ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనపై బుధవారం రాత్రి పదింటి వరకు హైడ్రామా సాగింది. విశాఖలో చంద్రబాబు ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించగా. పలు ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేతకు ఘనస్వాగతం పలకటంలో తప్పేముందని ప్రశ్నించారు. చంద్రబాబు వెంట 50 మందికి మించి ఉండకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలో ఇతర కార్యక్రమాలకూ షరతులు విధించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన తర్వాత...తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ... విశాఖ జిల్లా పెందుర్తిలో బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో శృంగవరపుకోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఎస్.కోట, కొత్తవలసలో అన్న క్యాంటీన్‌ల తొలగింపుపై నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం సహా... మూడు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడతారు.

విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్యయాత్రకు వెళుతూ చంద్రబాబు మార్గమధ్యలో పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీని కలిసేందుకు మంగళవారం వెళ్లగా, మర్నాడు రమ్మని పంపేశారని తెదేపా నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ చెప్పారు. ‘బుధవారం ఉదయమే డీసీపీ- 1 రంగారెడ్డిని కలిసేందుకు పార్టీ నాయకులు వెళ్లారు. మధ్యాహ్నం వరకు వేచి ఉన్నాక అర్జీ తీసుకున్న డీసీపీ రంగారెడ్డి అనుమతులివ్వడం తన పరిధిలో లేదని, డీసీపీ- 2ను కలవాలని చెప్పారు.

గాజువాకలో ఉన్న డీసీపీ-2ను కలవగా.. ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌ను సంప్రదించాలన్నారు. తెదేపా నాయకులు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితతో కలిసి కమిషనర్‌ ఆర్కే మీనా నివాసానికి వెళ్లి రాత్రి 9 గంటల వరకు వేచి ఉన్నారు. అమరావతి పర్యటన ముగించుకుని వచ్చిన మీనాను కలిసి చంద్రబాబు ర్యాలీకి, ఇతర కార్యక్రమాలకు అనుమతులు కోరారు. అరగంటసేపు తర్జనభర్జనల అనంతరం కొన్ని షరతులతో కార్యక్రమాలకు సీపీ అనుమతిచ్చారు. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు 50 మందికి మించి ఉండకూడదని, ఎక్కువ సంఖ్యలో వాహనాలను వినియోగించరాదని ఆంక్షలు విధించారు. అంతకుమించి ఉంటే కార్యక్రమాన్ని అడ్డుకుంటామన్నారు’ అని వివరించారు. పోలీసు కమిషనర్‌ కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆరోపించారు. చంద్రబాబు ర్యాలీలో భారీగా పాల్గొంటామని, పోలీసులు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. ఇళ్ల స్థలాల కోసం చదును చేసిన పెందుర్తి మండలం రాంపురం వీర్రాజు చెరువును పరిశీలించేందుకు చంద్రబాబు గురువారం రావాల్సి ఉంది. ఆయన వాహన శ్రేణికి ఆటంకం కలగకుండా తెదేపా నాయకులు ఓ జిరాయితీ స్థలంలో అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి చదును చేశారు. మరోవైపు ఆ స్థలంలో వాహనాలు వెళ్లకుండా కొంతమంది అడ్డంగా తవ్వేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై ఇచ్చిన జీవో 107 మీద తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో చర్చించారు. రాజధాని భూములు ఇతరులకు ఇవ్వజూపడంపై న్యాయపరమైన చిక్కులు వస్తాయని నేతలు అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై ఇచ్చిన జీవో మీద చర్చించారు. అమరావతిని దెబ్బతీసేందుకే పొరుగు జిల్లాల వారికి స్థలాలు ఇస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. సిద్ధంగా ఉన్న పేదల గృహాలను లబ్ధిదారులకు ఇవ్వట్లేదని నేతలు తెదేపా అధినేతకు తెలిపారు. రాజధాని కదిలించలేని స్థితి ఉన్నందునే ఈ అంశం తెరపైకి తెచ్చారని నేతలు అన్నారు. ప్రభుత్వ చర్య సీఆర్‌డీఏ చట్ట ఉల్లంఘనేనని నేతలు పేర్కొన్నారు. రాజధాని భూములు ఇతరులకు ఇస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని నేతలు అన్నారు. ఈ భేటీలో లోకేశ్‌, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి, ఆనందబాబు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

