గన్నవరం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క గన్నవరం ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు ఒక వైపు లీక్ చేస్తుంటే, మరో వైపు ఈ రోజు జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన వంశీకి పిలుపు రాలేదు. మరో పక్క వంశీ ఈ రోజు నియోజకవర్గ స్థాయి సమీక్షను టిడిపి కార్యాలయంలో చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి వంశీని అరెస్ట్ చేస్తే ? లేకపోతే జగన్ సభలో వంశీ, టిడిపి అభిమానులు ఆందోళన చేస్తే ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు జగన్ పర్యటన సాఫీగా సాగిపోయేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసారు. వంశీని అరెస్ట్ చెయ్యాలి అనుకుంటే, జగన్ పర్యటన అయిపోయిన తరువాతే అరెస్ట్ చేసే అవకాసం ఉంది. ఇక మరో పక్క ఎమ్మెల్యే వంశీ కూడా అరెస్ట్ చేసే చేసుకోండి అనే విధంగా, తన కార్యాలయంలో కూర్చుని నియోజకవర్గ టిడిపి సీనియర్లతో సమీక్ష చేస్తున్నారు.

vamsi 24102019 2

అయితే జగన్ పర్యటన ఉన్న రోజే, వంశీ బయటకు రావటం పై, పోలీసులు అలెర్ట్ అయ్యారు. జగన్ వైఖరి పై నిరసన ఏమైనా తెలిపే అవకాశం ఉందా, అనే విధంగా పోలీసులు ఆలోచిస్తున్నారు. మూడు రోజుల క్రితం వంశీ పుట్టిన రోజు అయినా, కార్యాలయానికి రాలేదు. దీంతో కేసుకు భయపడి వంశీ పారిపోయారు అంటూ ప్రచారం చేసారు. దీంతో వంశీ ఈ రోజు, ఆఫీస్ లోనే కూర్చుని, ఆ ప్రచారం చేస్తున్న వారి నోరు మూయించారు. మరో పక్క, నకలీ పట్టాలు సృష్టించారు అంటూ వంశీ పై నమోదు అయిన కేసులు, ఆయన్ను అరెస్ట్ చెయ్యటానికి, పోలీసులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే స్పీకర్ నుంచి కూడా అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో జగన్ పర్యటన అయిపోగానే, వంశీని అరెస్ట్ చేసే అవకాసం ఉంది.

vamsi 24102019 3

అయితే ఇప్పటికే వంశీ హైకోర్ట్ లో ఈ కేసు పై పిటీషన్ వేసారు. నిన్నే కోర్ట్ నుంచి ఉత్తర్వులు వస్తాయి అని అనుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం లోపు, కోర్ట్ కు ఈ విషయం పై ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాసం ఉంది. ఇవన్నీ ఇలా సాగుతూ ఉండగానే, వంశీ పార్టీ మారిపోతున్నారు అంటూ మరో ప్రచారం కూడా సాగుతుంది. జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన బీజేపీ లోకి వెళ్ళిపోతున్నారని, ఇప్పటికే తనకు గాడ్ ఫాదర్ అయిన సుజనా చౌదరిని కలిసారనే ప్రచారం జరుగుతుంది. దీని పై వంశీ స్పందిస్తూ, తాను టిడిపి ప్రతిపక్షంలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని, సీతారమంజనీయులు సీపీగా ఉండగా, తనను ఎంతో ఇబ్బంది పెట్టారని, మొన్న ఎన్నికల్లో కూడా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని, తాను ఈ ఒత్తిళ్లకు భయపడను అని, కోర్ట్ లో తేల్చుకుంటానని, పార్టీ మారాను అని చెప్తున్నారు..

గోదావరి నదిలో 77 మందితో వెళ్ళిన బోటు మునిగిన సంగతి తెలిసిందే. 51 మంది చనిపోగా, 26 మంది ఒడ్డుకుచేరారు. అయితే ఈ బోటు మునిగి దాదపుగా 38 రోజులు అయినా, ప్రభుత్వం ఈ బోటుని బయటకు తీయలేదు అనే విమర్సలు వచ్చాయి. ముఖ్యంగా 12 మంది ఆచూకీ దొరక్కపోవటంతో, ప్రభుత్వం పై మరింత విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వ, ధర్మాడి సత్యం బృందానికి, బోటు బయటకు తీసే పని అప్పగించింది. ధర్మాడి సత్యం బృందంతో పాటు, విశాఖ నుంచి వచ్చిన డీప్‌ వాటర్‌ డైవర్లు, నది లోపలికి దిగి బోటుకు ఇనుప తీగను కట్టి ఎట్టకేలకు బయటకు తీసారు. 38 రోజుల తరువాత బోటు బయటకు వచ్చింది. ధర్మాడి సత్యంతో, రూ.22 లక్షలు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బోటుని బయటకు తియ్యటంతో, ధర్మాడి సత్యం బృందానికి ప్రశంసలు అందుతున్నాయి. ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు కూడా అభినందిస్తూ లేఖ రాసారు. ఇది లేఖ సారంశం.

