krishna pushkaralu 4 08072016

పుష్కర విధులు నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. నదీ స్నానంతో పుణ్యం వస్తుంది. నీళ్ళతోనే అన్ని రోగాలు పోతాయనేది మన నమ్మకం. మన ఆత్మలన్నీ చివరకు పరమాత్మతో కలుస్తాయని చెప్పే పాఠమని ఈ నదీ ప్రవాహం. ఆత్మలన్నీ పరమాత్మలో కలవడమంటే మనం చేసే మంచి , చెడు పనులన్నీ చివరకు మనం ఉండే మన సమాజానికి ఉపయోగ పడటమే. నది మనకి తాగడానికి నీళ్లు ఇచ్చి, మంచి పంటల్ని పండించి జీవనాధారమై , మనందరి అవసరాల్ని తీరుస్తుంది.

ఇలాంటి నీళ్లని మనం దోసిళ్లలో తీసుకొని నీళ్ల స్వచ్ఛతని తెలుసుకుని ఎప్పటికి ఇలానే వుండేలా చూస్తామని ప్రతిజ్ఞ చేయడమే పుష్కర స్నానం. పిండ ప్రధానంలో మనం పితృదేవతల కోసం పూజ చేసి చివరికి బియ్యంతో ఉడికించిన పిండాల్ని నదీ నీళ్లలో వదుల్తాం. మన పితృదేవతలు మనల్ని వందేళ్లు ఆరోగ్యంగా ఉండమని దీవించాలని మనం కోరతాం. మనం రోగాలు లేకుండా ఆరోగ్యంగా వుండాలంటే పితృదేవతల రూపంలో నీళ్లలో వున్న చేపలు , తాబేళు , కప్పలకి పిండాల రూపంలో ఆహారాన్నిస్తాం.

నీళ్లలో పిండాల్ని వదలడమంటే మన పాపాల్ని అంటే రోగాల్ని పోగొట్టుకోవడానికి చేస్తే మంచి పని. మనం వదిలే పిండాలు నీళ్లలో వున్న చేపలు తినినీళ్లలోని మలినాల్ని, మురికిని తినేసి నీళ్లని శుభ్రంగా వుంచుతాయి. పుష్కరం పేరుతో మనం నీళ్లని మురికి చెయ్యకూడదు అనేదే పుష్కర సూత్రం. దైవ దర్శనం కోసం మనం గుడికి వెళ్తాం. గుడి అంటే ఒక శిఖరం , ఒక దేవుడి బొమ్మ కాదు.

గుడి, గుల్లో కొన్ని చెట్లు, గుడి దగ్గర్లో కోనేరు ఇవ్వన్నీ కలిస్తేనే దేవుడు , గుడి.ఇవన్నీ కలిస్తేనే పర్యావరణ సూత్రాన్ని, తత్వాన్ని చెప్తాయి. నీళ్లనిచ్చే చెరువుల్ని, బావుల్ని, కోనేరుల్ని కాపాడుకోవాలి. మంచి చెట్లు మన చుటూ వుండాలి. మందు మొక్కల్ని, వేప , ఉసిరి , రావి, మర్రి లాంటి చెట్లు ఉండేలా పెంచి కాపాడుకోవాలని మనకి చెప్తాయి మన దేవాలయాలు.

krishna pushkaralu 3 07072016

విజయవాడకి చరిత్రలో చాలా పేర్లు ఉన్నాయి . బిజియివాడు, విజయివాడ, బిజవాడ, బీజవాటిక, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, చోళరాజేంద్రపురం, చోళరాజేంద్ర విజయపురం, మల్లికార్జున మహాదేవపురం, విజయవాడ. ఇన్ని పేర్లు ఉన్నా చరిత్రలో చాలాకాలం బెజవాడగానే చలామణి అయింది.

ఆదిశంకరులు భగవాత్పాదులు భారతదేశమంతటా పర్యటించి, ప్రధాన ప్రదేశాలలో అష్టాదశ పీఠాలను స్థాపించి, శక్తి స్వరూపిణియైన జగధాంబను ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేష్ లోని పిఠాపురంలో పురు హెుతుకాశక్తి, విజయవాటికలో కనక దుర్గాంబా సుప్రసిద్దమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గల దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాలు వహించాయి.

