ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరుపై గడిచిన కొద్ది కాలంగా విమర్శలు గుప్పిస్తోంది. అధికార పార్టీకి అండగా నిలుస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. తాము ఇచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన నేతలు ఇస్తున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టింగులపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు, పోలీసులు బనాయించిన కేసులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొందరు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి.

dgp 23102019 2

మొత్తం పోలీసు వ్యవస్థనే కించపరుస్తున్నారంటూ పోలీసు అధికారుల సంఘం చంద్రబాబుపై ధ్వజమెత్తింది. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, కేవలం కొందరు పోలీ సు అధికారుల తీరును మాత్రమే తమ అధినేత చంద్రబాబు తప్పుపట్టారని దీనినే మొత్తం వ్యవస్థకు అపాదించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మహ్మద్ ముస్తఫా, విడదల రజనీ గుంటూరులోని అరండల్‌పేట పోలీసు స్టేషన్లో పోలీసు వ్యవస్థను కించపరుస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా ముదిరింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీ పేరు ప్రస్తావించకుండా ఇదంతా ఆ పార్టీ మీడియా షో అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చంద్రబాబు రాసిన లేఖలపై స్పందిస్తూ తనకు నేరుగా లేఖలు అందించకుండా తొలుత మీడియాకు విడుదల చేసి ఆ తర్వాత పార్టీ నేతలతో పంపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

dgp 23102019 3

ఇవన్ని రాజకీయ కోణంలో చేస్తున్న ఆరోపణలేనని కొట్టిపారేశారు. ఎటువంటి పక్షపాతం లేకుండా తనకు అందిన ప్రతి ఫిర్యాదుపై స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోమవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డీజీపీ సవాంగ్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో పాటు డీజీపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు. ఒకవైపు అధికార పార్టీ నేతలు, శ్రేణుల దాడుల్లో తమ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయాలపాలవుతుంటే మీడియా షో అంటారా..? అంటూ విరుచుకుపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనపై 26 ఎంక్వెయిరీలు నిర్వహించారని అయినప్పటికి ఏమి సాధించలేకపోయారన్న విషయాన్ని గుర్తెర గాలన్నారు. అధికారం శాశ్వతం కాదని పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై డీజీపీతో పాటు పోలీసు అధికారుల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అసహనం తారా స్థాయిలో ఉంది. ప్రభుత్వం పై చిన్న విమర్శ వచ్చినా తట్టుకోలేక పోతున్నారు. ఇటు పత్రికలు, ఛానెల్స్ అయినా, ఇటు సోషల్ మీడియాలో సామాన్యుడి వాయిస్ అయినా. ఎక్కడ విమర్శ వస్తే అక్కడ, వారి పై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, తమకు వ్యతిరేకంగా రాసిన వారి పై కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్నారు. ఇక మీడియా విషయానికి వస్తే, తమకు అనుకూలంగా కధనాలు ఇవ్వకుండా, వ్యతిరేకంగా కధనాలు ఇస్తున్నారని, ఏబీఎన్, టీవీ5 ఛానెల్స్ ను, రాష్ట్రంలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవి అధికారిక ఉత్తర్వులు కావు. అనాధికారిక ఆదేశాలతో, ఎంఎస్‌వోలను బెదిరించి, ఈ రెండు ఛానెల్స్ ఆపెసారనే వార్తలు వచ్చాయి. ఎంఎస్‌వోలు మాత్రమే కాదు, చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపే ఏపి ఫైబర్ నెట్ లో కూడా, ఈ ఛానెల్స్ ఆపేశారు.

tv 23102019 2

అయితే ఈ రెండు ఛానెల్స్ టెలికాం రెగ్యులేటరీ బోర్డు అయిన, టీడీశాట్‌ వద్దకు వెళ్లి, ఏపి ప్రభుత్వం పై కంప్లెయింట్ చేసాయి. అయితే దీని పై గత నెల రోజులుగా విచారణ జరుగుతుంది. ఏపి ఫైబర్ నెట్ పై, టీడీశాట్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోజుకి రెండు లక్షల ఫైన్ కట్టమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఏపి ఫైబర్ నెట్ మాత్రం, టీడీశాట్‌ కి చెప్పిన విషయం ఏమిటి అంటే, సాంకేతిక కారణాల వల్ల, ఆ ఛానెల్స్ ఇవ్వలేక పోతున్నాం అని. అయితే టీడీశాట్‌, వీరి మాటలు విశ్వసించలేదు. 22 లోపు ప్రసారాలు ఇవ్వకపోతే, మీ ఆఫీస్ కు వచ్చి, ఆ సాంకేతిక సమస్య ఏమిటో చూస్తామని చెప్పింది. దీంతో ఏపి ఫైబర్ నెట్, హడావిడిగా, నిన్న 22న, ఏపి ఫైబర్ నెట్ లో, ఏబీఎన్, టీవీ5 ప్రసారం చేసింది. అయితే, ఈ విషయం ట్రిబ్యునల్ కు చెప్తూ, మేము ప్రసారాలు ప్రారంభించామని, జరిమానా విధంచవద్దు, మేము ఆర్ధిక కష్టాల్లో ఉన్నాం అని టీడీశాట్‌ కు చెప్పింది.

