జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. సుప్రీం కోర్టు జస్టిస్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. అప్పట్లో సుప్రీం కోర్టు జడ్జీలు తిరుగుబాటుకి సారధ్యం వహించారనే ప్రచారం ఉండి. అయితే రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆయన పేరు ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, ఆయనకు కావాల్సిన న్యాయ సలహాలు ఇస్తున్నారని, ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ స్థానాలకు, జడ్జిలకు మధ్య వచ్చిన గ్యాప్ తరువాత, చలమేశ్వర్ పేరు వినిపిస్తూ వచ్చింది. ఇక ఆయన కుమారుడు జాస్తి నాగభూషణ్ కూడా జగన్ క్యాంప్ లో ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన పలు సందర్భాల్లో, జాస్తి నాగభూషణ్ కూడా వెళ్ళే వారని వార్తలు వస్తూ వచ్చేవి. అయితే ఇప్పటి వరకు ఇరు పక్షాలు ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా జాస్తి నాగభూషణ్ కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్ ను ఏపీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒక విధంగా ఎదో ఒకసాయం చేస్తారని ఊహించిందే అయినా, ఇంత తొందరగా తెర ముందుకు రావటం పై రాజకీయ పరంగా కూడా చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంసం అయ్యింది. ముఖ్యంగా అధికార వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఆ జీవోలో వాడిన భాష చూసి, అధికార వర్గాలు అవాక్కయ్యాయి. ఈ జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ. ఈ ఆదేశాలు ఇచ్చింది, వాణీ మోహన్‌ అనే ఐఏఎస్ కి. ఆ జీవోలో "మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి చట్టాలు చదువుకుని రండి. మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, మీ పని తనం పెంచుకోండి" అంటూ జీవోలో రాసారు. సహజంగా ఇలా ఒక అధికారి పని తనం గురించి జీవొలో ప్రస్తావన ఉండదు. ఏదైనా డిసిప్లిన్ ఆక్షన్ తీసుకుంటే, అంట వరకు చెప్పి వదిలేస్తారు. ఇలా ఏదైనా ఆ అధికారికి చెప్పాలి అనుకుంటే, ఇంటర్నల్ గా మేమోలు ఇస్తారు. ఆ మేమోలో వార్నింగ్ ఇవ్వటం కానీ, లేదా ఇంకా ఏమైనా సలహాలు కాని, సూచనలు కానీ ఇస్తారు. అయితే ఏకంగా జీవోలో ఇలా ఒక ఐఏఎస్ పై రాయటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ జీవోలు ప్రజలు ఎవరైనా చూసేందుకు వీలుగా ఓపెన్ గా ఉంటాయి. మరి ఏకంగా చీఫ్ సెక్రటరీ సంతకంతో బయటకు వచ్చిన ఈ జీవో పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

secretariat 09122020 2

వాణీ మోహన్‌ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె 1996 బ్యాచ్ ఐఏఎస్‌. అయితే ఈ జీవో ఇవ్వటానికి కారణం, ఆమె సర్వే సెటిల్మెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఇదంతా 2016లో జరిగింది. తరువాత దీని పై ఎంక్వయిరీ జరిగింది. ఆ నివేదికలో తప్పు చేసారని తేలింది. తరువాత ఆమె ఆమె తన పై వచ్చిన ఆరోపణలు కొట్టేయాలని, ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వాణీ మోహన్ అభ్యర్ధనను, గతంలో ఇచ్చిన విచారణ నివేదికను పరిశీలించి, ఆ జీవో విడుదల చేసారు. ఇక్కడ వరకు అంతా ప్రొసీజర్ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం జరిగింది. అయితే జీవోలో చివర్లో, అసాధారణ రీతిలో, ఐఏఎస్ ను చీఫ్ సెక్రటరీ హెచ్చరించటం, వెళ్లి చట్టాలు చదువకురండి అని చెప్పటం, పని తీరు మెరుగుపరుచుకుని, నైపుణ్యం పెంచుకోండి అని చెప్పటం పై అందరూ షాక్ అయ్యారు. ఆమె చట్టాలు గౌరవించలేదని, ఆ జీవో సారంశం. అయితే ఇలాంటివి సహజంగా మెమోలో ఇస్తారు కానీ, ఇలా ప్రజలు అందరూ చూసేలా జీవోలో ఎందుకు ఇచ్చారు అనేది చర్చగా మారింది. ఈ అంశం పత్రికల్లో వచ్చినా, ఎలాంటి వివరణ అధికారులు నుంచి రాలేదు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముఖ్య నేతగా, మాజీ ఎమ్మెల్యేగా పేరున్న విశాఖపట్నం నేత విష్ణుకుమార్ రాజు స్టైల్ వేరు. ఒక పక్క బీజేపీ నేతలు అందరూ జగన్ మోహన్ రెడ్డి పై, ఆయన ప్రభుత్వం పై ఏదో మొహమాటు పడుతూ కంమెంట్లు చేస్తూ, ఎక్కువగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంటే, విష్ణుకుమార్ రాజు మాత్రం, అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అరాచకాల పై, జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఖరి పై తనదైన శైలిలో కౌంటర్ లు ఇస్తూ ఉంటారు. గత నెల రోజులుగా విష్ణుకుమార్ రాజు తరుచు మీడియా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ లో అధికార పార్టీ చేస్తున్న అరాచకం పై, అలాగే శనివారం వస్తే చాలు, ఏదోఒకటి కూల్చివేయటం పై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, వైజాగ్ లో శనివారం, ఆదివారం కూడా పని చేసే కోర్టులు పెట్టాలని కోరారు. ఇది ఇలా ఉండగా, ఈ రోజు విష్ణుకుమార్ రాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు విష్ణుకుమార్ రాజు, తన నియోజకవర్గంలో పర్యటించారు. పేదలకు ఇళ్లు ఇవ్వటం లేదు అంటూ నిరసన కార్యక్రమం చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జగన్ మొహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, ఉత్తర కొరియా అధ్యక్ష్యుడు కిం తో జగన్ ని పోల్చారు. అంతే కాదు, ఆంధ్రా కిం జగన్ మొహన్ రెడ్డి అంటూ, తీవ్ర స్థాయిలో విమర్శించారు.

