ఒక పక్క, పవన్ కళ్యాణ్, గవర్నర్ నరసింహన్ పై గత నెల రోజులుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో, నిన్న జరిగిన మొరో సంఘటన, వీరిద్దరి రేలషన్ ఎలాంటిదో తెలియచెప్పింది... గత నెలలో కాంగ్రెస్ పార్టీ నుంచి, జనసేనలోకి చేరిన ఒక సీనియర్ నేత, నిన్న సాయంత్రం 4 గంటల పాటు గవర్నర్ తో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి... ఈ సీనియర్ నేత గతంలో, కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.. గత నెలలో జనసేన ఆవిర్భావ సభ జరిగే ముందు వచ్చి పార్టీలో చేరారు... అప్పటి నుంచి, ఆయన పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు... అయితే, నిన్న మీడియా కంట పడకుండా, దాదాపు నాలుగు గంటల పాటు, గవర్నర్ తో భేటీ అయ్యారు ఈ నేత..

pk 11042018 2

పవన్, జగన్ లను గవర్నర్ ద్వారా కేంద్రం సమన్వయం చేసుకుంటోందన్న వార్తల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఆకస్మిక సమావేశం... ఇప్పటికే గవర్నర్ పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి... రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నాయనీ, పవన్‌ కల్యాణ్‌ ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారనీ కూడా గవర్నర్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో , ! కేంద్ర పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో వేలుపెట్టడం మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ను పిలిపించుకుని మాట్లాడారని, ఆ ప్లాన్ లో భాగమే, ఆవిర్భావ దినోత్సవంలో, పవన్ అడ్డం తిరగటానికి కారణమని అంటున్నాయి టిడిపి వర్గాలు...

pk 11042018 3

అప్పటి నుంచి పవన్, కేంద్రం చెప్పినట్టే ఆడుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి.. నిజానికి పవన్ కదలికలు వాటికి బలం చేకురుస్తున్నాయి... చంద్రబాబు కేంద్రం పై యుద్ధం ప్రకటించిన మొదట్లో, నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు పై ఫోకస్ పెట్టింది... ఇలాంటి టైంలో, ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాకు ఎక్కటం, మోడీని ఒక్క మాట కూడా అనకుండా, చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేసింది అని గాలిలో ఆరోపణలు చేసి, జాతీయ స్థాయిలో చంద్రబాబుని బలహీన పరిచే కార్యక్రమం చేసారు.. అంతే కాదు, నేషనల్ మీడియాలో, నాకు హోదా అవసరం లేదు, నిధులు ఇస్తే చాలు, ఏ పేరు అయితే ఏంటి అని చెప్పటం, ఒక పక్క రాష్ట్రం అంతా మోడీ పై యుద్ధం ప్రకటిస్తే, నేను మోడీని ఆరాధిస్తాను అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, పవన్ ని కేంద్రం ఎలా ఆడిస్తుందో అర్ధమవుతుంది... నిన్న, జనసేన కీలక నేత గవర్నర్ తో రహస్య భేటీ కావటం, చూస్తుంటే, కేంద్రం నుంచి ఎదో డైరక్షన్ వచ్చింది అని, అది చెప్పటానికే గవర్నర్ పిలిపించారని, టిడిపి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి....

మొన్న జగన్ మాట్లాడుతూ, చంద్రబాబుని ఏదన్నా బావిలో దూకి చస్తే, రాష్ట్రానికి పాట్టిన శని వదులుతుంది అంటూ, పిచ్చ తలకెక్కి మాట్లాడాడు... అయితే, ఇప్పుడు ఈ రైతు మాట్లాడిన మాటలు వింటే, జగనే దూకాలి... బావిలో దూకుతాడో, హెలికాప్టర్ లో నుంచి దూకుతాడో కాని, అలా దులుపి దులిపి పెట్టాడు, ఈ రైతన్న... ఈయన పేరు రమణయ్య... నెల్లూరు జిల్లా వాసి... నెల్లూరు జిల్లాలో, వైసిపీ పార్టీ గోవర్ధన్ రెడ్డి చేస్తున్న పచ్చి అబద్ధపు ప్రచారాన్ని, జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు... అన్నం పెట్టినోడుని, అన్నం పెట్టలేదు అని, మా రైతన్నలని చెప్పమంటే నేను సిద్ధంగా లేము అంటూ, దులిపి దులిపి పెట్టారు... ఈ తాత మాటలు వింటే, నిజంగా జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారో... ఆయన మాటలు ఇవే...

jagan farmer 10042018 2

"నేను రైతుని... వ్యవసాయం చేసుకుని బ్రతకాలి... ఇంకా ఏమి ఆధారం లేదు... మాకు నెల్లూరులో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లాలో నీళ్ళు కావాల్సినన్ని ఇప్పించి, మాకు ఇబ్బంది లేకుండా, ధాన్యం పండేలా చేసారు... అంతే కాదు, ధాన్యం అమ్ముకునే దానికి కూడా సహాయ పడ్డారు... ముఖ్యమంత్రి గారితో చెప్పి, ఏ ఇబ్బంది లేకుండా చేసారు... వైసిపీ నాయకులు, మీరెందుకు సభ్యత లేకుండా, విషయం తెలీకుండా మాట్లాడుతారు.. ఆయన అనేవాడు లేకపోతే, మాకు చుక్క నీరు వచ్చేది కాదు.. అయన వల్ల మేము ఈ రోజు అన్నం తింటున్నాం... మాకు ఇంత చేస్తే, మీరు ఏదేదో మాట్లాడుతారు.. విషయం తెలీదు.. నేను వైసిపీ పార్టీ వాడిని... ఇప్పుడు మాత్రం, ఇందంతా చూసిన తరువాత టిడిపిలోకి వచ్చాను.."