dharmadi 23102019 2

గౌ|| ధర్మాడి సత్యం గారికి.. నమస్కారములు..బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న మీ తపన, మునిగిన పడవను బయటకు తియ్యాలన్న మీ పట్టుదల ప్రశంసనీయం. గోదావరిలో మునిగిన రాయిల్‌ వశిష్ట పడవను వెలికితీసేందుకు మీరు చూపిన తెగువ, చొరవ, పడిన శ్రమను అభినందిస్తున్నాను. పడవ వెలికితీత కోసం మీరు చూపిన శ్రద్ధలో ఒక్క శాతం అయినా ప్రభుత్వం పెట్టి ఉంటే, ఈ దురవస్ధ బాధిత కుటుంబాలకు వాటిల్లేది కాదు. ఇన్ని ప్రాణాలు గోదాట్లో కలిసిపోయేవేకాదు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చలూరు పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. పడవ వెలికితీతపై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టపోయినప్పటికీ మీరు అధికారుల వెంటపడి మరీ పడవను బయటకు తీస్తానని ముందుకొచ్చిన విషయం పత్రికల్లో చూశాను.

dharmadi 23102019 3

మీ పట్టుదల సాయం చేయాలన్న తపన అభినందనీయం. బాధ్యతాయుతమైన మీ బృంద స్పూర్తి అందరిలో నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను. తమ వారిని కడసారి కూడా చూడలేమోనని కన్నీళ్లతో క్రుంగిపోయిన ఆప్తులకు మృతదేహాలను వెలికితీసి ఊరట కల్గించారు. తమ వారికి అంత్యక్రియలు నిర్వహించి వారి ఆత్మకు శాంతి కల్గించేందుకు మీరు, మీ బృందం దోహద పడ్డారు. ఎంతో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు కచ్చలూరు పడవ ప్రమాదాన్ని, బాధితుల కన్నీళ్లను నిర్లక్ష్యం చేశారు. విపత్తులలో బాధితులను వదిలేసి దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారు. కానీ మీరు కుటుంబాలను వదిలి, అన్న పానీయాలు మాని జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు, వారి ఆప్తుల భౌతిక కాయాలను వారికి అప్పగించడం కోసం పడిన తపనను తెలుగుదేశం పార్టీ మనస్పూర్తిగా అభినందిస్తోంది.

వైసీపీ వచ్చిన గత అయుదు నెలలుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పై జరుగుతున్న దాడులతో పాటు, కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్న విధానం పై, తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా పోరాటం చేస్తుంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పోరాటంతో పాటు, చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రెజంటేషన్ లు ఇచ్చి మరీ, వైసిపీ అరాచకాలను ఎండ గడుతున్నారు. అయినా, వైసీపీలో మార్పు రాకపోవటంతో, వివిధ ఫోరమ్స్ లో పోరాటానికి తెలుగుదేశం సిద్ధమైంది. ఇందులో భాగంగా, ముందుగా జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్లి, ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నిటి పై ఆధారాలు ఇచ్చి, ఫిర్యాదు చేసింది తెలుగుదేశం. తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన, జాతీయ మానవ హక్కుల సంఘం, సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తమని వేధిస్తుంది అంటూ టిడిపి చేసిన ఆరోపణల పై, విచారణకు ఆదేశించింది.

