మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇక సెలెక్ట్ కమిటీకి వెళ్లనట్లేనా.. అంటే అవుననే రాజకీయ వర్గాలు, అధికార పార్టీ వైసీపీ నేతలు, అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. గతనెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి వంపాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేసింది. చైర్మన్ కమిటీలు ఏర్పాటుకు పార్టీల నుంచి పేర్లు కోరడం, రెండు బిల్లుల కోసం రెండు కమిటీల్లో పేర్లను సైతం ప్రతిపాదించారు. అయితే కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిం చాల్సిన మంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. బిల్లులు మండలికి వచ్చి 14 రోజులు పూర్తవ్వడంతో బిల్లులు ఆమోదం పొందినట్టేనంటూ మంత్రులు వాదించారు. టీడీపీ మాత్రం అవి మనీ బిల్లులు కావని దీంతో అవి సభ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేస్తున్నారు. చైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ రెండు సార్లు రాసిన లేఖలను తిరస్కరిస్తూ అసెంబ్లీ కార్య దర్శి లేఖలు రాయడంతో కథ అడ్డం తిరిగింది.

దీనిపై న్యాయపోరాటం చేయాలని టీడీపీ భావిస్తుండగా, వేచిచూసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చైర్మన్ ఆదేశించినా.. కార్యదర్శి ససేమిరా.. ఇప్పటికే రెండుసార్లు మండలి చైర్మన్ కమిటీలు ఏర్పాటు చేయాలంటే శాసనసభ కార్యదర్శికి లేఖలు రాశారు. సెలెక్ట్ కమిటీకి వంపడం సాధ్యం కాదంటూ కార్యదర్శి తిరిగి చైర్మన్‌కు లేఖ ద్వారా సమాధానమిచ్చారు. కార్యదర్శిపైన ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి చైర్మన్ ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకుంటుందని టీడీపీ ఆరోపిస్తోంది. చైర్మన్ ఆదేశాలు కార్యదర్శి అమలు చేయకుంటే ఉల్లంఘన కింద చర్యలకు అవకాశముందని చెవున్నారు. ఇదే సమయంలో సెలెక్ట్ కమిటీ విషయంలో వేచి చూసే ధోరణిలో. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదంటున్న అధికార పార్టీ బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూసే అవకాశం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తు న్నారంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీ అండగా నిలుస్తుంది. ఇదే సమయంలో ప్రతివక్ష వ్యూహాలకు విరుగుడు కనిపెట్టే దిశగా కసరత్తు కొనసాగుతుంది. ప్రతిపక్షం కోర్టుకెళ్లినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 క్లాజ్-1 ప్రకారం మండలి సెక్రటరి నిబంధనల మేరకే వ్యవహరించా రంటున్న వైసీపీ, బిల్లులపై ఏం చేయాలనే ఆలోచనలో అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఆర్డినెన్స్ చేయలా? గవర్నర్ వద్దకు పంపాలా? అనే అంశంపై నందిగ్ధతతో ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపి మాత్రం, సభా హక్కుల ఉల్లంఘనతో పాటుగా, కేంద్రం వద్దకు, కోర్ట్ కు వెళ్ళాలని భావిస్తుంది.

జగన్ ఢిల్లీ టూర్ నిరుపయోగమేనా ? మండలి రద్దు కోరుతూ, ప్రధాని, హోం మంత్రిని కలిసినా ఉపయోగం లేదా ? మరో ఏడాది వైట్ చెయ్యాల్సిందేనా ? అవును అనే సమాధానం వస్తుంది. రాష్ట్ర శాసనమండలి రద్దుతీర్మానం బీజేపీలో జాతీయస్థాయి చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా శాసన మండలిపై ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటు న్నాయి. శాసనమండలి ఏర్పాటు కోరుతూ కేంద్ర ప్రభు త్వం ముందు ప్రస్తుతం 11 రాష్ట్రాలకు చెందిన ప్రతిపాదనలున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి శాసనమండలి రద్దు తీర్మా నం కేంద్రం ముందుకు వెళ్లింది. శాసన మండలి విషయంలో ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అగ్రనాయ కత్వం సీరియస్ గా యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దీర్ఘకాలంగా అపరిష్కృ తంగా వున్న ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే శాసనమండలి ఏర్పాటు లేదా రకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండేలా కస రత్తు ప్రారంభించిందని ఉన్నతస్థాయి బీజేపీ ప్రముఖుడు ఒకరు మీడియాకు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్త చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు.

దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాల లో శాసనమండలి ఉంది. మరో 11 రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నాయి. ఒక రాష్ట్రం నుంచి శాసనమండలి రద్దు ప్రతిపాదన తాజాగా కేంద్రం ముందుకు వెళ్లింది. మిగిలిన రాష్ట్రాలలో ఇందుకు సంబంధించి ఏ విధమైన ప్రస్తావన లేదా ప్రతిపాదనలు లేవు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రాలలో శాసన మండలి ఉండాలా? వద్దా? అనే విషయమై జాతీయస్థాయి లో అధ్యయనం చేసేందుకు ఒక కేటినెట్ సబ్ కమిటీని నియ మించాలని బీజేపీలో పలువురు సీనియర్లు ప్రతిపాదిస్తు అన్నట్టు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ అన్ని రాష్ట్రాలలో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరపటంతో పాటు శాసనమండలి ఆవశ్యకత ఉందా ? దాని నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు ?

ఇలాంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఏడాదిలోగా నివేదిక రూపొందించటం, అనంతరం మేధా వులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ రాజకీ య పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవటం వంటి ప్రతిపాదనలు కేంద్రానికి పలువురు సీనియర్ బీజేపీ నాయకులు ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు, లేదా తీసివేయటం అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడకుండా ఒక చట్టబద్ధమైన విధానాన్ని రూపొందించాలనేది బీజేపీ యోచనగా ఉన్నది. శాసనమండలి విషయంలో రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతలు ఉండ కూడదన్నది బీజేపీ సీనియర్ నేతల వాదన. ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో విస్తృతంగా చర్చ జరపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి ఫైఓవర్ స్తంభాల పై కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నామం గుర్తును వేయడం వివాదాస్పదంగా మారింది. వారధి పిల్లర్లపై ఫ్లై ఓవర్ రోడ్డు నిర్మాణం పూర్తయితే దానిపై వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, ఇది అపచారమంటూ శ్రీవారి భక్తులు, ప్రజాసంఘాలు నిరసన తెలియజేస్తున్నాయి. తిరుపతి నగరంలో స్మార్టుసిటీ కార్పొరేషన్, టిటిడి సంయుక్తంగా గరుడవారధి ఫ్లై ఓవర్ నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వారధి నిర్మాణ పనుల్లో తొలుత స్తంభాలు పనులు పూర్తవడంతో స్మార్టుసిటీ అధికారులు శ్రీవారినామాన్ని వేశారు. తొలుత స్తంభాలకు నామం గుర్తువేయడాన్ని తిరుపతి వాసులు, స్వామివారి భక్తులు తప్పుపట్టారు.ఎంతో పవిత్రమైననామంపై వాహనాలు ప్రయాణించడం తప్పని వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో పవిత్రతకు, భక్తికి నిలయంగా వున్న తిరుమలలోని ఆలయ మాడవీదుల్లో కూడా పాదరక్షలు ధరించకుండా టిటిడి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే పవిత్రభావంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు క్రింద నామాలు వుంటే దానిపై వాహనాలు ప్రయాణించడం మంచిది కాదని పలువురు భక్తులు సూచిస్తున్నారు.

అయినా స్మార్టు సిటీ ప్రాజెక్టు అధికారులు వరుసగా పద్మావతిపురం సర్కిల్ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా నంది సర్కిల్ సమీపం వరకు 6 కిలోమీటర్లు దూరంవరకు ఫైఓవర్ లోని స్తంభాలలో 36స్తంభాల వరకుకు నామం అచ్చువేసి రంగులు కూడా దిద్దారు. దీంతో ఈ లోగో కాస్త వివాదాలకు కారణంగా మారింది. సాక్షాత్తు దేవదేవుడు ఆనంద నిలయంలో కొలువై వున్నా శ్రీ వారి భక్తులు నుదుటన ధరించడం తప్ప వాహనాలు రాకపోకలు సాగించే వారధి స్తంభాలకు నామం వేయడమేంటని ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివాదం కాస్త హిందూ సంప్రదాయాల వరకు వెళ్ళింది. ఏడుకొండలశ్రీవేంకటేశ్వరునికి వైఖానస ఆగమం ప్రకారం జరిగే నిత్యకైంకర్యాల్లో భాగస్వాములయ్యే అర్చకులు రెండు తెగలకు చెందినవారు వున్నారు. వడగలై తెగకు చెందిన ఆర్చకులు యు ఆకారంలో స్వామివారి నామాన్ని ధరిస్తారు. తెంగలై తెగకుచెందిన ఆర్చకులు వై ఆకారంలో నామాన్ని ధరిస్తారు. అయితే వారధి స్తంభాలపై చతు, రస్రాకారంలో శ్రీవారికి ధరింప జేసే నామాన్ని ముద్రించారు.

