రాష్ట్ర సమస్యలు, ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి, మంత్రులు చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీదాడుల గురించి, గత నాలుగురోజులుగా నిర్విరామంగా దుష్ర్ఫచారం చేస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా లక్షలకోట్లు పోగేసుకొని, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదన్న ఆయన, టీడీపీపై మాత్రం విషం చిమ్ముతున్నారని వెంకన్న దుయ్యబట్టారు. శ్రీనివాస్ ఇంటిలో ఏ సూట్ కేసులు దొరకలేదని ఐటీశాఖే స్పష్టంగా చెప్పిందని, రూ.2వేలకోట్లు దొరికాయని విష ప్రచారం చేస్తున్న వైసీపీనేతలు, మంత్రులు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. రూ.2వేలకోట్లు దొరికాయని, ఆ సొమ్మంతా చంద్రబాబునాయుడిదేనని గగ్గోలు పెట్టిన వైసీపీబ్రందం ఆ మొత్తంసొమ్ము ఎక్కడుందో చూపాలని వెంకన్న డిమాండ్ చేశారు. సింగిల్ బెడ్ రూమ్ ఇల్లున్న శ్రీనివాస్ ఇంట్లో ఆ రూ.2వేలకోట్లు ఎక్కడ దాచారో, వైసీపీనేతలే చెప్పాలన్నారు. వైసీపీ చెబుతున్న రూ.2వేలకోట్లు ఉంచడానికి వెయ్యి సూట్ కేస్ లు కావాలని, శ్రీనివాస్ ఇంటిలో ఐటీవారికి ఒక్క సూట్ కేస్ కూడా దొరకలేదన్నారు. లక్షరూపాయలు, కోటి రూపాయల నోట్లు ఏవైనా జగన్ ముద్రించినట్లయితే, అప్పుడు రూ.2వేలకోట్లను తేలికగా దాచవచ్చన్నారు.

చంద్రబాబునాయుడు సమాజం గురించి ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి సమాజనాశనం గురించి ఆలోచిస్తూ, దాన్ని నాశనం చేసి, శ్మశానం చేయాలని చూస్తున్నాడన్నారు. జగన్ తన అక్రమ సంపాదనను ఇడుపులపాయ, లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్ లలో దాచి ఉంచాడని, ఆ సొమ్ములో ఈడీ జప్తుచేసింది కేవలం రూ.43వేలకోట్లేనని, ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షలకోట్ల వరకు ఉందన్నారు. ఎన్నికల ముందు రావాలి జగన్... కావాలి జగన్ అన్నవారే, ఇప్పుడు, పోవాలి జగన్... జైలుకుపోవాలి జగన్ అంటున్నారని బుద్దా ఎద్దేవాచేశారు. అడ్డగోలుగా ప్రజలసొమ్ము తినడానికే జగన్ రాజకీయపార్టీ పెట్టాడని, అధికారపీఠాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు ఎలా దోచేయాలనేదాని గురించే ఆయన ఆలోచిస్తున్నాడని వెంకన్న తేల్చిచెప్పారు. వైసీపీ కార్యకర్తలే జగన్ పాలనచూశాక పోవాలి జగన్....పోవాలి జగన్ అనే పల్లవి పాడుతున్నారని, జగన్ చేస్తున్న పనులు అలాంటి స్థితిని కల్పించాడన్నారు.

విజయ్ మాల్యా తన మనసు మార్చుకొని ప్రజలసొమ్ముని తిన్నందుకు బాధపడుతూ, దాన్ని తిరిగిచ్చేయడానికి ముందుకొచ్చాదని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లో మాత్రం ఎక్కడా మచ్చుకైనా పశ్చత్తాపం కనిపించడంలేదన్నారు. చరిత్రలో చూసినట్లయితే చాణక్య_ చంద్రగుప్తులు ప్రజలకు మేలుచేయడానికి, వారి సంక్షేమం, సంతోషం కోసం పనిచేస్తే, జగన్ _ విజయసాయిరెడ్డి మాత్రం రాష్ర్టాన్ని ఎలా దోచుకోవాలి.. ప్రజల్ని ఎలా నాశనం చేయాలన్నదాని గురించే నిత్యం ఆలోచిస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు. తన పైశాచిక ఆనందం కోసం సమాజాన్ని భయపెట్టి, బతకడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. జగన్ పాలనతో విసిగి, వేసారిన జనమంతా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశానికే ఓటేయాలనే ధ్రఢసంకల్పంతో ఉన్నారని వెంకన్న స్పష్టంచేశారు.

