ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు, ఏపి హైకోర్ట్, షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా, అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, పై సిబిఐ విచారణ చెయ్యాలి అంటూ, హైకోర్ట్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పై పలు విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిడితో, కొంత మంది పై పోలీసులు కావాలని టార్గెట్ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తూ వస్తుంది. పలు సందర్భాల్లో చంద్రబాబు, వారిని హెచ్చరించారు కూడా. పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, వారి పై ప్రైవేటు కేసులు పెడతాం అని చంద్రబాబు హెచ్చరించారు కూడా. అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగకుండా, చట్ట ప్రకారం నడుచుకోవాలని హెచ్చరించారు. అయినా, పోలీసులు మాత్రం ఎక్కడ మారటం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ చెప్పిన వారి పై కేసులు పెడుతున్నారు కాని, ప్రతిపక్షం కేసు పెడితే, కనీసం ఆక్షన్ కూడా తీసుకువటం లేదు అని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా కేసులు పెడుతూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.

highcourt 25022020 2

అయితే కొంత మందిని పోలీసులు అకారణంగా తీసుకు వస్తూ, అరెస్ట్ కూడా చూపించకపోవటం పై, ఇప్పటికే, పోలీసుల పై పలు చోట్ల, హెబియస్ కార్పస్‌ పిటిషన్ లు వేసి, కోర్ట్ లను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఈ నేపధ్యంలో, తాజాగా ఒక కేసులో, పోలీసులకు షాక్ ఇచ్చింది, హై కోర్ట్. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లాలో ముగ్గురు యువకులు అదృశ్యం అయిన కేసులో, హైకోర్ట్ ఈ ఆదేశాలు ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం, గుంటూరులో ముగ్గురు కనిపించకకుండా పోయారు. అయితే వారిని పోలీసులే ఎట్టుకువెళ్ళారని, కుటుంబ సభ్యులు, ఆరోపించారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు, పోలీసులు మఫ్టీలో వచ్చి, వారిని దాడి చేసి, తీసుకు వెళ్ళారని ఆరోపించారు. వారిని అరెస్ట్ కూడా చూపించకుండా, చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు.

highcourt 25022020 3

అయితే వారు ఎంత కోరినా పోలీసులు ఆచూకీ చెప్పక పోవటంతో, కుటుంబ సభ్యులు, హైకోర్టులో హెబియస్ కార్పస్‌ పిటిషన్ వేశారు. ఆ తరువాత, వారిని క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేసామని పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే, వారిని అరెస్ట్ చూపించకుండా హింస పెట్టటం పై, హైకోర్ట్, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాని, పోలీసులు విచారణకు, జ్యుడీషియల్ విచారణకు తేడా ఉండటంతో, అసలు విషయం ఏమిటో తెలుసుకునేందుకు, హైకోర్ట్ సిబిఐ విచారణకు ఆదేశించింది. న్యాయవిచారణకు పోలీసులు స్పందించక పోవటంతో, గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పై సిబిఐ విచారణకు ఆదేశించటం, సంచలనంగా మారింది. వారం రోజుల ముందు ఇలాంటి కేసులోనే, హైకోర్ట్ డీజీపీని పిలిపించి మరీ, వివరణ కోరిన సంగతి తెలిసిందే.

 

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, తమ ప్రభుత్వ విజయంగా చెప్పుకుంటున్నది, వాలంటీర్ ఉద్యోగాల గురించి, అలాగే సచివాలయ ఉద్యోగాల గురించి. వీరికి ఇచ్చిన ఉద్యోగాల గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఇదే సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ వైఖరితో షాక్ తిన్నారు. ఎంతో ఆశతో మొదలు పెట్టిన సచివాలయ ఉద్యోగులు, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో షాక్ తిన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.10 లక్షలకుపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎక్కవ మంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళే. ఇప్పుడు వారికి కొత్తగా ఆఫర్లు వస్తూ ఉండటం, లేకపోతే ఇంకా కొంచెం మంచి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నంలో, వారికి మంచి ఉద్యోగం వచ్చి, వారు ఈ సచివాలయం ఉద్యోగం వదిలెయ్యాలి అంటే, కుదరదు అంటుంది ప్రభుత్వం. ఇంతవరకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం చేసిన ఖర్చు, ఇప్పటి వరకు, మీరు తీసుకున్న జీతం తిరిగి చెల్లించాలని, ప్రభుత్వం అంటుంది.

