‘‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’’ ఆన్ లైన్ సమావేశంలో శనివారం మధ్యాహ్నం ఐఐటి బోంబే విద్యార్ధులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సామర్ధ్యం బైటపడుతుంది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుంటే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క-రో-నాను ఎదుర్కొన్న తీరుతెన్నులను బట్టే రాబోయే రోజుల్లో వివిధ దేశాలు ముందంజ వేస్తాయి. ఈ నేపథ్యంలో మా వంతు బాధ్యతగా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపాం. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు దోహదం చేశాం. మా తరం దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పుట్టినవాళ్లం. మీ యువతరం ఆర్ధిక సంస్కరణల ముందు, తర్వాత పుట్టినవాళ్లు. 1991లో టైమ్స్ మ్యాగజైన్ లో ‘‘ప్రపంచ ఆర్ధిక సవాళ్లను భారతదేశం ఎదుర్కోగలదా’’ అనే వ్యాసం మమ్మల్నెంతో అసంతృప్తికి గురిచేసింది. దానినొక సవాల్ గా తీసుకునేలా చేసింది. ఆర్ధిక సంస్కరణలకు ముందు మనదేశంలో ఏకపార్టీ పాలన ఉండేది. తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల పాలన వచ్చింది. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టినప్పుడు పెట్రోల్ డీజిల్ దిగుమతులకు కూడా ఆర్ధిక కటకట. బంగారం కూడా కుదవబెట్టిన పరిస్థితులు. ఆ స్థితినుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరాం, భవిష్యత్తులో ప్రపంచంలోనే తొలిరెండు స్థానాల్లో భారతదేశం చేరనుంది. 1991లో ఆర్ధిక సంస్కరణలు, 1995లో తాను సీఎం కావడం, 1996లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఏపిలో సెకండ్ జనరేషన్ రిఫామ్స్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తొలిసారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించానని, 20ఏళ్ల ముందు ఆలోచనలు చేయడం ఏమిటనే కొందరి సందేహాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా చేసిన కృషి వివరించారు.

హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటి ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటి అభివృద్దికే నమూనా అయ్యింది. ఆర్ధికంగా ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి దోహదం చేసింది. సియాటెల్ తర్వాత రెండవ బేస్ గా హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో ఆంధ్రప్రదేశ్ నుంచే, గూగల్ సిఈవో ఇండియా నుంచే, అనేక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మనదేశం నుంచే కావడం విశేషం. హైదరాబాద్ లో అప్పుడు అభివృద్ది చేసిన బయో టెక్నాలజీ పార్క్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ముందంజలో ఉండటం, 8లేన్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, దేశానికే 4% జిడిపి ఇచ్చే స్థాయికి హైదరాబాద్ చేరేందుకు ఇవన్నీ దోహదపడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత 13జిల్లాల ఏపికి ఆర్ధిక కష్టాలు..రాజధాని లేదు, బస్సులోనుంచే పరిపాలన.. పట్టుదలతో పనిచేసి 10.5% వృద్దిరేటు సాధించాం, జాతీయ వృద్దిరేటు 7.3% ఉంటే దానికన్నా మూడు నాలుగు రెట్లు ముందున్నాం. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించాం. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 17% వృద్ది సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4ఏళ్లు నెంబర్ వన్ గా నిలబడ్డాం. రూ 15.48లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టాం, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా ఏపికి తెచ్చాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం, పట్టుదలగా పనిచేయడం ద్వారానే పురోగతిని సాధించాం. గత 30ఏళ్లలో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాబోయే 30ఏళ్ల అభివృద్ధి వైపు మనందరి దృష్టి ఉండాలి. 2050నాటికి ఎలా ఉండాలన్న ఆలోచన చేయాలి.

మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి. ప్రతి విజయానికి ఒక విజన్ ఉంటుంది. మీ అందరికీ ‘‘మెగా మైండ్ సెట్’’ ఉండాలి. భారతదేశం మెగా సూపర్ పవర్ గా ఎదిగేలా మీరంతా మెగా సూపర్ పవర్ గా ఎదగాలి.. ఇప్పుడు నడుస్తోన్న పారిశ్రామిక విప్లవం 4.0లో మీ భాగస్వామ్యంపై ఆలోచన చేయాలి. దీనికంటె ముందు 4 పారిశ్రామిక విప్లవాల వృద్ది పరిణామ క్రమం చూడాలి. 4వ పారిశ్రామిక విప్లవంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మిషన్ టూల్స్, డేటా సెంటర్ వచ్చాయి. పర్యావరణ హిత వాతావరణం, ఆటోమోటెడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వృద్ది నేపథ్యంలో కాలుష్య రహిత సమాజం కోసం మీరంతా దృష్టి పెట్టాలి. 4.0పారిశ్రామిక విప్లవంలో సాంకేతికత, టూల్స్ వినియోగం అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ రాకముందు అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం పంపాలంటే 3, 4రోజులు పట్టేది. ఫోన్ లో మాట్లాడాలంటే వందల రూపాయల ఖర్చయ్యేది. అలాంటిది ఇంటర్నెట్ అభివృద్ది చెందాక ప్రపంచమే గ్లోబల్ విలేజిగా మారింది. గతంలో ఉపాధ్యాయులనుంచి పాఠాలు నేర్చుకునేవాళ్లం. ఇప్పుడు అధ్యాపకులకే పాఠాలు చెప్పే పరిస్థితిలో విద్యార్ధులు ఉన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులుగా ఉండే వర్గీకరణ ఇప్పుడు ఐటి లిటరేట్, ఐటి ఇల్లిటరేట్ గా మారింది. ఒకప్పుడు రూ 14 ఉండే సోలార్ పవర్ యూనిట్ తర్వాత రూ 7కు, ఇప్పుడు రూ 2.50కు వచ్చింది. భవిష్యత్తులో సోలార్ పవర్ యూనిట్ రూపాయి, రూపాయిన్నరకే వచ్చే అవకాశం. ప్రకృతే సహజ ఇంధన ఉత్పాదన వనరు. సమాజంలో ఏవిధంగా వినూత్న మార్పులు వస్తున్నాయో ఇవే ప్రబల సాక్ష్యాలు. జలవిద్యుత్ సీజనల్ కాబట్టి, థర్మల్ పవర్ తప్ప మార్గాంతరం లేదని గతంలో భావించారు. ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్, సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరులు వచ్చాక థర్మల్ పవర్ తెరమరుగు అవుతోంది. పర్యావరణహితంగా సమాజంలో వచ్చే మార్పులను స్వాగతించాలి, అనుసరించాలి.

