balayya in tenali 30032016

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెనాలి లో సందడి చేసాడు.మంగళవారం తెనాలి లోని మార్కెట్ కమిటీ ప్రాంగణం లో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల బల ప్రదర్శన ని ప్రారంబించారు.టాపు లేని జీపు పై పట్టణమంతా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు.అనంతరం ఎన్టిఆర్,శివరామకృష్ణయ్య ల విగ్రహాలకు పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన చేసారు.అనతరం ఎడ్ల బండ్ల పోటి లను ప్రారబించిన బాలకృష్ణ తెలుగు సంప్రదాయాలను కొనియాడారు.

తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలువనిచ్చాడు మాతృభాష తల్లి పాలతో సమానమని, పరాయి బాష డబ్బా పాల వంటి దని అన్నారు. పాశ్చాత్య మోజులో వడి మన సంప్రదా యాలకు దూరం కావద్దని యువతకు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంగ ళవారం రాత్రి బాలకృష్ణ ప్రారంబించారు. ఈ నందర్బంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్ర సాద్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నవనేవి రాజ కుమారి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పోటీలను ప్రారంబించిన అనంతరం బాలకృష్ణ గుర్రంపై స్వారీ చేసి అబిమానులను అలరించాడు.

jagan ap 29032016 1 1

ఏప్రిల్ 1 ఫూల్స్ డే తర్వాత, ఏప్రిల్ 2 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాడ్ డే నా ? అవును అనే అంటున్నాయి పరిస్థితులు. జ్యోతలు నెహ్రు ఎపిసోడ్ మర్చిపోక ముందే, జగన్మోహన్ రెడ్డికి గెట్టి షాక్ ఇవ్వాలి అనుకుంటుంది తెలుగుదేశం. ఏప్రిల్ 2న, పది మంది YSR MLAలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

21 మందితో గంటలో నీ ప్రభుత్వాన్ని కూల్చుతా చంద్రబాబు అన్న దెగ్గర మొదలైన జగన్ పతనం, కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 8 మంది జంప్ అవ్వగా, ఇంకో పది మంది పచ్చ కండువా కప్పుకునేందుకు రెడీ గా ఉన్నారు. ఏకంగా వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జంప్ అవ్వటం జగన్ కి పెద్ద ఎదురుదెబ్బ.

ఈ పరిస్థితి జగన్ స్వయంకృతాపరాధమే అన్న వాదన బలంగా ఉంది. ప్రభుత్వం చేసే మంచి పనులుకుడా విమర్శించటం, పట్టిసీమని వ్యతిరేకించటం, కాపులకి సరియిన ప్రాధ్యాన్యత ఇవ్వకపోవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటంతో ఇటు కోస్తాలో, అటు రాయలసీమలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది ఇలా ఉంటె, సీనియర్లను , ఏ విషయంలోనే కాన్ఫిడెన్సులోకి తీసోకోకపోవటం, వాళ్ళకి సరియన ప్రాధాన్యత ఇవ్వకపోవటం అసలు విషయం. జగన్ క్రెడిబులిటీ రోజు రోజుకి దెబ్బతింటుంది. కేసులు ఏమి అవుతాయో తెలీదు, ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించటం లేదు. జనాలకు కావాల్సిన పోరాటం చెయ్యరు. ఇలా ప్రతి విషయంలో వెనకపడ్డం, ప్రతిపక్షంలో ఉండాల్సిన దూకుడు లేదు, అన్ని తప్పుడు నిర్ణయాలే, అసెంబ్లీలో ప్రతి విషయంలో ప్రభుత్వానిదే పై చేయి, వ్యక్తిగతంగా రాజశేఖరరెడ్డి నమ్మని వాళ్ళకోసం ఎంతకైనా తెగించేవారు, జగన్ ఎవర్ని నమ్మడు, కనీసం దెగ్గరకి కుడా రానియ్యాడు, అని YSP నాయకులూ వాపోతున్నారు. . ప్రతిపక్ష నాయకుడుకి ఉండాల్సిన గుర్తింపు జగన్కు లేదు, జగన్ విషయంలో ఆయన గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది.

ntr balayya 29032016

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్, ప్రధాన తారగణంతో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్ . ఈ సినిమా షూటింగ్ కొంత ఇటీవలే ముంబాయి లో పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చింది.

