chandrababu naidu 18052016

ఒక ముఖ్యమంత్రి పదేపదే కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ పరిస్థితి? ఒక మనిషిని చంపేసి క్షమాపణలు అడిగితే తప్పు మాఫీ అయిపోతుందా? దేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బంది నాకే ఎందుకు కలిగిస్తున్నారు ? ముఖ్యమంత్రిగా ఉన్న తాను పదేపదే ఢిల్లీ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరే రాష్ట్రాలకు లేని శిక్ష ఒక్క ఏపీకే ఎందుకు ? ఏపీకి ఏమిస్తున్నారో చెప్పలేదు, విభజన తరువాత రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో వివరించలేదు.

ఇది నిన్న ప్రధానమంత్రిని కలిసి వచ్చాక చంద్రబాబు చెప్పిన మాటలు...రాష్ట్ర ప్రజలుగా ఒక ముఖ్యమంత్రి అలా బాధపడటం చూసి, కేంద్ర చేస్తున్న అన్యాయం చూసి, మనలో చాలా మంది, ఎందుకు చంద్రబాబుకు ఇంత సహనం, ఓర్పు...బయటకు వచ్చేసి, BJPని విమర్శించవచ్చు కదా అని అంటున్నాం...అలా వచ్చేస్తే మన ఇగో satisfy అవ్వుద్ది కాని, మన రాష్ట్ర కష్టాలు తీరవు కదా, కేంద్రం చేసే ఆ సహాయం కుడా చెయ్యకపోతే, కష్టాలు ఇంకా ఎక్కువ అవ్వుతాయి...

అనువు గాని చోట అధికులమనరాదు అంటారు పెద్దలు...ఇది చంద్రబాబుకి బాగా తెలుసు...రాష్ట్రానికి ఉన్న బలహీనతలు, కేంద్రానికి ఉన్న బలం ఆయనికి తెలుసు...ఆయన చేతిలో 33000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు భవిష్యత్తు ఉంది....పర్యావరణ అనుమతులు, అటవీ భూమి డి-నోటిఫై, విదేశీ పెట్టుబడులు, నిధులు, ఇలా అన్నిట్లో కేంద్ర సహకారం అవసరం....ఏమాత్రం తేడా వచ్చినా, మన కలల అమరావతికి దెబ్బ పడుద్ది...33000 ఎకరాలు ఇచ్చిన రైతులు భవిష్యత్తు ప్రస్నార్ధకం అవుతుంది....ఇకపోతే పోలవరం, ఇది పూర్తీ అయితే, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది...దీనికి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి....ఇంత సఖ్యతగా ఉంటేనే, విదులుస్తున్నారు, మరి బయటికి వచ్చేస్తే ?

అలా అని చూస్తూ కుర్చోవలా ? ఇప్పటికి రెండు ఏళ్ళు అయిపోయింది...ఇంకా ఎంత కాలం ? ఇన్ని ప్రశ్నలు సామాన్య జనాలవి....మరి ఇంత సుదీర్గ అనుభవం ఉన్న చంద్రబాబుకి జనం నాడి తెలియదా అంటే ? తెలుసు...ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమి చేస్తే ఎవ్వరు లైన్ లోకి వస్తారో ఆయనికి బాగా తెలుసు...అయన రాజకీయ ప్రస్థానం చెప్పుతున్నది అదే...ప్లాన్ A ఫెయిల్ అయితే, ప్లాన్ B రెడీ గా ఉంటది.....ఆయన్ని జనాలు ఎంచుకున్నది కుడా, ఆ అనుభవానికే, ఆ సహననికే, ఆ చానిక్యతకే...దెబ్బ పడితే, కర్రా విరగకూడదు, పాము చావ కూడదు...ప్లాన్ B కుడా ఫెయిల్ అయితే,, మన ఆంధ్రుల సత్తా ఉంది, కష్టపడే తత్వం ఉంది, తెలివి తేటలు ఉన్నాయి....అన్నిటికీ మించి కష్టపడే నాయకుడు ఉన్నాడు...అవే మనల్ని స్వర్ణాంధ్ర వైపు నడిపిస్తాయి....