‘‘2050నాటికి భారతదేశంలో చోటుచేసుకున మార్పుకు నేను ఏవిధంగా దోహద పడగలను అనేది’’ ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక నిముషం ఆలోచించాలి. ఆ విధమైన నిద్రలేని రాత్రులే మిమ్మల్ని ఈ మార్పుకు నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. ఓటమి భయం ఉండకూడదు. రిస్క్ లను ముందే ఊహించి ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మానవీయ విలువలను కోల్పోరాదు. ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరూ అప్ గ్రేడ్ కావాలి. మీ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరికరాల వినియోగంపై పట్టు సాధించాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలి, దానిని ప్రోత్సహించాలి, పోటీతత్వంతో, నైపుణ్యాభివృద్దితో ముందడుగు వేయాలి. సరైన విజన్ ఉన్నప్పుడే మన లక్ష్యసాధన, దిశానిర్దేశం ఉంటుంది. మన జీవితానికి దిక్సూచి, లక్ష్య సాధన ద్వారా మన కలల సాఫల్యానికి శక్తి మన విజన్. మన కలలు నెరవేర్చే విజన్ ఉండాలి, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అద్భుత నాయకుడిగా ఎదగగలరు. తద్వారా మీ సాధికారతతోపాటు దేశ సాధికారత సాధ్యమయ్యేలా ఉభయతారకంగా మీ అందరి ఎదుగుదల ఉండాలి. మీ ఎదుగుదల కోసం ఒక విజన్ రూపొందించుకోండి. మెగా మైండ్ సెట్ ద్వారా దానిని చేరుకోండి. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయండి, స్థూలంగా కార్యాచరణ చేయండి. అప్పుడే మీరు మీమీ రంగాల్లో అద్భుత నాయకుల్లాగా ఎదుగుతారు.
2050 వైపు మీ ప్రయాణంలో ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే, ‘‘నేను కాలాన్ని మార్చగలనా, లేక కాలమే నన్ను మార్చుతుందా..?’’ అని...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 రోజులుగా కుదిపేస్తున్న టాపిక్ పోలవరం. గత తెలుగుదేశం హయంలో పునాదులు లోపల ఉన్న ప్రాజెక్ట్ పనులు, 72 శాతం పూర్తి చేస్తే, ఇప్పటికీ రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇవ్వలేదు. ఇక మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచాలు దాదాపుగా 55 వేల కోట్లు రూపాయలను, కేంద్ర జల శక్తి శాఖ టెక్నికల్ కమిటీ ఆమోదించి, కేంద్ర ఆర్ధిక శాఖకు పంపించింది. ఇందు కోసం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక లక్ష కాయితాలు ఢిల్లీ పంపించి, కేంద్రాన్ని ఒప్పించింది. అయితే అధికారం పోవటం, వైసీపీ అధికారంలోకి రావటం, తరువాత పోలారం నిర్మాణం అటకెక్కటం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా, గతంలో తెలుగుదేశం ఆమోదింపచేసుకున్న రూ.55 వేల కోట్లు కాకుండా, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. అయితే కేంద్ర వైఖరి పై అందరూ స్పందిస్తుంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రముఖ పార్టీగా ఉన్న జనసేన మాత్రం స్పందించటం లేదు. దాదాపుగా 10 రోజులు తరువాత, జనసేన ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, పోలవరం పై స్పందించింది. జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేశ్ పేరుతొ ఈ ప్రకటన విడుదుల అయ్యింది. ఈ ప్రకటన చూసిన వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కూడా రాజకీయ పార్టీ కాబట్టి, సహజంగానే, తెలుగుదేశం, వైసీపీ పై విమర్శలు చేసింది. ప్రకటన మొదటి లైన్ లోనే, పోలవరం ఇలా అవ్వటానికి కారణం తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ అంటూ, మొదటి లైన్ లోనే విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీల విమర్శలు సహజం కాబట్టి, దీని విషయంలో ఏమి మాట్లాడ లేం.

అయితే ఈ వివాదానికి, మోసానికి మొత్తం కారణం అయిన కేంద్రం ప్రభుత్వం పై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది , ఆంధ్రప్రదేశ్ హక్కు. ఈ దేశ పార్లమెంట్ ఇచ్చిన హక్కు. అది ఎవరో దయ మీద మనకు వచ్చేది కాదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఉత్తరాది అహంకారం మీద మాట్లాడుతూ, చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే జనసేన తమ అధినేత చెప్పిన మాటలే మర్చిపోయినట్టు ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పై ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం ఉదారంగా స్పందించి, పోలవరం పూర్తి చేయాలి అంటూ, సన్నాయి నొక్కులు నొక్కుతుంది. కేంద్రం చొరవ చూపాలని, ఉదారంగా వ్యవహరించాలని దేబిరించటం ఏమిటో జనసేనకే అర్ధం కావాలి. ఎంత మిత్ర పక్షం అయితే మాత్రం, పోలవరం ప్రాజెక్ట్ కు ఇంత అన్యాయం చేస్తుంటే, ఎలా ఊరుకుంటారు ? జనసేన అన్నట్టు, తెలుగుదేశం, వైసీపీది తప్పే కావచ్చు, కానీ అంతకు మూడింతల తప్పు కేంద్రం చేస్తుంది. మనకు పార్లమెంట్ వేదికగా, ఈ దేశ చట్టాల ప్రకారం, పోలవరం హక్కు. ఇది మోడీ ఇష్టమో, ఎవరో దయో కాదు. కేంద్రాన్ని నిలదీయాల్సిన పార్టీలు అన్నీ, ఇలా కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాయి కాబట్టే, కేంద్రం ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఇంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా, కేంద్రం ఉదారంగా సాయం చేయాలి అంటుంటే, కేంద్రానికి అలుసు కాక ఇంకేం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఈ పార్టీలను నమ్ముకోకుండా, కేంద్రం పై పోరాడాల్సిన సమయం వచ్చిందేమో.