దుర్గాదేవి బీజశక్తి, కనక బీజవాటిక అనే పేరు ఈ నగరానికి వచ్చింది. బీజవాటి యొక్క వికృ తరూపం బెజవాడ ఈ పేరును గురించి మరొక విధంగా కూడా చెబుతారు. జైన బౌద్ధ బిక్షకులకు ఇదినివాన మై కొందరు చెబుతారు. ఎవరేమి చెప్పినా, పన్నెండువందల ఏళ్ళక్రితం దీనిని బెజవాడ అని పిలిచేవారని విష్ణువర్ధన మహారాజు వ్రాయించిన తామ్రాశాసనం చెబుతుంది. దేశంలో బౌద్ధమతం వెల్లివిరిసిన కాలంలో, అంటే క్రీస్తు మరణానంతరం 639 లో భారత దేశానికి వచ్చిన చైనా యాత్రీకుడు హ్యూన్‌ సాంగ్‌ బెజవాడను కూడా సందర్శించినట్టు రాసుకున్నాడు.

దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంటుంది. విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల, ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని స్థల పురాణం. అలాగే, మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం. అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.

ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ విస్తరించి ఉండేదనీ, చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదనీ ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో...కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందనీ ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందనీ చరిత్రకారులు చెబుతారు. అందుకే, బెజవాడను మొదట్లో 'బెజ్జంవాడ' అని పిలిచేవారట.

krishna pushkaralu 1 07052016

పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాపవిముక్తులను జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్ధించారు. విష్ణువు బ్రహ్మర్ధులను తోడుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లి విషయము వివరించి సరైన తరుణోపాయమును సూచించమని కోరడం జరిగింది. అంత పరమేశ్వరుడు వారికి తరుణోపాయమును విశిద్ధ్హికపరచి పడమటి కనమలలో గల సహ్యాద్రి పర్వతమందు బ్రహ్మగిరి, వేదగిరి అను రెండు శిఖరములు గలవు. బ్రహ్మగిరి యందు నేవు శ్రీ మహా విష్ణువు ఆశ్వత (రావి) వృక్షము గాను, నేను వేదగిరి యందు పెద్ద ఉసిరిక వృక్షము గాను వెలయదుమని తెలిపారు. మా అంసలో కృష్ణ - వేణి నదులు ఆవిర్భవించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతములో కలియగలవని ఆ నదీమ తల్లిలో స్నానము ఆచరించిన జనులు సర్వ పాపవిముక్తులు అవుతారని పేర్కున్నారు. అలా బ్రహ్మాది దేవతలకు, ఈశ్వరుడు చెప్పి పంపించెను.

కాలానుగతముగా సహ్య పర్వతమందలి బ్రహ్మగిరి యందు శ్రీ మహా విష్ణువు ఆశ్వత వృక్షముగా ఆవిర్భవించి తన అంశతో "కృష్ణా నది"ని ఆవిర్భింప చేసెను. తదుపరి ఈశ్వరుడు వేదగిరి యందు ఆమలక వృక్షంగా వెలసి తన అంశతో "వేణి నది" గా ఆవిర్భింప చేసెను.

మహారాష్ట్రలోని పూణే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వరం ప్రాంతంలో జార్ గ్రామంలో కృష్ణా నది పుట్టిన ప్రాంతం. అటు మహాబలేశ్వర ప్రాంతాన ఉద్భవించిన "కృష్ణ - వేణి " నదులతో "ఖిల్లవడి" అనే ప్రదేశానికి పై భాగాన కలిసి కృష్ణవేణి నదులు విడిపోయి పులిగడ్డ నుంచి తూర్పుగా కృష్ణానది ప్రవహించి కృష్ణాజిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతములో కలిసినది. పులిగడ్డ నుండి వేణి నది దక్షిణంగా ప్రవహించి నాచుగుంట ప్రాంతాన మూడు పాయలై "త్రివేణి సాగర సంగమం" ను పేరు ప్రఖ్యాతలు గాంచి సముద్రంలో కలిసినది.

అందువల్ల ఈ రెండు నదుల మధ్య గల ప్రదేశమందు సంకల్పములో "కృష్ణవేణి యోర్యధ్యప్రదేశ్" అని చెప్పుకునే ఆచారము ననుడిలోనికి వచ్చినది.