"29 గ్రామాల్లోని పేద ప్రజకు తొగుదేశం హయాంలో 5 వేకు పైగా ఇళ్లను నేటి వరకు లబ్దిదారుకు అందించకుండా, మౌలిక సదుపాయాు అభివృద్ధి చేయకుండా కొత్తగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ప్రయోజనమేంటి? రాజధాని భూమును వైకాపా కార్యకర్తకు ఇచ్చేందుకు జీవో నెం.107 జారీ చేయడం దుర్మార్గం. ప్రభుత్వ తుగ్లక్‌ చర్యకు ఇది నిదర్శనం. ప్రభుత్వ విపరీత పోకడకు, స్వలాభాపేక్షకు ఈ జీవో అద్దం పడుతుంది. 70 రోజు నుంచి రోడ్ల మీదకు వచ్చి మహిళు, రైతు ఆందోళను చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాజధాని రైతుకు ఇచ్చిన హామీను అము చేయకుండా భూమును ఏ విధంగా కేటాయిస్తారు? బడ్జెట్‌లో ఇళ్ళ స్థలా కొనుగోు కోసం రూ.8 వే కోట్లు కేటాయించి ఒక్క ఎకరా కూడా కొనకుండా రాజధాని నిర్మాణం కోసం రైతు ఇచ్చిన భూమును ఇళ్ళ పట్టా కోసం ఏ విధంగా ఇస్తారు?"

"రైతుతో జరిగిన ఒప్పందాకు సీఆర్‌డీఏ నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతు ఇచ్చిన భూమును దుర్వినియోగం చేస్తోంది. 5 కోట్ల ప్రజ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా రూపొందించిన అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రు చేయడం సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా రాజధాని అమరావతికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మద్దతిచ్చి ఇప్పుడు ఏ విధంగా మడమ తిప్పుతారు? ఇళ్ళ స్థలా పంపిణీ పేరుతో రాజధాని భూమును వైకాపా కార్యకర్తకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మీ వ్యక్తిగత ప్రయోజనాకు రైతు భూము ఏ విధంగా కేటాయిస్తారు? 13 జిల్లా అభివృద్ధికి దోహదపడే అమరావతిని మీ రాజకీయ ప్రయోజనా కోసం బలి చేస్తారా? ‘సేవ్‌ అమరావతి`సేవ్‌ ఏపీ’ అంటూ రాష్ట్రం మొత్తం నినదిస్తుంటే మీరు మాత్రం ‘షేవ్‌ ఫార్మర్స్‌`సేవ్‌ వైసీపీ’ అంటూ వ్యవహరిస్తున్నారు. రాజధాని భూమును వైకాపా నేతకు కట్టబెట్టేందుకు ఇచ్చిన జీవో నెం.107ను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి" అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో, ప్రజా చైతన్య యాత్ర చెయ్యనున్నారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత, చంద్రబాబు మొదటి సారిగా వైజాగ్ వెళ్తున్నారు. అలాగే వైజాగ్ లోని, పెందుర్తిలో ల్యాండ్ పూలింగ్ బాధితులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తన పర్యటన పై చంద్రబాబు ఇప్పటికే, ప్రకటన చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఆమోదిస్తున్నప్పటికీ జగన్ మాత్రం మూడు రాజధానులు కావాలంటూ పట్టుబట్టడంలో 6 వేల ఎకరాల భూములను వైజాగ్ లో కొల్లగొట్టి తద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ భూబాగోతాన్ని బయటపెడతానని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలంటూ రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపై ఆమోదిస్తుంటే జగన్ ఉన్మాది గా వ్యవహరిస్తూ ప్రజా మనోభావాలను, భవిష్యత్తును తాకట్టుపెడు తున్నారని విమర్శించారు.

ఈ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చా రని ప్రశ్నించారు. రాష్ట్రంలో సైతాన్ ఉందంటూ పారిశ్రామికవేత్తలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా జగన్ సైకో ఇజంకు భయపడి పారిపోతున్నారన్నారు. ఉన్న పరిశ్రమలను కూడా వైకాపా నాయకులు పెడుతున్న ఇబ్బందులు, వేధింపులకు ఈ రాష్ట్రం వైపే చూసేందుకు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించే పత్రిక వ్యవస్థపై ఎల్లో మీడియా అంటూ వితండ వాదంతో ఎదురు దాడికి దిగడం సమంజసం కాదన్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలు, సంక్షేమకార్యక్రమాలు, ప్రాజెక్టులను రద్దు చేయడం జరిగిందన్నారు. వీరి సైకో ఇజానికి పోలవరం ప్రాజెక్టు సైతం అటకెక్కించారన్నారు.