village 25022020 2

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ సి.మహేశ్వరరెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. దీంతో, సచివాలయ ఉగ్యోగులు అందరూ, ప్రభుత్వానికి ఒక లేఖ రాసారు. ఇదే ఆ లేఖ, "రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయంలో ఉద్యోగం సాధించి, అనతి కాలంలోనే నవశకం, ప్రజా సాధికార సర్వే, రైతు భరోసా, ప్రస్తుతం హౌస్ హోల్డ్ మాపింగ్ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మేము 15,000/- జీతభత్యములతో మా ఇంటిళ్ళపాదిని, మా రవాణా ఖర్చులు అన్ని అందులోనే సరిపెట్టుకుని జగన్నన్న కానుకగా విధులను నిర్వర్తిస్తున్నాము. అయితే ప్రస్తుతంగాని, భవిష్యత్తులోగాని విద్యా, ఉద్యోగ, ఆరోగ్య రీత్యా ఏదైనా కారణాల వల్ల ఉద్యోగం నుండి రాజీనామా చేయవలసి వస్తే, మేము పడ్డ కష్టానికి, ఈ రాష్ట్రానికి మా ఉద్యోగరీత్యా చేసిన సేవలకి గాను పొందిన జీతభత్యాలను తిరిగి వెనుకను చెల్లించుట ఎంతవరకు సమంజసము?"

village 25022020 3

"ఎన్నో పేదరిక, ఆర్థిక, నిరుద్యోగ సమస్యలతో ఈ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగములో విధులు నిర్వర్తిస్తున్న మేము రాజీనామా చేసిన యెడల ఒకేసారి జీతభత్యములు మొత్తము తిరిగి చెల్లించడం వల్ల, మేము తిరిగి అదే పేదరికం లోకి నెట్టివేయబడుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం గ్రామ/వార్డు ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఇలాగే ఈ ఉద్యోగాలతోనే మేము బానిసలుగా బ్రతకవలసిందే అన్నట్లుగా మానసికంగా బాధపడుతున్నాము. ఇప్పుడు రాజీనామా చేసిన పిదప జీతభత్యములు వెనుకకు చెల్లించు ప్రక్రియ వల్ల మాకు మా భవిష్యత్తుపై నమ్మకం పోతుంది. కావున మా ఈ గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మీద నమ్మకము యుంచి గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది యొక్క ఉన్నతిని, అభివృద్ధిని, ఎదుగుదలని కోరుతూ మా యందు దయ యుంచి రాజీనామా తరువాత జీతభత్యములు తిరిగి చెల్లించే ప్రక్రియను రద్దు చేయగలరని మనవి." అంటూ లేఖ రాసారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండో రోజు మన దేశంలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోని, రాష్ట్రపతి భవన్ లో, కొంత మంది ముఖ్యమంత్రులతో కలిసి, సాయంత్రం రాష్ట్రపతి భావన్ లో విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు, దక్షిణభారత దేశంలో కేరళా, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు, ఈ విందుకు వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జగన్ కు ఆహ్వానం అందలేదు. దీని పై అనేక వాదనలు నడుస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా, మన రాష్ట్రంలో పర్యటిస్తే, ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ పిలిచి మన ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదో అర్ధం కాలేదు. అయితే దీని పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు అన్నారు.