jagan farmer 10042018 3

"కాలాన్ని బట్టి రాజకీయం చెయ్యాలి కాని... ఎన్నికలు అయ్యిన దగ్గర నుంచి, మనసులో ఏదేదో పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు... ఊరికే మాటలు కాదు, నాతో రండి... ఎన్ని గ్రామాలు నిండాయో ఎంత పంట పండిందో ఎంత గొడ్డు..గోదాను కాపడినాడో చూపిస్తా రండి నాతో.... అప్పుడు చూసి మాట్లాడండి... సభ్యత లేకుండా మాట్లాడి, మీ రాజకీయాల కోసం, మా రైతులని ఇబ్బంది పెట్టకండి... అన్నం పెట్టినోడిని , పెట్టలేదు అని మేము చెప్పలేము... ఎదో ఒక కాలువ లేని చెరువు చూపించి, అసలు జిల్లాలో నీళ్ళే లేవు అని చెప్తే ఎట్లాగండి... సబ్జెక్టు లేకుండా మాట్లాడకండి... మీకు ఏది కావాలన్నా నేను చూపిస్తా, నాతో రండి... అన్నీ చూపిస్తాం..." ఈ తాత మాటలు మీరూ వినండి...

పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌తో సహా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైనందున ఎలాంటి అవరోధాలూ లేకుండా శత్రుదుర్భేద్యంగా మార్చాలని, పనుల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని జల వనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.

polavaram 100042018

ప్రాజెక్టులో ముఖ్య భాగమైన డయాఫ్రమ్‌ వాల్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ నిర్మాణాన్ని ఈ వేసవి ఆయ్యేలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మొత్తం 10 కెమెరాలతో పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 52.10 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి కాగా, కుడి ప్రధాన కాలువ 89.10శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం మేర పనులు పూర్తయినట్లు సిఎంకు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.13,364.98 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ.8,229.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ.2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు.

polavaram 100042018

రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను నెలకోసారి స్వయంగా సమీక్షించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్నారు. పెదపాలెం, చినసాన, పులికనుమ ఎత్తిపోతల పథకాలు, ఓక్‌ టన్నెల్‌, గోరకల్లుబ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ విమానయాన మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజుకు తీవ్ర అవమానం జరిగింది... అవమానం జరిగింది కూడా, తాను నెల రోజుల క్రిందట మంత్రిగా నిర్వహించిన శాఖలోనే... ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం అశోక్ గజపతి రాజుకు చేదు అనుభవం ఎదురైంది... ఎయిర్ ఇండియా విమానంలో, ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్ళేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు... అశోక్ గజపతి రాజు లగేజీని తనిఖీ చేసిన విమానాశ్రయ సిబ్బంది, దానిని అక్కడే వదిలేశారు... ఆయన విశాఖపట్నం చేరుకున్న తర్వాత తన లగేజ్ లేకపోవడం గమనించినట్లు తెలుస్తోంది... ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి...

ashok 10042018

అయితే, ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరగటంతో, ఇది కావాలని ఎమన్నా జరిగిందా ? కావాలనే ఆయన్ను అవమానపరచటానికి, ఇలాంటి సంఘటన ఏమన్నా జరిగిందా అనే సందేహాలు ఉన్నాయి... మొన్న ప్రధాని ఇంటి ముందు జరిగిన ధర్నా సందర్భంలో, అశోక్ గజపతి రాజు కూడా పాల్గున్నారు... ఆయన తల్లి అంత్యక్రియలు ముగిసిన రెండో రోజే, ఆందోళనలో పాల్గుని, కన్న తల్లి లాంటి రాష్ట్రానికి న్యాయం కోసం, ఆయన చేసిన పనికి ప్రజలు మన్ననలు పొందారు... ఈ నేపధ్యంలోనే, ఎవరన్నా పెద్దలు కక్షకట్టి, రాజు గారిని ఇలా అవమానపరిచారా అనే సందేహం కూడా కలుగుతుంది...

ashok 10042018

ఎందుకంటే, అయన ఇదే విమానయాన శాఖలో నెల రోజులు క్రిందటి దాకా మంత్రి, మరో పక్క ఇప్పటికీ ఒక ఎంపీ... ఇలాంటి విఐపిని, ఎయిర్ ఇండియా సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాసం ఉండదు... పోనీ ఆయనతో పాటు, మరికొంత మంది లగేజి కూడా ఆగిపోతే, పొరపాటు అనుకోవచ్చు... కాని, పని గట్టుకుని, అశోక్ గజపతి రాజు ఒక్కరి లగేజిని ఇలా చెయ్యటం చూస్తుంటే, ఆయన్ను ఘోరంగా అవమానించటం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకునే క్రమంలో, అశోక్ గజపతి రాజు గౌరవాన్ని భంగం కలిగించే చర్యలు కూడా తీసిపారియ్యలేము అని టిడిపి వర్గాలు అంటున్నాయి...

Advertisements

Latest Articles

Most Read