కృష్ణ నది ఉప నదులు: కోయనా నది, పెన్నా నది, మాలప్రభ నది, భీమా నది, ఎర్ల నది, ఘాట్ ప్రభ నది, దిండి నది, వర్ణ నది, మూసి నది, పాలేరు నది, దూద్గంగ నది.

krishna pushkaralu 2 07062016

ఇంద్రకీలాద్రి అని పేరు ఆ కొండకి రావడాన్ని గురించి ఒక కధ చెబుతారు.అతి ప్రాచీనకాలంలో ఇంద్రకీలుడనే పర్వతరాజు వుండేవాడు. ఆయన ఏదో ఘోరమైన పాపం చేశాడు. ఇంద్రుడాగ్రహించి, వజ్రాయి ుధంతో అతని హృదయాన్ని చేధించాడు. ఆ దెబ్బకి రాజు గుండెలో మంటరేగింది. ఆ భాధనలకీలను పశమి ంప జేసుకొవడానికి శతవిధాల ప్రయత్నించాడు. కాని లాభం లేకపోయింది. చివరకు గత్యంతరంలేక జగనా తను పర్వతరాజ పుత్రిని ప్రార్ధించాడు. చల్లనితల్లి కనికరించింది. ఆ కొండ కొమ్మమీదికి వచ్చింది.పర్వత రాజు బాధ శమించింది. నాటి నుంచి దుర్గాదేవికి ఇంద్రకీలాద్రి శిఖరం నివాసమందిరమయ్యింది. నాటినుంచి ఈ కృష్ణాతీరం ఆర్ష ధర్మానికి మళ్ళీ అవాసమయ్యింది.

కనకదుర్గ అని పేరు రావడాన్ని గురించి కొన్ని కధలున్నాయి. నాగారునాచార్యుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించాట్ట. అంటే బంగారు చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని పిలిచి వుండవచ్చు. ఇదొక ఊహ. ఒక గొల్లవాడు గొర్రెల కాచుకుంటూ బ్రతికేవాడు దుర్గాదేవిని నమ్ముకొని కొండకు వచ్చేవాడు. ఒకనాడతనికి కొండమీద పచ్చని రాళ్ళు కనిపించాయి. అమాయకుడైన ఆ యాదవుడారాళ్లను ఊళ్ళోకి తీసుకువెళ్ళి పదిమందికి చూపించాడు. అవి బంగారు కణికలని వారు చెప్పారు. ఆ కొండమీద బంగారు రాళ్ళను పండించిన దుర్గాదేవిని కనకదుర్గ అని వారు చాటి భక్తితో పూజించారు.

మరొక గాధ
పల్లవ వంశీయుడైన మాధవవర్మ అనే రాజు విజయవాటిక రాజధానీ నగరంగా దేశాన్ని పరిపాలించా డు. ఆయన న్యాయంగా ప్రజలనేలాడు. ధర్మరక్షణ కోసం ప్రాణాలనైనా తృజించాలనే న్యాయమూర్తి. ఒక నాడు యునరాజ స్వేతమత్తాశ్వాలు పూన్చిన రధంమీద రాజవీధిలో వాహ్యాళికి బయలుదేరాడు. జనంతో కిక్కిరిసిన రాజవీధిలో రధం అతి వేగంగా నడిచింది.చింతకాయలమ్ముకోనే ఒక పేదరాసి పెద్దమ్మకొడుకు దారినిపోతుండగా అతనిమీదనుంచి రధం సాగి పొయింది. ఆ కుర్రవాడు అక్కడికక్కడే చనిపోయాడు.ఒక్కగా నొక్క కోడుకునూ యువరాజు చంపాడని ఆ ముసలమ్మరాజుగారితో ఫిర్యాదు చేసి, నేరస్తుని శిక్షించమని కోరి పుత్రశోకంతో ప్రాణాలు విడిచింది. ధర్మప్రభువైన మాధవవర్మ న్యాయాధికారుల నాదేశించాడు. "ప్రాణ మ్మ ప్రాణమ్మ బదులు కోరు" అని యువరాజునకు మరణశిక్ష విధించారు.వారి తీర్పును ఎదురించే ఆధికారం తనకున్నా న్యాయాన్ని తప్పని రాజు న్యాయాధికారుల నిర్ణయాన్ని ధ్రువపరిచాడు.ఆ మహారాజు యొక్క ధర్మగుణానికి దుర్గాదేవి సంతోషించి, విజయవాటికలో స్వర్ణవర్షం కురిపించింది. ఆ నాటినుంచి ఈ తల్లికి కనకదుర్గ అని పేరు వచ్చిందని ఒక గాధ ప్రచారంలో వుంది.

