ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రతిసారి దగా చేయబడుతూనే ఉంది. ఈ దేశ పార్లమెంట్ సాక్షిగా, మనకు ఇష్టం లేకపోయినా మనల్ని విడగొట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా మనలను చేసారు. కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ ని వదులుకున్నాం. సరే అయ్యింది ఎదో అయిపొయింది అనుకుని, మనకు రావాల్సిన హక్కుల పై పోరాడాం. ఈ పోరాటంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సహకరించింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంది. 5 ఏళ్ళు కాదు, పదేళ్ళు కావాలని అడిగింది. ఎవరో కాదు, ప్రధాని మాత్రమే హామీ ఇవ్వాలని పట్టుబట్టి, మన్మోహన్ చేత ప్రకటన ఇప్పించారు. తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. హమ్మయ్య అనుకున్న ఆంధ్రులు, కుదుట పడతాం అనుకున్నారు. అనుకున్నట్టే అమరావతి రైతుల త్యాగ ఫలం అమరావతి వచ్చింది. పోలవరం పునాదుల్లో నుంచి పైకి లెగిసింది. ఇలా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్న వేళ, కేంద్రం పెద్దలు అడ్డు పుల్లలు మొదలు పెట్టారు. ముందుగా స్పెషల్ స్టేటస్ పై వంచన చేసారు. ప్యాకేజి అని ఒప్పించారు. సరే ప్యాకేజికి చట్టబద్ధత ఇస్తామని మోసం చేసారు. విద్యా సంస్థలకు అరకొర నిధులు ఇస్తున్నారు. ఇక వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజి ఆపేశారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అని 1500 కోట్లు ఇచ్చారు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టటంతో, చంద్రబాబు కేంద్రం పై పోరాటం మొదలు పెట్టారు. మోడీ, అమిత్ షా ని దేశ వ్యాప్తంగా తిరిగి, వీళ్ళు చేస్తున్న పనుల పై నిలదేససారు. అయితే రాజకీయ సమరంలో చంద్రబాబు ఓడిపోయారు. మోడీ, అమిత్ షా ని రాష్ట్రం కోసం నిలదీసిన చంద్రబాబు రాజకీయంగా బలహీనుడు అయ్యాడు. దీంతో రాష్ట్ర సమస్యల పై ఢిల్లీని నిలదీసే వారే లేరు.

ఇదే సందర్భంలో కేంద్రం మెడలు వంచేస్తాను అంటూ ఎన్నికల ముందు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అధికారం వచ్చిన తరువాత సైలెంట్ అయ్యారు. మెడలు వంచుతారు అనుకుంటే, సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అంటున్నారు. ఇదే అలుసు అనుకున్నారో ఏమో, ఢిల్లీ పెద్దలు విభజన హామీల పై , ఈ 18 నెలల్లో ఏమి మాట్లాడటం లేదు. అమరావతి నిర్వీర్యం అయిపొయింది, అయినా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పోలవరం పై పిడిగు లాంటి వార్త చెప్పింది కేంద్రం. చంద్రబాబు హయంలో కేంద్ర జల శక్తి చేత 55 వేల కోట్లకు పోలవరం అంచనాలు ఆమోదిస్తే, ఇప్పుడు దాన్ని 20 వేల కోట్లకు తెచ్చారు. అయినా జగన్ గారు ఏమి మాట్లాడటం లేదు. జగన్ గారికి సన్నిహితంగా ఉండే ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా, పోలవరం పై ఇలాంటి అడుగులు వేస్తున్న నువ్వు ఎందుకు అంటున్నారు అంటే, జగన్ చేస్తున్న తప్పు ఏమిటో అర్ధం అవుతుంది. అయినా ఇక్కడ అనాల్సింది కేంద్రాన్ని. ఇక్కడ నష్టపోయింది చంద్రబాబు, జగన్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మోడీని నిలదీసే చంద్రబాబు , రాజకీయంగా బలహీనుడు అయ్యాడు, రాజకీయంగా బలంగా ఉన్న జగన్ గారు, నోరు తెరాటం లేదు. దీంతో కేంద్ర పెద్దలు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది తగునా ? ఈ దెస పార్లమెంట్ లో చెప్పిన దానికి విలువ లేదా ? మీ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు బలి అవ్వాలి. అమరావతి మూడు ముక్కలు అయితే మీకు సంబంధం లేదా ? పోలవరం 55 వేల కోట్లతో కట్టల్సింది, 20 వేల కోట్లతో ఎలా కడతారు ? స్టేటస్ లేకుండా, కొత్త రాష్ట్రం ఎలా నిలదొక్కుకుంటుంది ?

