పథకాలు తీసేస్తాం, అక్రమకేసులు పెడతాం, దాడులు చేస్తామంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. గత మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి ప్రజా తీర్పును తారుమారు చేసినట్లుగా ఈ రోజు కౌంటింగ్ కూడా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పంచాయతీలో ఆఖరి ఓటు లెక్కించేంతవరకు ఎవరూ కౌంటింగ్ కేంద్రం వదలి బయటికి రావద్దు. ప్రతి పంచాయతీలో చివరి ఓటు లెక్కించేంతవరకు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు తీసి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతుండడంపై జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి డిక్లరేషన్ ఇచ్చేంతవరకు ఎలక్షన్ ఏజెంటు, కౌంటింగ్ ఏజెంటు, అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోను బయటికి రావద్దు. పోలీసులు ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించినా, బెదిరింపు చర్యలకు దిగినా, కౌంటింగ్ ప్రక్రియలో వైసీపీ నేతలు ఏవైనా అవకతవకలకు పాల్పడినా వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 7557557744 లేదా ఎస్ఈసీకి 08662466877 నెంబరుకు తెలియజేయండి. 9గానీ, అంతకంటే తక్కువ ఓట్లుగానీ తేడా ఉన్నప్పుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాలి. ఒకసారి మాత్రమే రీకౌంటింగ్ చేయాలి. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలు లేదా సీసీ కెమెరాలతో రికార్డు చేయాలి. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తయి ఫలితాలు ప్రకటించకుండా, డిక్లరేషన్ ఇవ్వకుండా జాప్యం చేసినా వెంటనే తెలియజేయాలి. చివరి ఫలితం తేలేంతవరకు తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం అందుబాటులో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఏ ఇబ్బంది వచ్చినా గానీ తెలియజేయగలరు.

మొన్న కుప్పంలో అధికారం, డబ్బు, పోలీసులు ఇలా మొత్తాన్ని ఉపయోగించుకుని, మెజారిటీ పంచాయతీలు గెలుచుకున్న వైసీపీ, ఈ రోజు నాలుగవ విడత జరిగిన నారావారి పల్లె ఎన్నికల్లో కూడా గెలిచి చంద్రబాబుని దెబ్బ కొట్టాలని భారీ ప్లాన్ వేసారు. కుప్పంలో చేసినట్టు చేయటమే కాక, ఈ సారి దొంగ ఓట్లు కూడా వేసే ప్రయత్నం చేసారు. తిరుపతి నుంచి నారావారి పల్లె వచ్చి, ఓటింగ్ లైన్ లో నుంచున్న దాదాపు 20 మందిని టిడిపి వాళ్ళు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అయితే మళ్ళీ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, వైసీపీ నేతలు పెద్ద ఆపరేషన్ చేయటంతో, నారా వారి పల్లెలో కూడా ఎలా ఫలితం ఉంటుంది అనే టెన్షన్ ప్రజల్లో నెలకొంది. దొంగ ఓట్లు కూడా వేయటంతో, ఇక ఇది కూడా వైసీపీ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే టిడిపి మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, అధికారం ఉపయోగించినా అడ్రెస్ లేకుండా పోయారు. రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఎన్నిక జరిగిన ఎనిమిది వార్డులకు గానూ, ఎనిమిది వార్డులు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అలాగే సర్పంచి అభ్యర్ధి కూడా, బొబ్బా లక్ష్మి 563 ఓట్లతో గెలిచారు. దీంతో వైసీపీకి భంగపాటు తప్పలేదు.

రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో ఏసీబీ తనిఖీలు రాజకీయ రంగు పులుముకుంటు న్నాయి. తెదేపా, జనసేన నేతలు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా ఆరోపణ లు సంధిస్తుండగా..వెల్లంపల్లి మాత్రం ఆయా నేతలకు సమాధానం చెప్పాల్సి న అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఒకడుగు ముందు కేసి అవినీతికి పాల్పడలేదంటూ మంత్రి వెల్లంపల్లి ప్రమాణం చేయాలని సవాల్ విసిరడమేకాకతాను ముస్లింను అయినా అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నగరపాలక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో విపక్షాలు దుర్గ గుడిలో ఏసీబీ తనిఖీలను అస్త్రంగా చేసుకొని ప్రచారం నిర్వహిస్తు న్నాయి. గత కొంతకాలంగా వివిధ వర్గాలు, రాజకీయ పక్షాలనుంచి దుర్గగుడి అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో గత మూడు రోజులుగా ఏసీబీ అధికారులు దుర్గగుడిలో తనిఖీలు చేపట్టారు. స్టోర్సు, ప్రసాదం తయారీ, చీరల విభాగంతో పాటు రూ.300 దర్శనం టిక్కెట్ల వ్యవహారంపై ఏసీబీ అధి కారులు తనిఖీలు జరిపారు. కొనుగోలు చేసిన సరుకుల నాణ్యత, రేట్లకు సంబంధించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. డిపాజిట్లు, ఉద్యోగుల బదిలీలు సహా అన్ని అంశాలపై ఏసీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. 25 మంది ఏసీబీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి వివిధ అంశాలపై తనిఖీలు నిర్వ హిస్తున్నారు.