అధికారంలో ఉన్న పార్టీ, దూకుడు మీద ఉంటుంది. ప్రతిపక్షాలు దిగాలుగా ఉంటాయి. ఇక మన రాష్ట్రంలో 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీ , దూకుడు మీద ఉండాలి. కానీ ఎందుకో కానీ, ప్రతి సారి డిఫెన్సు లోనే ఉంటుంది. 151 సీట్లు చేతిలో ఉంటే, ప్రతిపక్షాలను ఫుట్ బాల్ ఆడవచ్చు కానీ ఎందుకో వైసీపీ మాత్రం తడబడుతుంది. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి, తమ సత్తా చాటుతూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలత ఎక్కువ ఉంటుంది. పక్కన ఉన్న తెలంగాణా, రెండో సారి అధికారంలోకి రాగానే, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి, మొత్తం కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రభుత్వం ఎందుకో వెనుకడుగు వేస్తుంది. ఇక్కడ గత మార్చ్ లో ఎన్నికలు ఆగిపోయాయి అని తెలుసు కానీ, ఆసలు ఎన్నికలు జరపమని హైకోర్టు చెప్తేనే, ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వచ్చిందనే `విషయం చాలా మందికి తెలియదు. అంటే దాపుగా 10 నెలల పాటు అధికారంలో ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు. ఎవరో కోర్టుకు వెళ్తే, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొదలు అయ్యింది. ఒక్కసారి ఎన్నికలు ప్రక్రియ మోదలు అయితే, మొత్తం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లి పోతుంది. అందుకే క-రో-నా గురించి ప్రపంచం భయపడుతున్న సమయంలో, ఎన్నికలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికలు జరపాల్సిందే అంటు వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రెండు రోజుల్లో దాదాపుగా 60 మందికి పైగా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషన్ పై, ఎన్నికలు జరపాల్సిందే అంటూ దుమ్మెత్తి పోశారు. తరువాత ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళినా వాళ్ళ వల్ల కాలేదు. ఇక తరువాత, ఎన్నికల కమిషన్ ను తప్పించటం, ఆయన మళ్ళీ కోర్టు ద్వారా పదవిలోకి రావటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత, మళ్ళీ ఆ కేసు కోర్టులో వాయిదాకు రావటంతో, కోర్టు ఎన్నికల ప్రక్రియ గురించి ఈసి అభిప్రాయం అడిగింది. అయితే మళ్ళీ వైసీపీ ఇప్పుడే ఎన్నికలు వద్దు అంటూ రాగం అందుకుంది. ప్రతిపక్షాలు ఎన్నికలు కావలి అంటుంటే, ప్రభుత్వం ఎన్నికలు వద్దు అంటుంది. అంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే నెగ్గం అనే భయం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఇసుక లేక, పనులులేక అల్లాడిన ప్రజలు, క-రో-నాతో పూర్తిగా చతికిల పడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం కరెంటు బిల్లులు, బస్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వాయించి పడేస్తుంది. మరో పక్క రోడ్డులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరదలతో రైతులు అల్లాడిపోయారు. చేతికి వచ్చిన పంట నష్ట పోవటం, వరదల్లో ప్రభుత్వం సరిగ్గా ఆదుకోక పోవటం కూడా మైనస్ అయ్యింది. ప్రజలు సంతోషంగా లేరు. మొత్తం నెగటివ్ మూడ్ ఉంది. ఇక మరో పక్క నిమ్మగడ్డ ఉంటే తమ ఆటలు సాగవు అని అధికార పక్షం అభిప్రాయం. మొత్తంగా, ఎన్నికలు అంటే అధికార పక్షం భయపడుతుంది. మరో పక్క ప్రతిపక్షాలు మాత్రం, ఎన్నికలు కావాలని కోరటం, మన రాష్ట్రంలో ఉన్న రివర్స్ పాలనకు అద్దం పడుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రతిసారి దగా చేయబడుతూనే ఉంది. ఈ దేశ పార్లమెంట్ సాక్షిగా, మనకు ఇష్టం లేకపోయినా మనల్ని విడగొట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా మనలను చేసారు. కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ ని వదులుకున్నాం. సరే అయ్యింది ఎదో అయిపొయింది అనుకుని, మనకు రావాల్సిన హక్కుల పై పోరాడాం. ఈ పోరాటంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సహకరించింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంది. 5 ఏళ్ళు కాదు, పదేళ్ళు కావాలని అడిగింది. ఎవరో కాదు, ప్రధాని మాత్రమే హామీ ఇవ్వాలని పట్టుబట్టి, మన్మోహన్ చేత ప్రకటన ఇప్పించారు. తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. హమ్మయ్య అనుకున్న ఆంధ్రులు, కుదుట పడతాం అనుకున్నారు. అనుకున్నట్టే అమరావతి రైతుల త్యాగ ఫలం అమరావతి వచ్చింది. పోలవరం పునాదుల్లో నుంచి పైకి లెగిసింది. ఇలా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్న వేళ, కేంద్రం పెద్దలు అడ్డు పుల్లలు మొదలు పెట్టారు. ముందుగా స్పెషల్ స్టేటస్ పై వంచన చేసారు. ప్యాకేజి అని ఒప్పించారు. సరే ప్యాకేజికి చట్టబద్ధత ఇస్తామని మోసం చేసారు. విద్యా సంస్థలకు అరకొర నిధులు ఇస్తున్నారు. ఇక వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజి ఆపేశారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అని 1500 కోట్లు ఇచ్చారు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టటంతో, చంద్రబాబు కేంద్రం పై పోరాటం మొదలు పెట్టారు. మోడీ, అమిత్ షా ని దేశ వ్యాప్తంగా తిరిగి, వీళ్ళు చేస్తున్న పనుల పై నిలదేససారు. అయితే రాజకీయ సమరంలో చంద్రబాబు ఓడిపోయారు. మోడీ, అమిత్ షా ని రాష్ట్రం కోసం నిలదీసిన చంద్రబాబు రాజకీయంగా బలహీనుడు అయ్యాడు. దీంతో రాష్ట్ర సమస్యల పై ఢిల్లీని నిలదీసే వారే లేరు.

