తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రామాదం తప్పింది. చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక వాహనానికి ప్రమాదం కావటంతో, మిగతా రెండు వాహనాలు గుద్దుకున్నాయి. చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పై ఆవు అడ్డురావడంతో, కాన్వాయ్ లోని ఒక వాహనం సడన్ బ్రేక్  వెయ్యటంతో కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. ఎన్ఎస్జీ వాహనం ముందుగా సడన్ బ్రేక్ వెయ్యగా, దాని వెనుక ఉన్న జామర్ వాహనం ముందు వాహనాన్ని డీ కొట్టింది. అయితే జామర్ వాహనం వెనుక చంద్రబాబు వాహనం ఉంది. జామర్ వాహనం సడన్ బ్రేక్ వేయటం గమనించి, చంద్రబాబు డ్రైవర్ అప్రమత్తం అవ్వటంతో, చంద్రబాబు సేఫ్ గా బయట పడ్డారు. అయితే, సిబ్బందికి కొన్ని స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది. అయితే దెబ్బ తిన్న వాహనం చూస్తే పెద్ద  ప్రమాదం తప్పింది అనే చెప్పాలి. తెలంగాణాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం దగ్గర ఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తరువాత, చంద్రబాబు కాన్వాయ్, 15 నిమిషాల పాటు హైవే పైనే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం పై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెడ్ ప్లస్ బద్రత ఉన్న వ్యక్తికి రూట్ క్లియరెన్స్ లో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబుకి ఏమి కాకపోవటం, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గత చంద్రబాబు హయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజినెస్ సర్కిల్స్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం మొదటి సారిగా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రకటించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో స్థానం వచ్చింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎలాగైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, విభజన జరిగిన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని, మిగతా రాష్ట్రాలతో దీటుగా ముందుకు వెళ్ళగలం అని అనేక సంస్కరణలు తెచ్చారు. కేవలం 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చంద్రబాబు పాలసీని మార్చారు. ఇలా అనేక సంస్కరణలు తీచ్చారు. దీంతో ర్యాంకులు ప్రకటించిన మొదటి ఏడాది రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తరువాత ఏడాది నుంచి దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. వరుసగా 3 సంవత్సరాలు పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక మణిహారంలా నిలిచింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచింది అంటూ, రాష్ట్రం కోసం పెట్టుబడులు తెచ్చారు. దేశంలోనే అతి పెద్ద ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా కంపెనీని తీసుకోవచ్చారు.

eodb 05092020 2

అలాగే ఒంగోలులో పేపర్ మిల్ తెచ్చారు. ఇక అనేక దేశీయ కంపెనీలు కూడా చంద్రబాబు గారి హయంలో వచ్చాయి. ఏషియన్ పెయింట్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, ఇసుజు, గమేశా, జియో, అదనీ డేటా సెంటర్, ఇలా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని కంపెనీలు వచ్చాయి అంటే, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం మొదట రావటం ఒక కారణం. అయితే ఇప్పుడు తాజాగా, 2019 జూన్ వరకు తీసిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలోనే ఈ ర్యాంకింగ్స్ ప్రకటించాల్సి ఉన్నా, ఈ సారి లేట్ అయ్యింది. అయితే తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో కూడా ఏపి నెంబర్ వన్ గా నిలిచింది. 2015లో రెండో స్థానంలో వచ్చిన ఏపి, 2016, 17, 18లో కూడా మొదటి స్థానం రాగా, తాజాగా చంద్రబాబు పని చేసిన చివరి ఏడాది కాలానికి కూడా మొదటి ర్యాంక్ వచ్చింది. ఈ విషయం నారా లోకేష్ కూడా ట్వీట్ చేసారు. ఇక వచ్చే ఏడాది జగన్ గారు, ఇదే ఒరవడి కొనసాగిస్తారని ఆశిద్దాం...