అధికారంలో ఉన్న పార్టీ, దూకుడు మీద ఉంటుంది. ప్రతిపక్షాలు దిగాలుగా ఉంటాయి. ఇక మన రాష్ట్రంలో 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీ , దూకుడు మీద ఉండాలి. కానీ ఎందుకో కానీ, ప్రతి సారి డిఫెన్సు లోనే ఉంటుంది. 151 సీట్లు చేతిలో ఉంటే, ప్రతిపక్షాలను ఫుట్ బాల్ ఆడవచ్చు కానీ ఎందుకో వైసీపీ మాత్రం తడబడుతుంది. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి, తమ సత్తా చాటుతూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలత ఎక్కువ ఉంటుంది. పక్కన ఉన్న తెలంగాణా, రెండో సారి అధికారంలోకి రాగానే, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి, మొత్తం కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రభుత్వం ఎందుకో వెనుకడుగు వేస్తుంది. ఇక్కడ గత మార్చ్ లో ఎన్నికలు ఆగిపోయాయి అని తెలుసు కానీ, ఆసలు ఎన్నికలు జరపమని హైకోర్టు చెప్తేనే, ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వచ్చిందనే `విషయం చాలా మందికి తెలియదు. అంటే దాపుగా 10 నెలల పాటు అధికారంలో ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు. ఎవరో కోర్టుకు వెళ్తే, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొదలు అయ్యింది. ఒక్కసారి ఎన్నికలు ప్రక్రియ మోదలు అయితే, మొత్తం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లి పోతుంది. అందుకే క-రో-నా గురించి ప్రపంచం భయపడుతున్న సమయంలో, ఎన్నికలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికలు జరపాల్సిందే అంటు వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రెండు రోజుల్లో దాదాపుగా 60 మందికి పైగా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషన్ పై, ఎన్నికలు జరపాల్సిందే అంటూ దుమ్మెత్తి పోశారు. తరువాత ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళినా వాళ్ళ వల్ల కాలేదు. ఇక తరువాత, ఎన్నికల కమిషన్ ను తప్పించటం, ఆయన మళ్ళీ కోర్టు ద్వారా పదవిలోకి రావటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత, మళ్ళీ ఆ కేసు కోర్టులో వాయిదాకు రావటంతో, కోర్టు ఎన్నికల ప్రక్రియ గురించి ఈసి అభిప్రాయం అడిగింది. అయితే మళ్ళీ వైసీపీ ఇప్పుడే ఎన్నికలు వద్దు అంటూ రాగం అందుకుంది. ప్రతిపక్షాలు ఎన్నికలు కావలి అంటుంటే, ప్రభుత్వం ఎన్నికలు వద్దు అంటుంది. అంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే నెగ్గం అనే భయం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఇసుక లేక, పనులులేక అల్లాడిన ప్రజలు, క-రో-నాతో పూర్తిగా చతికిల పడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం కరెంటు బిల్లులు, బస్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వాయించి పడేస్తుంది. మరో పక్క రోడ్డులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరదలతో రైతులు అల్లాడిపోయారు. చేతికి వచ్చిన పంట నష్ట పోవటం, వరదల్లో ప్రభుత్వం సరిగ్గా ఆదుకోక పోవటం కూడా మైనస్ అయ్యింది. ప్రజలు సంతోషంగా లేరు. మొత్తం నెగటివ్ మూడ్ ఉంది. ఇక మరో పక్క నిమ్మగడ్డ ఉంటే తమ ఆటలు సాగవు అని అధికార పక్షం అభిప్రాయం. మొత్తంగా, ఎన్నికలు అంటే అధికార పక్షం భయపడుతుంది. మరో పక్క ప్రతిపక్షాలు మాత్రం, ఎన్నికలు కావాలని కోరటం, మన రాష్ట్రంలో ఉన్న రివర్స్ పాలనకు అద్దం పడుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి పై, తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే " జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నెలకొక షాక్ ఇస్తున్నారు. రాష్ట్ర కాగ్ నివేదికలు చూస్తే జగన్ ఇస్తున్న షాక్ లు అందరికీ అర్థమౌతాయి. నెలనెల CAG విడుదల చేస్తున్న జగన్ అప్పల ప్రోగెస్ కార్డు (కాగ్ నివేదికలు) లు రాష్ట్ర ప్రజలపై గుది బండల్లా పడుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఒక్క సెప్టెంబర్ నెలలోనే రూ. 8,038 కోట్లు అప్పు భారాన్ని రాష్ట్రంపై మోపారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలానికి అక్షరాల రూ. 55,189 కోట్లు అప్పు చేశారు. మొదటి ఆరు నెలల లెక్కలే ఇలా ఉంటే ఏడాది పూర్తయ్యే నాటికి అది ఎక్కడికి పోతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. కాగ్ నివేదికలను పరిశీలించి వీటిని అంచనా వేస్తే ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే వైకాపా ప్రభుత్వ అప్పులు దాదాపు రూ. 1,11,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 2014-2019 వరకు ఐదేళ్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,25,000 కోట్లు. అంటే సరాసరి సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు మాత్రమే. ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు జగన్ మోహన్ రెడ్డి ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అప్పులను కప్పి పుచ్చుకోవడానికి కరోనా భారంతో ఇతర రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు పొరుగు రాష్ట్రాల మొదటి ఆరు నెలల అప్పులతో పోల్చితే ఏపీ రెండున్నర రెట్లు కు పైగానే అప్పులు చేసింది."

