గత మూడు నాలుగు రోజులుగా, వైసీపీ పార్టీ, ఎన్డీఏలో చేరుతుందని, చేరగానే, వారికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి అంటూ, ప్రచారం జరిగింది. వైసీపీకి రెండు నుంచి మూడు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని, విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను ఇస్తారని, మరొకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుంది అనే వార్తలు వచ్చాయి. ఈ విషయం పైనే, జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్ళారని, మూడు రోజుల వ్యవధిలో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం వెనుక, కారణం ఇదే అని, అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో, ఈ విషయం పై చర్చలు జరిపారనే, వార్తలు వచ్చాయి. నిన్న ఇదే విషయం పై బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ఎవరితో అయినా కలుస్తామని, రాష్ట్రానికి మంచిది అనుకుంటే, కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాం అని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై ఇప్పటికే, గోల జరగటంతో, నేను అలా అనలేదు అంటూ ఈ రోజు బొత్సా మరో ప్రకటన విడుదల చేసారు. మొత్తంగా, వైసీపీ, కేంద్రం మంత్రి వర్గంలో చేరుతుంది అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు.

అయితే ఇదే విషయం పై, బీజేపీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్, ఈ ప్రచారం పై స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం జనసేనతో పొత్తు ఉందని, తెలుగుదేశం పార్టీతో కాని, వైసీపీ పార్టీతో కాని, ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పారు. వైసీపీ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ప్రచారం మాత్రమే అని సునీల్ దేవధర్ తేల్చి చెప్పారు. ఈ విషయం పై, గత రెండు రోజులుగా అనేక, చర్చలు జరిగిన విషయం తమకు తెలుసని, ఇవన్నీ తప్పుడు వార్తలని, వైసీపీ, కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకామే లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, తమకు వైసీపీ, రాజకీయ ప్రత్యర్థులే తప్ప మరొకటి కాదని, సునీల్ దేవధర్ స్పష్టం చేసారు.

"జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను కలిసిన తరువాత, వైసీపీ పార్టీ ఎన్డీయేలో చేరి, కేంద్ర మంత్రి పదవులు చేపడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పై నేను మీకో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దీని కోసం వీలు అయినంత సహాయం చెయ్యాలని మోడీ సారధ్యంలోని కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, వేరే పార్టీ ఉన్నా, రాష్ట్రాలకు సహాయం చెయ్యటంలో, కేంద్రం వైఖరిలో మార్పు ఉండదు. మాకు అన్ని రాష్ట్రాలు ఒక్కటే, అన్ని రాష్ట్రాలను సమాన దృష్టిలో చూస్తాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చే సరికి, మేము జనసేన పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నాము. ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీతో కాని, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కాని, మాకు రాజకీయ ప్రత్యర్థులే" అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటన తరువాత ఆయన నోటినుంచి ఒక్కమాట కూడా రాలేదని, ప్రధాని, ఇతరమంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనలను పబ్లిక్‌డొమైన్‌లో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని, టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడుతూ, కేంద్రమంత్రులకు విడివిడిగా వినతిపత్రాలిచ్చిన ముఖ్యమంత్రి, వాిలోని వివరాలను వెల్లడించడానికి ఎందుకు సంకోచిస్తున్నాడన్నారు. కనీసం మీడియాముందు కు కూడా రాలేని నిస్సహాయస్థితిలో సీఎం ఎందుకున్నాడో చెప్పాలన్నారు. మంత్రి బొత్స ఒకప్రముఖ పత్రికాసంస్థ అధినేతకు లేఖరాశారని, దానిలో తాను అననిమాటలను అన్నట్లుగా రాసినట్లు ఆయన ఆరోపించారని దేవినేని తెలిపారు. అదేవార్తను టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రభ పత్రికలుకూడా ప్రచురించాయని, బొత్స వాటికి ఎందుకు నోటీసులివ్వలేదని దేవినేని ప్రశ్నించారు. వైసీపీప్రభుత్వం ఎన్డీఏలో చేరుతున్నట్లు మంత్రే ప్రకించారంటూ, అందుకు సంబంధించిన వీడియోను ీడీపీనేత విలేకరుల ఎదుట ప్రదర్శించారు. జగన్‌ ఒత్తిడివల్లే బొత్స 1974, ఆగస్ట్‌10న ప్రారంభమైన ప్రముఖ తెలుగుదినపత్రిక వ్యవస్థాపకుడికి నోీసు ఇచ్చాడని, ఆయనవైఖరి చూస్తుంటే, సీఎం, సాక్షిమీడియా ఎంతలా భయపడుతున్నాయో అర్థమవుతోందన్నారు.

