కరోనా మహమ్మారిని ప్రజలంతా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, వైరస్ ప్రభావం, దాని వ్యాప్తిపై వారిలో సీరియస్ నెస్ లేదని, అందుకు కారణం ముఖ్యమంత్రి వ్యాఖ్యలేనని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైనట్లు కనిపించడంలేదని, వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం ఇప్పటికీ తేలిగ్గానే తీసుకుంటోందన్నారు. గతంలో బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ తో కరోనా నయమవుతుందని, ఇప్పుడేమో కరోనా కొరియాలో పుట్టిందని ముఖ్యమంత్రి మాట్లాడటం చూసి, ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల, రాష్ట్రప్రజలెవరూ కరోనాను ప్రాణాంతకమైనదిగా భావించడంలేదని వర్ల తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతోపాటు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుకూడా ప్రజల్లో సీరియస్ నెస్ కలిగించడంలేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, రాష్ట్ర ప్రజలను అప్రమత్తంచేసి, వైరస్ ను ఎదుర్కొనేలా వారిని సన్నద్ధం చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రామయ్య దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కరోనాను సీరియస్ గా తీసుకుంటే, ప్రజలు కూడా సీరియస్ గానే తీసుకుంటార న్నారు.

కరోనా మహమ్మారి ధాటికి దేశాలే తల్లడిల్లిపోతూ, దాన్నెలా కట్టడిచేయాలా అంటూ తలకిందలవుతుంటే, రాష్ట్రముఖ్యమంత్రిలో మాత్రం వైరస్ పట్ల సీరియస్ నెస్ ఎందుకు రావడంలేదని వర్ల ప్రశ్నించారు. బాధ్యతకల ప్రతిపక్షనేతగా, టీడీపీ తరుపున ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రిని సన్నద్దం చేయడానికే తాను విలేకరుల ముందుకొచ్చానని రామయ్య స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యంతో జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి తన దృష్టిని ప్రజల ఆరోగ్యంపై పెట్టేలా చేయడం కోసమే తెలుగుదేశం పార్టీనేతగా తాను బయటకు వచ్చానన్నారు. కరోనా ప్రభావాన్ని ప్రజలకు తెలియచేయడంలో ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడుతున్నారో, వారి ముందుకు రావడానికి ఆయనెందుకు సంకోచిస్తున్నారో తెలియడంలేదన్నారు. కరోనా ప్రభావంపై ముఖ్యమంత్రి ఎంత సీరియస్ గా ఉన్నారో, ప్రజలు కూడా అంతే సీరియస్ గా ఉన్నారన్నారు. ప్రభుత్వంఇచ్చిన పిలుపును ప్రజలు సీరియస్ గా తీసుకోవడంలేదన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజలముందుకొచ్చి, కరోనా ప్రభావం గురించి వారికి అర్థమయ్యే లా చెప్పాలని, వారు బయటకురాకుండా చూడాలని ప్రభుత్వానికి చేతులెత్తి విజ్ఞప్తిచేస్తున్నట్లు రామయ్య చెప్పారు.

విజయవాడ వన్ టౌన్ లో కరోనా సోకిన వ్యక్తిని గుర్తించారని, కానీ అక్కడున్న ప్రజలంతా యథేచ్ఛగా బయటతిరుగుతూనే ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి మారువేషంలో బయటకు వస్తే, పరస్థితిఎలా ఉందో ఆయనకు అర్థమవుతుం దన్నారు. ఒక్కసారి మరణాలు మొదలైతే ఆపడం ఎవ్వరితరం కాదని, ఇటలీ, చైనాలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. ముఖ్యమంత్రి తమకోసం మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం, ఆలోచన ప్రజల్లో కలిగేలా ఆయన ప్రతి రెండుగంటలకు ఒకసారి మీడియా ద్వారా వారినుద్దేశించి ప్రసంగించాలన్నారు. కరోనాను ప్రజలంతా చాలా తేలికగా తీసుకోవడానికి ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఖరే కారణమన్నారు. రాజకీయం చేయడానికి ఇది సమయం కాదని, బాధ్యతకల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి పట్టించుకోవాలన్నారు. ప్రజలంతా కరోనా వ్యాప్తిని సీరియస్ గా తీసుకోవాలని, ఎవ్వరూ బయటకు రాకుండా, స్వీయనిర్బంధం విధించుకోవాలని, టీడీపీతరుపున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

చేసిందే పిచ్చి పని. ఆ పిచ్చి పనిని హైకోర్ట్ కొట్టేసింది. వాదనలు సమయంలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అయినా హైకోర్ట్ ని కాదని, తమ పని కరెక్ట్ అని చెప్పుకోవటానికి, సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. ఇప్పుడు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇష్టం వచ్చినట్టు, ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది అంటూ, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పనిని సమర్ధించుకోవటానికి, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటమే పెద్ద తప్పు అని అంటున్నారు. ఇక విషయానికి వస్తే, మన రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కనిపించిన ప్రతిదానికి, వైసీపీ రంగులు వేసుకుంటూ వెళ్ళిన సంగతి తెలిసిందే. పంచాయతీలు, ప్రభుత్వ భవనాలు, స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, ఇలా ప్రతి దానికి రంగులు వేసారు. ఇక చివరకు గేదల కొమ్ములు, చెట్ల ఆకులకు కూడా వైసీపీ రంగులు వేసి విరక్తి పుట్టించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ వెళ్ళే పంచాయతీ భవనాలకు, వైసీపీ రంగులు వేసి, దాన్ని పార్టీ ఆఫీస్ గా మార్చటం పై, తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.

