రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత, అమరావతి లాంటి ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ కు రుణాలు ఇస్తాం అని చెప్పిన బ్యాంకులు కూడా, వెనక్కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమరావతి విషయంలో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, రుణం ఇవ్వటానికి, అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తామని, పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటంతో, రాష్ట్రం దాని పై ఏమి స్పందించక పోవటంతో, ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. తరువాత ఇదే వరుసలో ఎసియన్‌ డెవలప్‌మెంటు బ్యాంకు కూడా అమరావతి నుంచి తప్పుకుంది. నిన్న కాక మొన్న, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురుపించింది. మీకు రుణం ఇవ్వాలంటే, మీకు తీర్చే శక్తి ఉండాలి కదా, మీ పరిస్థితి బాగోలేదు అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు ముందుకు రావటం లేదనే విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది.

adb 18102019 2

అయితే కొత్త రుణాలు సంగతి తరువాత, ఇప్పటికే ఇచ్చిన రుణాల పై, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో, కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాశక్తిలో వచ్చిన కధనం ప్రకారం, విశాఖ- చెన్నై పారిశ్రామిక క్యారి డార్‌ నిర్మాణానికి ఎసియన్‌ డెవలప్‌మెంటు బ్యాంకు రుణం ఇచ్చింది. అయితే ఈ రుణం పక్కదారి పట్టిందనే విషయం ఇప్పుడు గుర్తించారు. ప్రభుత్వం పనులు చేపించుకుని, బిల్లులు ఇవ్వకపోవటంతో, పనులు చేసిన కాంట్రాక్టర్ లు, ఇక మా వల్ల కాదు అంటూ, మేము ఇక పనులు చెయ్యలేం అంటూ నోటీసులు ఇస్తున్నారు. దీంతో కేంద్రం కూడా ఈ విషయం పై అసంతృప్తితో ఉంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఏషియన్‌ డెవలప్‌మెరట్‌ బ్యారకు దాదాపు 2600 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.

adb 18102019 3

అయితే ఇందులో, 960 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది. అయితే నిబంధనలు ప్రకరం, ఇప్పటికే విడుదల చేసిన నిధులలో ఐదు వందల కోట్ల రూపాయల వరకు పనులు జరగాలన్నది లక్ష్యం. అయితే ఇప్పటికే, 350 కోట్ల రూపాయల పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఆ 350 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం కొన్ని నెలలుగా చెల్లిరచలేదని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమావేశరలో గుర్తిరచారు. దీని పై పరిశీలన చేయగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా చెల్లించకపోవడంతో పాటు, విడుదల చేసిన మొత్తాన్ని కూడా ఇతర అవసరాలకు మళ్లిం చినట్లు తేలింది. దీంతో అటు పని చేసిన కాంట్రాక్టర్లతో పాటుగా, ఇటు కేంద్రం కూడా రాష్ట్రం పై అసహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఇది కరెక్ట్ చెయ్యాలని, కేంద్రం ఆదేశించింది.

టీవీ9 మాజీ సిఈవో రవి ప్రకాష్ కేసుల విషయంలో రోజుకి ఒక ట్విస్ట్ వస్తుంది. ఆయన్ను బయటకు తీసుకోవచ్చే ఉద్దేశం అక్కడ ప్రభుత్వ పెద్దలకు లేనట్టు ఉంది. టీవ9 చేతులు మారగానే, రవి ప్రకాష్ ను కొత్త యాజమాన్యం టార్గెట్ చేసింది. అయితే రవి ప్రకాష్ కోర్ట్ నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు. దీంతో పెద్దలు, ఈ కేసు విషయంలో రవి ప్రకాష్ ని అరెస్ట్ చెయ్యలేం అని తెలుసుకుని, మరో కేసు పెట్టారు. అంతే, ఉన్నట్టు ఉండి దసరా పండుగ రెండు రోజుల ముందు, పోలీసులు ఉన్న పళంగా వచ్చి, రవి ప్రకాష్ ని అరెస్ట్ చేసారు. ఏబీసీఎల్‌ ఖాతాల నుంచి రూ.18కోట్లు అక్రమంగా తీసుకున్నారన్న అభియోగాలపై రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసు విషయంలో రవి ప్రకాష్ బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై నిన్న వాదనలు జరిగాయి.

