ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ కు, నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. ప్రశాంత్‌ కిశోర్‌, జేడీయూలో చేరటం, ఆయనను నితీష్ ఉపాధ్యక్షుడుని చెయ్యటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రశాంత్ కిషోర్ కూడా , నేను ఇక ఎక్కువ సేపు రాజకీయాల్లోనే ఉంటాను, నా టీం అంతా, జగన్ పనులు చూస్తుంది అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ప్రశాంత్ కిషోర్ మాత్రం, బీహార్ లో కాకుండా, ఎక్కువగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యటం కోసం, రకరకాల పన్నాగాలు పన్నుతూ, ఎక్కువ సేపు ఇక్కడే గడిపేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే నితీష్ కు, ప్రశాంత్ కిషోర్ వైఖరి నచ్చలేదని తెలుస్తుంది.

game 27032019

దీంతో జేడీయూపార్టీ వ్యవహారాల్లో, ప్రశాంత్ కిషోర్ ను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఉపాధ్యక్షుడుని అయిన నన్నే దూరం పెడితే ఎలా, ఇది ఎన్నికల సమయం కదా అంటూ, ప్రశాంత్ కిషోర్. తన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసహనాన్ని ఆయాన ట్విట్టర్ లో పంచుకున్నూర్. గురువారం ఆయన చేసిన ఓ ట్వీటే దీనికి ఉదాహరణ. ‘‘జేడీయూలో ఎన్నికల నిర్వహణ, ప్రచార బాధ్యతలన్నీ ఆర్‌సీపీ సింగ్‌లాంటి సీనియర్‌ చూస్తున్నారు. నా రాజకీయ జీవితపు తొలినాళ్లివి. నేర్చుకోవడం, సహకరించడం వరకే నా పాత్ర పరిమితం’’ అని నర్మగర్భంగా పోస్ట్‌ పెట్టారు.

game 27032019

పొత్తులు, సీట్ల పంపిణీలాంటి బాధ్యతలను ఉపాధ్యక్షుడైన తనకు కాకుండా ఆర్‌సీపీ సింగ్‌, లల్లన్‌సింగ్‌లకు నితీశ్‌ ఇవ్వడం ప్రశాంత్‌ కిశోర్‌లో అసంతృప్తిని రేపింది. పార్టీ యువ విభాగం, మిగిలిన రాష్ట్రాల్లో జేడీయూని బలోపేతం చేయడమెలా అనే చిన్నచిన్న పనులను మాత్రమే అప్పగించడంపై అలిగి ప్రశాంత్‌ కిశోర్‌- ఏపీలో ఎక్కువకాలం గడుపుతున్నారు. అక్కడాయన వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహరచనలో సహకరిస్తున్నారు. ఇది ముగిశాక ఆయన శివసేనకు కూడా ఇదే తరహా వ్యూహరచన చేయనున్నారు.

దేశాన్ని రక్షిస్తానని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలుత రాష్ట్రంలో గెలిచి చూపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాలు విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు తొలుత ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు.

game 27032019

మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారన్న ఆయన.. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తామంటే అక్కడి నుంచి వద్దని జనాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పదిసీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమేనన్నారు. మరో పక్క జీవీఎల్, కన్నా లక్ష్మీనారయణ లాంటి వాళ్ళు కూడా ప్రతి రోజు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే కాని ఏపి రాత మారదని, ఏపిలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోవాలని అంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రసంగాల్లో మధ్యలో చమత్కారాలు, ఛలోక్తులు విసురుతూ సభికులను బాగా నవ్విస్తున్నారు. తాజాగా రాజమండ్రి రోడ్ షోలో కూడా చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై ఓవైపు విసుర్లు, మరోవైపు వ్యంగ్యం కురిపించారు. తాను లక్ష రూపాయలిచ్చి ఆడబిడ్డలను అత్తారింటికి పంపిస్తున్నానని చెప్పే క్రమంలో, పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తీశారని గుర్తుచేశారు. తాను అందరినీ అత్తారింటికి పంపిస్తుంటే, పవన్ కల్యాణ్ మాత్రం ఆయన దారి ఆయన వెతుక్కుంటూ వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు సైకిల్ చెయిన్ ను కేసీఆర్ తెంపేశారని, ఇక సైకిల్ నడవడంలేదని పవన్ అనడం పట్ల తనదైన శైలిలో స్పందించారు.

viveka 3032019

తన సైకిల్ ను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. "నా సైకిల్ ను తాకితే షాక్ తింటారు, నా సైకిల్ తాకి నిలబడగలరా వీళ్లు? సైకిల్ నుంచి కూడా కరెంట్ తయారవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. అంత స్పీడుగా వెళుతుంది నా సైకిల్ బుల్లెట్ మాదిరిగా. ఎవరైనా తాకితే అక్కడితో ఫినిష్! అలాంటి సైకిల్ చెయిన్ ను ఎవన్నా తెంపగలరా? వాళ్లను నేను వదిలిపెడతానా?" అంటూ నవ్వులు విరబూయించారు. జగన్‌ లోటస్‌పాండ్‌లోనే అభ్యర్థుల్ని ఎంపిక చేశాడని, మనల్ని మోసం చేయడానికి జగన్‌ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్‌.. ఆంధ్రా వాళ్లు రాక్షసులు, కుక్కలు అన్నారని, కేసీఆర్‌ నోరు పారేసుకుంటే మనం పడాలా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పై కూడా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. మోదీకి కొడుకులు, కూతుళ్లు లేరు..ఎందుకు మాపై శాపనార్దాలు.. సెటైర్లు వేస్తారని చంద్రబాబు మండిపడ్డారు.