బహిరంగ లేఖ.. గౌ|| శ్రీమతి భారతి రెడ్డి గారు,జగతి పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌. విషయం : పత్రికా విలువలను దిగజారుస్తున్న సాక్షి పత్రిక కథనాల గురించి.. రాష్ట్రంలో వార్తా పత్రికల విలువల వలువులను సాక్షి పత్రిక ఊడదీస్తున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఫోర్త్‌ ఎస్టేట్ గా సమాజంలో విలువైన స్థానంలో ఉండావాల్సిన మీ పత్రిక ఒక రాజకీయ పార్టీకి కరపత్రికగా ఉపయోగపడటం దురదృష్టకరం. గత రెండు థాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. ఒక సారి పార్లమెంటుకు పోీ చేశాను. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోీ చేశారు. గత 11 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. ప్రసుత్తం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్రియాశీలక పోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరపున పత్రికా సమావేశాలు అత్యధికంగా నిర్వహించే అతికొద్ది మంది అధికార ప్రతినిధుల్లో నేనూ ఒకడిని. నా పత్రికా సమావేశాలను ఎలక్ట్రానిక్‌, పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తారు. కానీ దురదృష్టం ఏమిటంటే.. సాక్షి పత్రిక పుట్టిన నాటి నుండి ఏ ఒక్క రోజు కూడా నా వార్తలను గానీ, నా పత్రికా సమావేశం వివరాలను గానీ, ప్రసారం చేసినట్లు, ప్రచురించినట్లు ఎటువిం దాఖలాల్లేవు.

దీనికి ప్రత్యేమైన కారణం ఏమైనా ఉన్నదా.? మీ పత్రికలో నా వార్తలు ప్రచురించకపోవడానికి, మీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడానికి నాపై ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.? లేక నా కులమే మీకు అడ్డొస్తున్నదా.? నాకు తెలిసి పత్రికా రంగంలో కులాలకు ప్రాధాన్యం ఇస్తారని అనుకోవడం లేదు. సాక్షి పత్రిక, ఛానల్‌ ప్రారంభించింది వైసీపీ అధ్యకక్షుడు శ్రీ జగన్మోహన్‌ రెడ్డి గారని, దానిని ప్రస్తుతం కొనసాగిస్తున్నది మీరు అని రాష్ట్ర ప్రజలందరికీ విధితమే. ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన గ్టి గొంతుకను మీరు ఈ విధంగా నొక్కితొక్కేయడం సబబా.. అని గౌరవ ప్రదంగా మిమ్ములను అడుగుతున్నా. మీ పత్రిక నేను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం పాత్రికేయ విలువలు పాటించినట్లేనా.? మాజీ పీఎస్‌ శ్రీనివాసరావుపై ఐటీ సోదాలకు సంబంధించి.. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశ వ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, రూ.2వేల కోట్లు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

కానీ.. ఆ సొమ్ము మొత్తం కూడా పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు, ఆ బురదను చంద్రబాబు నాయుడు గారికి అంటగ్టాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం.? ఇది అబద్దపు వార్తలను ప్రచురించడం కాదా.? ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో మరో రాజకీయ పార్టీపై బురద జల్లడం భావ్యమా.? నిన్న ఐీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రూ.2.63 లక్షల నగదు, కుమార్తెకు చెందిన కొన్ని బంగారు ఆభరణాలు పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఉన్నట్లు, వాటి రికార్డులు సక్రమంగా ఉండడంతో తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేశారు. కానీ సాక్షి పత్రికలో గానీ, ఛానల్‌లో గానీ కనీసం ఒక్క నిమిషం కూడా ప్రసారం చేయలేదు. ఇది మీ మీడియా ద్వారా మీడియా విలువలను దిగజార్చడం కాదా.? ఇలా తప్పుడు వార్తలు రాయడం పత్రికా విలువలకు విరుద్ధమని మీకు తెలుసా.? అత్యున్నతమైన మీడియాను ఇలా దిగజార్చడం మీకు సరికాదు. ఇప్పికైనా ఎందరో మహానుభావులు ప్రధాన పాత్ర పోషించిన పత్రికా రంగ నిర్వహణ ఇప్పుడు మీరు కూడా పోషిస్తున్నారు కనుక.. ఆ మహానుభావులు కాపాడిన నైతిక విలువల వలువలు ఊడ్చకండని తెలియజేస్తున్నాను. (వర్ల రామయ్య), తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు

జగన్ ఢిల్లీ టూర్ నిరుపయోగమేనా ? మండలి రద్దు కోరుతూ, ప్రధాని, హోం మంత్రిని కలిసినా ఉపయోగం లేదా ? మరో ఏడాది వైట్ చెయ్యాల్సిందేనా ? అవును అనే సమాధానం వస్తుంది. రాష్ట్ర శాసనమండలి రద్దుతీర్మానం బీజేపీలో జాతీయస్థాయి చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా శాసన మండలిపై ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటు న్నాయి. శాసనమండలి ఏర్పాటు కోరుతూ కేంద్ర ప్రభు త్వం ముందు ప్రస్తుతం 11 రాష్ట్రాలకు చెందిన ప్రతిపాదనలున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి శాసనమండలి రద్దు తీర్మా నం కేంద్రం ముందుకు వెళ్లింది. శాసన మండలి విషయంలో ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అగ్రనాయ కత్వం సీరియస్ గా యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దీర్ఘకాలంగా అపరిష్కృ తంగా వున్న ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే శాసనమండలి ఏర్పాటు లేదా రకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండేలా కస రత్తు ప్రారంభించిందని ఉన్నతస్థాయి బీజేపీ ప్రముఖుడు ఒకరు మీడియాకు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్త చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు.

దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాల లో శాసనమండలి ఉంది. మరో 11 రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నాయి. ఒక రాష్ట్రం నుంచి శాసనమండలి రద్దు ప్రతిపాదన తాజాగా కేంద్రం ముందుకు వెళ్లింది. మిగిలిన రాష్ట్రాలలో ఇందుకు సంబంధించి ఏ విధమైన ప్రస్తావన లేదా ప్రతిపాదనలు లేవు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రాలలో శాసన మండలి ఉండాలా? వద్దా? అనే విషయమై జాతీయస్థాయి లో అధ్యయనం చేసేందుకు ఒక కేటినెట్ సబ్ కమిటీని నియ మించాలని బీజేపీలో పలువురు సీనియర్లు ప్రతిపాదిస్తు అన్నట్టు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ అన్ని రాష్ట్రాలలో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరపటంతో పాటు శాసనమండలి ఆవశ్యకత ఉందా ? దాని నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు ?

ఇలాంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఏడాదిలోగా నివేదిక రూపొందించటం, అనంతరం మేధా వులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ రాజకీ య పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవటం వంటి ప్రతిపాదనలు కేంద్రానికి పలువురు సీనియర్ బీజేపీ నాయకులు ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు, లేదా తీసివేయటం అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడకుండా ఒక చట్టబద్ధమైన విధానాన్ని రూపొందించాలనేది బీజేపీ యోచనగా ఉన్నది. శాసనమండలి విషయంలో రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతలు ఉండ కూడదన్నది బీజేపీ సీనియర్ నేతల వాదన. ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో విస్తృతంగా చర్చ జరపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇక సెలెక్ట్ కమిటీకి వెళ్లనట్లేనా.. అంటే అవుననే రాజకీయ వర్గాలు, అధికార పార్టీ వైసీపీ నేతలు, అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. గతనెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి వంపాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేసింది. చైర్మన్ కమిటీలు ఏర్పాటుకు పార్టీల నుంచి పేర్లు కోరడం, రెండు బిల్లుల కోసం రెండు కమిటీల్లో పేర్లను సైతం ప్రతిపాదించారు. అయితే కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిం చాల్సిన మంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. బిల్లులు మండలికి వచ్చి 14 రోజులు పూర్తవ్వడంతో బిల్లులు ఆమోదం పొందినట్టేనంటూ మంత్రులు వాదించారు. టీడీపీ మాత్రం అవి మనీ బిల్లులు కావని దీంతో అవి సభ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేస్తున్నారు. చైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ రెండు సార్లు రాసిన లేఖలను తిరస్కరిస్తూ అసెంబ్లీ కార్య దర్శి లేఖలు రాయడంతో కథ అడ్డం తిరిగింది.

దీనిపై న్యాయపోరాటం చేయాలని టీడీపీ భావిస్తుండగా, వేచిచూసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చైర్మన్ ఆదేశించినా.. కార్యదర్శి ససేమిరా.. ఇప్పటికే రెండుసార్లు మండలి చైర్మన్ కమిటీలు ఏర్పాటు చేయాలంటే శాసనసభ కార్యదర్శికి లేఖలు రాశారు. సెలెక్ట్ కమిటీకి వంపడం సాధ్యం కాదంటూ కార్యదర్శి తిరిగి చైర్మన్‌కు లేఖ ద్వారా సమాధానమిచ్చారు. కార్యదర్శిపైన ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి చైర్మన్ ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకుంటుందని టీడీపీ ఆరోపిస్తోంది. చైర్మన్ ఆదేశాలు కార్యదర్శి అమలు చేయకుంటే ఉల్లంఘన కింద చర్యలకు అవకాశముందని చెవున్నారు. ఇదే సమయంలో సెలెక్ట్ కమిటీ విషయంలో వేచి చూసే ధోరణిలో. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదంటున్న అధికార పార్టీ బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూసే అవకాశం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తు న్నారంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీ అండగా నిలుస్తుంది. ఇదే సమయంలో ప్రతివక్ష వ్యూహాలకు విరుగుడు కనిపెట్టే దిశగా కసరత్తు కొనసాగుతుంది. ప్రతిపక్షం కోర్టుకెళ్లినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 క్లాజ్-1 ప్రకారం మండలి సెక్రటరి నిబంధనల మేరకే వ్యవహరించా రంటున్న వైసీపీ, బిల్లులపై ఏం చేయాలనే ఆలోచనలో అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఆర్డినెన్స్ చేయలా? గవర్నర్ వద్దకు పంపాలా? అనే అంశంపై నందిగ్ధతతో ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపి మాత్రం, సభా హక్కుల ఉల్లంఘనతో పాటుగా, కేంద్రం వద్దకు, కోర్ట్ కు వెళ్ళాలని భావిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read