ప్రస్తుతం డిఫిన్సేవ్ ప్లే ఆడుతున్న చంద్రబాబు, అగ్గ్రేస్సివ్ ప్లే ఆడాలని ప్రతి ఒక్క ఆంధ్రుడి కోరిక...అగ్గ్రేస్సివ్ ప్లే చివ్వర్లో ఆడాలి, మధ్యలో ఆడి వికెట్ పోగుట్టుకుంటే, అసలకే మోసం వస్తుంది....

{youtube}1DyQzGuQnaU|500|250|1{/youtube}

somu verraju 17052016

ఈయన రాష్ట్ర BJP అధ్యక్షుడు. కాని ఈయనికి రాష్ట్ర సమస్యలు పట్టవ్. కేంద్రాన్ని వెనకేసుకురావటం కోసం, నాలుక ఎటుఅయిన తిప్పేస్తాడు...నిన్నకాక మొన్న, కేంద్రం 1.70 లక్షల కోట్లు సహాయం చేసింది అని, దానికి లెక్కలు అడిగాడు...ఇవాళ, ప్రతి ఆంధ్రుడి కలల రాజధాని అయిన అమరావతి మీద విషం చిమ్ముతున్నాడు...కేంద్రం చేస్తున్న ద్రోహం సమర్ధించటానికి, ఈయనికి అమరావతి అయిన , అనకాపల్లి అయినా ఒకటే అంట...ఇక్కడ అనకాపల్లిని తక్కువ చెయ్యటం కాదు కాని, మాకు కూడా బెజవాడలో గల్లీ ఎంతో, నీ ఢిల్లీ కుడా మాకు అంతే...

రాజధానికి లక్ష కోట్లు ఎందుకు అని మన వీర్రాజు సార్ ప్రశ్నిస్తున్నాడు...ఇప్పటికే 30 వేల కోట్లు రాజధానికి ఇచ్చారు అంట...దానికి లెక్కలు చెప్పాలి అంట....ఎప్పుడు ఇచ్చారో, ఎంత ఇచ్చారో అడిగితే మాత్రం మన వీరుడు చెప్పలేడు...అయినా స్వయానా మోడీనే డిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తాము అన్నారు...మరి అప్పుడు వీర్రాజు సార్ ఎక్కడ ఉన్నారో...అప్పుడే వాళ్ళ నాయకుడు మోడీ ని అడగాల్సింది...డిల్లీని తలదన్నే రాజధాని అంటే, మన వీరుడు చెప్పినట్టు లక్ష కాదు, 5 లక్షల కోట్లు కావలి...

ఆంధ్ర రాష్ట్రము లాగే చాలా రాష్ట్రాలు విడిపోయినియ్యి అంట...మేము విదేపోలేదు వీర్రాజు సార్, మమ్మల్ని విడగొట్టారు....అది ఎలాగు అంటే, అప్పులు మాకు, ఆదాయం తెలంగణాకి పంచి, రాజధాని లేకుండా నడి రోడ్డు మీద పడేసారు... ఆంధ్ర రాష్ట్రాన్ని ఛత్తీస్ గడ్ తోపోలుస్తాన్నారు మన వీరుడు...ఛత్తీస్ గడ్ కోటి జనాభా ఉండే రాష్ట్రం....దానికే అప్పట్లో 15 వేల కోట్లు అంటే...ఇప్పటి విలువ ప్రకారం కనీసం 40 వేల కోట్లు అనమాట.. పైగా కోటి జనాభా వున్నా రాష్ట్ర రాజధానికి అంత అంటే, 5 కోట్ల ఆంధ్ర కు ఎంత సహాయం చెయ్యాలి...మీ కాకి లెక్కలు ఇక్కడ వాడి, మీ కేంద్ర నాయకత్వం మీద వత్తిడితెండి...

