వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీ రావు మీద ఒంటి కాలు మీద వెళ్ళే వారు. తన పాలనకు వ్యతిరేకంగా కధనాలు వస్తే చాలు, వారిని ద్రోహులుగా చిత్రీకరించే వారు. కాని వైఎస్ఆర్ ఒక లైన్ దాటి వెళ్ళే వారు కాదు. విమర్శలు వస్తే, కొంచెం వెనక్కు తగ్గి, తెగే దాకా లాగే వారు కాదు. కాని ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, దానికి పూర్తి భిన్నం. తనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, అటు సోషల్ మీడియాలో ఉన్న సామాన్యులు దగ్గర నుంచి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇటు పత్రికులు, టీవీ ఛానెల్స్ దాకా, అందరి సంగతి చూడటం మొదలు పెట్టరు. విమర్శ అనే మాట కూడా తట్టుకోలేక పోతున్నారు. ఇందులో భాగంగానే, గ్రామ సచివాలయ పేపెర్ లీక్ తో పాటుగా, రివెర్స్ టెండరింగ్ లో జరుగుతున్న స్కాం గురించి బయట పెట్టిన ఆంధ్రజ్యోతి కధనాలకు, వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యకుండా, వాటి పై కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారు.

rk 20102019 2

ఇప్పటికే ఏబీఎన్, టీవీ5 బ్యాన్ చేసారు. ఇంకా ఈనాడు జోలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పేపర్ లను కూడా టార్గెట్ చేసారు. 24 గంటల్లో ప్రభుత్వానికి మచ్చ తెచ్చే వ్యతిరేక కధనాల పై కేసులు పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన పరిహారం విషయంలో కూడా, కఠినంగా వెళ్తున్నారు. 1986లో ఆంధ్రజ్యోతి భూమి జాతీయ రహదారి విస్తారణలో పోవటంతో, దానికి పరిహారంగా వైజాగ్ లో భూమి ఇచ్చారు. అయితే ఈ భూమి విషయంలో నిర్ణయం తీసుకున్న జగన్, ఆ భూమి వెనక్కు తీసుకుంది. దీని పై వీకెండ్ కామెంట్ లో ఆర్కే, జగన్ కు సవాల్ విసిరారు. "ఇదంతా అక్రమమనీ, మొదటిసారిగా ‘ఆంధ్రజ్యోతి’కి మాత్రమే అప్పనంగా భూమిని కేటాయించారనీ మంత్రి పేర్ని నానితోపాటు జగన్‌ మీడియా ప్రచారం చేయడాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ‘ఆంధ్రజ్యోతి’కి కేటాయించిన భూమి అక్రమమని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ఒక పని చేద్దాం. మేం ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించిన 50 లక్షలను కూడా వదులుకుంటాం."

rk 20102019 3

"జగన్మోహన్‌రెడ్డి 45 వేల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్నారనీ, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనీ సీబీఐ నిర్ధారించినందున.. ఆయన కూడా సదరు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారా? ఇందుకు సిద్ధమేనా? అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన అనుచరులు ఇతరులకు బురద పూయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉండదా!? " అంటూ ఆర్కే జగన్ కు సవాల్ విసిరారు. మరి జగన్ ఆ ఛాలెంజ్ ఒప్పుకుని, తన డేర్ చూపించగలరా ? చూద్దాం. ఇదే సందర్భంలో జగన్ తనకు రాయబారం పంపటం పై కూడా ఆర్కే చెప్పుకొచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమను బలపరిస్తే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఉన్న విలువైన భూమిని ‘ఆంధ్రజ్యోతి’కి కేటాయిస్తామని అప్పట్లో ఇదే జగన్మోహన్‌రెడ్డిని, వైఎస్ఆర్ నా వద్దకు రాయబారం పంపారని, కాని షరతులకు లోబడి భూమి తీసుకోవడానికి అప్పుడు నేను అంగీకరించలేదని, జగన్ ఆ విషయం గుర్తుంచుకోవాలని ఆర్కే అన్నారు. మరి ఈ విషయం తప్పు అయితే, జగన్, ఆర్కే పై కేసు పెట్టాలి, ఎలాగూ కొత్త జీవో వచ్చింది కదా. చూద్దాం.

రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాన్యం ఆస్తుల పై ఆరు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు, ఐటి దాడులు చెయ్యటం అంటే, ఇది ఒక సంచలనంగానే చెప్పచ్చారు. మేఘా కంపెనీ యాజమాన్యం మాత్రం ఇది ఐటీ అధికారులు ప్రతి ఏటా జరిపే ఖాతాల పరిశీలనలో భాగమేనని చెబుతున్నప్పటికీ, ఐటీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా ఆరు రోజులుగా మేఘా సంస్థ ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్‌లలో సోదాలు జరిపారు. ఎక్కడా స్టేట్ టీమ్స్ కి సమాచారం ఇవ్వకుండా, డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్స్ ఈ సోదాలు జరిపాయి. సీఆర్పీఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగి, బద్రత కల్పించాయి. అయితే మేఘా కృష్ణా రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దగ్గర ఆయన కావటంతో, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

megha 19102019 2

సోదాల్లో భాగంగా, బాలానగర్‌, ఐడీఏ బొల్లారం, మాదాపూర్‌ కావేరి హిల్స్‌లో మేఘా కంపెనీ ఛైర్మన్‌ పిచ్చిరెడ్డి, ఎండీ కృష్ణారెడ్డి, మరో డైరెక్టర్‌కు చెందిన ఖాతాలు, లాకర్‌లను ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ సమయంలో సంబంధితులనూ వెంట తీసుకుని వెళ్లి మరీ సోదాలు జరిపినట్లు సమాచారం. అన్ని ఖాతాలలో ఎంత మేరకు నగదు ఉంది ? లాకర్‌లలో ఎంత మొత్తంలో బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయనే దానిపై వివరాలు సేకరించినట్లు సమాచారం. బాలానగర్‌ ఆంధ్రా బ్యాంకులోని లాకర్‌లో ఉంచిన నగలను ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. వాటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఐటీ అధికారులు ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు.

megha 19102019 3

ఈ రోజు, ఐటి అధికారులు అఫిషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ప్రెస్ నోట్ లో సంచలన విషయాలు ఉన్నాయి. 30 చోట్ల ఏక కాలంలో, హైదరబాద్, ఢిల్లీ , ముంబై లో దాడులు చేసామని, పెద్ద ఎత్తున నకిలీ బిల్లులు, సబ్ కాంట్రాక్టు లావాదేవీలు కనుక్కున్నామని చెప్పారు. లెక్కల్లో చాలా తేడాలు గమనించామని చెప్పారు. అంతే కాదు, హవాలా మార్గం ద్వారా, వందల కోట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసామని చెప్పారు. ఇక 17.4 కోట్ల క్యాష్ కు సంబంధించి లెక్కలు లేకపోవటంతో, వాటిని కూడా సీజ్ చేసామని చెప్పారు. వీటి అన్నిటి పై, విచారణ జరుపుతున్నామని అన్నారు. అయితే, ఐటి ప్రెస్ నోట్ చూస్తే, వందల వేల కోట్లు హవాలా మార్గం ద్వారా వచ్చినట్టు అర్ధమవుతుంది. వీటి అన్నిటి పై విచారణ జరిపితే, పెద్ద తలకాయలు బయట పడటం ఖాయం..

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఆయన అనుచరులు మరో 9మంది పై హనుమాన్‌ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసారు. జంక్షన్ పోలీసుల కథనం ప్రకారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బావులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నకిలీ ఇళ్ళ పట్టాలు వంపిణీ చేసారన్న ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేసారు. తాహసీలార్ సంతకం స్టాంపు వేసి ఉన్న నకిలీ ఇళ్ళ పట్టాలను ఎన్నికలకు మూడు రోజుల ముందు పెరికీడులో టిడిపి నాయకులు పంపిణీ చేసారని వైసిపీ ఆరోపణ. దీని పై వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమీషను, జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్పట్లో మాజీ జడ్పీటీసి మరి కొంతమంది పై పోలీసులు కేసు నమోదు చేసారు.

vamsi 19102019 2

టిడిపి ఎమ్మెల్యే వంశీ ప్రోద్బలంతోనే నకిలీ పట్టాలు తయారు చేసి వెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో వంపిణీ చేసారని గన్నవరం కు చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ 10.07.19వతేదీ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహసీల్దార్ విచారణ జరిపిన తాహసీల్దార్ నరశింహారావు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన సంగతి వాస్తవమేనని నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులపై జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాహసీలార్ ఫిర్యాదు మేరకు వంశీ ఆయన అనుచరులు ఓలువల్లి మోహనరంగా, కాట్రు శేషు కుమార్, టిడిపి నాయకులు జాస్తి ఫణీశేఖర్ తదితరులు మొత్తం 9మందిపై ఐపిసి 420, 468 ,472, 171(ఈ), 120(బి) సెక్షన్ల ప్రకారం జంక్షన్ ఎన్ఏ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

