ఎప్పటి లాగా, ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుంది. హైకోర్టు కాదు అని చెప్తున్నా, ఇప్పుడు సుప్రీం కోర్టులో తేల్చుకుంటాం అంటూ, మరోసారి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది ప్రభుత్వం. గతంలో నిమ్మగడ్డ రమేష్ విషయం, పంచాయతీ భావనలకు పార్టీ రంగులు విషయం, అమరావతి విషయం, ఇలా అనేక అంశాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులని సుప్రీం కోర్టులో సవాల్ చెయ్యగా, ప్రతి సారి అక్కడ కూడా చుక్కు ఎదురు అవుతుంది. ఇవన్నీ చట్టబద్దమైన అంశాలు కాబట్టి, ఎక్కడైనా ఒకే తీర్పు వచ్చే అవకాసం ఉండటంతో, కింద కోర్టు, పై కోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తాజగా డాక్టర్ రమేష్ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. విజయవాడలో ఉన్న ఒక డాక్టర్ ని ఎలా అయినా బాధ్యుడుని చెయ్యలనే ఆలోచనలో, ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ఊరిలో ఉన్న ఒక డాక్టర్ పై, సుప్రీం కోర్టు వరకు వెళ్ళటం అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తుంది. స్వర్ణా ప్యాలస్ ఘటన తరువాత, డాక్టర్ రమేష్ ని టార్గెట్ చేస్తూ, చర్చ అంతా డాక్టర్ రమేష్ పైనే తిరిగేలా చేసారు. ఏకంగా ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్ కి కులం అంట గట్టారు. ఇక మరింత ముందుకు వెళ్లి, డాక్టర్ రమేష్ ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు.

sc 04092020 2

ఇలా ఒక డాక్టర్ పై ప్రభుత్వ స్థాయిలో టార్గెట్ చేసారు. అయితే ఘటన జరిగిన హోటల్ యాజమాన్యం పై కాకుండా, వైద్యం చేసిన డాక్టర్ రమేష్ ని టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయంతో పాటు, అసలు అక్కడ అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ కేసు పై డాక్టర్ రమేష్ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా హైకోర్టు ఎఫ్ఐఆర్ పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, స్టే విధిస్తూ, అసలు ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని కోరింది. ఆ హోటల్ లో ఇంతకు ముందు ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నిర్వహణ చేసింది కదా ? అసలు అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? కలెక్టర్ బాధ్యత ఏమిటి ? సబ్ కలెక్టర్ బాధ్యత ఏమిటి ?డీఎం అండ్ హెచ్‌వో ఏమి చేస్తున్నారు, వీరిని ఎందుకు బాధ్యులని చెయ్యకూడదు అనే ప్రాధమిక ప్రశ్నలు కోర్టు అడిగింది. అనుమతులు ఇచ్చిన అధికారులని హైకోర్టు ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఎఫ్ఐఆర్ పై ఇచ్చిన స్టే పై, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అధికారులని బాధ్యులని చేరుస్తూ, రమేష్, హోటల్ యాజమాన్యం పై కూడా చర్యలు తీసుకుంటే అయిపోయే దానికి, సుప్రీం కోర్టుకు వెళ్ళటం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా ? లేక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సమర్ధిస్తారా అనేది చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువ ఉన్నారని, దాదాపుగా 33 సలహాదారులు వరకు ఉన్నారని, వీరిలో చాలా మందికి అన్ని అలౌవెన్స్ లు కలుపుకుని, దాదాపుగా నాలుగు లక్షల వరకు జీతాలు ఇస్తున్నారని, ఇంత ప్రజాధనం ఎందుకు వృధా అంటూ, అటు పత్రికకు, ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని విమర్శల మధ్య కూడా, పోయిన వారం మరో సలహదారుని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూనికేషన్స్ సలహదారుగా ఉన్న, జీవీడీ కృష్ణమోహన్‌ జీతాన్ని భారీగా పెంచేసింది. ఆయనకు ఇప్పటి వరకు జీతం నెలకు, రూ.14 వేలు కాగా, ఆయన జీతాన్ని ఇప్పుడు రెండు లక్షలు చేసింది ప్రభుత్వం. అంటే ఒకేసారి లక్షా 86 వేల జీతం పెంచింది. దీనికి సంబంధించి నిన్న ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోలో, జీతం పెంపుకు కారణం చెప్తూ, ఆయన పనితనానికి మెచ్చి, జీతం పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో జీవీడీ కృష్ణమోహన్‌ ను కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి, ఆయనకు క్యాబినెట్ ర్యాంకు కూడా ఇస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది.

