రాజధానిలో పైప్‌లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వాణిజ్య సంస్థల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చునని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి వుంటుంది. నూతన నగరంలో అన్ని రకాల కేబుళ్లు, పైప్ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాలి. ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

amaravati 25042018

అమరావతిలో 1350 ఎకరాలలో నిర్మించే పరిపాలన నగరానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని గత సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు తాజాగా ఈ ప్రతిపాదనలను పరిశీలించారు. సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమీక్షా సమావేశంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అమరావతిలో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తొలుత 10 ఎకరాలలో మాల్ తరహాలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ధియేటర్లు, రెస్టరెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింప్ సదుపాయాలతో ఈ మాల్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. మాల్ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ చేపడితే, తరువాత దాని నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించవచ్చునని తలపోస్తున్నారు.

amaravati 25042018

ఏడాదిన్నర కాలంలోగా ఇక్కడికి 38 వేల కుటుంబాలు తరలివస్తాయని అంచనా వేస్తున్నామని, మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీరందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా సదుపాయాలను ముందే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలో స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చినా ప్రస్తుత అవసరాలను గమనంలోకి తీసుకుని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. కంటైనర్ హోటల్ భావనను విజయవాడలోని మురళీ ఫార్య్చూన్ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు.

amaravati 25042018

కొత్త నగరంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనావేశారు. అమరావతి ఆర్థిక ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. ఆదాయాన్ని పెంచడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాల్సివుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకునే క్రమంలో మున్ముందు ప్రభుత్వానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడ్చుకోకూడదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చునేప్పుడు ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయేలా కాకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేలా విధానాలు ఉండాలని చెప్పారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ‘హడ్కో’ కంటే ఇతర వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉన్నందున రాజధానిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుకు వాటి ద్వారా ఆర్థిక సాయం తీసుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మే 14న ధర్మాసనం ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు విచారణకు కూడా కోటం శ్రీధర్‌రెడ్డి సహకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యేపై 173, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది... ఈ విషయం పై నెల్లూరు పోలీసులు పత్రికా ప్రకటన ఇచ్చారు.. ఇదే ఆ ప్రకటన...

nellore 25042018 1

"నెల్లూరు నగర 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అయిన కృష్ణ సింగ్, బుకీలు, పంటర్ల పై Sec.3 A.P Gaming Act మరియు Sec.109 IPC క్రింద కేసు నమోదు చేయటం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో నెల్లూరు రూరల్ MLA అయిన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అయిన కృష్ణ సింగ్ మరియు బుకీలు, పంటర్లను ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తున్నట్లు వారితో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తగు ఆధారాలు సేకరించడం జరిగింది. సేకరించిన ఆదారాల ఆధారంగా సదరు MLA గారికి దర్యాప్తు అధికారి Sec.41 Cr.P.C ప్రకారం సంజాయిషీ ఇచ్చుకొనుటకు నోటీసు ఇవ్వటం జరిగింది. MLA గారు నోటీసు తీసుకొని దర్యాప్తు అధికారి వద్ద హాజరు కాలేదు. సదరు MLA గారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి " నేను దర్యాప్తు అధికారుల వద్ద హాజరుకాను. వారి ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టుకోండి " అని తెలియచేయడం జరిగింది. దర్యాప్తు అధికారి 2వ సారి నోటీసు ఇవ్వటానికి ప్రయత్నించగా నోటీసును MLA గారు నిరాకరించటం జరిగింది.

nellore 25042018 1

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన కృష్ణ సింగ్ మరియు బుకీలు, పంటర్ల పై ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై Sec.3 of AP. Gaming Act క్రింది మరియు వారిని ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తూ వారితో లావదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నందు వలన MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై Sec.3 of AP Gaming Act, Sec. 109 IPC క్రింద, మరియు నోటీసు తీసుకొని హాజరు కానందుకు, నోటీసు నిరాకరించినందుకు Sec.173, 174 IPC క్రింద నేరాలు రుజువు అయినందున ది.23.04.18 న సంభందిత కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయటమయినది. సదరు కోర్ట్ మే నెల 14 వ తేదీన కోర్టులో హాజరు కావలసినదిగా రూరల్ MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరియు ఇతర ముద్దాయిలకు సమన్లు జారీ చేయటం జరిగినది. రూరల్ MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి క్రికెట్ బుకీల తోను మరియు పంటర్ల తోను జరిపిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ACB వారికి సమర్పించటం జరుగుతుంది. ఈ లావాదేవీలపై తదుపరి దర్యాప్తు ACB వారు నిర్వహిస్తారు. జిల్లాలో క్రికెట్ బూకీలపై, నిర్వాహకులపై మరియు Gutka అమ్మకందారుల పై మరియు సరఫరా దారుల పైన కఠిన చర్యలు తీసుకోబడుతాయి. సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, నెల్లూరు"