రెండు లక్షల కోట్ల సంపద అమరావతి ద్వారా సృష్టిస్తే దానిని నాశనం చేసేందుకు పూనుకోవడం బాధేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక వంటి ప్రజా ఉపయోగకరమైన పథకాలను రద్దు చేయడం ఎంత వరకు సబబు అన్నారు. అనాది కాలంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలు, ఫీజులు ప్రభుత్వం ఇస్తున్నదని, వీటిని ఉన్నట్టుండి విద్యాదివెన అంటూ నూత పథకాన్ని ప్రవేశ పెట్టడం నవ్వేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్యం రాబడి తగ్గిందని, మద్యంలో కూడా పెద్ద స్కాం నడుస్తోందన్నారు. వైజాగ్ లో జగన్ చేస్తున్న భూకబ్జాలు అన్నీ రేపు బయట పెడతానని చంద్రబాబు అన్నారు. అయితే మరో పక్క వైసీపీ చంద్రబాబుని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఊరు నుంచి 100 మంది వచ్చి చంద్రబాబు ముందు నినాదాలు చెయ్యాలంటూ, వైసీపీ బెదిరింపుల, వాట్స్ అప్ సందేశం, ఇప్పటికే వైరల్ అయ్యింది. చూద్దాం రేపు ఏమి జరుగుతుందో.

రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను, ప్రజలకు దగ్గర చెయ్యటానికి అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 4 లక్షలు అని చెప్పినా, 2.5 లక్షల మందినే ఇప్పటి వరకు తీసుకున్నారు. అయితే, వీరు కూడా ఎక్కువ మంది, వైసీపీ కార్యకర్తలే అనే వాదన కూడా వచ్చింది. పలు సందర్భాల్లో వాలంటీర్ల తీరు కూడా వివాదస్పదం అయ్యింది. ఇప్పటి వరకు, వీరు గ్రామల్లో పెన్షన్లు, రేషన్ కార్డులు లాంటి సేవలు అందిస్తున్నారు. రేషన్ ఇంటికి తెచ్చి ఇవ్వటం మాత్రం మొదలు అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా, పెన్షన్లు తీసి వేయటం, రేషన్ కార్డ్ లు తీసివేయటం పై కూడా వాలంటర్ల పైనే విమర్శలు వస్తున్నాయి. అయితే వాలంటీర్లు మాత్రం, అవి మాకు సంబంధం లేదని, పై స్థాయిలో, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పోతున్నాయి అని చెప్తున్నారు. ఇలా వాలంటీర్ల పై, ఒక పక్క విమర్శలు వస్తున్న వేళ, ప్రభుత్వం మాత్రం, వాలంటీర్లే మా ప్రభుత్వానికి బలం అని, అన్ని పధకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళేది వారే అని చెప్తున్నారు.

volunteers 26022020 2

అయితే ఒక పక్క ఈ విమర్శలు, ప్రభుత్వం వారిని సమర్ధించటం కొనసాగుతూ ఉండగానే, ఇప్పుడు ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో, తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ రోజు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరగబోయే పరీక్షల విషయం పై మాట్లాడారు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని, మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని ఆయన చెప్పారు. అయితే, ఈ పరీక్షలకు, గ్రామ, వార్డు వలంటీర్లను ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వం పెడుతుంది అంటూ, వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రకటనతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఈ ప్రకటన, లైవ్ లో చూసి విన్న వారు, ఇదేమీ నిర్ణయం అంటూ, ఒకేసారి షాక్ కు గురయ్యారు.

volunteers 26022020 3

ఇంటర్, 10th లాంటి పరీక్షలు పిల్లల జీవితాల్లో ఎంతో కీలకం అని, ఆ పరీక్షలు రాసే సమయంలో, వచ్చే ఇన్విజిలేటర్లు తీరు, వారి పరీక్ష పై ప్రభావం చూపుతుందని, వారి పేపర్లు తీసుకోవటం, పరీక్షా విధానం, ఓఎంఆర్ షీట్లు, ఇలా ప్రతి విషయంలో ఇన్విజిలేటర్లు జాగ్రత్తగా ఉండాలని, చాలా అనుభవం ఉన్న టీచర్లే ఒక్కోసారి పొరపాటు చేస్తారని, ఇలాంటి కీలకమైన చోట, వాలంటీర్లను, ఇన్విజిలేటర్లుగా పెట్టటం పై, తీవ్ర అభ్యంతరం ఎదురు అవుతుంది. ఇప్పుడు ఇన్విజిలేటర్లు అంటున్నారని, రేపు పరీక్షా పేపర్లు కూడా దిద్దిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు అందరూ, చాలా వరకు 23 నుంచి 25 ఏళ్ళ లోపు వారని, వాళ్ళకు ఇలాంటి కీలక బాధ్యతలు ఎలా ఇస్తారంటూ, సర్వత్రా విమర్శలు ఎదురు అవుతున్నాయి. వారి పని వారు సవ్యంగా చేసేలా చెయ్యకుండా, ఇలాంటి కీలక బాధ్యతలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read