ప్రత్యెక హోదా ఇస్తే అన్నీ నష్టాలే అని మన వీర్రాజు సార్ సెలవు ఇచ్చారు...మరి ఆ విషయం ఆంధ్ర రాష్ట్రాన్ని వీకెండ్ విజిట్ చేసే వెంకయ్య గారికి తెలీక, పాపం రాజ్యసభ సాక్షిగా 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అడిగారు అనుకుంటా...

చేస్తే, కేంద్రం మీద వత్తిడి తెచ్చి, రాష్ట్రానికి సహాయం చెయ్యండి..అంతే కాని మీ భజన కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని తక్కువ చేస్తే, “హిస్టరీ రిపీట్ అవ్వుద్ది”

{youtube}E3E_dnu_9dE|500|250|1{/youtube}

sita ram 15042016

సందుకి ఒక పందిరి...రెండు రోజులు ముందు నుంచి కుర్రాళ్ళ హడావిడి...మండపం కోసం చందాలు...ముందు రోజు నుంచి స్పీకర్ లో "శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి" పాటలు...మన పక్కింటి మావయ్యో, బావో పీటల మీద కూర్చుని చేసే హడావిడి...పానకం, వడపప్పు తాయారు చెయ్యటం కోసం బెల్లం కొట్టటం...కళ్యాణం అయిపోయినాక రోడ్లు మీద వెళ్ళే బస్సులు, లారిలు, బళ్ళు వాళ్ళని ఆపి మరి మన సెంటర్లో తాయారు చేసిన పానకం వడపప్పు పంచటం...మనం పానకం తాగేసి, ఇంటికి తీసుకువేల్లటానికి అమ్మ ఇచ్చే రెండు లీటర్ల thumps-up బాటిల్ నిండా పానకం నింపుకుని ఇంటికి తెసుకువెళ్లి సాయంత్రం దాక తాగటం...అన్నదానం...సాయంత్రం వినోద కార్యక్రమాలు...చివరగా ఊరేగింపు.....ఇది కదా “శ్రీ రామ నవమి” హడావిడి అంటే....

కాని, రాను రాను ఈ సందడే లేదు, ఎక్కడో రామలయాల్లో, లేకపోతె బీసెంట్ రోడ్ లాంటి సెంటర్లో తప్పితే, చూడటానికి ఎక్కడా పందిరి లేదు...కనీసం ఇంట్లో అయినా పానకం, వడపప్పు చేసుకునే తీరిక లేదు...వేసవి కాలంలో వడదెబ్బ కొట్టకుండా ఉండటానికి మన పెద్దలు పానకం తాగమంటారు...అలా సందడి చెయ్యకుండా, ఇంట్లో కూర్చుని దూరదర్శన్లో రాముల వారి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం... మెట్రో కల్చర్‌లో మనం మన సంప్రదాయ సిరులను కోల్పోతున్నాం...మన పిల్లలకి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రపంచం లోనే ఉంచుతున్నాం....ఎప్పటికి మేల్కుంటామో ఏంటో...

cbn birthday 19042016

చంద్రబాబు నాయుడు, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు...అయన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అలాంటిది మరి...66వ ఏట అడుగుపెడుతన్న మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలతో...

ఆయన ఒక సామన్యుడు, ఏ రాజకీయ నేపధ్యం లేనివాడు, తండ్రి ఒక సామాన్య అయుదు ఎకరాలు సాగు చేసుకునే రైతు, తల్లి ఒక కష్ట జీవి...ఆయన మాత్రం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాశిస్తూ, అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు...ఆయనే నారా చంద్రబాబు నాయుడు..