సునామీ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఇన్‌కాయిస్) సమాచారం మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదం ఉందని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే పడే అవకాశం ఉండగా రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఒకవేళ వెళ్లినా వారికి సమాచారం ఇచ్చి తిరిగి రప్పించాలని మత్స్య శాఖాధికారులకు సూచించారు.

krishna sunami 25042018 2

కలెక్టరేట్‌లో 08672-252847 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సముద్ర ప్రాంతాలైన ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ కమిటీలు, రెడ్‌క్రాస్ వంటి సహాయ సంస్థలు అప్రమత్తం కావాలని కలెక్టర్ కోరారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది. రానున్న రెండు రోజుల మధ్య సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.

krishna sunami 25042018 3

అండమాన్ నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని వెల్లడించింది. అలల ఎత్తు దాదాపుగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని పేర్కొంది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అలల ఉధృతికి అవకాశం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఉంటాయని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికరలు జారీ చేశారు.

పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి మీడియా మీద ఎందుకు పడ్డాడు ? పవన్ నా తల్లిని తిట్టారు అంటూ, మూడు రోజులు తరువాత ఎందుకు బయటకు వచ్చాడు ? సరిగ్గా, ధర్మ పోరాట దీక్ష అంటూ, మోడీ చేస్తున్న మోసం పై, తన పుట్టిన రోజు నాడే దీక్ష చేస్తున్నా అంటూ చంద్రబాబు చెప్పిన రోజే ఎందుకు హడావిడి చేసాడు ? ఇదంతా చంద్రబాబు దీక్ష డైవర్ట్ చెయ్యటానికి, బీజేపీ పెద్దలు ఆడించిన డ్రామా అని అందరికీ తెలిసిందే... ఇదే విషయం ఒక ప్రముఖ జాతీయ ప్రతిక్ర కూడా రాసింది... కేవలం చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెయ్యటానికే, పవన్ ఈ హంగామా చేసాడు అంటూ రాసింది... ఈ దీక్ష జాతీయ స్థాయిలో అటెన్షన్ పొందింది... అందుకే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెట్టాడు... అతడి వ్యక్తిగత విషయాలు పై, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టాడు... కొంత మేరకు దీక్ష డైవర్ట్ చెయ్యటంలో సక్సెస్ అయ్యాడు... అంటూ ఆ పత్రిక రాసింది.

pk national 250420182

జాతీయ స్థాయిలో కాకపోయినా, రాష్ట్ర స్థాయులో చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెయ్యటంలో కొంత వరకు సక్సెస్ అయినట్టు ఆ పత్రిక రాసింది... శ్రీ రెడ్డి వివాదంలో, తన తల్లి ప్రస్తావన రావటంతో, ఇదే అవకాశంగా మలుచుకున్న పవన్, మెలో డ్రామా అల్లారు... మూడు రోజుల తరువాత, తన తల్లి తిట్టారు అంటూ బయటకు వచ్చి, శ్రీ రెడ్డి ఉదంతం, చంద్రబాబు చేపిస్తున్నారు అంటూ, ఒక కట్టు కధ అల్లారు... సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే, అదీ తన తల్లిని తిట్టిన మూడు రోజుల తరువాత వచ్చి హంగామా చేసారు... శ్రీ రెడ్డి ఉదంతాన్ని, చంద్రబాబుకి ముడి పెట్టే ప్రయత్నం చేసి, సెన్సేషన్ చేసే ప్రయత్నం చేసారు.. దీనికి తోడూ కొంత మంది టీవీ వాళ్ళని కూడా ఈ రొచ్చులోకి లాగి, చంద్రబాబు, టీవీ9, ABN, లోకేష్, TV5, మహా టీవీ అందరూ తన మీదకి శ్రీ రెడ్డిని పంపించారు అంటూ, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసారు...

pk national 25042018 3

మొత్తానికి ప్లాన్ ప్రకారం, చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెచెయ్యటానికి, పవన్ ని రంగంలోకి దించి, డ్రామాలు ఆడించే ప్రయత్నం చేసి, చంద్రబాబు దీక్షని డైల్యుట్ చేసే ప్రయత్నం చేసి, విఫలం అయ్యారు... అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి... తన ట్విట్టర్ వేదికగా, టీవీ9, ABN,TV5 చానల్స్ ను బ్యాన్ చెయ్యమన్న పవన్, మరి ఈ రోజు ఒక జాతీయ పత్రికలో, తన పైన వచ్చిన వ్యతిరేక వార్తను పరిగణలోకి తీసుకుని, దీన్ని కూడా బ్యాన్ చెయ్యమని, తన అభిమానులకి పిలుపు ఇస్తాడా ? ఈ జాతీయ పత్రికను కూడా, చంద్రబాబు పత్రిక అని, చంద్రబాబు కుట్ర అని, చంద్రబాబు కులం అని, ఇలాంటి పిచ్చి వాగుడు వాగి, దాన్ని కూడా బ్యాన్ చేస్తాడా ? చూద్దాం...

Advertisements

Latest Articles

Most Read