ఏపీలో ఎంబీబీఎస్ సీట్ల అమ్మకానికి పెట్టి, పేదల నడ్డి విరిచారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు 42 వేల మంది అర్హత పొందారు, కానీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్లు 6 వేల మాత్రమే. ఇందులో 3 వేల సీట్లు అమ్ముకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చాలా మంది విద్యార్థులు హైదరాబాద్, చెన్నై వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. ఎంబీబీఎస్ సీట్లు కొరతతో పాటు, ఖరీదైన ఫీజులూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఓపెన్ కేటగరీలో 3 వేలకు పైగా సీట్లు అమ్ముకునేలా, అధిక ఫీజు వసూలు చేసుకునేలా కళాశాలలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను అందుకోవడం కష్టతరం అవుతోంది. ఎన్నికల ముందు వైద్య విద్య మరియు ఇంజనీరింగ్ విద్యను ఉచితం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఇంకా ఆ హామీని అమలు చేయలేదు. ఎంబీబీఎస్ సీట్ల కొరత మరియు ఖరీదైన ఫీజులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. కృష్ణాయపాలెంలోని రైతుల శిబిరాలలో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసన చేస్తున్నారు. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు ప్రభుత్వం బస్సులు పంపింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని చెప్పినా వినకుండా బస్సులు లాక్కున్నారు. స్కూల్, కాలేజీల బస్సుల్లో జనాన్ని తరలించారు. అమరావతిలోని రైతుల నేతలను ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. హౌస్ అరెస్ట్‌ పై రైతులు తీవ్రంగా నిరసన చేస్తున్నారు.  రైతుల ఆందోళనతో అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ రోజు రాజధాని అమరావతిలో జగన్ సభకు విద్యాసంస్థల బస్సులను లాక్కున్నారు అధికారులు. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు ఉన్నా బస్సులను బెదిరించి అధికారులు లాక్కోవటంతో విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులు ఇవ్వలేమని చెప్పినా కళాశాలల యాజమాన్యాలపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకే యాజమాన్యాల నుంచి బస్సులు తీసుకున్నారు. బస్సులు ఇవ్వకపోతే ఎలా తిరుగుతాయో చూస్తామంటూ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. రాజధానిలో సీఎం సభకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకెళ్లేందుకు విద్యాసంస్థల బస్సులు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, విద్యార్థులు పరీక్షల సమయం అని, వారు హాజరయ్యేందుకు బస్సులు అవసరమని కళాశాలల యాజమాన్యాలు చెప్పాయి. అయినప్పటికీ, అధికారులు విద్యార్థుల పరీక్షలను పట్టించుకోకుండా బస్సులను లాక్కున్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బస్సులను బలవంతంగా తీసుకువెళ్లి సీఎం సభకు పంపేలా బెదిరించిన ప్రభుత్వం ఈ చరిత్రలోనే లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అమరావతిలో ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించాలని అధికారులు ఆదేశించారు. లబ్ధిదారులందరూ తప్పకుండా రావాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, లబ్ధిదారులు కొందరు కార్యక్రమానికి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు కార్యక్రమానికి రావడం తప్పనిసరి అని చెబుతున్నారు. వారు రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 1,100 ఆర్టీసీ, 400 ప్రైవేటు బస్సులను సిద్ధం చేశారు. ఈ బస్సుల ద్వారా లబ్ధిదారులను అమరావతిలోని కార్యక్రమానికి తరలించనున్నారు.  భారీ వర్షం పడినా సరే కార్యక్రమం ఆగకూడదని, జనాలని తోలుకు రావలసిందే అని గుంటూరు, కృష్ణా జిల్లా అధికారుల ఆదేశాలు ఇచ్చారు. నెల కూడా అవ్వలేదని, మొన్ననే పనులు మానుకుని వచ్చామని, ఈసారి రాలేమంటున్నా, ససేమిరా అంటు వలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారు.

Page 3 of 3181

Advertisements

Latest Articles

Most Read