చంద్రబాబు, సదరుపత్రికా యజమాని వయస్సుని గురించి హేళనగా మ్లాడుతున్న మంత్రులంతా ఒక్కసారి వారి బతుకులేమిో, ఎక్కడినుంచి వచ్చారో ఆలోచిస్తే బాగుంటుందన్నారు. 2018-19లో దేశంలోనే పెట్టుబడులు ఆకర్షణలో ఏపీ మూడోస్థానంలో నిలిచి, రూ. 70వేలకోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని, వైసీపీవచ్చాక రూ.లక్షా80 వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రంనుంచి వెనక్కువెళ్లాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే చెప్పిందన్నారు. ఈ అంశాన్ని వదిలేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి పదేపదేపాతపాటే పాడుతూ పాచిపళ్ల దాసుడిగా తయారయ్యాడన్నారు. కియావెళ్లిపోవడం గురించి, కియా అనుబం ధపరిశ్రమలు తరలిపోవడం గురించి, విశాఖలో ఉండాల్సిన సంస్థలు వెనక్కువెళ్లడం గురించి మ్లాడలేని బుగ్గన, అసెంబ్లీలో చెప్పిన రాజధానిభూముల ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ కి సంబంధించిన తప్పులప్రసంగాన్నే, నేడుకూడా చదివి వినిపించాడన్నారు. అమరావతి పై విషం చిమ్మడంతప్ప, బుగ్గనకు, ఇతరమంత్రులకు రాష్ట్రంలోని ఇతరసమస్యలు పట్టడంలేదన్నారు.

రాజధానిలోని ఎస్‌ఆర్‌ఎం, వ్‌ి విశ్వవిద్యాలయం, అమృతమయ విశ్వవిద్యాలయాలు మూసేసి, విజ్ఞాన్‌సంస్థలకు లాభంచేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థికఎమర్జన్సీ వస్తున్నా కూడా బుగ్గన తన బురదజల్లే ప్రయత్నాలు మానుకోవడంలేదన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్‌, సివిల్‌ సప్లైస్‌ మంత్రులంతా బాధ్యతలేకుండా, వారిశాఖలపై అవగాహనలేకుండా మ్లాడు తున్నారని, ధాన్యం, మిర్చి, సుబాబుల్‌రైతులు గిట్టుబాటుధరలేక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుంటూరు మిర్చియార్డులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రైతులను దోచుకుంటుంటే, ఆయనేమో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. వైసీపీమంత్రులు, సాక్షిమీడియా వార్తలుచూస్తుంటే, వారేదో మానసికజాడ్యంతో బాధప డుతున్నట్లుగా అనిపిస్తోందని, ఐీశాఖ సోదాలు నిర్వహించిన శ్రీనివాస్‌, కిలారిరాజేశ్‌ ల ఇళ్లలో దొరికినసొత్తుపై ఆశాఖ ఇచ్చే పంచనామా లేకుండా పిచ్చిపిచ్చిరాతలు ఎలా రాస్తారని టీడీపీనేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు.

