జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, విజయసాయి రెడ్డి ఫోకస్ అంతా విశాఖపట్నం మీదే ఉంది. విశాఖని రాజధానిగా చెయ్యాలని నిర్ణయం తీసుకోవటం, కీలకమైన విశాఖ విజయసాయికి అప్పచెప్పటం, విశాఖలో జరిగే ప్రతి విషయం విజయసాయికి చెప్పే చేయాలనే ఆదేశాలు, ప్రతి ప్రజాప్రతినిధి కూడా విజయసాయికి చెప్పి పనులు చేయటం, ఇక్కడ జరుగుతుందా అంతా అందరికీ తెలిసిందే. విజయసాయి రెడ్డి అంత పవర్ఫుల్ గా అయ్యారు. విజయసాయి రెడ్డికి ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయలేరు. ఎంత ఇబ్బంది ఉన్నా, మౌనంగా భరించాల్సిందే కానీ, ఆయనకు ఎదురు చెప్పటం కానీ, విజయసాయి రెడ్డి పై పైన ఎవరికైనా ఫిర్యాదు చేయటానికి లేదు. అలాంటి పవర్ఫుల్ విజయసాయి రెడ్డి పై, వైసిపీలో మొదటి సారిగా బాహిరంగంగా విమర్శలు వచ్చాయి. ఆయన ముందే ధిక్కార స్వరం వినిపించారు. నిన్న విశాఖలో డీడీఆర్‌సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి. మేమేమీ అవినీతిపరులం కాదు, నిజాయతీ పరులమే అంటూ అందరి ముందు విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విశాఖలో ఒక మాజీ సైనికుడికి చెందిన భుముని ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటుగా కొంత మంది కొనుగోలు చేసారు. అయితే, దీనికి సంబంధించి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగి, చివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాలేదు. దీని పై చర్చ జరుగుతూ ఉండగానే, నిన్న సమావేశంలో విజయసాయి రెడ్డి , ఇన్ డైరెక్ట్ గా ఈ విషయం పై స్పందిస్తూ, విశాఖలో జరుగుతున్న ఆక్రమణల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు అంటూ తన ప్రసంగం మొత్తం రాజకీయ నాయకులు అంటూ, అనేక సార్లు కార్నర్ చేసే ప్రయత్నం చేసారు.

vsreddy 11112020 2

అయితే ఈ సమావేశంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ధర్మశ్రీ ఘాటుగా విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మాటిమాటికి రాజకీయ నాయకులు అంటున్నారు, మేము నిజాయితీ పరులమే, ప్రజల కోసం సేవ చేస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేసారు. అంతా రూల్స్ ప్రకారమే మేము ఆ భూములు కొనుగోలు చేసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడిగామని, అది రూల్స్ కు విరుద్ధం అయితే, దాన్ని ఇవ్వకండి, అంతే తప్ప మేమేదో చేసామని నిందించటం సరికాదు అని అన్నారు. భూములు దోచేసే దొంగలు ఉంటే వారి పై చర్యలు తీసుకోండి కానీ, అందరినీ దొంగలు అనటం సరి కదాని అన్నారు. మేము ఏ పని చెప్పినా అధికారులు సహకరించటం లేదని, ఏమి జరుగుతుందో అని వ్యాఖ్యానించారు. ఇక మరో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ నాడు-నేడులో అవినీతి తారా స్థాయిలో ఉందని చెప్పటం, మరో విశేషం. ఇక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఈ మీటింగ్ కి రాకపోవటం కూడా చర్చనీయంసం అయ్యింది. సింహాచలం దేవస్థానం భూముల కమిటీలో ఎంపీ పేరు లేకపోవటం వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారనే ప్రచారంలో, ఇప్పుడు ఎంపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తానికి విశాఖ వైసీపీలో , విజయసాయి రెడ్డి పై ఉన్న కోపం, ఇలా బయట పడింది ఏమో.

దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలకు రెడీ అవుతున్నారు. దీపావళి అంటేనే పిల్లల పండుగ. టపాసులు కాలుస్తూ, పండుగ చేసుకుంటారు. దీపాల పండుగగా చేసుకోవాలని, కొంత మంది ప్రతి ఏడు ఉద్యమాలు చేస్తున్నా, దీపావళి అంటేనే టపాసులు అని, వివిధ సందర్భాల్లో, న్యూ ఇయర్ వేడుకల్లో, రాజకీయ పార్టీల మీటింగుల్లో టపాసులు కాలిస్తే లేనిది, ఇప్పుడే వచ్చిందా అంటూ, హిందూ సంస్థలు కౌంటర్ ఇస్తూ వచ్చేవి. అయితే ఈ సారి మాత్రం క-రో-నా వైరస్ ఉండటంతో, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, దీపావళి సంబరాల పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీని పై నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీపావళి సంబరాల పై పలు కీలక సూచనలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మూడు రోజుల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీపావళి పండుగ రోజున, రెండు గంటల పాటు దీపావళి సంబరాలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే, ఈ రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే టపాసులు అమ్మకాల పై కూడా ఆంక్షలు వధించింది. కేవలం గ్రీన్ క్రాకెర్స్ మాత్రమే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక టపాసులు అమ్మే షాపుల్లో, శానిటైజర్ ను వాడవద్దు అని కూడా సూచనలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రాజధాని అమరావతిని, ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చుపెట్టి, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఉన్న రాజధానిని, మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం తీసుకుని దగ్గరి దగ్గర ఏడాది అవుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తాను అనుకున్నది చేయలేక పోతున్నారు. ఒక పక్క అమరావతి మహిళలు, రైతుల పోరాటం ఒక వైపు అయితే, మరో పక్క న్యాయపోరాటంలో, వైసీపీకి చిక్కులు తప్పటం లేదు. కొన్ని పిటీషన్లలో అయితే, ఏమని సమాధానం చెప్పాలో తెలియక తిప్పలు పడుతూ, వాయిదాలు కోరుతున్నారు. ఇక విషయానికి వస్తే, గతంలో చంద్రబాబు హయాంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ అనేది చాలా చిన్నదిగా ఉండటంతో, ఎయిర్ పోర్ట్ విస్తరణ బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా కూడా మార్చేసారు. అయితే మరింత భూమి కావాల్సి రావటంతో, గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టు పక్కల భూములు కోసం ప్రయత్నాలు చేసారు. అక్కడ ప్రజలు ముందుగా ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ చాలా విలువైన భూమి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం, వినూత్నంగా, ఇక్కడ భూములు ఇస్తే, అమరావతి రాజధానిలో భూములు ఇస్తాం అంటూ, ఒప్పందం చేసుకోవటంతో, రైతులు ముందుకు వచ్చారు. మనకంటూ అమరావతిలో భూమి ఉంటుందని ఆశ పడి, ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వీరిలో సినీ నిర్మాత అశ్వినీదత్, అలాగే ప్రముఖ హీరో కృష్ణంరాజు కూడా తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు.

aswinidutt 10112020 2

అయితే ఇప్పుడు అమరావతిని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్వీర్యం చేయటంతో, రేట్లు పడిపోయాయి. అందుకే ఇప్పుడు అశ్వినీదత్ కోర్టుకు వెళ్లారు. తాను 39 ఎకరాలు ఎయిర్ పోర్ట్ కోసం ఇచ్చానని, అగ్రిమెంట్ ప్రకారం అమరావతిలో భూములు ఇస్తాం అన్నారని, అయితే ఇప్పుడు అక్కడ రాజధాని వెళ్ళిపోతుంది కాబట్టి, తమకు పరిహారం ఇప్పించాలని, కోర్టులో కేసు వేసారు. అయితే గతంలో ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయటానికి సమయం ఇచ్చింది కోర్టు. నిన్న ఈ కేసు విచారణకు రాగా, తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అగ్రిమెంట్ కు లోబడి ఉండాలి అంటూ, కోర్టు ఈ పిటీషన్ ని నవంబర్ 17కు వాయిదా వేసింది. అయితే అగ్రిమెంట్ పక్కాగా ఉండటంతో, ప్రభుత్వం కౌంటర్ ఇవ్వటానికి ఇబ్బంది పడుతుందేమో అని విశ్లేషకులు అభిప్రయపడుతున్నారు. పరిహారం ఇవ్వాల్సి వస్తే భారీగా ఇవ్వాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు అమరావతి రైతులు ఇక్కడ నుంచి అమరావతి తరలించవద్దు అంటూ న్యాయ పోరాటం చేస్తున్నారని, తమ అగ్రిమెంట్ ప్రకారం పరిహారం కావాలని వారు కూడా కోరితే, 33 వేల ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఇవన్నీ తెలిసే ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేస్తుందా ? ప్రభుత్వం ఏమని వాదనలు వినిపిస్తుందో చూడాలి.