jaydev 23102019 2

ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, డీజీపీలకు, లేఖ రాస్తూ జాతీయ మానవ హక్కుల సంఘం, కీలక ఆదేశాలు జారీ చేసింది. టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఇచ్చిన ఫిర్యాదు పై పూర్తి స్థాయి విచారణ జరిపి, ఆరు వారాల్లోగా, ఆ నివేదిక తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ లోపే, గుంటూరు జిల్లాలోని పిన్నెల్లి, ఆత్మకూరు, జంగమేశ్వరపాడు, పునుగుపాడు గ్రామాలకు, పోలీసు, న్యాయశాఖలకు చెందిన ఇద్దరు అధికారులును పంపించి, అక్కడ ఊళ్ళు వదిలి వెళ్ళిన బాధితుల పరిస్థితి పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, 2 పేజీల ఆదేశాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆదేశాలు జారీ చేసింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.

jaydev 23102019 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, టిడిపి పార్టీకి ఓటేసిన సానుభూతిపరులను వేధిస్తూ, వారి పౌర హక్కులకు ఉల్లంఘన కల్గిస్తున్నట్లు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత, జయదేవ్‌ గల్లా ఈనెల 15న, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేసులు విచారణ పేరిట, బాధితులనే పోలీసులు వేధిస్తున్నారని, బాధితులను నిస్సహాయులుగా మార్చేస్తున్నారని, వీటికి సంబంధించి, 19 కేసుల వివరాలను, గల్లా జయదేవ్ సమర్పించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గ్రామాల్లో, దళిత వర్గానికి చెందిన పౌరులను, ఊరి నుంచి వెళ్ళగొట్టిన విషయంలో, మానవ హక్కుల సంఘం పరిగణనలోకి తీసుకుని, చీఫ్ సెక్రటరీ, డీజీపీలను, విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రోజు రొజుకీ ఆందోళన కలిగించే విషయంగా మారుతున్నాయి. ఏకంగా ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని అరెస్ట్ చెయ్యటం, పెను సంచలనంగా మారింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను, గవర్నర్ నియమిస్తారు. ఏ సమస్య వచ్చినా, ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళాలి. మన రాష్ట్రంలో మాత్రం, గవర్నర్ కు కూడా చెప్పకుండా, ఏకంగా ఒక యూనివర్సిటీ వీసిని అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. అయితే హైకోర్ట్ లో బెయిల్ రావటంతో, ప్రస్తుతానికి ఈ వివాదం సద్దు మణిగింది. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావటంతో, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ వివాదానికి కాంట్రాక్టు ఉద్యోగి మురళీకృష్ణ ఫిర్యాదు చెయ్యటమే. మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకే, పోలీసులు వీసీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

ranga 23102019 2

మురళీకృష్ణ చెప్పిన వివరాలు ప్రకారం, ఏప్రిల్‌ 12న తనను విధులు నుంచి తొలగించారని, ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలని కోరిన సందర్భంలో, వైస్‌ ఛాన్సలర్‌ తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు చేసారు. అయితే ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో, గవర్నర్ కు సమాధానం ఇవ్వకుండా, పోలీసులు దూకుడుగా వెళ్ళటం పై విమర్శలు వచ్చాయి. అయితే, నిన్న వైస్‌ ఛాన్సలర్‌ దామోదర నాయుడికి హైకోర్ట్ లో బెయిల్‌ మంజూరైంది. అయితే అన్ని యూనివర్సిటీల వీసిలను కొత్త ప్రభుత్వం రాజీనామా చెయ్యమని కోరిందని, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీ దామోదర నాయుడు మాత్రం అందుకు నిరాకరించటంతో, ఆయన పై ఇలా కేసులు పెట్టి ఒత్తిడి తెస్తున్నరనే ప్రచారం నడుస్తుంది.

ranga 23102019 3

ఈ అరెస్ట్ పై వీసీ దామోదర నాయుడు స్పందిస్తూ, తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, తాను ఎవరినీ కులం పేరిట దూషించలేదని చెప్పారు. ఈ కేసు విషయంలో, దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని ఆయన విమర్శించారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే సమర్ధవంతమైన అధికారులు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయలేరన్నారు. దీని వెనుక ఉన్న కధ మొత్తం తనకు తెలుసని, న్యాయస్థానంలో తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందని అన్నారు. మరో పక్క, హైకోర్ట్ లో వాదనలు వినిపిస్తూ, వీసీ అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు ఆరోపించటంతో, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అర్ధమవుతుంది. మరో పక్క గవర్నర్‌ అనుమతి లేకుండా వీసీని అరెస్ట్‌ చేసిన విషయన్ని కోర్ట్ ద్రుష్టికి తీసుకు వెళ్లారు.

Advertisements

Latest Articles

Most Read