స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, మూడు రాజధానులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేయరా దని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం నిశతంగా పరిశీలిస్తోంది. హైకోర్టు నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ వారం రోజుల్లోగా రిజర్వేషన్ల ప్రక్రియను సిద్ధం చేయాలని నిర్ణయించింది. మరోవైపు శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని తిప్పికొట్టే విషయమై అధికార పార్టీ నేతలు, మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ వల్లే 'స్థానిక ఎన్ని కల్లో రిజర్వేషన్లకు విఘాతం కలిగిందనే ప్రచారాన్ని చెయ్యాలని జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే స్థానిక ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 4 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నందున ఎన్నికలకు అవకాశం ఉండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

హైకోర్టు నెల రోజులు గడువు ప్రకటించిన నేపథ్యంలో ఈ లోగా శాసన సభ బడ్జెట్ సమావేశాలను ముగిస్తే ఎలా ఉంటుందనే విషయమై సీఎం జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవ ర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రకటనను శాసనమండలిలో మెజారిటీ పక్షంగా ఉన్న తాము వ్యతిరేకిస్తామని మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేసిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగ పాఠంపై అధికార పార్టీ నేతలు దృష్టి సారించారు. ఈ నెల 6 నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగి స్తారు. ఇదే అదనుగా టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ చెల్లుబాటు కాదని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇవే బిల్లులు గవర్నర్ ప్రసంగంలో పునరావృతమైతే తిరస్కరించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది.

శాసనమండలిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇంతకు ముందెన్నడూలేని రీతిన అసలు గవర్నర్ ప్రసంగాన్ని తిరస్కరించడం ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు టీడీపీ ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ఆమోదం విషయంలో కూడా వ్యతిరేకంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వమే రూపకల్పన చేస్తుంది. ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణ, సీఆ స్టీఏ బిల్లులను గవర్నర్ ప్రసంగంలో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. మూడు రాజధానులపై పంతం నెగ్గించుకు నేందుకు ఆర్డినెన్స్ ఏకైక మార్గమని భావిస్తోంది. మండలి జోలికి వెళ్లకుండా ఆర్డినెన్సును జారీ చేసి గవర్నర్ సంతకంతో ప్రక్రియ ప్రారంభించాలనే యోచనతో ఉంది. దీనిపై ఈనెల 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

నాలుగు రోజులు క్రితం, ఒక వార్త వినిపించింది. అదే వాలంటీర్లను, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లగా వేస్తున్నాం అంటూ ప్రభుత్వం ప్రకటించటం. దీని పై అందరూ విమర్శలు గుప్పించారు. వారి భవిషత్తును శాసించే పరీక్షల్లో, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యటం ఏమిటి, ఒక చిన్న తప్పు జరిగినా, జీవితాలు తారు మారు అయిపోతాయి అంటూ విమర్శలు గుప్పించారు. అనుభవం ఉన్న టీచర్లే ఒకోసారి పొరపాటు పడతారని, మరి వాలంటీర్లు ఇన్విజిలేటర్లగా ఎలా నియమిస్తారు అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. రేపు వారి చేత పేపర్లు కూడా దిద్దిస్తారా అంటూ, విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ అయితే మాములుగా లేవు. టీచర్లను ఇంట్లో కూర్చో పెట్టి, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యటం ఏమిటి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఇదంతా ఎంతో సిల్లీగా అనిపిస్తున్నా, ప్రభుత్వం ఆలోచన మాత్రం మాములుగా లేదు. ప్రభుత్వం ఎంతో ప్లానింగ్ తో, ఇలా వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వేస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే విషయం వెనుక, ఎంతో స్కెచ్ ఉంది.