పంచనామా ప్రచురించ కుండా, ఐటీశాఖ ఇచ్చిన పూర్తివివరాలు రాయకుండా తప్పుడు వార్తలురాసిన సాక్షిపత్రి కపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాక్షిపత్రికకు నీతి, నిజాయితీ ఉంటే, ఐీసోదాలు జరిగిన మూడుకంపెనీల గురించి ఎందుకు రాయడంలేదన్నారు. పూర్తిగా విషప్రచారం చేయడం మానకపోతే, సాక్షిని, ఆసంస్థ యాజమాన్యాన్ని కోర్టుల్లో దోషులు గా నిలబ్టెి తీరుతామని అశోక్‌బాబు తేల్చిచెప్పారు. ఐీశాఖ వివరణను కనిపించి, కనిపించకుండా ప్రచురిస్తూ, చంద్రబాబు దగ్గర గతంలో పనిచేసిన శ్రీనివాస్‌, కిలారి రాజేశ్‌ల చిత్రాలను, వారి వివరాలను పెద్దపెద్ద అక్షరాలతో వేయడం సాక్షి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమేనని అశోక్‌బాబు దుయ్యబ్టారు. సాక్షి వార్తలో భూతద్దం వేసి వెతికినా ఎక్కడా వాస్తవాలు కనిపించడంలేదని, చంద్రబాబు ని, లోకేశ్‌ని దోషులుగా చూపాలన్న తాపత్రయం తప్ప, ఐీశాఖ ఇచ్చిన పూర్తివివరాలు ఇవ్వకుండా తప్పుడువార్తలు రాయడం సిగ్గుచేటని ీడీపీనేత, మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దుయ్యబ్టారు. జర్నలిజంలో కనీసవిలువలను పాించని సాక్షి మీడియాను బ్యాన్‌చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆధారాలు లేకుండా మసి పూసి మారేడుకాయగా ఏమార్చే ప్రక్రియను నమ్ముతున్న సాక్షి, తన హీనమైన చర్యలతో మీడియావ్యవస్థకే కళంకంగా మారిందన్నారు. మంత్రులుకూడా జ్ఞానంలేకుండా సాక్షి రాతలనే పట్టుకొని పిచ్చిపిచ్చిగా మ్లాడటం సరికాదన్నారు. ఐీశాఖ తాను నిర్వహించి న సోదాల్లో ఎక్కడాకూడా చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పలేదన్నారు. నిజంగా టీడీపీనేతలు తప్పుచేసి ఉంటే, అధికారంలోఉన్న వైసీపీ, చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకడుగు వేస్తోందని శ్రావణ్‌ ప్రశ్నించారు.

వైసీపీప్రభుత్వ తీరు నీరోచక్రవర్తిని తలపిస్తోందని, గతప్రభుత్వంలో భూముల ధరలు ఎలాఉన్నాయో, అభివృద్ధి ఏతీరుగా పరుగులుపెట్టిందో, ఇప్పుడు జగన్‌వచ్చాక రాష్ట్రపరిస్థితి ఎంతదారుణంగా తయారైందో ఆలోచనచేయకుండా మంత్రులంతా అవాస్తవాలు, అభూతకల్పనలుచెప్పడానికి పోీపడుతున్నారని ీడీపీసీనియర్‌నేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐీసోదా ల్లో పట్టుబడిన సొమ్మంతా చంద్రబాబునాయుడిదేనని, ఆయనదగ్గర గతంలో పీ.ఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ ఇంో్ల రూ.2వేలకోట్లు పట్టుబడ్డాయని చెప్పడం వైసీపీనేతల మందబుద్ధికి నిదర్శనమన్నారు. దేశంలో జరిగిన ఐీదాడులకు, పట్టుబడిన మొత్తం సొమ్ముకి చంద్రబాబునాయుడిని బాధ్యుడిని చేయాలని చూడానికి వైసీపీనేతలు, మంత్రులకు సిగ్గులేకపోయినా, అవాస్తవాలు వినడానికి ప్రజలకు సిగ్గుగా ఉందన్నారు. 11సీబీఐకేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, క్రమంతప్పకుండా కోర్టుకు హాజరైతే ఇప్పికే ఊచలులెక్కపెడుతూ ఉండేవాడన్నారు.