advisor 04092020 2

అప్పట్లో ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వటంతో, ఇతర మంత్రులతో పాటు ఆయనకు కూడా 14 వేల జీతం, హౌసింగ్ రెంట్ అలౌన్స్ కింద లక్ష రూపాయలు, కారు అద్దె కోసం 30 వేలు, ఇతర అలవెన్స్ లు ఇవ్చ్చే వారు. అయితే ఇప్పుడు జీతం 14 వేల నుంచి రెండు లక్షలు చేసారు. అలాగే ఇతర అలవెన్స్ లు అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ప్రకారం, మంత్రులు హోదా ఉన్నవారి కంటే, ఎక్కువ జీతం ఇస్తున్నారు. జీవీడీ కృష్ణమోహన్‌ , సాక్షిలో పని చేసే వారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆయన్ను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇప్పటికే సలహాదారు పదవులు, వాటి ఖర్చు పై చర్చ జరుగుతున్న సమయంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం సాహసం అనే చెప్పాలి. మరి ప్రతిపక్షాలు, ఇతర సామాజిక వేత్తలు దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి..

ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి, దాదాపుగా 77 రోజులు పాటు కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఏదో కంపెనీకి సిఫారుసు చేసారు అంటూ, అభియోగాలు మోపిన ఏసిబి, ఆయన్ను అరెస్ట్ చేసింది. అయితే అచ్చెన్నాయుడు బెయిల్ కోసం కింద కోర్టులో, అలాగే హైకోర్టులో పిటీషన్ వేయగా, రెండు చోట్లా తిరస్కరించబడింది. మళ్ళీ తరువాత హైకోర్టుకు వెళ్లి, 77 రోజులు అయినా అభియోగాల పై ఎలాంటి ఆధారాలు చూపలేదని, సిఫారసు లేఖలు అనేవి మాములుగా జరిగే ప్రక్రియ అని, పక్క రాష్ట్రంలో జరిగినట్టే ఇవ్వమని చెప్పారని, దీనిలో ఎలాంటి అవినీతి లేదని, ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి కూడా మేము ఎస్టాబ్లిష్ చెయ్యలేదని, అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు తెలిపిన విషయాన్ని, అచ్చెన్నాయుడు తరుపు లాయర్లు కోర్టుకు చెప్పటంతో, కోర్టు కూడా ఇందుకు ఏకీభావిస్తూ, ఇప్పటికే 77 రోజులు సమయం ఇచ్చామని, అంతకు ముందుకు కూడా ప్రాధమిక విచారణ జరిగిందని, ఈ కోర్టులో ఒకసారి బెయిల్ పిటీషన్ కూడా తిరస్కరించాం అని, అయినా ఇప్పటికీ అచ్చెన్నాయుడు డబ్బు తీసుకున్నారనే ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి, ఏ3 దొరికే దాకా, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కరెక్ట్ కాదు అంటూ, గత వారం బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

