ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని పై క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి, ఇందులో చాలా కీలక అంశాలు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడిన నేపధ్యంతో పాటు, అలాగే ఇతర రాష్ట్రాల్లో, అంటే హైదరాబాద్ లో ఎన్నికలు వంటివి ప్రస్తావించారు. అదే విధంగా రాజస్తాన్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అక్కడ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవటం, అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇది సరైన సమయం కాదని పేర్కొందని, అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా, ఫలితం లేకపోయిందని, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ లో గతంలో రోజుకు 10 వేల క-రో-నా కేసులు నమోదు అయ్యాయని, ఇప్పుడు 700కి పడిపోయిందని, ఈ సందర్భంగా ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పిల్, అందులో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు, తాము ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలతో ఎన్నికల పై సమావేశం నిర్వహించానని అన్నూర్.

nimmagadda 17112020 2

ఈ సమావేశంలో అనేక పక్షాలు తమ అభిప్రాయాలు తెలిపయాని అన్నారు. దీంతో పార్టీ ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహనీ, ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి వచ్చి, తమ అభిప్రాయం తెలిపారని, అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని పేర్కొన్నారని, సెకండ్ వేవ్ వస్తుందని కేంద్రం ప్రభుత్వం, ఇతర సంస్థలు చెప్తున్న నేపధ్యంలో, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని చెప్పారని వివరించారు. అయితే ఇదే సందర్భంలో రాజస్తాన్ లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు నిర్వహించటం అవసరం అని అన్నారు. ఇక అలాగే రాజ్యంగ పరమైన ఆబ్లిగేషన్ తో పాటుగా, కేంద్రం ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు పంచాయతీలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని, వీటి అన్నిటి నేపధ్యంలో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమాయత్తం అవుతున్నాం అని అన్నారు. తాము ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అంచనా వేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని, నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును, అదే విధంగా హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులకు దురుద్దేశాలు ఆపదిస్తూ, కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా, వారి పరువు తీస్తూ పెట్టిన పోస్టింగ్ లు పై సిబిఐ ఈ రోజు కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో సుమోటోగా కేసు నమోదు చేసి, పరిశీలనకు తీసుకుని, వెంటనే కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్టార్ జనరల్ ని ఆదేశించింది. రిజిస్టార్ జెనెరల్, హైకోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం కొంత మంది కేసులు నమోదు చేసి, విచారణ చేసినట్టు కోర్టుకు తెలిపింది. అయితే ఈ సిఐడి విచారణ పై కూడా హైకోర్టులో అనేక సార్లు వాదనలు కూడా జరిగాయి. హైకోర్టు కూడా సిఐడి విచారణ పియా అభ్యంతరం తెలిపింది. పోస్టింగ్ లు పెట్టిన వాళ్ళు విదేశాల్లో ఉండటం, అదే విధంగా వీరిని అదుపులోకి తీసుకోవటం సాధ్యం కావటం లేదని, సిఐడి పేర్కొంది. అయితే సిఐడి దర్యాప్తు పురోగతికి సంబంధించి హైకోర్టు స్పందిస్తూ, మీ దగ్గర యంత్రాంగం లేకపోతే, దీని పై ఆధునిక సాంకేతికతో పాటుగా, విదేశాల్లో కూడా దర్యాప్తు చేయగలిగే అవకాసం ఉన్న సిబిఐకి, ఈ కేసు దర్యాప్తుకి ఇస్తే మీకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది.

cbi 16112020 2

ఈ సందర్భంగా అటు ప్రభుత్వ న్యాయవాది, అదే విధంగా హైకోర్టు తరుపు న్యాయవాదుల వాదన విన్న హైకోర్టు, కీలక ఆదేశాలు జారీ చేస్తూ, దీని పై వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా, వెంటనే ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సిబిఐ ఈ రోజు కేసుని నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం గతంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను సిబిఐ పరిగణలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసారు. ఐపిసిలోని 153A, 504, 505 (2), 506, 2020 IT Act section 67 కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం దురుద్దేశాలు ఆపాదించటం, కావాలని రెఛ్గొగొట్టటం, దురుద్దేశాలు ఆపాదించటంతో పాటుగా, నేర పూరిత దురుద్దేశం కింద, మొత్తం 17 మంది పై , ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. దీని పై వెంటనే దర్యాప్తు చేస్తున్నట్టు సిబిఐ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు రిజిస్టర్ చేసినట్టు స్పష్టంగా పెర్కున్నారు.

రాజమహేంద్రవరం వైసీపీలో మరోసారి విబేధాలు రచ్చకు ఎక్కాయి. గత రెండు రోజుల నుంచి, మూడు నాలుగు చోట్ల వైసీపీలోని రెండు వర్గాలు విబేధించి రచ్చకు ఎక్కితే, ఇప్పుడు ఏకంగా ఎంపీ, మాజీ ఎమ్మల్యే మధ్య విబేధాలు హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను లక్ష్యంగా చేసుకుని, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏకంగా హోంమంత్రికి లేఖ రాయటం వైసీపీలో కలకలం రేపుతుంది. వాస్తవానికి ఇద్దరూ కలిసి మొన్నటిదాకా పాదయాత్రలో కూడా పాల్గున్నారు. తోట త్రిమూర్తులు పార్టీలో చేరే సమయంలో, జగన్ కు అటు పక్కన తోట త్రిమూర్తులు ఉంటే, ఇటు పక్క పిల్లి సుబాష్ చంద్ర బోస్ ఉండి, ఇద్దరూ కలిసి పని చేస్తాం అనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు త్రిమూర్తులను లక్ష్యంగా చేసుకుని, పిల్లి బోస్ లేఖ రాయటం చర్చనీయంసం అయ్యింది. 1996లో దళితుల శిరోమండనం కేసులో, తోట త్రిమూర్తుల పై ఏ1గా కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి గడిచిన 23 ఏళ్ళుగా తన పలుకుబడి ఉపయోగించుకుని, తోట త్రిమూర్తులు ఈ కేసుని అదే పనిగా వాయిదా వేయించుకుంటున్నారని, ముఖ్యంగా ఇతని పలుకుబడి కారణంగానే ఇతని కేసు వాయిదా పడుతూ వస్తుందని, ఈ నేపధ్యంలోనే నిందితులకు న్యాయం జరగలేదని, అందుకే తక్షణం కేసుని తేల్చాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలో తెలిపారు.