raviprakash 18102019 2

దీంతో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈకేసులో రవిప్రకాశ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసు విషయంలో రవి ప్రకాష్ కు బెయిల్ వస్తుందని, ముందే గ్రహించి, బెయిల్ వచ్చే లోపే మరో కేసు పెట్టారు. దీంతో రవి ప్రకాష్ కి బెయిల్ వచ్చిన వెంటనే, మరో కేసులో పోలీసులు అరెస్ట్ చూపించారు. నకిలీ మెయిల్‌ ఐడీ సృష్టించి మోసం చేశారని ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ జైలు నుంచి విడుదలకాగానే ఈకేసులో ఆయన్ను విచారించే అవకాశముంది.

raviprakash 18102019 3

ఐ ల్యాబ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, ఈ కొత్త కేసు పెట్టి, రవిప్రకాశ్‌ పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ సెక‌్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. అయితే మరో పక్క, రవి ప్రకాష్ కేసు ఇన్ని ట్విస్ట్ లు తిరగటం వెనుక, రాజకీయ కోణం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. టీవీ9 కొత్త యాజమాన్యం, కేసిఆర్ కు సన్నిహితులు కావటమే, ఈ వాదనలకు బలం చేకూరింది. అయితే, రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసిన వారం రోజులుకి, కేసిఆర్ సన్నిహితుడు అయిన మేఘా కృష్ణా రెడ్డి పై, ఆరు రోజుల పాటు ఐటి దాడులు జరగటం వెనుక ఉన్న మర్మం పై కూడా, ఆసక్తి నెలకొంది. ఈ దాడులు, రవి ప్రకాష్ ఇచ్చిన కంప్లైంట్ పైనే జరిగాయనే ప్రచారం కూడా ఉంది.

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణ కోసం, జగన్ మోహన్ రెడ్డి ఏ1 గా, విజయసాయి రెడ్డి ఏ2గా, మిగతా వారు , ప్రతి వారం నాంపల్లి సిబిఐ కోర్ట్ కు హాజరావుతున్నారు. ప్రతి శుక్రవారం వీరు సిబిఐ కోర్ట్ కు హాజరుకావాల్సి ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, ఆయనకు ప్రతి శుక్రవారం వీలు కాకపోవటంతో, ఇప్పటి వరకు ఒక్క శుక్రవారం కూడా ఆయన సిబిఐ కోర్ట్ కు హాజరుకాలేదు. గత నాలుగు నెలలుగా ఒక్కసారి కూడా కోర్ట్ కు వెళ్ళకుండా, ప్రతి వారం మినహాయింపు అడుగుతూ వస్తున్నారు. అయితే, ప్రతి వారం ఇలా మినహాయింపు ఇవ్వాలి అంటే, కోర్ట్ ఏమంటుందో అని, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావటం కుదరదని, తన బదులు, ప్రతి వారం సిబిఐ కోర్ట్ కు, తన తరపున లాయర్ వస్తారాని, కావలసినప్పుడు తాను వ్యక్తిగతంగా హాజరు అవుతానాని, సిబిఐ కోర్ట్ ని కోరారు.

cbi 17102019 2

తాను ఇప్పుడు సియం అయ్యాను అని, అదీ కాక మా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ప్రతి శుక్రవారం తాను హైదరాబాద్ రావాలి అంటే, తనతో పాటుగా బద్రతా సిబ్బంది వస్తారని, ఇది ఆర్ధికంగా బారం అని, అందుకే మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే జగన్ పిటీషన్ పై, సిబిఐ, చాలా ఘాటుగా, అతి పెద్ద పిటీషన్ దాఖలు చేసింది. చట్టం ముందు, సియం అయినా, సామాన్యుడు అయినా ఒకటే అని కోర్ట్ కి చెప్పింది. అలాగే, జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే, సాక్షులను ప్రభావితం చేసారని, ఇప్పుడు ఆయన సియం అని, సాక్ష్యులని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పింది. అలాగే, ఇది వరకే, జగన్ మినహియింపు కోరారని, అప్పుడు హైకోర్ట్, ఆ పిటీషన్ కొట్టేసిందని, గుర్తు చేసింది.

