మాకు న్యాయం చెయ్యండి అని అంటున్నందుకు, కేంద్ర ప్రభుత్వం మన మీద కక్ష కొనసాగిస్తూనే ఉంది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని, కేసులు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, అవినీతి జరిగినట్టు చిన్న ఆధారం కూడా దొరక్కపోవటంతో, అమరావతి పై, పోలవరం పై, ఆ కక్ష తీర్చుకుని, తన పై ఎదురు తిరుగుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించటం కోసం, కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం, అమరావతి పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు జరిగాయి... అమరావతి నిర్మాణం ఆపెయ్యమని, కొంత మంది రాష్ట్ర ద్రోహులు, కేసులు వేసారు... అయితే, అప్పట్లో, అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.. పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది...

అప్పటికి ఇంకా చంద్రబాబు ఎన్డీఏ లోనే ఉన్నారు... అయితే ఇప్పుడు పరిస్థుతులు వేరు.. మోడీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు చంద్రబాబు.. మా హక్కు ప్రకారం, మా రాష్ట్రానికి సాయం చెయ్యమని పోరాడుతున్నారు.. ఈ తరుణంలో, మళ్ళీ కొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు... తీర్పును పునర్‌ సమీక్ష చెయ్యాలి అంటూ మరో పిటీషన్ వేసారు.. నిజానికి, ఒక్కసారి కొట్టేస్తే, వెంటనే మరో పిటీషన్ స్వీకరించరు.. మరీ ప్రత్యెక పరిస్థుతుల్లో తప్ప ఇది జరగదు... అయితే, కేసు కొట్టేసి 7-8 నెలలు కాకముందే, అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది.

అమరావతి నిర్మాణం పై ఎన్జీటీ, గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై, నిన్న గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది... గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, అందుకే కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది... అంటే, ఇప్పుడు అమరావతి నిర్మాణం పై మళ్ళీ వాదనలు జరుగుతాయి... మనం ఎంత సమర్ధవంతంగా వాదించినా, కేంద్రం తలుచుకుంటే, ఈ విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టటం, పెద్ద సమస్య కాదు.. మరోసారి, చంద్రబాబుని, అమరావతి విషయంలో ఇబ్బంది పెట్టే స్కెచ్ అంటూ, ప్రభుత్వ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.. కొట్టేసిన కేసు, మళ్ళీ రీ ఓపెన్ చెయ్యటం ఏంటో అంటూ, మాట్లాడుకుంటున్నారు... చివరకు ఇది ఎటు పోతుందో చూడాలి...

ఆంధ్రుల ఆశల సౌధం... అమరావతి నిర్మాణాలు మొదలు కానున్నాయి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది... అమరావతి అంటే అది పీపుల్స్ కేపిటల్... అది వన్ అఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కావలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు మేధో మధనం చేసి, మైన్యూట్ విషయాలు కూడా పర్ఫెక్షన్ వచ్చేలా చేసి, డిజైన్లు ఫైనల్ చేసారు... ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యం అయినా, డిజైన్లు ప్రజలందరికీ నచ్చాయి... మరో పక్క, భ్రమరావతి అనే హేళన చేసే బ్యాచ్ ఉంటానే ఉంది... ఇవన్నీ పక్కన పెడితే, అమరావతి నిర్మాణాల పై ఇక దూకుడుగా వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది... నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత కీలకమిన్ సచివాలయ భవన నిర్మాణానికి ఏపీసీఆర్డీయే పూనుకుంటోంది.

మొత్తం ఐదు ప్రధాన టవర్లు, వాటికి అనుబంధంగా ఉండే భవనాల నిర్మాణానికి, మూడు ప్యాకేజీలుగా సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది... ఈ మూడు ప్యాకేజీల అంచనా విలువ మొత్తం 2176 కోట్లు... వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి రూ.530 కోట్లు, 1, 2 టవర్ల నిర్మాణానికి రూ.895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.751 కోట్లతో సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. బిడ్‌లు దాఖలు చేయడానికి, మే 16 వరకు సీఆర్‌డీఏ టైం ఇచ్చింది. పరిపాలనా నగరంలో పాలవాగుకు ఉత్తర, దక్షిణ దిశల్లో మొత్తం 5 టవర్లతో సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ ఆవిర్భవిస్తుంది. పాలవాగుకు ఒకపక్కన మూడు టవర్లు, మరో పక్కన రెండు టవర్లు వస్తాయి.

సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ మొత్తం 32 ఎకరాల్లో, సుమారు 69 లక్షల చదరపుటడుగుల వైశాల్యంతో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, కార్యదర్శులు, జీఏడీ కొలువుదీరనున్న టవర్‌ 50 అంతస్థులతోనూ, వివిధ శాఖాధిపతులు, ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగుల కోసం మిగిలిన 4 టవర్లు ఒక్కొక్కటీ 40 అంతస్థులతోనూ నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం 46వ అంతస్తులో ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయ పైనే హెలిప్యాడ్‌ ఉంటుంది. ఈ ఐదు టవర్లను కలుపుతూ ఒక ఎలివేటెడ్‌ మార్గం ఉంటుంది. అన్ని భవనాల్లో మాదిరిగా ఇందులో పిల్లర్లు ఉండవు. పిల్లర్లకు బదులుగా డయాగ్రిడ్‌ డిజైన్లు మోస్తాయి. కలంకారీ డిజైన్‌లో ఈ డయాగ్రిడ్‌ ఉంటుంది.

ఆయన ఒక కూలి... అలాంటి పెద్దయిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా ? నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తానూ కష్టపడి దాచుకున్న సొమ్మును విరాళంగా అందించటానికి వచ్చారు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు... చంద్రబాబు పిలుపు మేరకు, ప్రజా రాజధాని నిర్మాణానికి సమాజంలోని అన్ని వర్గాల నుండి విరాళాలు అందుతున్నాయి... కూలీపని చేసుకునేవారు సైతం ప్రజా రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలులో జరిగింది.

కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలు మండలం కుల్లికోళ్ల గ్రామానికి చెందిన నారిశెట్టి పుల్లయ్య(68) s/o ఆంజనేయులు రాజధాని నిర్మాణానికి రూ.22,210లు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేశారు. కూలీపని చేసుకునే నారిశెట్టి పుల్లయ్య రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తనకున్నంతలో ఎదుటివారికి సహాయపడాలి అనే తెలుగువారి సేవా గుణానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి శ్రీ నారి శెట్టి పుల్లయ్యను కొనియాడారు... అమరావతికి, తానూ భాగస్వామి అవ్వటానికి వచ్చినందుకు సంతోషం అన్నారు... కేంద్రం చేస్తున్న అన్యాయానికి, ప్రజల్లో ఎంత కసి ఉందో, ఈ ఘటనే నిదర్శనమని చంద్రబాబు అన్నారు..

మరో పక్క, ఇలాంటి వారిని చుసైనా, పవన్, జగన్, మనసు మార్చుకోవాలని, నిత్యం అమరావతి పై చేసే కుట్రలు ఆపాలి.. జగన్, విజయవాడ పాదయత్రకు వచ్చి, భ్రమరావతి అంటూ యెగతాళి చేసాడు.. మంగళగిరిలో పాదయాత్ర చేసినా, కూత వేటు దూరంలో ఉన్న అమరావతికి రావటానికి మాత్రం ఇష్టపడలేదు... ఇక జగన్ మీడియా, పార్టీ, అమరావతి పై చిమ్మే విషం గురించి చెప్పే పని లేదు... ఇక పవన్ విషయానికి వస్తే, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తాకాలు వదులుతాడు.. అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అంటాడు... వీరందరూ కలిసి, అదే స్టేజి పై, అమరావతి రైతుల త్యాగాలను కూడా అవహేళన చేస్తారు... కానీసం ఇలాంటి వారిని చూసైనా, బుద్ధి తెచ్చుకుని, రాజధానికి అడ్డు రాకుండా, సహకరిస్తారని ఆశిద్దాం..

