బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌‌‌రెడ్డికి ఫోన్ చేసారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరినీ, మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పినట్టు తెలిసిందే. అంతే కాదు, వైసిపీలోకి వెళ్ళాలి అనుకున్న కన్నా లక్ష్మీ నారాయణకు కూడా అమిత్ షా ఫోన్ చేసి, వైసీపీ లోకి వెళ్ళద్దు అని, త్వరలో మీ రాష్ట్రంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయిని, చెప్పినట్టు సమాచారం... అమిత్ షా ఫోన్ చేసిన తరువాత, మనసు మార్చుకున్న కన్నా ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. అస్వస్థత అనే వంకతో, కన్నా హాస్పిటల్ లో చేరి, వైసిపీ తో చేరే అంశం వాయిదా వేసారు. ఢిల్లీ నుంచి అమిత్ షా.. ఒక్క ఫోన్ కాల్‌తో అంతా మారిపోయింది అని సమాచారం.

kanna 25042018

అటు జగన్ కు కూడా ఫోన్ చేసి, మా పార్టీలో నుంచి ఎవర్నీ, చేర్చుకోవద్దు.. త్వరలోనే దీనికి సంబంధించి మీకు స్పష్టత ఇస్తాము. మీ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి, ఈ తరుణంలో, ఈ చేరికలు కరెక్ట్ కాదు అని అమిత్ షా, జగన్ తో చెప్పారని తెలిసింది.. జగన్ కూడా , దీనికి అంగీకారం తెలుపుతూ, మీరు ఎలా చెప్తే అల అని చెప్పారు... కన్నా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మా పార్టీలోకి వస్తాను అన్నారని, మీ సూచన మేరకు వారిని పార్టీలోకి ఇప్పుడే తీసుకోము అని, మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తామని, జగన్, అమిత్ షా తో చెప్పారు..

kanna 25042018

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దెబ్బకు బిజెపి విలవిలలాడుతోంది. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఎంత దెబ్బ తీయాలో అంతా దెబ్బతీసింది. ఇలాంటి స్థితిలో నాయకుల్లో కూడా గందరగోళం నెలకొంది. తమ రాజకీయ భవిష్యత్తును చూసుకొని నాయకులు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిస్థాయిలో నిర్జీవంగా తయారవుతుంది అమిత్ షా గ్రహించారు. ఇందుకు ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలనే ఆలోచనతోనే ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఒకవైపు పార్టీ మారాలనుకునే నాయకులను బుజ్జగిస్తూనే మరోవైపు వైసీపీ అధినేత అధినేత జగన్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ చెప్పటంతో, జగన ఆయన మాటలు వినాల్సిన పరిస్థితి..

తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. ఇవాళ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధానమంత్రి మోడీతో గవర్నర్‌ భేటీ కావాల్సింది. అయితే ఆయన అపాయింట్స్ క్యాన్సిల్‌ కావడంతో ఆయన ఇవాళ 12 గంటలకే హైదరాబాద్‌కు తిరుగు ముఖం పట్టారు. ప్రధాని చైనా పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో.. ఆయన కీలక కార్యక్రమాల షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. దీంతో ప్రధాని, గవర్నర్‌ భేటీ క్యాన్సిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇతర మంత్రులతో జరగాల్సిన భేటీలు కూడా రద్దు చేసుకోవడం విశేషం.

govenrer 25042018

తెలుగు రాష్ట్రాలపై గవర్నర్‌ ఇప్పటికే తాను తయారు చేసిన నివేదికను ప్రధాని, హోం శాఖకు పంపినట్లు తెలుస్తోంది. ఇలా ఆయన పర్యటన మధ్యలోనే ముగియడం, ప్రధానితో భేటీ కాకపోవడం, నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం, నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం. నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో గవర్నర్ తటస్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తుండటం, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్టుగా గవర్నర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం.