cbi 17102019 3

అయితే ఇప్పుడు సియం అని అందుకే మినహియింపు ఇవ్వాలని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పటం, సమంజసం కాదని, హైదరాబాద్ కి, విజయవాడకి పెద్ద దూరం లేదని, ఆయన రావటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆయన పనులు మిగతా రోజుల్లో చేసుకోవచ్చని, ఆ పిటీషన్ లో చెప్పింది. ఇలా చాలా ఘాటుగా, ఆ పిటీషన్ లో, సిబిఐ పేర్కొంది. అయితే ఈ పిటీషన్ రేపు, విచారణకు రానుంది. సిబిఐ తరుపున లాయర్లు గట్టిగా వాదనలు వినిపించనున్నారు. జగన్ తరుపు లాయర్లు మాత్రం, సియం అని చెప్పటం తప్ప, పెద్దగా వాదించటానికి ఏమి ఉండే అవకాసం లేదు. ఈ నేపధ్యంలో రేపటి విచారణ పై, ఉత్కంఠ నెలకొంది. జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే, సియం హోదాలో ఉంటూ, వారం వారం కోర్ట్ కు వెళ్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వైసిపీ కార్యకర్తలు భయపడుతున్నారు.

ఆంధ్రజ్యోతి పై , జగన్ ప్రభుత్వ కక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏబిఎన్ ఛానెల్ రాకుండా చేసిన ప్రభుత్వం, తాజాగా వ్యతిరేక వార్తల పై, 24 గంటల్లో కేసులు పెట్టాలనే జీవోను ముందుకు తీసుకువచ్చింది. ఇది కూడా ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసి తెచ్చిందే అని, నిన్నటి మంత్రి పెర్ని నాని ప్రెస్ మీట్ చూస్తే తెలుస్తుంది. మరో పక్క మొన్న జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశంలో, 1986లో ఆంధ్రజ్యోతి భూములు ప్రభుత్వం స్వాధీన పరచుకుని, దానికి పరిహారంగా ఇచ్చిన భూమి విషయంలో, దాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 1986లో అప్పటి ప్రభుత్వ, విశాఖకు 17 కి.మీ దూరంలో ఉన్న, పరదేశిపాలెంలో, అన్ని పత్రికా కార్యాలయాలకు భూమి ఇచ్చినట్టే, ఆంధ్రజ్యోతి’కి 1.5 ఎకరాల భూమి కేటాయించింది. అప్పట్లో అక్కడ ఎకరం 10 వేలు. అయితే తరువాత జరిగిన హైవే విస్తరణలో, ఎకరం స్థలం పోయింది. అయితే అప్పటి నుంచి పరిహారం ఇవ్వలేదు.

highcourt 18102019 2

దీని పై ఆంధ్రజ్యోతి అప్పటి నుంచి ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉంది. చివరకు 2017 జూన్‌ 28న ఆమోద పబ్లికేషన్స్‌ ఎండీకి భూమి కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది. 1986లో కేటాయించిన భూమిలో మిగిలిన అర ఎకరా పక్కనే మరో ఎకరా భూమిని కేటాయిస్తూ ఆ జీవో విడుదలైంది. అయితే పరిహారంగా ఇచ్చే భూమి, ఎలాంటి చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, ప్రభుత్వ ఆదేశాల మేరకు, 50 లక్షలు ప్రభుత్వానికి చెల్లించింది. భూమి తీసుకున్న మూడేళ్ళలో, నిర్మాణం జరగాలి అనే ఒప్పందం కూడా ఉంది. అయితే మూడేళ్ళ సమయంలో, ఇప్పటికి రెండేళ్ళు అయ్యాయి, మరో ఏడాది టైం ఉంది. అయితే ఇదే సాకుగా చూసిన జగన్ ప్రభుత్వం, ఆ స్థలంలో నిర్మాణాలు ప్రారంభించనందున భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేబినెట్‌ లో తీర్మానించింది. అయితే దీని పై ఇప్పటి వరకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, క్యాబినెట్ తీర్మానం చెయ్యటంతో, ఆంధ్రజ్యోతి నిన్న ప్రభుత్వం పై హైకోర్ట్ కు వెళ్ళింది.

highcourt 18102019 3

దీని పై హై కోర్ట్ స్పందిస్తూ, భూస్వాధీనం పై ప్రభుత్వం ఏవైనా చర్యలకు ఉపక్రమించినట్లయితే చట్ట నిబంధనల మేరకు నడచుకోవాలని ఆదేశించింది. ఈ పిటీషన్ పై ప్రభుత్వ తరుపు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలను వినిపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే, కలెక్టర్ కు భూమి వెనక్కు తీసుకునే అవకాసం ఉందని చెప్పారు. ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమిలో ఇప్పటి వరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదని చెప్పారు. అయినా, ఆ భూమి స్వాధీనం పై, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగలేదని, కేవలం మీడియాలో వార్తలు చూసి భయాందోళనలతో కోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, చట్టపరమైన నిబంధనలు పాటించకుండా ఎలాంటి చర్యలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read