తనకు సంబంధంలేని కేసులో పోలీసులు స్టేషన్లో చి-త్ర-హిం-స-ల-కు గురిచేయటంతో అవమానంగా భావించి మనస్థాపంతో విజయవాడ కృష్ణానది బ్యారేజీపై నుంచి దూ-కి ఆ-త్మ-హ-త్య చేసుకున్న హృదయవి దారక సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై సేకరించిన సమాచారం మేరకు మున్నంగి రాజశేఖర్ రెడ్డి నాయనమ్మ తెలిపిన సమాచారం మేరకు మండల పరిధిలోని పరిటాల గ్రామానికి చెందిన మున్నంగి రాజశేఖరరెడ్డి (23) చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో తాతయ్య, నాయినమ్మ, మేనత్తల సంరక్షణలో పెరిగాడని, ఇంటర్ వరకు చదివిన రాజశేఖర్ హైదరాబాదులో బార్ అండ్ రెస్టారెంట్ లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ లో బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడటంతో పరిటాలకు వచ్చాడు. బుధవారం సాయంత్రం ఇంటివద్ద కొంతమంది పేకాట ఆడుతుండగా అక్కడ రాజశేఖర్ నిలబడి చూస్తుండగా పోలీసులు దా-డి చేయగా, రాజశేఖర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. దా-డి చేసిన పోలీసులు రాజశేఖర్ వాహనాన్ని తీసుకువెళ్లటంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా ఐదుగురు జూదరులతో పాటు రాజశేఖర్ రెడ్డిని కూడా చేర్చి కేసు నమోదు చేశారు. గురువారం ఆరుగురిని స్టేషను పిలిపించగా వీరు పరిటాల వైసీపీ నాయకులకు ఫోన్లు చేయగా ఎవరూ స్పందించకపోవటంతో మూడు గంటల పాటు నిరీక్షించిన ఆరుగురు టీడీపీ మండల అధ్యక్షుడు కోగంటి బాబుకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి సొంతపూచీకత్తుపై వారిని విడుదల చేయించారు.

అనంతరం రాజశేఖర్ అతని స్నేహితులు పరిటాల గ్రామానికి వెళ్లి తన ఫేస్ బుక్ లో మండలంలో నిజమైన నాయకుడు అంటే కోగంటి బాబు అని, అన్నా నీవు చేసిన సాయానికి ధన్యవాదాలు అని పేస్ బుక్ లో పెట్టడంతో వైసీపీ నాయకుల్లో ఆగ్రహం చెలరేగింది. దీంతో పరిటాలకు చెందిన నాయకుడు మారశ్రీను పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయటంతో గురువారం మధ్యాహ్నం ఆరుగులు యువకులను స్టేషన్‌కు తీసుకువచ్చి ఐదుగురి జోలికి వెళ్లకుండా రాజశేఖర్ పేస్బుక్ లో నీకు ఇష్టం వచ్చినట్లు పెడతావా అంటూ ఎస్ఎ, సిబ్బంది చితకబాదారని నాయనమ్మ కస్తూరమ్మ బోరున విలపిస్తూ చెప్పింది. స్టేషన్‌కు వచ్చిన ఆరుగురితో రాజశేఖర్ వెళ్లకుండా తాను తరువాత వస్తానని నా వాహనాన్ని తీసుకువెళ్లమని చెప్పినట్లు అతని స్నేహితులు తెలిపారు. కాగా కొద్ది సేపటి తరువాత తాను చ-ని-పో-తా-న-ని నా కోసం ఎవరూ వెతకవద్దని స్నేహితులకు ఫోన్ చేసినట్లు రాజశేఖర్ నాయినమ్మ తెలిపింది. అర్ధరాత్రి కృష్ణా బ్యారేజి 58వ నెంబర్ గేట్ వద్ద చెప్పులు, సెల్ పోన్ కింద పెట్టి బ్రిడ్జిపై నుండి దూ-కు-తుం-డ-గా అదే సమయానికి అటువైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆపటానికి ప్రయత్నించినా రాజశేఖర్ వారిని తప్పించుకొని కృష్ణా నదిలో దూ-కా-డు.

