మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గురించి తెలియని తెలుగు వారు ఉండరు.. రోజు ఉదయమే, నవజీవన వేదం అంటూ, మనల్ని పలకరిస్తూ, నాలుగు మంచి మాటలు చెప్తారు.. మొన్నా మధ్య, తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పిలవలేదు అని, తనకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదని, ఆంధ్రాకు చెందిన వాడిగా తాను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదని అన్నారు... అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థుతల పై కూడా స్పందించారు..

సాత్వికుడైన ఒక పండితోత్తముడు తన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, దగాని చూసి కలిగిన ధర్మాగ్రహంవల్ల గద్గదస్వరంతో ఏమంటున్నారో చూడండి. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ చంద్రబాబు రావాలని అందరూ కోరుకున్నారని, రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్ర సహాయం కావాలని అందరూ భావించారని, కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని అన్నారు... ఇలా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని, నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు... అనుభవంతో, అంకితభావంతో, చిత్తశుద్ధితో ఈ పేదరాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తపన పడుతున్న నాయకుడ్ని వదులుకుని, 2019 మే నెల తర్వాత ఒక అవినీతిపరుడిని నేను పాలకుడిగా చూడాలా అని కంపిస్తున్న గొంతుకతో ప్రశ్నిస్తున్నారు ఆయన. తెలుగుజాతి మొత్తం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఆణిముత్యాల్లాంటి పలుకులు ఆయన నోటివెంట వచ్చాయి...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే మన రాష్ట్రానికి కర్తా కర్మ క్రియ, భవిష్యత్తు అని భావించే ప్రతి ఒక్కరూ...,ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో పుణ్యభూమి సస్యశ్యామలం అవుతుందని భావించే ప్రతి ఒక్కరు ఈ గరికపాటి నరసింహారావు గారి వీడియోను చూసి అయిదు కోట్ల ప్రజల ఆవేదనను, ఆకాంక్షను అర్థం చేసుకోవాలని, ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, పది మందికి చెప్పాలని ఆశిస్తూ... ఆ వీడియో ఇక్కడ చూడండి, https://youtu.be/kCpvK9BesY0

గన్నవరం సమీపంలో, అతి పెద్ద ఐటి కంపెనీ హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌), తమ కార్యకలాపాలని మే నెల నుంచి ప్రారంభించనుంది.. గన్నవరంలని మేధా టవర్స్ లో, హెచ్‌సీఎల్‌ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.. గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుగా, ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో, హెచ్‌సీఎల్‌ శాశ్వత భవనాలకు కూడా మే నెలలోనే భూమిపూజ జరగనుంది. ఒకే రోజు, అటు శాశ్వత భవనాలకు భూమి పూజ, మేధా టవర్స్ లో కార్యకలాపాలు మొదలు పెట్టటానికి, హెచ్‌సీఎల్‌ సిద్ధమైంది.. ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్‌సీఎల్‌ కు కేటాయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ భూమిలో, చెట్ల తొలగింపు, నేల చదును పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ పనులు అన్నీ మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, వెంటనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులు మొదలు పెడతామని, చెప్తున్నారు... ఇక్కడ నిర్మించే ఐటి టవర్ నిర్మాణానికి, సంవత్సరం దాకా పడుతుంది అని, అందుకే మేధా టవర్స్ లో, కార్యకలాపాలు కూడా మొదలు పెట్టనుంది... ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు మేథ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది... దీని కోసం, మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.. ఇప్పటికే, ఇక్కడ ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి... ఐటి టవర్ భూమి పూజ, మేధాలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ పూనుకుంది. మే రెండో వారంలో కానీ, మూడో వారంలో కాని, ఇవి మొదలు కానున్నాయి...

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది...

‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ కావటంతో, సినిమా ప్రమోషన్ లో భాగంగా, మహేష్ బాబు ఈ రోజు విజయవాడలో పర్యటించారు.. ప్రేక్ష‌కుల‌తో క‌ల‌సి సినిమాను చూసేందుకు ప్ర‌త్యేక విమానంలో, హైదరాబాద్ నుంచి విజ‌య‌వాడ చేరుకున్నారు. దర్శకుడు కొరటాల శివ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి ఆయన విజయవాడ వచ్చారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి నేరుగా, క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకొని, అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యానికి చేరుకున్న మ‌హేష్, దర్శకుడు, ఇతరులకు, ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగతం ప‌లికారు. అనంత‌రం ద‌ర్శ‌న ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