vamsi 19102019 3

అయితే దీని పై వల్లభనేని వంశీ సహచరులు మాత్రం, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని అంటున్నారు. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయం పై, వైసిపీ నుంచి గన్నవరం అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట రావు, హైకోర్ట్ లో, వంశీ ని అనర్హుడిగా చెయ్యాలని కేసు వేసారని, ఈ కేసు హైకోర్ట్ లో విచారణకు వచ్చిన టైంలో, నిజానిజాలు తెలుస్తాయని, ఈ లోపే మళ్ళీ తప్పుడు కేసు పెట్టి, ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వంశీ వర్గీయులు అంటున్నారు. వంశీని పార్టీ మారమని ఒత్తిడులు వస్తున్నాయని, వంశీ వీళ్ళ బెదిరింపులకు లొంగకపోవటంతోనే, ఇప్పుడు వంశీని కేసులు పెట్టి టార్గెట్ చేస్తున్నారని, టిడిపి ఎమ్మెల్యేలు అందరి పై, ఇలాగే కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర డీజీపీ పై, తెలుగుదేశం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. జగన్ చెప్పినట్టు ఆడుతూ, చట్టాలను తుంగలోకి తోక్కుతున్నారని, టిడిపి కార్యకర్తలను టార్గెట్ చేస్తూ, టిడిపి ఇచ్చిన కంప్లైంట్ లు కూడా తీసుకోవటం లేదని, డీజీపీ, జగన్ చెప్పినట్టు ఆడుతున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. చంద్రబాబు కూడా, డీజీపీ పై ఘాటుగా స్పందించారు. అయితే ఈ రజు, విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ , ఆ వ్యాఖ్యల పై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనను కలవటానికి, వచ్చిన సమయంలో తాను ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల వారిని కలవలేకపోయానన్నారు. అయినా వారిచ్చిన ఫిర్యాదు, మీడియాతో పాటు సోషల్ మీడియా ద్వారా తాను చూశానని వెల్లడించారు. తాను వినయపూర్వకమైన ఓ ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమేనని, తనకు తెలిసిందల్లా ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడమేనని డీజీపీ వ్యాఖ్యానించారు.

dgp 19102019 2

రాజకీయ ఆరోపణలతో తనకు సంబంధం లేదని, అందులో తనకు పాత్ర కూడా లేదని గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టంచేశారు. నిన్న చంద్రబాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "ఫిర్యాదు చేసేందుకు టిడిపి నాయకులు వెళ్తే డిజిపి ఉండరా..? అదే వైసిపి వాళ్లు ముగ్గురు వెళ్తే ఉంటారు,అక్కడే ప్రెస్ మీట్ పెడతారా..? డిజి ఆఫీసులోనే మీసాలు మెలేసి టిడిపి నేతలను హెచ్చరిస్తారా..?అది డిజిపి ఆఫీసా, వైసిపి ఆఫీసా..? 14ఏళ్లు సీఎంగా, 11ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్ననాకు నోటిసు పంపిస్తానని డిజిపి అంటారా..? వైసిపి నేతల బారినుంచి తమను తాము కాపాడుకోలేని దుస్థితిలో పోలీసులు ఉంటే ఇక ప్రజలను ఏం కాపాడతారనే చర్చ జరుగుతోంది. కరడుగట్టిన నేరస్తుల ట్రైనింగ్ లో పోలీసులు పనిచేస్తున్నారనే అపవాదు వస్తోంది." అని చంద్రబాబు అన్నారు.

dgp 19102019 3

"మీడియా ఆంక్షలపై మంత్రి పేర్నినాని నంగినంగిగా మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు కేబుల్ ఆపరేటర్లతో మీటింగ్ లు పెట్టి బెదిరించారు. ట్రాయ్, టిడి శాట్ ఉన్నాయని చెప్పినా, రాష్ట్రంలో అమలు చేయాల్సింది మేమే అంటారా..? ఆ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛలేదా, ప్రజాస్వామ్యం లేదా..? తోలు మందమా..? ఇలాంటి రాక్షసులు వస్తారనే రెగ్యులేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఛానళ్లు కావాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లెక్కి ఆందోళను చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం చెప్పాయి. అడిగితే సమాధానం చెప్పరు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇష్టానుసారం తప్పుడు పనులు చేయడానికా మీ సబ్ కమిటిలు..? సాంకేతిక సమస్యలు ఉన్నాయని ట్రిబ్యునల్ కు చెబుతారా..? పోదాం రండి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూపించండి. ఛానళ్ల నిలిపివేతపై ఎక్కడికక్కడ వినియోగదారులు డిమాండ్ చేయాలని పిలుపిస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read