tv 23102019 3

దీని పై ఘాటుగా స్పందించింది టీడీశాట్‌. మా, ఆదేశాల అమలులో జాప్యం చేసినందున జరిమానా చెల్లించి తీరాల్సిందేనని, దీని నుంచి తప్పించుకోలేరని ఏపి ఫైబర్ నెట్ కు స్పష్టం చేశారు. మీ నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని ఆగహ్రం వ్యక్తం చేసింది. జరిమానా ఎందుకు విధంచకూడదో చెప్పాలని, ఏపి ఫైబర్ నెట్ ను కోరుతూ, నవంబర్ 14కి వాయిదా వేసింది. అయితే ఎంఎస్‌వోల విషయంలో కూడా టీడీశాట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 18న, 24న ఆదేశించినా, నిన్నటి వరకు ఛానెల్స్ ఇవ్వకపోవటంతో, ఎంఎస్‌వోలకు ట్రైబ్యునల్‌ జరిమానా విధించింది. రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు పాటించినందుకు, మాకు జరిమానా పడింది అని, ప్రభుత్వం పెద్దలేమో, ఆ చానల్స్ వస్తే, కేబుల్ లేకుండా చేస్తామని బెదిరించారని, ఇప్పుడు ట్రిబ్యునల్ మాకు ఫైన్ వేసిందని, మధ్యలో మేము బుక్ అయ్యాం అని వారు బాధ పడుతున్నారు.

రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఈ మధ్య కాలంలో, రెండూ ఏకం అయిపోయి, రాజకీయ వ్యవస్థ పతనం వైపు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే, కొంత మంది నేతలు, రెండూ వేరు వేరుగా చూస్తూ, రాజకీయ వేడి తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు పై ఎంత వైరం చూపిస్తారో, ఎలాంటి వ్యక్తిత్వ హననం చేస్తారో, చూస్తూనే ఉంటాం. అయితే చంద్రబాబు సియంగా ఉండగా, గత మూడేళ్ళ నుంచి, జగన్ మొహన్ రెడ్డి పుట్టిన రోజు నాడు, చంద్రబాబు ఆయన్ను ట్విట్టర్ ద్వరా విష్ చేసే వారు. ఒక మంచి వాతావరణం వైపు అడుగులు వేసేవారు. అలాగే బీజేపీ పార్టీతో అంత పోరాటం చేసినా, ప్రధాని మోడీకి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసావారు. అయితే ఇప్పుడు అమిత్ షా హోం మంత్రి కావటంతో, ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావటంతో, చంద్రబాబు ఆయనకు ట్విట్టర్ ద్వారా విషెస్ పంపించారు.

shah 22102019 21

"Happy Birthday @AmitShah Ji Wishing you a memorable day and a wonderful year ahead with good health and happiness. " అంటూ చంద్రబాబు ఈ రోజు ట్వీట్ చేసారు. అయితే, చంద్రబాబు చేసిన ట్వీట్ కి, అమిత్ షా కూడా రిప్లై ఇచ్చారు. "Thank you for your wishes. @ncbn" అంటూ అమిత్ షా స్పందించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంటూ, బీజేపీ పై, చంద్రబాబు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అటు బీజేపీ కూడా, తమకు ఎదురు లేదు అనుకుంటున్న టైంలో, చంద్రబాబు ఎదురు తిరిగారు కాబట్టి, ఆయన్ను రాజకీయంగా దెబ్బ తియ్యటం కోసం, చంద్రబాబు ఓటమికి అన్ని విధాలుగా సహకరించారు.

shah 22102019 3

అయితే, రాజకీయం ఎలా ఉన్నా, అది వ్యక్తిగత వైరం కాదని, మొన్న జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎలా చెప్పారో, ఈ రోజు అమిత్ షా కి కూడా అలాగే విషెస్ చెప్పారని, టిడిపి అంటుంది. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయం పై పోరాడామని, పోరాడుతూనే ఉంటామని, అలాగే జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడతామని టిడిపి అంటుంది. తమ్ముడే తమ్ముడే, పేకాట పేకాటే అంటుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం పై ఒత్తిడి తెస్తూనే ఉంటామని టిడిపి అంటుంది. అయితే, అమిత్ షా, చంద్రబాబుకి రిప్లై ఇవ్వటం పై మాత్రం, వైసిపీ గమనిస్తుంది. ఒక పక్క సియం హోదాలో ఉన్న జగన్ కు, ఢిల్లీ పర్యటన సాఫీగా సాగాకపోవటంతో, చిరాకులో ఉన్న వైసీపీకి, ఇది మరింత చికాకు తెప్పించే అంశం.