achem 03092020 2

అచ్చెన్నాయుడుకు అప్పటికే కరోనా సోకి రెండు వారలు అవ్వటం, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటంతో, ఆయన నాలుగు రోజులు తరువాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. ఆయన ఈ కేసు పై ఎలా స్పందిస్తారా అని అనుకున్న టైంలో, నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తానూ ఏ తప్పు చెయ్యలేదు అని, ప్రభుత్వం చేస్తున్న తప్పులు నేను ప్రశ్నించటమే తప్పు అయితే, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, నేను నిలదీస్తూనే ఉంటానని అన్నారు. మీ అవినీతిని నేను ప్రశ్నించటం నేరం అయితే, మీరు ఎన్ని అక్రమ కేసులు నా పై పెట్టినా నేను మీ అవినీతి ప్రశ్నిస్తూనే ఉంటాను అని అచ్చెన్నాయుడు అన్నారు. నిజాయితీగా ఉంటానని, అదే నా ధైర్యం అని అన్నారు. తన పై అక్రమ కేసు పెట్టారని, ప్రజలందరూ గుర్తించారని, తాను అనార్యోగం నుంచి కోలుకోవాలని ప్రజలు ప్రార్ధించారని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, విజయవాడలోని అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి, ఆయన్ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు వద్దకు వెళ్లారు. గతంలో ప్రభుత్వం రాజ్యాంగా విరుద్ధంగా తన పై కక్ష సాధించి, విధుల్లో నుంచి తొలగించిందని చెప్తూ, న్యాయ పోరాటం చేసి, హైకోర్టు, సుప్రీం కోర్టులో గెలిచి మరీ, ఆయన మళ్ళీ పదవి పొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఆయన హైకోర్టు తలుపులు తట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని, ఇది తమ స్వతంత్రతాకు ఇబ్బంది అని చెప్తూ, ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. గతంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో, వరుస పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి, నిమ్మగడ్డ పై ఎదురు దాడి చేసారు. తరువాత వారం రోజులకు నిమ్మగడ్డ, కేంద్ర హోం శాఖకు ఒక లేఖ రాసారు. తనకు కేంద్ర బలగాల బద్రత కావాలి అంటూ, ఎందుకో చెప్తూ, ఆయన ఒక పెద్ద లేఖ రాసారు. అయితే ఈ లేఖ అందినట్టు కేంద్రం, ఇటు నిమ్మగడ్డ కూడా తానే లేఖ రాసినట్టు చెప్పారు. కేంద్రం కూడా లేఖకు తగ్గట్టే కేంద్ర బద్రత కూడా ఇచ్చింది. అయితే ఈ లేఖ పై విజయసాయి రెడ్డి అభ్యంతరం తెలుపుతూ, దీని వెనుక కుట్ర ఉంది అంటూ డీజీపీకి కంప్లైంట్ చేసారు.

nimmagadda 03092020 2

తరువాత ఈ విషయం పై సిఐడి ఎంక్వయిరీ మొదలైంది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో కంప్యూటర్ తీసుకు వెళ్ళటం, అలాగే ఎలక్షన్ కమిషన్ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ని ఎంక్వయిరీ చెయ్యటం లాంటివి చేసారు. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం పై నిమ్మగడ్డ హైకోర్టుని ఆశ్రయించారు. తమ విధుల్లో జోక్యం చేసుకుంటూ, తమ కంప్యూటర్ ని తీసుకు వెళ్ళారని, ఆ వస్తువులు ఇప్పించాలాని, అలాగే తమ సిబ్బంది పై పెట్టిన కేసులు, ఈ మొత్తం వ్యవహారం పై సిబిఐ విచారణ జరిపించాలని, పెట్టిన సిఐడి కేసుని కొట్టేయాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేసారు. అలాగే ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ రెండు కేసులని కలిపి విచారిస్తామని చెప్పిన హైకోర్టు, కేసుని వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. నిమ్మగడ్డ వేసిన పిటీషన్ లో కేంద్ర హోం శాఖ సెక్రటరీ, అలాగే రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ రాజు ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజే పీ, సిఐడిలను ప్రతివాదులుగా చేర్చారు. మరి ఈ కేసు పై హైకోర్టు ఎలానటి డైరక్షన్ ఇస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read