"తెలంగాణ ప్రభుత్వం రూ. 26,060, కోట్లు, తమిళనాడు రూ. 31,512 కోట్లు, కర్ణాటక రూ. 16,078 కోట్లు, కేరళ రూ. 28,773 కోట్లు అప్పులు చేయగా ఆంధ్రప్రదేశ్ రూ.55,169 కోట్లు అప్పులు చేసి కరోనా కారణం చెప్పడం హాస్యాస్పదం. పొరుగు రాష్ట్రాలలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఏపీ చేసినంతగా వాళ్లు అప్పులు చేయలేదు. తమిళనాడు, తెలంగాణ రెండు రాష్ట్రాలు చేసినంత అప్పు ఒక్క ఆంధ్రప్రదేశ్ చేయటం గమనార్హం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు రెండు రాష్ట్రాల కు సమానమైన అప్పు చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి ఏపీ రెవెన్యూ డెఫిసిట్ రూ. 45, 472 కోట్లు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఆర్ధిక లోటు రూ. 16 వేల కోట్లు ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేసి 2019 నాటికి రూ. 2 వేల కోట్ల ఆర్థిక లోటును తగ్గించి షుమారుగా దానిని రూ. 14 వేల కోట్లకు తగ్గించడం జరిగింది. కానీ, జగన్ చేతగాని తనంతో రాష్ట్ర ఆర్థిక లోటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు మూడు రెట్లు పెంచి రూ.16 వేల కోట్లను రూ.45,472 కోట్లు పెంచేశారు. ఇది జగన్ అసమర్ధత కాదా?? చేతగానితనం కాదా? అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు చేయకుండా తెస్తున్న అప్పులు కూడా దోచుకు తినడానికే అన్నట్లు ఉన్నాయి. జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి సహాయం చేయలేదు. వేల కోట్ల రూపాయల అప్పుచేసి మరీ తెచ్చిన సొమ్మంతా జగన్ మోహన్ రెడ్డి అవినీతికే ఆవిరైపోతోంది." అని పట్టాభి అన్నారు