acb 21022021 2

తొలుత రెండు రోజుల పాటు తనిఖీలకు అధికారులు నిర్ణయించుకున్నప్పటికీ.. ఎంతకూ లెక్కలు తేలకపోవడంతో మూడో రోజైన శనివారం కూడా తనిఖీలు జరిగాయి. అర్ధరాత్రి వరకు తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్న ఏసీబీ అధికారులు, అవసరమైతే ఆదివారం సైతం తనిఖీలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఇంద్ర కీలాద్రీలో ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించిన నిధులు వాటికి చెల్లించిన బిల్లులకు సంబంధించిన రికార్డులను వెరిఫై చేశారు. వీటిలో కూడా కొన్ని లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. పలు విభాగాల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ప్రతిపక్షాలు ఆరోపణలు చేసాయి. ఈ క్రమంలోనే దుర్గగుడి ఈవోగా ఎంవీ సురేష్ బాబు రాకతో ఆరోపణలు తీవ్రం చేశారు. అవినీతికి పాల్పడే క్రమంలోనే అర్హుడు కాకున్నా సురేష్ బాబుకు ఈవో బాధ్యతలు అప్పగించారనేది ప్రతిపక్షాల అభిప్రాయం. దుర్గగుడి వెండి రథం మూడు సింహాలు మాయం సహా అన్ని అంశాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చోటు చేసుకున్న ఏసీబీ తనిఖీలు మరింత ఆజ్యం పోశాయి. వెల్లంపల్లి టార్గెట్ గానే అధికార పక్షమే, ఈ దాడులు చేపించిందని, లేకపోతే ప్రతిపక్షాల ఆరోపణలు బలం చేకూర్చేలా, ఎన్నికల సమయంలో ఏసీబీ దాడులు చేపించటం వెనుక మర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

చంద్రబాబు సొంత గ్రామం, చిత్తూరు జిల్లాలో ఉన్న నారావారి పల్లెలోని పంచాయతీలో ఈ రోజు దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నం చేసి, అడ్డంగా దొరికిపోయారు దొంగ బ్యాచ్. తిరుపతి నుంచి సుమారుగా 20 కిమీ తరువాత ఉండే నారావారి పల్లె పంచాయతీలో, దొంగ ఓట్లు వేయటానికి తిరుపతి నుంచి కొంత మంది యువకులు రావటంతో, వారిన్ పట్టుకోవటం జరిగింది. ఆ గ్రామస్తులు, కొత్తగా వచ్చిన వీళ్ళు అనుమాస్పదంగా ఉండటంతో, పోలీసులకు చెప్పారు. అయితే గ్రమాస్తులు చెప్పేంత వరకు కూడా పోలీసులు వారిని గుర్తించలేక పోయారు. ఎందుకంటే, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం, ఆధార్ కార్డు కానీ, ఓటరు కార్డు కానీ, ఏదో ఒకటి చూపించి లోపలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు చూపించనప్పుడు, ఆ గ్రామానికి సంబందించిన రుజువులు కూడా ఉండాలి. అవేమి లేకుండా, దొంగ ఓట్లు వేయటానికి స్వయంగా చంద్రబాబు లాంటి పెద్ద నేత అయిన సొంత గ్రామంలోనే, ఏకంగా దొంగ ఓట్లు వేయటానికి వచ్చారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా 20 మందిని పట్టుకుని, గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఇదంతా ప్లాన్ ప్రాకారం అధికార పార్టీ చేస్తున్న అరాచకం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నారావారిపల్లెలో వారి ఆటలు సాగవు కాబట్టి, ఇలా చేస్తున్నారని వాపోయారు.

nara 21022021 2

గోడలు దూకి కూడా వచ్చి, దొంగ ఓట్లు వేసి వెళ్లిపోతున్నారని వాపోతున్నారు. ఆ వీడియోకు ఒక ఛానల్ లో రావటంతో, అసలు ఏ రకంగా నారావారిపల్లెను టార్గెట్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. దొంగ ఓట్లు యదేచ్చగా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా, పోలీసులు, అధికారుల సహకారంతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే బెదిరింపులతో ఏకాగ్రీవాలు చేసుకున్నారని, ఎలాగొలా పోటీ చేస్తే, ప్రచారం చేసుకోనివ్వలేదని, ఎక్కడ చూసినా అధికార పార్టీ వాళ్ళ వాల్ పోస్టర్ లు ఉండేలా చూసుకున్నారని, అక్రమాలకూ పాల్పడ్డారని, ఇప్పుడు దొంగ ఓట్లు ద్వారా లబ్ది చేకుర్చుకునే విధంగా, ప్రతి పోలింగ్ బూత్ లో ప్రయత్నాలు చేస్తున్నారని, వాపోతున్నారు. దీని కోసం వార్డు వాలంటీర్లను కూడా ఉపయోగించుకుని, ఎవరు ఊరిలో లేరో తెలుసుకుని మరీ, ఆ ఓట్లు వేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇది మొత్తం చాలా ప్లాన్ ప్రకారం చేసారని, అసలు వీళ్ళకు కుప్పం, నారా వారి పల్లెను ఎందుకు ఇలా టార్గెట్ చేసారో అర్ధం కావటం లేదని టిడిపి నేతలు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read