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత రెండు నెలలుగా ఎలా ఆందోళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... ఇటు రాజకీయంగా, మోడీ చేస్తున్న అన్యాయం దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు వచ్చింది.... అన్ని విపక్షాలను, ఈ విషయంలో చంద్రబాబు ఏకం చేసి, ఢిల్లీని ఇబ్బంది పెడుతున్నారు... అదే సందర్భంలో, బీజేపీ, ఇక్కడ కొంత మందిని అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ, కేసులు పెడతాం అంటూ భయపెడుతున్నా, చంద్రబాబు మాత్రం, ఈ కుట్రలని ఎదుర్కుని ఢిల్లీ పై యుద్ధం చేస్తున్నారు.. ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన సినీనటుడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ, ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి మాత్రం, అసలు ఇక్కడ జరుగుతుంది ఏమి పట్టనట్టు, తన పని తాను చేసుకుపోతున్నారు.

అవిశ్వాసం పెట్టిన వేళ, నెల రోజులు రాజ్యసభకు సెలవలు కావలి అంటూ, చిరంజీవి రాజ్యసభ చైర్మన్ ను కోరారు. ఆ మరుసటి రోజే, సినిమా ఫంక్షన్ లో ప్రత్యేక్షం అయ్యారు... గత కొన్ని రోజులుగా, తన తమ్ముడి కోసం, ఆయనకు రాజకీయంగా లబ్ది చేకూరటం కోసం సినీ ఇండస్ట్రీని ఏకం చేసి, మీడియాను బ్యాన్ చేసే పనిలో ఉన్నారు... రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైములో, ఒక్క రోజు కూడా ప్రత్యెక హోదా కోసం, ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యని చిరంజీవి, తన సొంత పనులు మాత్రం చేసుకుంటూ, తనని ఇంత వాడిని చేసిన రాష్ట్రం కష్టాల్లో ఉంటే మాత్రం, ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.. ఇప్పుడు అమెరికా పర్యటనకు బయలుదేరాడు.. ఈ శనివారంనాడు, ఏప్రిల్ 28 వ తేదీన డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను మాజీ కేంద్రమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవిగారు, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలుసుకుని, డల్లాస్ ప్రవాసాంధ్రులు ఒకింత ఆశ్చర్యపోయారు.. మరో పక్క, ఇదే వేదికలో, నిధుల సేకరణ కార్యక్రమం కూడా జరగనుంది.

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చెయ్యనున్నారు... ఒక ప్రవాసాంధ్రుడు మాట్లాడుతూ "వేలమైళ్ళ దూరంలో ఉండి కూడా మేము, జన్మభూమి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాము. మన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంపట్ల బాధ పడుతున్నాము. ఇలాంటి సమయంలో టికెట్లకు భారీ ధరలు పెట్టి, తమకు బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి మా కష్టార్జితాన్ని కొల్లగొట్టడానికి చిరంజీవిగారు, ఇతర సినిమాతారలు ఈ ఉత్సవాలను జరపడం ఎంతవరకు సబబు ? ఇది ఖచ్చితంగా ప్రత్యేకహోదా కోసం తపన పడుతున్న రాష్ట్రప్రజలను, ప్రవాసాంధ్రుల ఆత్మగౌరవాన్ని అవహేళన చేయడమే కదా ?" అంటూ తమ ఆవేదన తెలిపారు.

చిరంజీవి, ఇతర సినిమా వాళ్ళు డల్లాస్ లో జరిపే మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను బహిష్కరిస్తున్నామని, ఇప్పటికే టికెట్లు కొన్నవాళ్ళు, అదే ప్రాంగణంలో, వేదిక వద్ద నల్లరిబ్బన్లు ధరించి, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి, మా బాధ చిరంజీవికి అర్ధం అయ్యే విధంగా నిరసనలు తెలుపుతామని ప్రవాసాంధ్రులు పిలుపు ఇచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. మన జన్మభూమిని అవమానించే విధంగా మన ఆంధ్రులే కృతఘ్నతతో వ్యవహరిస్తే ఊరుకోబోమని, మా నిరసన చూసైనా, చిరంజీవి గారు, ఇతర సినిమా తారలు మద్దతు పలుకుతారేమో చూస్తామని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read