govenrer 25042018

మరో పక్క ప్రధాని మోడీతో పాటు, మిగిలిన బీజేపీ పెద్దలు గవర్నర్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. చంద్రబాబుతో సంధి కుదర్చమని, కర్ణాటక ఎన్నికల దాక, చంద్రబాబుని విమర్శలు చెయ్యకుండా ఉండమని పంపించినా, గవర్నర్, చంద్రబాబుని ఒప్పించలేక పోగా, తిరిగి చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ లు తీసుకురావటం మోడీకి నచ్చలేదని తెలుస్తుంది. నిన్న చంద్రబాబు మరింత ఘాటుగా మోడీ పై వ్యాఖ్యలు చెయ్యటం, గవర్నర్ ని నేరుగా బహిరంగంగా విమర్శలు చెయ్యటం కూడా, మోడీకి మింగుడు పడటం లేదని సమాచారం. చంద్రబాబుని ఒప్పించటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, మరో పక్క జగన్, పవన్ ను ఆడిస్తుంది గవర్నర్ అనే విషయం సామాన్యులకు కూడా అర్ధం అవ్వటంతో, బీజేపీ ప్లాన్ కూడా బయట పడటంతో, గవర్నర్ ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం...

బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. హై బిపితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నాలక్ష్మినారాయణ చేరారు. ఇవాళ సాయంత్రం గన్నవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని మాజీ మంత్రి కన్నా నిర్ణయించుకున్నారు. పార్టీ మారే విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కూడా తీవ్ర ఒత్తిడికి గురైన కన్నా .. ఆ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేది వాయిదా పడినట్లే అని సమాచారం అందించింది.

kanna 25042018 1

బీజేపీలో నిన్నమొన్నటి వరకు కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న కన్నా పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ పడ్డారు. బీజేపీలో చేరిన సమయంలో, తగిన ప్రాధ్యానత ఇస్తామని హామీ కూడా ఇచ్చారని కన్నా వర్గీయులు అంటున్నారు.. హరిబాబు రాజీనామాతో అది తనకు ఖాయమని నమ్మారు. అధిష్ఠానం కూడా తొలుత ఆయనకే ఇవ్వాలని భావించినా, పార్టీలోని సీనియర్లను కాదని, బయటి నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్ఠానం వెనక్కి తగ్గింది. దీంతో కినుక వహించిన కన్నా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలి అనే విషయం పై కన్నా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం... ఇటు తెలుగుదేశం పార్టీ నానియ్యదు... కాపు పార్టీగా పేరు ఉన్న జనసేన, అసలు అది ఒక పార్టీనో కాదో కూడా అర్ధం కావటం లేదు, మరో పక్క జగన్ రమ్మని ఆహ్వానం పంపుతున్నా, కన్నా వర్గీయులు కూడా అందుకే సై అంటున్నా, జగన్ పార్టీలో చేరిక విషయం పై కన్నా ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తుంది..

kanna 25042018 1

మరో పక్క బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ బీజేపీలో కొనసాగి.. ఎన్నికల బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్న భావనకు వచ్చిన ఆయన బీజేపీని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజులపాటు తన అనుయాయులతో మంతనాలు జరిపి వారి మనోగతానికి అనుగుణంగా వైసీపీలో చేరాలని అయిష్టంగానే ఒప్పుకున్నారు.. ఇప్పటికే తనతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ముఖ్యులతో ఫోన్లో చర్చలు జరిపిన ఈ నెల 25న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు... ఈ క్రమంలో, నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని మీడియాకు లీకులు ఇచ్చారు... అంతలోనే ఆయన అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు.

నెల్లూరు సోగ్గాడు, పాపులర్ పొలిటీషియన్, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. విలక్షణమైన వ్యక్తిత్వం, మాటతీరు, వేషధారణతో నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఆనం మృతితో టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

aanam 25042018 1

ఆనం వివేకా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడు,మంత్రులు ,ఇతర పార్టీ నేతలు హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా ఆయనను పరామర్శించి వచ్చారు. గత ఏడాది జూలై నుంచి ఆనం ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. గతంలో కోర్టుకు హాజరు కావాల్సిన సందర్భంలో అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానంటూ ఆయన న్యాయస్థానానికి సమాచారం అందించారు. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

aanam 25042018 1

ఇటీవల ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్న ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు బాబు. ఆనంను పరామర్శించిన వారిలో బాబుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు. కాగా ఆనం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నెల్లూరు జిల్లా నుంచి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read