ఆంధ్రప్రదేశ్‌లోని ఒకటైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెప్పుకుంటున్న కృష్ణా జిల్లా, నాగాయలంక తీర ప్రాంతంలో నిర్మించతలపెట్టిన క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు న్యాయశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గుల్లల మోద ప్రాంతంలో 154 హెక్టార్లలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండు దశ ల్లో రూ.1600 కోట్లు ఖర్చు చేసేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. తొలి దశ లో రూ. 600 కోట్లతో, రెండో దశలో వెయ్యి కోట్ల రూపాయలతో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు న్యాయ శాఖ అనుమతి తెలిపింది. భూసేకరణకు రూ. 35 కోట్లు, అటవీ శాఖకు రూ. 85 కోట్లు చెల్లించినట్లు డీఆర్డీవో ( రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ) వివరణ ఇచ్చింది.

ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు పర్యావరణ శాఖ ప్రకటించింది. ఒడిశాలోని బాలాసోర్‌ క్షిపణి పరీక్షా కేంద్రం తర్వాత కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయబోయే రెండో రక్షణ శాఖ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. బాలాసోర్‌ కంటే మెరుగైన సదుపాయాలతో మరో చోట క్షిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. తూర్పు తీర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన మీదట కృష్ణా డెల్టా ప్రాంతంలోని గుల్లలమోద ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. ఈ ప్రాంతం బంగాళాఖాతంలోకి చొచ్చుకెళ్లినట్టు ఉండడం ఈ ప్రాజెక్టుకు కలిసి వచ్చే అంశం.

ఈ కేంద్రం చుట్టుపక్కల 8 కిలో మీటర్ల పరిధిలో ఎక్కడా జనావాసాలు లేవు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన మడ అడవులు ఉన్నాయి. ఈ క్షిపణి కేంద్రం ఏర్పాటు వల్ల తీర ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండబోతోంది. పరిసర ప్రాంతాలకు మౌలిక వసతులూ సమకూరనున్నాయి. దాదాపు 6 వందల మంది స్థానికులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 3 వందల మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది ఈ ప్రాంతంలో నివసించబోతున్నారు. ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగ పడబోతోంది.

రెండు రోజుల ముందు విజయసాయి రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ నిర్మలా సీతారామన్ ను కలిసి, ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగుల సమస్యలు చెప్పారు అంటూ సాక్షి ఊదరగొట్టింది. అయితే ఉన్నట్టు ఉండి, ఈ చిన్న విషయం పై ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని వెనుక పెద్ద కధే ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒక్క రోజులోనే హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే, ఈ రోజు శుక్రవారం కావటంతో, మనోడు 11 సిబిఐ కేసుల్లో, బెయిల్ పై బయట తిరుగుతున్నాడు కాబట్టి, కోర్ట్ కు పోవాలి. అందుకే మళ్ళీ హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. అయితే, మళ్ళీ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయిని సమాచారం. ఇంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి, చేసేది ఏంటి అంటే, గాలి జనార్ధన్ రెడ్డికి లాబీయింగ్ అనే వార్తలు వస్తున్నాయి.

vijayasai 29062018 2

ఉక్కు పరిశ్రమ కోసం, ఒక పక్క సియం రమేష్, గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో దగ్గర ఉండి, కేంద్ర మంత్రిని కలిసి, కావలసిన డేటా అంతా నేతలు ఇస్తున్నారు. దీంతో, ఉక్కు పరిశ్రమ పై, ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కేంద్రానికి వచ్చింది. ఈ నేపధ్యంలో, కడప ఉక్కు పరిశ్రమ గాలికి కట్టబెట్టేలా, విజయసాయి లాబీయింగ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఉక్కు పరిశ్రమ పెట్టే అవకాశం లేదని రిపోర్ట్ ఇప్పించి, ప్రైవేటు ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, దానికి గాలి రెడీగా ఉన్నాడు అంటూ, ప్లాన్ చేసేలా, విజయసాయి రెడ్డి కధ నడుపుతున్నట్టు తెలుస్తుంది.

vijayasai 29062018 3

కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని గాలి హఠాత్తుగా ఉక్కు పరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పడంతో. ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది. బిజెపితోనూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు. ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ. 18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు అప్పగించింది. ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాబీయింగ్ చూస్తుంటే, గాలికి కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించటానికి రాష్ట్ర ప్రజలు అందరికి అవకాశం కల్పిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ఉచితంగా సందర్సించాలి అనుకునేవారు ముందుగా ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి. లేదా అమలులో వున్న ఏదో ఒక అసోసియేషన్ ద్వారా అయినా వెళ్ళవచ్చు. అంటే ఒక డ్వాక్రా గ్రూప్, లేదా ఒక రైతులు సంఘం, స్కూల్స్, వాకర్ క్లబ్, లయన్స్ క్లబ్, యువజన సంఘం, ఇలా ఒక గ్రూపుగా ఏర్పడాలి. తరువాత జిల్లాలోని నీటిపారుదల శాఖ ఆఫీస్‌లో వుండే జిల్లా స్థాయి అధికారికి పోలవరం యాత్ర గురించి తెలియచేస్తూ, బస్సు సదుపాయం కల్పించమని దరఖాస్తు చెయ్యాలి. నీటి పారుదల జిల్లా అధికారి సమీపంలోని ఆర్ టి సి డిపోకి సదరు సంఘం లేదా సంస్థకి బస్సు సదుపాయం కల్పించమని ఆదేశాలు జారీ చేస్తారు.