vishnu 09122020 2

జగన్ మోహన్ రెడ్డి, ప్రజల కష్టాలు తెలుసుకోవటం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో, రెండున్నర ఏళ్ళ తరువాత మంత్రులను మార్చేస్తాం అని చెప్పారని, అయితే రెండేళ్ళలో ముఖ్యమంత్రి మారిపోయే అవకాసం ఉంది అంటూ బాంబు పేల్చారు. అలా జరిగితే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళకు ఎలా అవకాసం ఇచ్చారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చే అవకాసం ఉందని, సంచలన వ్యాఖ్యలు చేసారు. తదుపరి సియంగా, జగన్ సతీమణి భారతి రెడ్డి అవుతారని ఆయన వ్యాఖ్యలు చేస్తూ, అలా చేస్తే ప్రజలు కూడా సంతోషిస్తారని, మహిళలకు ప్రజల కష్టాలు ఎక్కువ తెలుస్తాయని, ఆవిడైనా ప్రజలను ఆదుకుంటారని అన్నారు. ఎన్నో సమస్యలు ఆమె పరిష్కరిస్తారని అన్నారు. పేదలకు నిర్మించిన ఇళ్లు కూడా ఇవ్వకుండా, వేదిస్తున్నారని, ప్రజలు వివిధ కష్టాలు పడుతున్నాయని, తొందర్లోనే జగన్ దిగిపోయి, మహిళా సియాం వస్తారని చెప్తూ, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఏమంటారో.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని, మూడు ముక్కల రాజధానులు చేస్తూ, ఒక ముక్క వైజాగ్, ఒక ముక్క కర్నూల్, ఒక ముక్క అమరావతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దానికి సంబంధించి బిల్లులను ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుల పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. గత నెల రోజులకు పైగానే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు ముక్కల రాజధాని బిల్లుల పై, హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే రైతుల తరుపున, ఇతర పిటీషనర్ల తరుపున వాదనలను హైకోర్టు వింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్,దుష్యంత్‌ దవే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ, రాజధాని నిర్ణయం విషయం అనేది రాష్ట్ర శాసనసభకు సంబందించిన నిర్ణయం అని చెప్పారు. ఇందులో పార్లమెంట్ కు సంబంధం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిర్ణయాదికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలి, ఎన్ని రాజధానులు ఉండాలి అనేది రాష్ట్రం ఇష్టం అని, మూడు రాజధానులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పిటీషనర్ లు చెప్పటం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న హైకోర్టు, ఒక మౌలికమైన ప్రశ్న అడగటంతో, రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం బయట పడింది.

hc 09122020 2

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును రాష్ట్రప్రతి, అమరావతిలో నోటిఫై చేసారు కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని న్యాయ రాజధాని పేరుతో కర్నూల్ తరలించే హక్కు మీకు ఎక్కడిది అంటూ, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇక్కడ ప్రభుత్వ వైఖరి బయట పడింది. కర్నూల్ లో హైకోర్టు అనేది కేవలం ప్రతిపాదన మాత్రమే అని, దీనికి సంబంధించి చర్యలు ఏమి ప్రారంభించలేదని చెప్పింది. అయితే దీనికి బదులు ఇస్తూ, ఒక పక్క చట్టం చేసి, కేవలం ప్రతిపాదన అని అలా అంటారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ అంశం పై ప్రతిపక్షం తెలుగుదేశం భగ్గు మంటుంది. కర్నూల్ ప్రజలను మభ్య పెట్టటం కోసమే, ఈ రాజధాని డ్రామా ఆడారని, కర్నూల్ కి హైకోర్టు మార్చటం అయ్యే పని కాదు అని తెలిసినా, కేవలం వైజాగ్ భూములు పై కన్ను వేసి, ఇటు కర్నూల్ ప్రజలను, అమరావతి ప్రజలను మభ్య పెడుతూ, వైజాగ్ భూములు పై కన్ను వేసారంటూ తమ అధికార సోషల్ మీడియాలో తెలుగుదేశం విమర్శించింది.

Advertisements

Latest Articles

Most Read