volunteers 03032020 2

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మార్చి 31వ తేదీతో 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తి కానుంది. ఈలోగా స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన సుమారు రూ. 5 వేల కోట్లు వస్తాయి. అలా కాకపోతే ఆ రూ. 5 వేల కోట్లపై ప్రభుత్వం ఆశలు వదులుకోవాల్సిందే. ఏప్రిల్ 1 నుండి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 లోగా స్థానిక సమరాన్ని పూర్తిచేస్తే కేంద్రం నుండి రావల్సిన నిధులను తీసుకొనేందుకు సమయం సరిపోతుందని భావిస్తున్నారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావల్సిన రూ. 5 వేల కోట్లు పోతే అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

volunteers 03032020 3

ఈ నేపథ్యంలోనే ఈనెల 7వ తేదీ లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే కోర్ట్, ప్రభుత్వం నియమించిన 59 శాతం రిజర్వేషన్ కొట్టేసింది. దీంతో, 5 వేల కోట్ల కోసం, 50 శాతం రిజర్వేషన్ తోనే, ఎన్నికలకు వెళ్లనున్నారు. అయితే, ఇక్కడ వాలంటీర్లకు పని ఏమిటి అనుకుంటున్నారా ? ప్రభుత్వం చెప్తున్నట్టు, మార్చి నెలలోనే ఎన్నికలు జరిగితే, ఇది పరీక్షలు టైం. ఎన్నికల ప్రక్రియలో ఎక్కువగా ప్రభుత్వ టీచర్లను ఉపయోగిస్తారు. అయితే ఎన్నికల సమయం, పరీక్షలు ఒకేసారి వస్తూ ఉండటంతో, టీచర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించటం కోసం, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగిస్తే విమర్శలు వస్తాయి కాబట్టి, ఇలా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఈ రోజు పోలీసులు హౌస్ అరెస్ట్ లో ఉంచారు. చింతమనేని ఈ రోజు చలో అమరావతికి పిలుపు ఇచ్చిన నేపధ్యంలోనే, ముందస్తు చర్యగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చలో అమరావతి కోసం, దెందులూరు నుంచి దాదాపు 200 కార్లలో అమరావతి బయల్దేరేందుకు సిద్ధమైన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, చింతమనేని ఇంటికి చేరుకున్నారు. అక్కడ నుంచి అమరావతి వచ్చి, అమరావతిలో నిరసనలు చేస్తున్న రైతులకు, మద్దతు ఇవ్వాలని, చింతమనేని భావించారు. అయితే అనుకున్న దాని కంటే, ఎక్కవు మంది ఈ కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చారు. అయితే, వారిని అడ్డుకున్న పొలీసులు, చింతమనేనిని హౌస్ అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇది కొనసాగుతూ ఉండగానే, పోలీసుల కళ్లు గప్పి చింతమనేని అమరావతికి పయనమయ్యారు. చలో అమరావతి నిర్వహించి తీరుతాం అని అన్నారు.

chintamaneni 030320201 2

ఇక మరో పక్క, మూడు రాజధానుల ప్రకట నను ఉపసంహరించుకుని, అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు సోమవారం నాటికి 78వ రోజుకు చేరగా ఇప్పటికే పలు రూపాల్లో, వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ వచ్చిన రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో నిరసనలు కొనసా గాయి. సోమవారం తుళ్లూరు, మందడం, వెలగ పూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, కుర గల్లు, పెదపరిమి, ఉండవల్లి, తాడికొండ అడ్డరోడ్డు, తదితర ప్రాంతాల్లో రైతులు, మహిళలు రిలే దీక్షలు, మహాధర్నాలను కొనసాగించారు. రాయపూడి గ్రామంలో మహిళలు ఒంటికాలిపై నిలబడి, మోకా క్లపై కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడి రాజధానిగా అమరావతినే కొనసా గించాలని డిమాండ్ చేశారు. మందడం గ్రామంలోని చర్చిలో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్ధనలు, ఉపవాస దినాలు ఆచరించారు.