అక్కడ నుంచి, బెంజిసర్కిల్ ట్రెండ్ సెట్‌ మాల్ లో ప్రేక్షకులతో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాను చుసారు. తరువాత, డీవీ మానర్‌ హోటల్‌లో మహేశ్‌బాబు గుండె శస్త్ర చికిత్స చేసుకున్న చిన్నారులను కలిశారు. ఆంధ్రా హాస్పిటల్స్ మరియి ఇంగ్లండ్‌కు చెందిన లిటిల్ హెవెన్స్ ఆధ్వర్యంలో, ఇప్పటి వరకు 300 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కలిసి మహేష్ కాసేపు సరదాగా గడిపారు. రెండేళ్లుగా చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు మహేష్‌బాబు సహకారం అందిస్తున్నారని, అలాగే బుర్రిపాలెం గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వైద్యులు తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్ చీఫ్‌ పిడియాట్రిషియన్ రామారావు మాట్లాడుతూ, చిన్న పిల్లల ఆపరేషన్ల పై, షార్ట్‌ఫిల్మ్‌ తీసేందుకు మహేష్‌ అంగీకరించారని తెలిపారు.

అనంతరం, మహేష్ మీడియాతో మాట్లాడారు.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడికి రావడం సెంటిమెంట్‌గా ఫీలవుతానన్నారు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి విజయోత్సవ సభలు విజయవాడలోనే నిర్వహించిన సంగతిని గుర్తుచేసుకున్నారు. రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించగా, తనకు వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని వెల్లడించారు. జీవితాంతం సినిమాలు చేస్తానని, ఇతర విషయాల జోలికి వెళ్లనని మహేష్‌బాబు ఘంటాపథంగా చెప్పారు. మహేశ్ బాబును చూడటానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.

మొన్నటి దాక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై విరచుకుపడ్డ విజయసాయి రెడ్డి, గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు.. ఏమై పోయాడో, ఎక్కడకి వెళ్ళాడో తెలియక, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంటే, ఆయన ఒక మిషన్ పై పని చేస్తున్నట్టు తెలిసిందే... ఈ బాధ్యత అప్పచెప్పింది కూడా అమిత్ షా నే.. సాక్షాత్తు అమిత్ షా, టాస్క్ ఇవ్వటంతో, అన్ని పనులు పక్కన పెట్టి మరీ విజయసాయి రెడ్డి ఆ పనిలో పడ్డారు... దీనికి జగన్ కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టు తెలిసింది.. మాట రానియ్యకుండా, అమిత్ షా చేసిన పని సమర్ధవంతంగా నిర్వహించాలని, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యద్దు అని, ఎలా అయినా సరే, విజయంతో తిరిగి రావాలని, అవసరం అయితే, నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అని, ఫైనల్ గా అమిత్ షా సంతృప్తి చెందాలని, జగన్, విజయసాయి రెడ్డికి చెప్పి పంపించారు..

ఇంతకీ, విజయసాయి రెడ్డికి ఇచ్చిన బాధ్యత ఏంటి అనుకుంటున్నారా ? బీజేపీ పార్టీ తరుపున కర్ణాటక ఎన్నికల బాధ్యత... కర్ణాటక ఎన్నికల్లో, పని చెయ్యటానికి, విజయసాయి రెడ్డికి కొన్ని నియోజకవర్గాల బాధ్యత ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్న విజయసాయి రెడ్డి, గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు.. అక్కడ కావాల్సిన ఆర్ధిక వనరులు, మనుషలని పంపించటంలో బిజీగా ఉన్నారు.. కడప, అనంతపురం నుంచి, ఇప్పటికే కొన్ని వేల మంది వైసిపీ కార్యకర్తలని, కర్ణాటక పంపించారు.. అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గునటం, చీకటి పడిన తరువాత, ఎన్నికల సమయంలో చేసే పనులు, వీళ్ళ బాధ్యత... అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి వ్యతిరేక ప్రచారం చేసే ఎవరైనా వస్తే, వారిని అడ్డుకోవటం కూడా వీరి బాధ్యత...

మొన్న మహా న్యూస్, బెంగుళూరులో డిబేట్ జరుపుతుంటే, అక్కడకు వెళ్లి, గొడవ చేసి, మహా న్యూస్ మూర్తి పై దాడి చేసింది కూడా ఈ వైసిపీ కార్యకర్తలే... అయితే ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక కాంగ్రెస్, వీరి పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది... పక్క రాష్ట్రము నుంచి, ఇక్కడకు వచ్చి, అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పింది... ఇక్కడ వింత ఏంటి అంటే, వైసిపీ ఇంత బహిరంగంగా, కర్ణాటకలో బీజేపీ కోసం పని చేస్తూ, కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తుంటే, మన రాష్ట్రంలో ఉన్న ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా, వైసిపీ నేతలను తప్పు పట్టం లేదు... మొత్తానికి, అమిత్ షా ని ప్రసన్నం చేసుకోవటాని, విజయసాయి రెడ్డి, కర్ణాటకలో బిజీగా ఉన్నారు... మరి, ఫలితం ఎలా ఉంటుందో, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది...

Advertisements

Latest Articles

Most Read