viveka 3032019

యుద్ధం హుందాగా ఉండాలని, దెబ్బ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతా, అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదని చంద్రబాబు అన్నారు. హోదా అడిగితే కేసీఆర్‌, జగన్‌తో కలిసి నాపై కక్ష తీర్చుకుంటారా? అని బాబు ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన వెనక్కి తీసుకున్నారని, ఇదేనా ప్రధాన మంత్రి ధర్మం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన గాయాలు ఇంకా మానలేదు.. మోదీ వచ్చి కారం జల్లుతున్నారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి ప్రధాన మంత్రి దేశానికి అవసరమా? అని చంద్రబాబు అన్నారు.

కర్నూలు సభలో తనపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. తనపైనా, తన కుమారుడు లోకేశ్ పైనా మోదీ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాము రాష్ట్రానికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకుంటే ఎగతాళి చేస్తున్నాడని మండిపడ్డారు. గుజరాత్ కు వైబ్రాంట్ గుజరాత్ అని పెట్టుకున్నారని, ఎవరి పేరు బాగుందో చెప్పాలని సభికులను ప్రశ్నించారు. "సోలార్ ఎనర్జీని తానే ఇచ్చానని మోదీ చెబుతున్నాడు. మీరిచ్చేదేంటి? ఆ ప్రాజక్ట్ కు భూమి ఇచ్చింది నేను. మీ దయాదాక్షిణ్యాలు మాకవసరం లేదు. ప్రపంచం అంతా ఏపీకి వస్తున్నారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టడానికి కారణం, మనం తూర్పు దిక్కున ఉన్నామనే. మనకు ఇప్పుడా సూర్యుడే సోలార్ ఎనర్జీ ఇస్తున్నాడు, అంతకంటే ఏంకావాలి!

game 27032019

నరేంద్ర మోదీ సన్ సెట్ అంటున్నాడు! ఎస్ యు ఎన్ కాదు ఎస్ ఓ ఎన్ అంట! నా కొడుకు సెట్ అంట! మీకు నరేంద్ర మోదీ కుటుంబం గురించి తెలుసా? (నవ్వుతూ) అయినా, నేనా విషయం చెప్పదలుచుకోలా! కానీ నాకు కుటుంబ విలువలు తెలుసు. నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, చిన్నవాడు మనవడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. మరి మీ కథేంటి నరేంద్ర మోదీ గారూ? మీకెవరైనా ఉన్నారా? విలువలేమైనా ఉన్నాయా? కుటుంబ సంప్రదాయాలేమైనా ఉన్నాయా? ఎర్రన్నాయుడు, బాలయోగి వంటి నాయకుల కుటుంబాలను ఆదుకోవడంలో మేం విజ్ఞత చూపించాం. అందుకే వారి వారసులకు అవకాశం ఇచ్చాం.

game 27032019

అయినా నా కొడుకు గురించి మాట్లాడారు మీరు? మా అబ్బాయేమైనా గాలికి వచ్చాడనుకున్నారా? స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్నాడు. లోకేశ్ రాజకీయాల్లోకి రావాలని కూడా మేం కోరుకోలేదు. వ్యాపారాలు కూడా ఉన్నాయి. నాన్నా, మీలాగానే ప్రజాసేవా రంగంలోకి వస్తానని చెప్పాడు. మీ ఇష్టం ఇందులో కష్టాలుంటాయి అని చెప్పాను. ఎలాంటి అవినీతి లేని యువ నాయకులను విమర్శించడం సరికాదు. ఇప్పుడు కోడికత్తి పార్టీతో కలిసి మోదీ కత్తి రాజకీయాలు చేస్తున్నాడు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీని నమ్మకద్రోహి అంటూ చంద్రబాబు దుయ్యబెట్టారు. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ను సన్‌సెట్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ మోడీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. మోడీకి ప్రేమలు, బంధాలు, వాత్సల్యాలు, మమకారాలు తెలీదన్నారు. ఆయనకు పిల్లల్లేకపోవడమే ఇందుక్కారణమన్నారు. బంధుత్వాలు, ప్రేమలు తెలిసిన వారికే విలువలుంటాయన్నారు. వారే రాజకీయాల్లో రాణిస్తారన్నారు. అసలు రోబోకు, మోడీకి తేడా లేదన్నారు. అసలు మోడీకి రాష్ట్రంలో పనేంటంటూ నిలదీశారు.

Advertisements

Latest Articles

Most Read