నారావారి పల్లె లాంటి మారు మూల గ్రామంలో పుట్టిన అతి సామాన్యుడు, తిరిగులేని శక్తిగా ఎలా మారారు...గవర్నమెంట్ స్కూల్ లో చుదువుకున్న ఒక సామాన్య కుర్రవాడు, టైమ్స్ మాగజైన్ లో స్పెషల్ స్టొరీ వేసే స్థాయికి ఎలా చేరాడు....క్లింటన్, టోనీ బ్లెర్ లాంటి దేశాధినేతల మనసు ఎలా దోచుకున్నారు....బిల్ గేట్స్ లాంటి కార్పొరేట్ దిగ్గజాల్ని ఎలా ఆకట్టుకున్నారు....

దేశం మొత్తం మీద, సారీ ప్రపంచం మొత్తం మీద 24/7 ప్రజా నాయకుడు అంటే ఆయనే...వ్యక్తిగత జీవితం లేదు, ఒక సరదా లేదు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చెయ్యటం లేదు...66 ఏళ్ళ వయసులో మనవడితో ముచ్చటించలేని స్థితి ఆయనది....ఆయన ఎంజాయ్ చేసేది అయన పనిని, అయన కష్టాన్ని...పొద్దున్న లెగిసిన దెగ్గర నుంచి, పడుకునే దాక, విశ్రాంతి అనేది ఉండదు ఆ మనిషికి....రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం స్వరూపం మొత్తం తెలుసు ఆయనకు...డెబ్బైల్లో రాజకీయాలు చూసారు, ఎనభైల్లో రాజకీయాలు చూసారు, తొంబైల్లో రాజకీయాలు చూసారు, ఇప్పుడు 2016 రాజయకీయలు చూసారు...పాతికేళ్ళకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది...రాజాకీయ అపర చానిక్యుడు అంటారు ఆయనని...అయన చూడని ఎత్తులు లేవు, ఆయనకి ఎదురైన అవరోధాలు లేవు...అన్ని తట్టుకుని ముందుకు సాగరు, సాగుతూనే ఉన్నారు....రాష్ట్ర రాజకీయం కాదు, కేంద్ర రాజకీయ్యాల్లో కుడా ఆయనకి ప్రత్యెక స్థానం ఉంది...

రాజకీయాల్లో పోలిటీషియన్ లే ఉంటారు, కాని ఆయన అడ్మినిస్ట్రేటర్గానే ప్రజలు గుర్తిస్తారు....రాష్ట్రానికి IT పరిచియం చేసిన హై-టెక్ CM ఆయనే, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేత గా, మళ్ళి ఇప్పుడు నవ్యాంధ్ర మొదట ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ఎవరకి లేని అవకాసం ప్రజలు ఆయనకి ఇచ్చారు...

ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రం నాయుడు, దేవినేని రమణ, పరిటాల రవి లాంటి ఎంతో ముఖ్యమైన నాయకలు చనిపోయినా...రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన రాజకీయం, 2012 జగన్ హవా, 2014 రాష్ట్ర విభజన, 2015 లో తెలంగాణాలో కెసిఆర్ వేసిన దెబ్బ....ఇలా అన్ని దెబ్బలు తగిలినా, మళ్ళి లేగుస్తాడు, సరిచేసుకుంటాడు, మళ్ళి మొదలు పెడతాడు..అది ఆయన సైలె... ఎన్ని ఎదురుదెబ్బలు తిన్న, పోరాట పటిమ అస్సలు తగ్గకుండా, అంతే వేగంతో దూసుకు వెళ్తున్న పొలిటికల్ మిస్సైల్ ఆయన...ఆయన నినాదాలతో పార్టి రూపు రేఖలను, ఆయన విధానాలతో రాష్ట్ర అభివ్రుది రూపు రేఖలను మార్చేసిన ఘనుడు ఆయన....సంస్కరణలు అంటే ఏంటో దేశానకి చెప్పి, గవర్నమెంట్ అంటే ఎలా పని చెయ్యాలో చేసి చూపించాడు ఆయన....జన్మభూమి, ప్రజల వద్దకు పాలనా అంటూ, నిద్రపోతున్న ఉద్యోగులను పరుగులు పెట్టించిన నాయకుడు ఆయన...ఇప్పుడు ఏమి లేని నవ్య ఆంధ్రకి పెద్ద దిక్కు ఆయనే...పెట్టుబడిదారులకు అయస్కాంతం ఆయన..ఆయన పడుకోడు, ఎదుటివాళ్ళని పడుకోనివ్వాడు...పని పని పని....అదే ఆయన బలం...ఇంత పనిలో కుడా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు...చక్కటి ఆహరం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా...ఇదే ఆయన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్....క్రమశిక్షణ, కష్టపడటం, నిజాయితీ ఇది ఆయన సక్సెస్ సీక్రెట్....