నామాలపై వాహనాలు వెళ్ళడం తప్పని అంటున్నారు. ఈ నేపధ్యంలో స్తంభాలపై నామాలు వేయాల్సిన అవసరం ఏముందని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అయితే వారధి రీ డిజైనింగ్ అంటూ గతంలోనే టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో శ్రీవారినామానికి బదులు తిరుపతి స్మార్టుసిటీ కార్పొరేషన్ లోగోను స్తంభాలపై వేసి వారధి ప్రారంభం మొదట్లో, చివరన శ్రీవారి నామాలు తీర్చిదిద్దితే మంచిదని పలువురు భక్తులు, ప్రజాసంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నామం గుర్తు ముద్రించి రంగులేయడం వరకు వివాదం కాకుండా మళ్ళీ స్తంభాలపై రీడిజైన్ చేసి సిమెంట్ పాలిష్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. అయితే తిరుపతి నగరంలో ఆటు నిత్యం వస్తున్న 80వేలమంది యాత్రికులకు ఇటు 5లక్షలమంది వుండే తిరుపతి నగరవాసులకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గరుడవారధి ఫైఓవర్ పూర్తయితేనే ఊరట కలుగుతుందని అంటున్నారు.

భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్సీ పొత్తు ఉండదని జనసేనపార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఒకవేళ బిజెపి వైఎస్సార్సీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీతో తాము కలిసివుండేది లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిని కదలించేశక్తి ముఖ్యమంత్రి జగన్ కు లేదన్నారు. శనివారం ఆయన అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సం దర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలో మాట్లాడుతూ పొత్తులపై వైఎస్సార్సీనేతలు చేస్తున్న వ్యాఖ్యలన్ని ఆబద్దాలేనన్నారు. ఒకవేళ బిజెపితో జగన్ పార్టీ పొత్తు పెట్టు కుంటే అందులో తాను ఉండలేనన్నారు. నాకు తెలిసి బిజెపి అలాంటి పనిచేస్తుందని భావించడం లేదన్నారు. రాజధాని తరలింపు వివాదానికి జగన్ బాధ్యత వహించాల్సి ఉందన్నారు. రాజధాని భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం సరికాదన్నారు. రాజధాని రైతులు తమ భూ ములను నవరత్నాలు పథకం కోసం ఇవ్వలేదన్నారు. రాజధాని అమరావతి పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

రైతులతో రాసుకున్న ఒప్పందంప్రకారం అమరావతే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అన్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి అమరావతిని తీర్చిదిద్దుకున్నాక రాజధాని మార్పు సాధ్యం కాదన్నారు. తనకు అధికారం లేదన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే తమ పార్టీతో ఉన్నాడో లేడో తమకు తెలియదన్నారు. తాను ఓట్లు కోసం, అధికారం కోసం రాలేదన్నారు. అమరావతిలో రైతులపై జరిగినదాడులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జగన్ మొండి పట్టుదలను వదిలి పెట్టాలన్నారు. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుని ఏ ప్రభుత్వం మనుగడ సాధించ లేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో భవిష్యత్తు అంధకారం రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్ర ప్రజల భవిష్యత్తు అంథకారం లోకి నెట్టి వేయబడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం తుళ్లూరు మండలంలోని రైతుదీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు సంఘీభావం ప్రకటించారు.

దీక్షా శిబిరాలను చేరుకొని రైతులతో తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జననేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైన పద్దతికాదన్నారు. అమరావతి రాజధానికి బిజెపి సానుకూలంగా ఉందని చెప్పారు. ఇక్కడ మంచి పంటలు పండే భూములను రైతులు వైఎస్సార్సీ నాయకుల నవరత్నాలకు కాదు త్యాగం చేసిందని, అన్ని కులాల, మతాలవాళ్లు రాజధాని భూములు త్యాగం చేశారన్నారు. వైఎస్సార్సీ ప్రభుత్వానికి టిడిపి నాయకులుమీద కోపం ఉంటే వారిపై చూపించాలని రైతుల మీద కాదన్నారు. రాజధాని ఇష్టారాజ్యంగా మార్చడం తగదని 151మంది ఎమ్మెల్యేలు ఉండి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం తగదని పవన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read