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ చిత్రం, త్వరలో సారధి స్టూడియో లో వేసిన గ్యారేజ్ సెట్ లో షూటింగ్ మొదలు పెట్టబోతుంది. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్, ప్రధాన తారగణంతో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్.

ఇప్పుడు ఈ సెట్ కు నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడని టాలీవుడ్ ఫిలిం నగర్ టాక్. ఎందుకంటే గతంలో గాండీవం లో తనతో పాటు కలిసి ఆడి పాడిన మోహన్ లాల్ ఈ చిత్రం లో నటిస్తున్నాడు. కాబట్టి అతడిని పలకరించి, చిత్ర విశేషాలు తెలుసుకోవడానికి రాబోతున్నారట. ఈ వార్త తో నందమూరి అబిమనుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుద్దో...

news papers 29032016

అన్ని న్యూస్ పేపర్లు వైట్ కలర్లో ఉంటే, బిజినెస్‌ న్యూస్ పేపర్లన్నీ సాల్మన్ పింక్‌ కలర్‌లోనే ఎందుకు ఉంటాయనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? దానికి చరిత్రలో రెండు కారణాలు ఉన్నాయి...ఈ స్టొరీ చదవండి...

‘ద ఫైనాన్షియల్‌ టైమ్స్‌’అనే బిజినెస్ న్యూస్ పేపర్ 1888లో లండన్‌లో ప్రారంభమైంది. కొత్తలో చాలా కొద్దిమంది రీడర్స్ ఉండేవారు అంట. అప్పుడు యాజమాన్యానికి ఒక ఐడియా వచ్చింది. ఎన్ని పేపర్ల మధ్యనున్నా దానిని చటుక్కున గుర్తించడానికి వీలుగా, విభిన్నంగా కనిపించడానికి 1893 నుంచి పేపర్‌ను సాల్మన్ పింక్‌ కలర్‌లో ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి దానికి సర్క్యులేషన్ పెరిగింది.

దానితో పాటు, పేపర్‌కు తెల్లరంగు డై వెయ్యడం కంటే గులాబీ రంగు వేయడానికి చాలా తక్కువ ఖర్చయ్యేది. అలా ఒక సంప్రదాయంగా స్థిరపడి, బిజినెస్‌ పేపర్లన్నీ పింక్‌ కలర్‌లోనే ముద్రిస్తున్నారు.

tdp balaram 28032016

పార్టీ ఫిరాయిస్తున్న నేతలతో ఏనాటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆ పార్టీ సీనియర్ నేత, 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం కృష్ణమూర్తి హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటిని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలంటే, తనతో సంప్రదిస్తారనే భావిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, దానివల్ల ఇబ్బందులనూ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చంద్రబాబునాయుడితో తనకున్న సంబంధాలు తెగిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవాలని, 30 ఏళ్లకు ముందు తామెలా ఉన్నామో, ఇప్పుడూ అలానే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉందనిపించిన వేళ, కొన్నిసార్లు ముందుగానే అడుగువేయాల్సి వస్తుందన్నారు. తానెన్నడూ తప్పు చేయలేదని, తనపై అన్ని కేసులనూ కొట్టేశారని గుర్తు చేశారు.

జిల్లాలో కిడ్నాప్ అయిన వారి గురించి ప్రశ్నించగా, ఎవరో ఎక్కడో సన్యాసుల్లోకి వెళ్లి కలిస్తే, వారి సమాచారం తనకెలా తెలుస్తుందని అన్నారు. క్యాడర్‌ను నిలుపుకునేందుకు కొన్ని సార్లు పరిధులు దాటాల్సి వస్తుందని అంతమాత్రాన నేరాలు చేసినట్టు కాదని అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేనని కరణం బలరాం తెలిపారు.