bose 15112020 2

అంతే కాకుండా తోట త్రిమూర్తులు ఏ1గా ఉన్న కేసులో, ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మార్చేందుకు తోట త్రిమూర్తులు ప్రయత్నాలు చేస్తున్నారని, అది పూర్తిగా తప్పు అని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఎట్టి పరిస్థితిలోనూ మార్చటానికి వీలు లేదని, ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కొనసాగించి ఈ కేసుని తేల్చాలని బోసు లేఖ రాయటం, మరోసారి వైసీపీలో ఉన్న వర్గ పోరు బయట పడిందని చెప్పాలి. వాస్తవానికి 1996లో జరిగిన ఈ ఘటన గురించి, అప్పట్లోనే తోట త్రిమూర్తులు 86 రోజులు, రాజమండ్రి సెంట్రల్ జైలు లో కూడా ఉన్నారు. ఆ తరువాత రాష్ట్ర హైకోర్టులో కేసు స్టే ఉండటంతో, అప్పటి నుంచి బయటే ఉన్నారు. అయితే గడిచిన 23 ఏళ్ళుగా, కేసు విచారణకు వస్తున్న సమయంలో త్రిమూర్తులు తెలివిగా తప్పించుకుంటున్నారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కేసుని వాయిదా వేసుకున్నారని, బోసు హోంమంత్రికి రాసిన లేఖలో ఈ విషయం స్పష్టం అవ్తుంది. మొన్నటి దాకా బోసు, త్రిమూర్తులు వేరే పార్టీల్లో ఉండే వారు. అయితే త్రిమూర్తులు వైసీపీలో చేరటంతో, ఇరు వర్గాల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ లేఖతో వర్గ విబేధాలు బహిరంగం అయ్యాయి.

ఈ రోజు అందరి చూపు సుప్రీం కోర్టు వైపే. జగన మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, అలాగే ఆయన పై కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలి అంటూ వేసిన పిటీషన్ లు ఈ రోజు విచారణకు వచ్చాయి. అయితే ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలు బట్టి, జగన్ భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించారు. రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు అయితే, జగన్ క్షమాపణ చెప్పకపోతే, ఆయన రాజీనామా చేసే అవకాసం ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ నేపధ్యంలోనే, ఏమి జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ కేసు జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇదే ధర్మాసనంలో జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్ కూడా ఉన్నారు. ముగ్గురు జడ్జిల ముందు కేసు విచారణకు వచ్చింది. అందరూ ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జడ్జి పిటీషనర్ తరుపున న్యాయవాదిని తమ వాదనలు వినిపించమంటారని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుని. ఈ కేసు వాదనలు వింటున్న జస్టిస్ లలిత్ ఈ పిటీషన్ ను తన బెంచ్ ముందు వద్దు అంటూ తిరస్కరించారు. తాను లయార్ గా ఉన్న సమయంలో, కేసులో ఉన్న వ్యక్తుల తరపున తాను వాదనలు వినిపించానని, నైతికంగా ఇది తాను విచారణ చేయలేను అని, ఈ కేసుని తొందర్లోనే మరో జస్టిస్ ముందుకు, ఈ పిటీషన్ వచ్చేలా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఆదేశాలు ఇస్తారని చెప్పారు.

sc 16112020 2

దీంతో ఆసక్తిగా ఎదురు చుసిన వారికి ఇబ్బంది ఎదురు అయ్యింది. తొందర్లోనే ఈ పిటీషన్ వేరే బెంచ్ ముందుకు వచ్చే అవకాసం ఉంది. అయితే ఈ కేసు విషయానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి కొంత మంది హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిల పియా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ లేఖ రాయటం తప్పు కాదు కానీ, ఆ లేఖను మీడియా ముందుకు వదిలారు. ఇందులో కొంత మంది జడ్జిలకు చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయి అంటూ కంటెంట్ ఉంది. ఇవన్నీ బయటకు వదిలారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి, ఈ మీడియా సమావేశం పెట్టారు. అయితే దీని పై జగన్ మోహన్ రెడ్డి మీద, అలాగే అజయ్ కల్లం మీద, మూడు పిటీషన్ లు, సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. ఒకటి జగన్ మోహన్ రెడ్డిని సియం పదవి నుంచి తప్పించాలని, మరి కొన్ని కోర్టు ధిక్కరణ పిటీషన్లు. పిటీషన్లలో జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తెలుపుతూ, ఆయన పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని, అయితే అందరి ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసులు ఏడాది లోపు విచారణ చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ఆదేశాలు ఇవ్వగానే, ఇలా చేస్తున్నారు అంటూ పిటీషన్ లో తెలిపారు. అయితే దీని పై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read