ప్రజలు ఎంత వ్యతిరేకించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కొంత మంది ఇదే విషయం పై హైకోర్ట్ కు వెళ్లారు. దీంతో హైకోర్ట్ వాదనాలు సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము కూడా కోర్ట్ ల్లో మా ఫోటోలు పెట్టుకోమా ? ప్రధాని కూడా అలాగే పెట్టుకున్నారా ? అని వ్యాఖ్యలు చెయ్యగా, అసలు అది పార్టీ రంగులే కాదు అని వాదించారు. దీంతో హైకోర్ట్, వైసీపీ పార్టీ జెండా తీసుకుని రమ్మని చెప్పింది. ఇక ఆ వాదనలు ముగిసిన తరువాత, హైకోర్ట్ పోయిన వారం, ఈ రంగుల పై తీర్పు ఇస్తూ, 10 రోజుల్లో, ఆ రంగులు తియ్యాలని ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ సెక్రెటరి చెప్పిన రంగులు వెయ్యాలని , ఆదేశాలు ఇచ్చింది.

అయితే అనూహ్యంగా, ప్రభుత్వం ఈ నిర్ణయం పై కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. దీని పై ఈ రోజు సుప్రీం కోర్ట్ లో వాదనలు జరిగాయి. దీంతో, సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.- పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. రంగులు తొలగించాలంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా - సీజేఐ బాబ్డే, న్యాయమూర్తులు నాగేశ్వరరావు, సూర్యకాంత ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు, కాషాయం రంగు వేస్తే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించింది. అయినా, ఈ విషయం పై కూడా జగన్ ఎలా సుప్రీం కోర్ట్ కు వెళ్లారు అంటూ, ఆశ్చర్యపోతున్నారు.

కరోనా వైరస్​తో ప్రభావితమైన 75 జిల్లాల బంద్​కు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31వరకు రాష్ట్రాల మధ్య బస్సుల బంద్​కు పిలుపునిచ్చింది. కరోనాతో ప్రభావితమైన 75 జిల్లాల్లో ఆంక్షలపై త్వరలో రాష్ట్రప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తాయని పేర్కొన్నారు అధికారులు. ఆ 75 జిల్లాల్లో అత్యవసర సేవలు మాత్రమే అందించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం, విజయవాడ, విశాఖపట్నం, ఈ లిస్టు లో ఉన్నాయి. అలాగే తెలంగాణా నుంచి, కొత్తగూడెం, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.

జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశం వేదికగా కేంద్రానికి నివేదించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5వరకు సైనిక బలగాల తరలింపును రద్దు చేశారు అధికారులు. సెలవులు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడివారక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు. జవాన్లు అందరూ తమ కుటుంబసభ్యులు ఎవరూ విదేశాల్లో ప్రయాణించలేదన్న డిక్లరేషన్​ను సమర్పించాలని ఆదేశించారు అధికారులు. విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరో పక్క, జనతా కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

సీఎస్‌, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం నియమించిన పర్యవేక్షకుడు సురేష్ కుమార్‌, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి చర్చించారు. రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంపై విస్త్రత స్థాయిలో చర్చ జరిగింది.విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం వ్యవహరించాల్సి ఉందని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అలాగే కరోనా అనుమానిత కేసులకు సంబంధించి ఐసోలేషన్‌ వార్డులు, చికిత్సలకు సంబంధించి ఉపకరణాలు, ఔషధాలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ తరహాలోనే మరో రెండు రోజులు ఇదే తరహాలో కర్ఫ్యూ కొనసాగించాలనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.

గత వారం, కరోనా పెద్ద రోగం కాదు, పారాసిటమాల్ వేసుకుంటే చాలు, మాకు ఇప్పుడే ఎన్నికలు పెట్టాలి అని గోల గోల చేసి, ఏకంగా ఎన్నికల కమీషనర్ కే కులం ఆపాదించిన వైఎస్ జగన్, ఎట్టకేలకు వారం తరువాత, కరోనా ఉందని, దేశంలో భయానక పరిస్థితి ఉందని ఒప్పుకున్నారు. అలాగే, ఈనెల 31 వరకు రాష్ట్రంలో లాక్​డౌన్​ను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో లౌక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి కిలో పప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.వెయ్యి అందిస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్లు ఇంటికెళ్లి నగదును అందజేస్తారని పేర్కొన్నారు. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని స్పష్టం చేశారు.

జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వెంటనే 104కు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్​ను ఆమోదిస్తామని...అసెంబ్లీని కూడా కొన్ని రోజులపాటే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమన్న జగన్ అందరితోపాటు బస్సులు, వాహనాలు నిలిపివేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇక మరో పక్క, కరోనా సౌత్ కొరియాలో పుట్టింది అంటూ, జగన్ నోరు జారటంతో, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక మరో పక్క, కరోనా వ్యాపించిన జిల్లాల జాబితాను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు వెల్లడించింది. వీటిలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాల పేర్లను చేర్చింది. పక్కరాష్ట్రమైనా తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్లు తెలిపింది.

Advertisements

Latest Articles

Most Read