polavaram 29062018 3

నీటి పారుదల శాఖ జిల్లా అధికారి ఇచ్చిన సిఫార్సులేఖని బట్టి మీ సమీపంలోని ఆర్టీసీ డిపోలో సమర్పించి ఉచిత బస్సు పొందవచ్చు. నీటి పారుదలశాఖ జిల్లా అధికారికి మీ ప్రయాణ తేదీని ముందే తెలియచేసినట్లయితే, వారు పోలవరం సైట్‌లో వున్న నీటిపారుదల విభాగానికి ఫలానా రోజు ఫలానా డిపో బస్సు వస్తుంది అని ముందే తెలియచేస్తారు. అప్పుడు మీకు సైట్ దగ్గర క్యాంటీన్ లో భోజన సదుపాయం ఉచితంగా లభిస్తుంది, లేనిచో ఉచిత భోజన సదుపాయం లభించదు. ఈ ప్రొసీజర్ అంతా మనకి ఎందుకు అంటారా..? మనమే డబ్బు పెట్టుకుని ప్రైవేట్ వాహనాలలో వెళ్ళొచ్చు. ప్రైవేట్ వాహనాలని సైట్ లో చూడటానికి అనుమతిస్తారు. సైట్ కాంటీన్ దగ్గర పెయిడ్ భోజనం ఉంటుంది.

polavaram 29062018 2

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వైపు నుంచి వచ్చేవారు రాజముండ్రి వచ్చి అక్కడ నుంచి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ మీదగా కొవ్వూరు వచ్చి, కొవ్వూరు, చిదిపి, కుమారదేవం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం, మీదుగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. కొవ్వూరు నుంచి పోలవరం 28 కిలోమీటర్లు అక్కడ నుంచి డ్యామ్ 10 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ వైపు నుంచి వచ్చే వారు, విజయవాడ, గుండుగొలను, బీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం మీదగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి దేవరపల్లి 130 కిలోమీటర్లు, దేవరపల్లి నుంచి గోపాలపురం 10 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి తాళ్లపూడి 15 కిలోమీటర్లు, తాళ్లపూడి నుంచి పోలవరం 15 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి వచ్చేవారు సత్తుపల్లి, అశ్వారావుపేట, జిలుగుమిల్లి, కన్నాపురం, గోపాలపురం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం మీదుగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి గోపాలపురం 170 కిలోమీటర్లు ఉంటుంది. గోపాలపురం నుంచి తాళ్లపూడి 15 కిలోమీటర్లు, తాళ్లపూడి నుంచి పోలవరం 15 కిలోమీటర్లు.

ఏమి ఏమి చూడాలి ?? * పట్టిసీమ పంప్ హౌస్ : ఇది గోదావరి నది ఒడ్డున నిర్మించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులు ఉంటేనే ఇక్కడ పంపుల ద్వారా నీరు తోడగలుగుతారు. * పట్టిసీమ డెలివరీ పాయింట్: పట్టిసీమ పంప్ హౌస్ కి, డెలివరీ పాయింట్ కి మధ్య 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పట్టిసీమ నుంచి పోలవరం వచ్చి, పోలవరం నుంచి లెఫ్ట్ వైపు 3 కిలోమీటర్లు వెళ్తే పట్టిసీమ డెలివరీ పాయింట్ వస్తుంది. పంపు హౌస్ లో తోడిన నీరు డెలివరీ పాయింట్ లో నుంచి బయటకి వస్తాయి. * పోలవరం కుడి కాలవ టన్నెల్స్: పోలవరం నుంచి విజయవాడ వైపు వచ్చే కాలవ కోసం ఒక కొండలోనుంచి రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు ఇవి చూడాలి. * పోలవరం సైట్ మ్యాప్: సైట్ లో ప్రధాన ఇంజనీర్ కార్యాలయంలో ఇది ఏర్పాటు చేసారు. ఇది చూడటం వల్ల మనకి పూర్తి అవగాహనా వస్తుంది. * వ్యూ పాయింట్: ప్రాజెక్ట్ ని పూర్తిగా చూసేందుకు వ్యూ పాయింట్ ఉంది. ఇది సముద్ర మట్టానికి 150 అడుగుల ఎత్తులో కొండ మీద వుంది. ఇక్కడ నుంచి పూర్తిగా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. * స్పిల్ వే, దయాఫ్రొమ్ వాల్, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, విద్యుత్ కేంద్రం చూడటంతో పోలవరం సైట్ సందర్శన పూర్తవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఎఫ్ ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడ ఎనికెపాడులోని ఎస్.ఆర్.కె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఆసంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9:30 గంటల నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. ఎపిఎస్‌ఎస్‌డిసి నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు హాజరయ్యే అభ్యర్థులు engineering.apssdc.in/careers వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలకు2016, 17,18లో బీటెక్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ 60శాతం మార్కులతో పాసైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

efftronics 29062018 2

సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకి బీటెక్ (ఈసీఈ, ఈఈఈ, ఈసిఎం, ఈఐ, సిఎస్ఈ, ఐటి, ఈసిఎం) డిప్లొమా, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లో 55 నుంచి 65శాతం మార్కులు, బిసిఎ కంప్యూటర్స్ లో 60శాతం మార్కులతో పాసైన పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఇక ఫ్రంట్ ఆఫీసు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 2016, 17,18లో డిగ్రీ, బిటెక్, ఎంబిఎ 60శాతం మార్కులతో పాసైన అభ్యర్థులంతా హాజరు కావచ్చు. మరిన్ని వివరాల కోసం పి.విజయ్‌కుమార్ 9948206501 నంబరులో సంప్రదించవచ్చని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read