడు . అయితే ఈ లోపు దర్శకరత్నదాసరికి ఒక సినిమా చేసి పెడతాను అని పవన్ ఎప్పుడో మాట ఇచ్చాడు . ఇప్పుడు ఆమాటను నిలబెట్టుకోబోతున్నాడు . లయన్ సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యిన సత్యదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించ బోతున్నాడు అని సమాచారం.

ఈ చిత్రంలో మెగాస్టార్ ,పవర్ స్టార్ కలిసి నటిస్తున్నారు .ఇందులో చిరంజీవి సియం గా కనిపించనున్నాడు అని సమాచారం . ఇంతకు ముందు శంకర్ దాదా జిందాబాద్ లో పవన్ తలుక్కున మెరిశాడు . కాని ఇప్పుడు చిరు పవన్ సినిమాలో 20 నిమిషాలు కనిపించనున్నాడు. ఇది పవన్ ఆఖరు చిత్రంగా సినిమా వర్గాలు భావిస్తున్నాయి.