ఇదే సందర్భంలో కేంద్రం మెడలు వంచేస్తాను అంటూ ఎన్నికల ముందు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అధికారం వచ్చిన తరువాత సైలెంట్ అయ్యారు. మెడలు వంచుతారు అనుకుంటే, సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అంటున్నారు. ఇదే అలుసు అనుకున్నారో ఏమో, ఢిల్లీ పెద్దలు విభజన హామీల పై , ఈ 18 నెలల్లో ఏమి మాట్లాడటం లేదు. అమరావతి నిర్వీర్యం అయిపొయింది, అయినా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పోలవరం పై పిడిగు లాంటి వార్త చెప్పింది కేంద్రం. చంద్రబాబు హయంలో కేంద్ర జల శక్తి చేత 55 వేల కోట్లకు పోలవరం అంచనాలు ఆమోదిస్తే, ఇప్పుడు దాన్ని 20 వేల కోట్లకు తెచ్చారు. అయినా జగన్ గారు ఏమి మాట్లాడటం లేదు. జగన్ గారికి సన్నిహితంగా ఉండే ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా, పోలవరం పై ఇలాంటి అడుగులు వేస్తున్న నువ్వు ఎందుకు అంటున్నారు అంటే, జగన్ చేస్తున్న తప్పు ఏమిటో అర్ధం అవుతుంది. అయినా ఇక్కడ అనాల్సింది కేంద్రాన్ని. ఇక్కడ నష్టపోయింది చంద్రబాబు, జగన్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మోడీని నిలదీసే చంద్రబాబు , రాజకీయంగా బలహీనుడు అయ్యాడు, రాజకీయంగా బలంగా ఉన్న జగన్ గారు, నోరు తెరాటం లేదు. దీంతో కేంద్ర పెద్దలు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది తగునా ? ఈ దెస పార్లమెంట్ లో చెప్పిన దానికి విలువ లేదా ? మీ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు బలి అవ్వాలి. అమరావతి మూడు ముక్కలు అయితే మీకు సంబంధం లేదా ? పోలవరం 55 వేల కోట్లతో కట్టల్సింది, 20 వేల కోట్లతో ఎలా కడతారు ? స్టేటస్ లేకుండా, కొత్త రాష్ట్రం ఎలా నిలదొక్కుకుంటుంది ?

Advertisements

Latest Articles

Most Read