సెల్‌పోన్ ద్వారా ఈ సమాచారాన్ని వారు స్నేహితులకు తెలియజేసి వారు వెళ్లిపోవటంతో బందువులు వెళ్లారు. గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించటం మొదలుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి మృ-త-దే-హాం శుక్రవారం లభ్యమైంది. పో-స్టు-మా-ర్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రాజశేఖరెడ్డి మృతి చెందిన వార్త మేనత్త సరస్వతిదేవి తెలుసుకొని తన మేనల్లుడిని చం-పా-ర-ని, ఇంటిలో ఉన్న పు-రు-గు-మం-దు తాగటంతో ఆమె అ-ప-స్మా-ర-క స్థితికి చేరుకోవటంతో చుట్టు పక్కల వారు గమనించి ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్ రెడ్డి మృతితో పరిటాల గ్రామంలో పెద్దఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. డీఎస్సీ జివి రమణమూర్తి ఆధ్వర్యంలో వీరులపాడు ఎస్ఎ, చందర్లపాడు ఎస్ఎ పెద్దఎత్తున పోలీసులతో పరిటాల గ్రామానికి చేరుకున్నారు. దీంతో బందువులు, స్నేహితులు అందరూ ఒక్కసారిగా పరిటాల జాతీయ రహదారిపైకి వచ్చి బైటాయించి, పోలీసులకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని రోడ్డు పైన ఉంచుతామని వారు ఆందోళన చేయటంతో దాదాపు గంటపాటు జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనకు కారణమైన మార్త శ్రీను, స్థానిక ఎన్ఏ పై చర్యలు తీసుకుంటానని డీఎస్పీ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఐఎంఎఫ్ లిక్కర్, విదేశీ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై కొంత మేర ధర తగ్గించింది. అలాగే 90ఎంఎల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యం ధరలను పెంచింది. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం మద్యం ధరలను స్వల్పంగా తగ్గించడంతో మందు బాబులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైన్‌షాపులపై మందు కోసం ఎగబడుతున్నారు. మందు బాబులు మద్యం కోసం శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచే ప్రభుత్వ వైన్‌షాపుల వద్ద బారులు తీశారు. గుంటూరు అరండల్‌పేట 1వ లైనులోని ప్రభుత్వ వైన్ షాపు పరిసర ప్రాంతాలు మందు బాబులతో కోలాహల వాతావరణం ఏర్పడింది. ఉదయం ఇంటి పనులపై పాల ప్యాకెట్లు, కూరగాయలు, కుటుంబ అవసరాలకు సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళేందుకు వచ్చిన వారు కూడా ప్రభుత్వ వైన్ షాపుల వద్దే బారులు తీరి తమ సమయం కాస్త ప్రభుత్వ వైన్ షాపుల వద్దే కొందరు వెళ్ళబుచ్చారు.

liquor 05092020 2

కో-వి-డ్ నేపథ్యంలో మందు చుక్క దొరక్క అల్లాడి పోయామని, అదీకాక క్వార్టర్ బాటిల్ ధర భారీగా విక్రయించడం వల్ల మందు త్రాగలేక పోయామని పలువురు మందు బాబులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మద్యం ధరలను తగ్గించటంతో తెల్లారే సరికే మద్యం కొనుగోలుకు ప్రభుత్వ వైన్ షాపుల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరి గంటల కొద్దీ వేచి ఉండడం విశేషం. మరి కొందరైతే ఆటోల్లో, ద్విచక్ర వాహనాలలో వచ్చి రోడ్ల వెంట గంటల కొద్దీ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండడంతో వారిని క్రమబద్దీకరించే నాధుడు లేక పోవడంతో అటు పాదచారులకు ఇటు వాహన చోదకులు పలు ఇబ్బంలకు గురికావాల్సి వస్తోందని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం, బ్రాండుల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందని అంటున్నారు.ఏదో తగ్గించాం అంటున్నారని, గతంలో కంటే 100 శాతం పెంచి, పెంచిన దాని పై 20,30 రూపాయలు తగ్గించారని, ఇక్కడకు వస్తేనే తెలిసిందని, ఏదో పేరుకు తప్ప తగ్గించామని చెప్పి, అవే ఊరు పేరు లేని బ్రాండులు అమ్ముతున్నారని వాపోతున్నారు. మొత్తానికి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తరువాత, అన్ని విషయాల్లో పెరిగే రేట్లే కానీ, తగ్గే రేట్లు మాత్రం మద్యం ఒక్కటే అనుకుంటా...

Advertisements

Latest Articles

Most Read