ఇది ఆయన వ్యక్తిగత జీవన ప్రస్థానం...

  • 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా, నారావారి పల్లెలో తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మన్నమ్మ కు జన్మించారు చంద్రబాబు...డిగ్రీ చదివే రోజుల్లోనే కాలేజి రాజకీయాల్లో అడుగుపెట్టారు. డిగ్రీ కంటే ముందే, కాంగ్రెస్ పార్టీలో చేరారు...ఆచార్య ఎన్జీరంగా, పాతూరి రాజగోపాల్ అయన రాజకీయ గురువులు...
  • 1978 ఎన్నికలలో చంద్రబాబుకి MLA టికెట్ ఇచ్చారు. 28 ఏళ్ళకే, 1980-83 మధ్య మంత్రిగా పనిచేసారు.
  • చంద్రబాబుకి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు..
  • ఆయనకి కష్టం అనేది చిన్ననాటి నుంచే పరిచయం...ఆయన స్కూల్ కి రోజు అయుదు కీ.మీ నడుచుకుంటూ వెళ్ళే వారు...
  • 1980 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేస్వరిలో వివాహం జరిగింది.
  • 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి భాద్యతలు అప్పగించారు.

అధినేతగా పార్టీని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తనదైన స్టైల్ లో ముందుకి తీసుకువేల్తున్నారు..44 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళి పుట్టారేమో...

ఆయన కష్ట జీవి...కష్టం అనేది చాలా మజానిస్తుంది, సక్సెస్ కూడా ఇవ్వలేనంత గొప్ప సంతృప్తిని ఇస్తుంది. కష్టం ఇచ్చిన మజాకి రుచి మరిగిన వాడికి విజయం గురించి పెద్దగా పట్టింపు ఉండదు. విజయమైనా, అపజయమైనా వాడికి కావలసిన సంతృప్తి వాడు ఆల్రెడీ ఆస్వాదించాడు. అదీ శ్రమైక జీవన సౌందర్యం!! అదే చంద్రబాబు నైజం....

హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారు....మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి....

jagan somireddy 08042016

వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి ఎంఎల్ సి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెల్లడం ఖాయమని , అధినేత జైలు కి వెళితే తమ పరిస్థితేమిటనే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ ఈడీ కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని, 11 కేసుల్లో జగన్ పై విచారణ జరుగుతోందని, జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో వైసిపి ఎమ్మెల్యేలు గందరగోళంలో పడిపోయారని అన్నారు.

దీంతో ముందు వారి భవిష్యత్తును చూసుకోవడంలో నిమగ్నమయ్యారని, ఆ కోవలోనే ఈ వలసలు అని, మున్ముందు మరింత మంది వైసిపి ఎంఎల్ఏ లు టీడీపీలోకి చేరనున్నారని అయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు జైల్లోనే ఉంటుంది ? బయట ఉండదు? అనే అనుమానంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం స్పష్టంగా తెలుస్తుందని అందుకే వైసిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని , అయన మూర్ఖపు వైఖరి వల్లే వైసిపి పార్టీ కి ఆ గతి పట్టిందని , రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు , రోజా తప్ప ఆ పార్టీ లో ఎవరు ఉండరని సోమిరెడ్డి ఎద్దేవా చేసారు.