medicine st ranker andhra 22052016

ఈ స్టొరీ పెద్దలు చెప్పిన ఒక చిన్న మంచి మాటతో మొదలుపెడదాం..."ఇవాళ కష్టపడితే, రేపు సుఖపడతాం...ఇవాళ సుఖపడితే, రేపు కష్టపడతాం"

ఏడాది పాటు కోల్పోయిన సంతోషానికీ, పడిన కష్టానికి, అమ్మన్నానాలు చేసిన త్యాగానికి, ఫలితం...మెడిసిన్ 1st ర్యాంక్....ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ మెడిసిన్‌ విభాగంలో మొదటిర్యాంకు సొంతం చేసుకున్న కర్నూలు జిల్లా, జొహరాపురం ప్రాంతానికి చెందిన హేమలత ఇన్స్పిరేషనల్ స్టొరీ...మెడిసిన్లో మంచి ర్యాంక్ రావటమే ఎక్కువ, అలాంటిది ఫస్ట్ ర్యాంక్ అంటే, కృషితో పాటు, కసి ఉంటే రిసుల్ట్ ఇలాగే ఉంటుంది...

నాన్న వీరన్న ఓ దుస్తుల దుకాణంలో గుమాస్తా, అమ్మ గృహిణి. ఒక అక్క, చెల్లి...పదోతరగతిలో ఫీజు డబ్బులు కట్టకపోతే హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు....అలాంటి పేద కుటుంబంలో నుంచి వచ్చి, నేడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యింది హేమలత....కిందటి సంవత్సరం కష్టపడి ఎంసెట్‌ 245వ ర్యాంకు సాధించినా.. నీ వయసు ఇరవై ఎనిమిది రోజులు తక్కువ ఉంది, అని సీటు ఇవ్వలేదు...అధికారుల్ని ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది....ఏడాది కాలం వృథా అవుతుందన్న బాధ...ఆత్మవిశ్వాసం కోలోపోయింది...అమ్మ,నాన్న,అక్కా, చెల్లీ, స్నేహితురాళ్ల స్ఫూర్తినింపే మాటలతో మళ్ళి తనకు ఆత్మవిశ్వాసం వచ్చింది...

నెల్లూరులో రత్నం మెడికల్‌ అకాడమీలో జాయిన్ అయ్యింది...అలా ఇంటికి దూరంగా వెళ్లిన హేమ, పరీక్ష రాశాకే ఇంటికి రావాలని నిర్ణయించుకుంది...అప్పుడప్పుడూ నాన్న కష్టం, కౌన్సెలింగులో సీటు కోల్పోవడం గుర్తొచ్చి కసి పెరిగేది....దాదాపు ఏడాది పాటు సంతోషం అనేది లేకుండా, చదువు మీద తప్ప వేరే విషయం మీద దృష్టి పెట్టలేదు...చివరకు పరీక్షా రాసింది...కీ చూసుకున్నాక టాప్‌ పదిలో ఉంటాననే ధైర్యం వచ్చింది...ఆ ధైర్యంతోనే ఎలాగైనా, సీఎంని కలవటానికి విజయవాడ క్యాంపు కార్యాలయానికి నిన్న ఉదయాన్నేవచ్చింది...సీఎం ఫలితాలు చదువుతున్నారు...మెడిసిన్లో ఫస్ట్ ర్యాంక్ హేమలత అని సీఎం నోటి వెంట ప్రకటన రాగానే, హేమలత కళ్ల వెంట నీళ్లు తిరిగాయి...అమ్మానాన్నల కష్టానికీ, ఏడాది పాటు కోల్పోయిన సంతోషనికీ ఈ ఫలితాలే నిదర్సనం...ఇప్పుడు హేమలత తండ్రి ఒక చిరు ఉద్యోగి కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికే, ఒక ముత్యాన్ని అందించిన ఒక గొప్ప తండ్రి...

తర్వాత హేమలత టార్గెట్, ఎయిమ్స్‌లో న్యూరాలజీ విభాగంలో పట్టా తీసుకోవటం...హేమలత మంచి న్యూరాలజీ డాక్టర్ అవ్వాలి అని ఆకాంక్షిస్తూ...అల్ ది బెస్ట్ హేమా....

{youtube}HSXlvD8QKmY|500|250|1{/youtube}