రాజకీయాల్లో ఒక వ్యక్తీ క్యారక్టర్ ను చంపేస్తే, మానం, అభిమానం ఉన్న వ్యక్తులు, అవి ఎదుర్కోలేక, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే వికృత క్రీడ మన రాష్ట్రంలో నడుస్తుంది. ఇలాగే కోడెల లాంటి నాయకుడుని, టిడిపి కోల్పోయింది. ఇప్పుడు ఇదే రకమైన ప్రచారం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై చేస్తున్నారు. లోకేష్ పై అనేక అవినీతి ఆరోపణలు చేసి, ఏది నిరూపించలేక, వైసిపీ ఎన్ని పాట్లు పడుతుందో చూసాం. అందుకే ఆయన ఏదైనా స్పీచ్ ఇస్తే మాటల్లో జరిగిన తప్పులు ఎత్తి చూపుతూ, సంతోష పడుతూ ఉంటారు. అవినీతి ఎలాగూ నిరూపించలేం అని తెలుసుకున్న వైసీపీ, ఇప్పుడు లోకేష్ చిరుతిండి ఖర్చు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. లోకేష్ మంత్రి అయిన తరువాత, కేవలం వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోని ఒక రెస్టారెంట్ లో, 25 లక్షల ఖర్చు చేసే, చిరుతిండి తిన్నారు అంటూ వైసీపీ తన సొంత మీడియాలో వేసుకోవటం, అది పట్టుకుని, మరి కొన్ని అనుకూల మీడియాలో కధనాలు రావటం, వైసిపీ దాన్ని ప్రచారం చెయ్యటం జరుగుతుంది.

lokesh 23102019 2

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో క్లారిటీ ఇచ్చింది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ రెస్టారంట్ లో, ప్రోటోకాల్ ప్రకారం, సియం, కేంద్ర/రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అతిధులు, ప్రతిపక్ష నేత, ఎంపీలు, ఇలా అనేక మందికి ప్రోటోకాల్ ప్రకారం, ఆ ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ లో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్యం ఇస్తారని, అందరి ఖర్చు, లోకేష్ ఖర్చు గా చూపిస్తున్నారని టిడిపి అంటుంది. అసలు ఇంకో విషయం ఏమిటి అంటే, వైసిపీ ప్రచారం చేస్తున్న ఆ తేదీలిలో, అసలు లోకేష్ వైజాగ్ లోనే లేరని, ఆయన అమరావతిలో, హైదరబాద్ లో, అమెరికాలో , ఢిల్లీలో ఇలా వివిధ చోట్ల ఉన్నారని, ఆధారాలు చూపిస్తి, ఈ వికృత ప్రచారాన్ని టిడిపి ఖండించింది. అసలు లోకేష్ వైజాగ్ లోనే లేకపోతే, ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో, పూర్తీ ఆధారాలతో, కేసు వేయటానికి, లోకేష్ సిద్ధమయ్యారు.

lokesh 23102019 3

ఇది టిడిపి విడుదల చేసిన వివరాలు...15-08-2017 - సాక్షి రాసింది: 83,816 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, సుజనా చౌదరి కూతురు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు; 31-10-2017 - సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో; 31-10-2017 - సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో; 18-11-2017 - సాక్షి రాసింది: 31,322 రూపాయల బిల్ చేసారని,లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉన్నారు: ఈ ఒక్క రోజు మాత్రమే విశాఖపట్నంలో, ఆగ్రీ టెక్ సమ్మిట్ లో; 20-11-2017 - సాక్షి రాసింది: 59,818 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీం పై ప్రసంగం; 05-12-2017 - సాక్షి రాసింది: 21,098 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ; 05-12-2017 - సాక్షి రాసింది: 10,466 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ; 31-12-2017 - సాక్షి రాసింది: 45,234 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో; 04-02-2018 - సాక్షి రాసింది: 67,096 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: అమెరికాలోని న్యూజర్సీలో, ఎన్ఆర్ఐ టిడిపి శ్రేణుల మధ్య మాట్లాడుతూ; 28-02-2018 - సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ;

lokesh 23102019 4

28-02-2018 - సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ; 30-04-2018 - సాక్షి రాసింది: 47,040 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం; 31-05-2018 - సాక్షి రాసింది: 48,878 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, నిరుద్యోగ బృతి ప్రకటన; 30-06-2018 - సాక్షి రాసింది: 44,122 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: కడపలో జరిగిన, సియం రమేష్ ఉక్కు దీక్షలో ప్రసంగం; 31-07-2018 - సాక్షి రాసింది: 56,742 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, stanford పూర్వ విద్యార్ధుల కలియికలో ; 26-08-2018 - సాక్షి రాసింది: 74,392 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ నివాసంలో.; 30-09-2018 - సాక్షి రాసింది: 63,452 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, యువనేస్తం పై రివ్యూ; 30-10-2018 - సాక్షి రాసింది: 79,170 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం; 31-01-2019 - సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ ; 31-01-2019 - సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ ; 20-03-2019 - సాక్షి రాసింది: 3,928 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: తాడేపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో; 31-03-2019 - సాక్షి రాసింది: 7,246 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో; 30-04-2019 - సాక్షి రాసింది: 3,108 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఎన్నికలు అయిపోయాయి, హైదరాబాద్ నివాసంలో; 31-05-2019 - సాక్షి రాసింది: 10,396 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

Advertisements

Latest Articles

Most Read