అమరావతి ఉద్యమకారులు ఏదైనా పిలుపు ఇస్తే చాలు, ప్రభుత్వం ఎందుకో కానీ భయపడుతున్నట్టు కనిపిస్తుంది. ఏ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా, దాన్ని అణిచివేస్తూ వస్తుంది. 319 రోజుల్లో ఎన్నో నిర్బంధాలు చేసినా, రైతులు మాత్రం శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, అమరావతి రైతులకు సంకెళ్ళు వేసిన సంఘటన, రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దళితుల పైనే, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టటం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు చలో గుంటూరు జైలు కార్యక్రమానికి అమరావతి జేఏసి పిలుపు ఇచ్చింది. గుంటూరు జైలులోనే, అరెస్ట్ చేసిన అమరావతి రైతులు ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించటంతో, జగన్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. కేవలం అమరావతి నుంచే కాదు, అటు శ్రీకాకుళం నుంచి, రాయలసీమ వరకు, నేతలు ఈ కార్యక్రమానికి వస్తున్నారనే సమాచారం రావటంతో, నిన్న రాత్రి నుంచే నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. దీంతో మరోసారి అమరావతి ఉద్యమం , జగన్ సర్కార్ ను తాకినట్టు అయ్యింది. వారి సమస్యలు ఏమిటో పట్టించుకోకుండా, వారి పై నిర్బంధాలు చేస్తూనే ఉన్నారు. అమరావతి ఉద్యమంలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నా రైతులను పోలీసులు అరెస్టు చేసి బేడీలు వేసి కోర్టుకు హాజరు పరిచిన నేపథ్యంలో అన్నదాతకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుంటూరు జైలు భరో కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశించింది. అలాగే అన్ని పార్టీల నేతలు పిలుపు ఇచ్చారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేయటానికి జైలు భరో కార్యక్రమానికి బయలుదేరిన నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఈ అరెస్ట్ ల పై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. "ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన ఏ విధంగా కొనసాగుతుందో చెప్పడానికి.... అందుకు నిదర్శనమే ఈ యొక్క అమరావతి రాజధాని రైతులకు చేసిన అన్యాయం అంతేకాకుండా అక్కడ ఉన్న రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు తరలించడంలోనే తెలుస్తుంది. ఇటువంటి ప్రభుత్వాలా మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి అని సిగ్గేస్తుంది. ఈ దేశానికి వెన్నెముక రైతన్న అటువంటి రైతు చేతికే ఈరోజు బేడీలు వేసి జైలుకు తీసుకు వెళ్లారు అంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాము మీరు ఇటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని తలంపులు తెచ్చినా అమరావతి రాజధానికి మా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అక్కడ ఉన్న రైతులు అందరికీ కూడా అండగా ఉండి వారికి న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేశారు. ప్రజలందరూ కూడా మీ యొక్క పరిపాలనను గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈప్రభుత్వం భయపడుతుందనడానికి ఈ అక్రమ అరెస్టే కారణం అన్నారు. ఇటువంటి అరెస్టులు, కేసులు ఎన్ని పెట్టినా ఏమి చేసినా ఎవరూ భయపడేవారు లేరని న్యాయం జరుగుతుందంటే ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధమేనని ఎటువంటి పోరాటం అయినా చేస్తామని తెలియజేశారు.

Advertisements

Latest Articles

Most Read