trump 25022020 2

ప్రశాంత వాతావరణానికి మారుపేరైన కుప్పంలో దౌర్జన్యాలు, రౌడీయిజం చేయాలని చూస్తే సహించేది లేదని, తానే స్వయంగా కుప్పంలో వచ్చి కూర్చుంటానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుప్పంలో వైకాపా నాయకులు దౌర్జన్యాల ద్వారా రాజకీయాలు చేయవచ్చునని అనుకుంటే అవి ఏమాత్రం పని చేయవన్నారు. కుప్పం పట్టణాన్ని అత్యంత సుందరీకరణతోపాటు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో రూర్బన్ పథకాన్ని తీసుకొస్తే వైకాపా నాయకులు కుప్పంను మున్సిపాలిటీ చేసి, ఆ నిధులను వెనక్కి పంపించారన్నారు. మున్సిపాలిటీ ద్వారా కుప్పంను అభివృద్ధి చేసుకోలేమన్నారు. కేవలం మున్సిపాలిటీ నిధులతోనే అభివృద్ధి చేసుకోవాలని, అదే పంచాయతీగా ఉంటే నరేగా నిధులు, ఇతర నిధులను పూర్తిగా వినియోగించి అభివృద్ధి చేసుకోవచ్చుననే ఆలోచనను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

trump 25022020 3

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకాన్ని అయినా ఏ పార్టీ కార్యక్రమం అయినా కుప్పం నుండే ప్రారంభించి దిగ్విజయంగా అమలు చేశానని, ఇప్పుడు తమ ప్రభుత్వం లేకపోయినా సరే కుప్పంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాన్నారు. 35 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు రుణం తీర్చుకొనేందుకు అన్ని విధాలుగా పనిచేస్తానని తెలిపారు. కుప్పంకు కొందరు వలస పక్షులు వచ్చారని, మీ పనులు మీరు చూసుకొని వెళ్లాలే గానీ ఇక్కడి వాతారవణాన్ని కలుషితం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఆస్తుల విషయాల్లో విచారణలు చేయడం, భయాంబ్రాంతులకు గురి చేయాలనుకుంటే ఎవరూ భయపడేది లేదన్నారు. రాయలసీమకు సాగునీటి కోసం 64వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి, అగ్రికల్చర్, హర్టికల్చర్‌ను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

70 రోజులుగా అమరావతిలో రైతులు, పెళ్ళాం, బిడ్డలతో కలిసి రోడ్డున పడి, మాకు న్యాయం చెయ్యండి అంటూ, ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయినా 70 రోజులుగా ఒక్కరంటే, ఒక్కరు కూడా, అమరావతి రైతులు దగ్గరకు వచ్చి, ప్రభుత్వం తరుపున చర్చలు జరపలేదు. జగన్ మోహన్ రెడ్డి, ఆ గ్రామాలు మీదుగా సచివాలయం వెళ్తున్నా, వారి వైపు కూడా చూడటానికి ఇష్టం లేక, పోలీస్ బంద్భోస్తుతో, వారిని రోడ్డుల మీద లేకుండా చేసి, సచివాలయానికి వెళ్లి వస్తూ ఉన్నారు. మరో పక్క న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా, ఆ రైతులకు సంతోషం తెప్పించే ఒక్క చర్య కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా, వారి పొట్ట కొట్టే మరో నిర్ణయం తీసుకోవటంతో, అమరావతిలో కలకలం రేగింది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు గారి హయంలో, ఆయనను నమ్మి, 33 వేల ఎకరాలు, నవ్యాంధ్ర కొత్త రాజధాని కోసం, అని రైతులు తమ భూములు ఇచ్చిన సంగతి, అందరికీ తెలిసిందే.

jagan 25022020 2

అయితే ఈ భూములు రాజధాని కోసం కాకుండా, మరో కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంది. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి, సీఆర్డీఏ పరిధిలో ఉన్న, తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో, ప్రభుత్వం భూమిని సేకరించింది. ఈ ఏరియాలో, 54,307 మందికి, 1251.5 ఎకరాలు ఇవ్వనున్నారు. రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలు కూడా, ఇందులో ఉండటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను పేదలకు పంచుతూ, ఈ రోజు ప్రభుత్వం జీవో జారీ చెయ్యటం, వివాదాస్పదంగా మారింది. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందం ప్రకారం, ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో, 5 శాతం పేదలకు ఉపయోగించవచ్చు అని ఉంది.