ఏ2 విజయసాయిరెడ్డి ఈడీ డైరెక్టర్లను ప్రభావితం చేసేలా మ్లాడుతున్నారని, ీడీపీనేతలపై ఐీసోదాలుచేయిస్తూ రాక్షసానం దం పొందుతున్నారని బచ్చుల దుయ్యబ్టారు. నిజం నిలకడమీద తెలుస్తుందన్నట్లుగా , టీడీపీనేతల సచ్ఛీలత, నిజాయితీ త్వరలోనే రాష్ట్రప్రజానీకానికి అవగతమవుతుందన్నా రు. వైసీపీలో దిక్కూమొక్కూలేకుండా ఉన్న పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అర్జునుడు హెచ్చరించారు. వైసీపీప్రభుత్వం వచ్చాక రియల్‌ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నదో, ీడీపీ హయాంలో పతనమైందో పార్థసారథి నిరూపించాలన్నారు. జగన్‌ నిర్ణయాలకారణంగా రియల్‌ రంగం కుదేలైందని దేశవ్యాప్తంగా చర్చించుకుంటు న్నారన్నారు. రాజధానిలో ఆనాడు గజం రూ.32వేలు అమ్మితే, జగన్‌ప్రభుత్వం వచ్చాక రూ.9వేలకు పడిపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా భూములధరలు పతనమైన విషయాన్ని గ్రహించకుండా పార్థసారథి దిగజారి మ్లాడుతున్నాడన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న మెగాకృష్ణారెడ్డి ఇన్‌కంటాక్స్‌ దాడుల్లో దొరికాడని, అలాంటి వ్యక్తికి జగన్‌ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు లేకుండా చేశారంటున్న పార్థసారథి, విశాఖలో రాజధాని పేరుతో జరుగుతున్న భూదోపిడీపై ఎందుకు మ్లాడటంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సాగుభూములపై చంద్రబాబునాయుడు హక్కులు కల్పించారని, వారికి ప్టాలిచ్చి భూహక్కుదారుల్ని చేశారని పార్థసారథి తెలుసుకోవాలన్నారు. మంత్రిపదవికోసం, జగన్‌ మెప్పుకోసం అవాస్తవాలు మ్లాడటం వైసీపీనేతలకు అలవాటుగా మారిందని వారుచేస్తున్న పాపాలకు ప్రతిఫలం అనుభవించి తీరతారని బచ్చుల హెచ్చరించారు. గతప్రభుత్వం రాజధానిలో అమలుచేసిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను చూస్తే, ఏప్రభుత్వ హయాంలో భూములధరలు ఎంతున్నాయో అవగతమవుతుందన్నారు. పార్థసారధి దగ్గర దమ్ముంటే, ఆయన చెప్పినట్లుగా భూములధరలపై చర్చకురావాలని, ఏ ప్రభుత్వ హయాంలో భూములధరలు ఎలా ఉన్నాయో వాస్తవాలతో సహా నిరూపిస్తామని ీడీపీ ఎమ్మెల్సీ పత్రికాముఖంగా సవాల్‌విసిరారు.