నంద్యాలలో జరిగిన ఘటన పై ఇప్పటికే నిరసనలు తెలుపుతున్న క్రమంలో, ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం మహిళను వేధిస్తున్న తీరుతో అందరూ షాక్ కు గురయ్యారు. ఆమె కడప జిల్లా రాయచోటిలో ఒక అంగన్వాడీ వర్కర్. భర్త లేరు, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఉద్యోగం తీసేవేసి అక్రమ కేసులు పెడుతూ ఉండటంతో, ఆమె న్యాయ పోరాటానికి దిగింది. ఈమె నా ఉద్యోగం తీసేసి, వైసిపీ ఎమ్మెల్యేతో నన్ను విధించి, వైసీపీ కార్యకర్తలు నా ఉద్యోగం తీసుకుపోతున్నారని, ఆమె బాధను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేసారు. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాంట్లో, ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నారు. అయితే ఆమె ఎవరినీ విమర్శించలేదు. నా కష్టాన్ని ఆదుకోండి అంటూ, అభ్యర్ధిస్తూ ఒక వీడియో పెట్టారు. దాని మీద రాయచోటి పోలీసులు, సెక్షన్ 500, 501, 120 (B) & 506 అనే కేసులు ఆమె పైన, మరో ఇద్దరి పైన కేసులు పెట్టారు. దీని పై ఆమె హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఈ విషయం పై, స్టే విధించింది. ఈ సెక్షన్ల కింద, పోలీసులకు కేసు పెట్టే హక్కు లేదని ఆర్డర్ లో తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన తరువాత పూర్తి వివరాలతో ఆమె మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తనకు జరిగిన అన్యాయం పై, జగన్ మోహన్ రెడ్డి కలుగు చేసుకుని ఆదుకోవాలని కోరారు. తన పై పెట్టిన అక్రమ కేసులు విషయంలో రక్షించాలని వేడుకున్నారు.

rayachoti 10112020 2

ఇక మరో పక్క, ఈ వీడియోని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసూర్. సీఎం సొంతజిల్లాలో వైసీపీ నేతలు ముస్లిం మహిళని వేధిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో రాక్షసరాజ్యం సాగుతోందని స్పష్టమవుతోందని అన్నారు. రాయచోటిలో అంగన్‍వాడీ వర్కర్‍ని తీసేసి తమవాళ్లని నియమించుకునేందుకు వైసీపీ రౌడీలు ఏకంగా అంగన్ వాడీ స్కూల్‍నే కాల్చేశారని, అంగన్‍వాడీ ఉద్యోగమే ఆధారంగా బతుకుతున్న భర్తలేని, నలుగురు పిల్లలున్న ముస్లిం మహిళని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం తొలగించడంతో పాటు మహిళపైనే తప్పుడు కేసులు పెట్టారని నలుగురు పిల్లలతో ఒంటరి ముస్లిం మహిళని నడిరోడ్డున పడేయడమేనా.. మహిళలకు జగన్ ఇచ్చే భరోసా?అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అయితే ఈ విషయం పై, హైకోర్టు స్టే విధించటంతో, ప్రస్తుతానికి ఈ కేసు పై ఎలాంటి ఆక్టివిటీ లేదు కానీ, ఆమె ఉద్యోగం పై మాత్రం ప్రభావం చూపే అవకాసం ఉంది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read