jagan 25022020 3

అంటే రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల్లో, 1650 ఎకరాలు పేదలకు ఉపయోగించ వచ్చు. ఇందులో భాగంగానే, చంద్రబాబు హయంలోనే, పేదలకు ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కి, ఏకంగా, నాలుగు వేల ఎకరాల భూమిని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతానికి 1251.5 ఎకరాలు పేదలకు ఇవ్వటానికి, నిర్ణయం తీసుకుంది. అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు కాకుండా, ఎక్కడో విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్లకు ఇక్కడ స్థలాలు ఇవ్వటం పై కూడా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం, ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, మా భూములు పంచి పెట్టటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు జగన ఇచ్చిన జీవోనే రేపు కోర్ట్ లో, ఆయన మెడకే చుట్టుకుంటుందని, ప్రభుత్వం అభాసుపాలు అవ్వటం ఖాయం అని అంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పర్యవసానాలు చూడకుండా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్న జగన్ కు, కోర్టుల్లో, వివిధ ట్రిబ్యునల్స్ లో, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అవగాహనా రాహిత్యమో లేక వ్యక్తిగత పగతో వెళ్తూ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవటమో కాని, ప్రతి విషయంలో జగన్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ పీపీఏల విషయంలో, అటు ట్రిబ్యునల్ లోను, ఇటు కోర్టుల్లోనూ మొట్టికాయలు పడ్డాయి. ఆ తరువాత పోలవరం విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. రంగులు వేసే విషయంలో కూడా కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు సీనియర్ అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో క్యాట్ చేతిలో, జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా, గతంలో జాస్తి కృష్ణ కిషోర్ పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

cat 25022020 2

జాస్తి కృష్ణ కిషోర్ కేంద్రం నుంచి మన రాష్ట్రానికి డెప్యుటేషన్ పై వచ్చారు. చంద్రబాబు హయంలో ఆయన రాష్ట్రానికి పెట్టుబులు తేవటానికి ఎంతో కృషి చేసారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా, ఆయన పని చేసారు. అయితే, ఆయన చంద్రబాబుకు బాగా సన్నిహితంగా ఉండే వారనే కారణంతో, ఆయన పై ప్రభుత్వం వ్యక్తిగత కక్ష పెంచుకుంది అనే వాదన కూడా ఉంది. ఒక సీనియర్ అధికారి, అది కూడా రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన అధికారి పై ఇలా సస్పెన్షన్ వేటు వెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. అది కాక, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కృష్ణ కిషోర్ కు జీతం కూడా ఇవ్వలేదు. దీంతో, ఈ విషయం పై జాస్తి కృష్ణ కిషోర్, ఏపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, క్యాట్ కు వెళ్లారు.

cat 25022020 3

దీని పై, నెల రెండు నెలల నుంచి విచారణ జరిపిన క్యాట్, ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ తగిలింది. కృష్ణ కిషోర్ కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి, మార్గం సుగుమం అయ్యింది. కావాలంటే, ఆయన పై కేసులు పెట్టుకుని, చట్ట ప్రకారం వెళ్ళండి అంటూ, క్యాట్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. గతంలో విచారణ సందర్భంగా కూడా క్యాట్ ప్రభుత్వాన్ని, తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కృష్ణ కిషోర్ కు జీతం ఎందుకు ఇవ్వలేదు అంటూ, క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఉన్నా, ఎందుకు జీతం చెల్లించలేదు అంటూ, చీఫ్ సెక్రటరీని పిలిపిస్తాం అని, వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పక్క ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా క్యాట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై, వచ్చే నెల 6 కు, క్యాట్ వాయిదా వేసింది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read