రాష్ట్రమంత్రివర్గమంతా ఊకదంపుడుగా మీడియాముందుకొచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, జగన్‌మెప్పుకోసం అర్రులచాస్తున్నారని, చంద్రబాబు దగ్గర గతంలో పనిచేసిన శ్రీనివాస్‌ అనేవ్యక్తి ఇంటిలో ఐటీదాడుల్లో రూ.2వేలకోట్లు దొరికాయంటూ, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐటీశాఖ నిర్వహించిన సోదాల వివరాలపై పూర్తిస్థాయి నివేదిక (పంచనామా) వచ్చాక, దానిఆధారంగా ఎవరిపేర్లున్నాయో, ఎవరు ఎవరికి బినామీలో చర్చిద్దామని టీడీపీ చెబుతున్నా, నిస్సిగ్గుగా బురదజల్లడానికే రాష్ట్రమంత్రులు , వైసీపీనేతలు తాపత్రయపడుతున్నారన్నారు. పరిపాలన చేయడం చేతగాక, నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఐటీసోదాలపై బహిరంగచర్చకు రావడానికి వైసీపీనేతలు, మంత్రులు సిద్ధంగా ఉంటే, వేదికనువారే నిర్ణయించాలని ఆలపాి సూచించారు. వ్యవస్థలపై వారికి ఏమాత్రం నమ్మకమున్నా, వారు తక్షణమే సీబీడీటీ ప్రకటన, ఐటీసోదాలపై బహిరంగచర్చకు రావాలన్నారు. గతంలో ఊళ్లలో అచ్చోసిన ఆంబోతులని తిరుగుతుండేవని, రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్మూలించే కార్యక్రమాలు చేస్తున్న మంత్రులుకూడా అదేవిధంగా తయారయ్యారని ఆలపాటి మండిపడ్డారు.

చంద్రబాబుని అవినీతిపరుడిగా చిత్రీకరించడంకోసం, నాటి వై.ఎస్‌నుంచి నేటి జగన్‌ వరకు అందరూ కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. పీపీఏలరద్దు, రివర్సటెండరింగ్‌, రాజధానిలో ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ అని, గృహనిర్మా పథకాల్లో అవినీతి జరిగిందని, విషప్రచారంచేసి చివరకు ఏమీనిరూపించలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారన్నారు. 9నెలల్లో సాధించిందేమీ లేకపోవడంతో చివరకు ఆధారాల్లేని ఆరోపణలతో ప్రతిపక్షంపై పసలేని వాదనలు చేస్తున్నారని రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. పార్లమెంటుసాక్షిగా ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రంచెబితే, హోదాకోసం జగన్‌ ఢిల్లీవెళ్లాడని చెప్పుకోవడం సిగ్గుమాలిన వైసీపీనేతలకే చెల్లిందన్నారు. కర్నూలుని న్యాయరాజధానిగా చేస్తామని చెబుతూ, కేంద్రానికిచ్చిన నివేదికలో మాత్రం హైకోర్టుబెంచ్‌ ఏర్పాటుచేయాలని కోరడం సీమ వాసుల్ని మోసగించడంకాదా అన్నారు.

మంత్రివర్గమంతా అలీబాబా 40దొంగలముఠా లా మారి, రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడుతోందన్నారు. విశాఖకేంద్రంగా ఉన్న ప్రాజెక్టుల్లో మంత్రులు 70శాతం, 80శాతం షేర్‌హోల్డర్లుగా ఎందుకు మారారో చెప్పాలన్నారు. శ్రీనివాస్‌ ఇంట్లోని ఐటీదాడులు, కిలారిరాజేశ్‌ ఇంట్లోని ఐటీదాడుల పంచనామాలతో వైసీపీనేతలు చర్చకొస్తే, ఎవరు అవినీతిపరులో తేలుస్తామన్నారు. క్విడ్‌ప్రోకో ద్వారా లక్షలకోట్లు పోగేసిన జగన్‌, తనకున్న ఆస్తులన్నీ ఎక్కడినుంచి చెప్పగలరా అని ఆలపాటి నిలదీశారు. 2004కు ముందు రూ.9లక్షల పన్నులుక్టిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రూ.365కోట్లు చెల్లించేస్థాయికి ఎలావచ్చాడన్నారు. జగన్‌ తన ఒంటినిండా అవినీతి మసిపూసుకొని, దాన్ని చంద్రబాబుకి పూయాలని చూస్తున్నాడ న్నారు. అవినీతి..అవినీతి అనడంతప్ప, దాన్ని నిరూపించడం వైసీపీకి చేతకాలేదన్నారు.

Advertisements

Latest Articles

Most Read