chintamaneni 030320201 3

జగన్మోహనరెడ్డి మనసును మార్చి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రార్ధనలు నిర్వహిం చారు. ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుండి వచ్చిన రైతులు రాజధాని గ్రామాల్లో నిర్వహి స్తున్న దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహి శలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన తమపై ఈ విధంగా కక్షపూరి తంగా వ్యవహరించడం తగదన్నారు. రాజధాని గ్రామాల్లో అన్ని వర్గాల వారు ఉన్నారని, ఓ సామాజిక వర్గం ముద్ర వేసి విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని హితవుపలికారు. ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోని మండల, గ్రామాల ప్రజలం దరూ ఓట్లు వేస్తేనే వైసీపీ విజయం సాధించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. నాడు అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగిన సమయంలో 30 వేల ఎకరాలు కావాలని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పలేదా అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంతో మా జీవితాలు వీధిన పడ్డా యని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. కాగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, పలువురు వామపక్ష నేతలు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

మూడు రాజధానుల ఏర్పాటుకు ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం సరికొత్త అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో మరో పాచికను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై అధికారపక్షాన్ని ఇరుకుపెట్టిన తెదేపా, ఇప్పుడు తాజాగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. గత సమావేశాల్లో మాదిరిగానే ఈసారి కూడా జగన్ సర్కారుకు ఝలక్ ఇవ్వాలని భావిస్తోంది. తాజాగా సోమవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ మేరకు ఒక ప్రకటన చేసి, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. గత సమావేశాల్లోలాగా గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, ప్రతిపక్షాన్ని గౌరవించాలని లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందని, ఈ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే గవర్నర్ ప్రసంగిస్తారని, అయితే ఈ ప్రసంగంలో మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలను ప్రస్తావించవద్దని ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. ప్రభుత్వం తమ మాటను గౌరవించకపోతే గవర్నర్ ప్రసంగాన్ని కూడా తిరస్కరించాల్సి ఉంటుందని, అప్పుడు సంక్షోభం తలెత్తుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఈ అంశంలో చిత్తశుద్ధి లేదని, కనీసం గవర్నర్ అయినా ఈ ప్రసంగాన్ని చదివే ముందు తిరస్కరణకు గురైన బిల్లుల అంశం ఉందో.. లేదో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అని సూచించారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ఎక్కడా తిరస్కరించడం జరగదని, అయితే తమ ముందు ఉన్న ప్రత్యామ్నాయ అవకాశం అంతకు మించి లేదని యనమల స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం తిరస్కరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టమంట కలుస్తుందని, అందుకే ఈ అంశంలో ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ సీఆర్డీయే బిల్లులనురూల్-71 కింద శాసనమండలిలో తిరస్కరించామని, అయితే ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు వాటిపై చర్చ సాగించి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ కార్యదర్శిని ప్రభుత్వం బెదిరించి సెలక్ట్ కమిటీ ఏర్పడకుండా ఆ ప్రక్రియకు అడ్డు పడుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు మండలి చైర్మన్ షరీఫ్ క వాడా గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారన్నారు.

మండలిలో ప్రతిపక్ష పార్టీగా తమ హక్కులను ఎవరూ అడ్డుకోలేరని, ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే గతంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని యనమల హెచ్చరించారు. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వం క్షణాల్లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, ఆమోద ముద్ర వేసి అరగంటలోనే శాసనసభలో ఆమోదించుకుందని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం అప్రజాస్వామికంగా జరగడంతో మండలిలో తాము అడ్డుకున్నామన్నారు. తమకు ఉన్న సంఖ్య బలంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించామని, సెలక్ట్ కమిటీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇప్పటికే సగం పని పూర్తి అయ్యేదని, ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి వల్లే దీనికి విఘాతం కలిగిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయని, దీనికి ప్రధాన కారణం జగన్ అని యనమల వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ చరిత్రలో జగన్‌ను సరిపోల్చడానికి ఎవరూ లేరని, ఇండియాలో తుగ్లక్ మహాయుడు, జర్మనీలో హిట్లర్, ఇటరీలో ముసోలిన్, రోమ్ లో నీరో చక్రవర్తిని కలిపిన ఆయనకు సాటి రారని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యక్తిగత స్వార్థం ఉందని, స్వార్థం మినహా ప్రజల సంక్షేమం ఏ మాత్రం లేదని విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read