రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని, ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా మండలితిరస్కరించిన మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు అంశాల ప్రస్తావన రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సమావేశాల్లో భాగం కాకపోయినప్పటికీ, అది జరగడం అనేది రివాజుగా వస్తోంది కాబట్టి, అది జరుగుతుందన్నారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని తయారుచేసేది ప్రభుత్వమే కాబట్టి, దానిలో ఎక్కడా కూడా గత సమావేశాల్లో మండలి తీసుకున్న నిర్ణయాలను ఎక్కడా ఆ ప్రసంగంలో రాకుండా చూడాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి, ప్రభుత్వ పాలసీని రూల్-71కింద తిరస్కరించడం జరిగిందన్నారు. ఏపాలసీలను మండలి తిరస్కరించిందో, వాటినే గవర్నర్ ప్రసంగంద్వారా ప్రభుత్వం తిరిగి సభల్లోకి తీసుకురావాలని చూస్తోందన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ఎక్కడా తనసొంత అభిప్రాయాలు చెప్పరని, ప్రభుత్వ ఆలోచనలు, అభిప్రాయాలే ఆయనద్వారా సభల ముందుకొస్తాయని యనమల పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలుచేయకుండా, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, గవర్నర్ కూడా తాను చేయబోయే ప్రసంగాన్ని పరిశీలించాలన్నారు. అసెంబ్లీలో ఆ రెండు బిల్లులు మద్ధుతుపొందాయికాబట్టి, అక్కడ వాటి ప్రస్తావనరాదని, మండలిలో మాత్రమే వాటిని ప్రస్తావించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తు దన్నారు. సర్కారు అదేవిధంగా ముందుకెళ్లాలని చూస్తే, ప్రతిపక్షం చూస్తూ ఉండదని, రాజ్యాంగంప్రకారం, చట్టప్రకారమే ముందుకెళుతుందన్నారు. గతంలో మండలిలో ప్రతిపక్షం తిరస్కరించిన మూడురాజధానుల బిల్లు, సీఆర్డీ ఏ రద్దు బిల్లులను గవర్నర్ ప్రసంగంలో చేరిస్తే, ఆ రెండు అంశాలు సభలో చర్చకు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తే, వాటిని నిర్ద్వందంగా తిరస్కరిస్తామని యనమల తేల్చిచెప్పారు. మండలి తిరస్కరించిన పాతపాలసీలను ప్రభుత్వం పక్కనపెడితేనే మంచిదన్నారు. ప్రతిపక్షం తనకున్న అధికారాలను ఉపయోగించుకునే హక్కుని ఎవరూ కాదనలేరని, ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పోకుండా చేసింది ప్రభుత్వమే కాబట్టి, త్వరలోజరగబోయే సమావేశాల్లో మండలిలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోకుంటే ప్రభుత్వానికి సరైనవిధంగా గుణపాఠం చెప్పి తీరుతామని యనమల తేల్చిచెప్పారు. రాష్ట్రప్రతిష్టకు సంబంధించిన అంశాలను, బలవంతంగా ఆమోదింపచేసుకోవాలని జగన్ సర్కారు చూస్తే, తాము చట్టప్రకారం తమకున్న హక్కులను ఉపయోగించుకుంటామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, వీలైనంతవరకు ఆ రెండు అంశాలను సభ ముందకు తీసుకురాకుండా ఉంటేనే మంచిదన్నారు.

రిజర్వేషన్ల అమలు, విధివిధానాలపై సుప్రీం ఇచ్చిన తీర్పుని తామేమీ తప్పుపట్టడంలేదని, కాలమాన పరిస్థితులకు తగినట్లుగా న్యాయస్థానాలుకూడా వాటి నిర్ణయాలను మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, రిజర్వేషన్ల ఖరారుపై ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం న్యాయస్థానంలో పున:సమీక్ష కోరవచ్చన్నారు. రిజర్వేషన్లనేవి దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కని, వాటి విషయంలో తమకేమీ అభ్యంతరం లేదన్న యనమల, బీసీల రిజర్వేషన్లలో మాత్రం వారికి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. బీసీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చిన పక్షంలో ప్రభుత్వం ఆదరాబాదరాగా ముందుకెళ్లడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు. బీసీల సంఖ్యకు తగినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. నలుగురి కలయికగా జగన్ ను పేర్కొనవచ్చని, అంతటి ప్రత్యేక లక్షణాలు ఆయనకు మాత్రమే ఉన్నాయని యనమల ఎద్దేవాచేశారు. హిట్లర్, ముస్సోలినీ, నీరో, తుగ్లక్ ల కలయికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డని, ఆయన చర్యలు, చేష్టలు, ఆలోచనలు, నిర్ణయాలు ఆ నలుగురినే గుర్తుకు తెస్తుంటాయన్నారు.

ప్రపంచ రాజకీయ చరిత్రను ఒకసారి గమనించినట్లయితే, రాజధాని మార్పు పేరుతో తుగ్లక్ ఎలా ప్రవర్తించాడో, ప్రపంచాన్నే మింగేయాలన్న పరిపాలనా కాంక్షతో హిట్లర్ ఎలా విర్రవీగాడో, తొలుత సోషలిజం గురించి ప్రచారం చేసిన ముస్సోలినీ, అధికారంలోకి రాగానే ఏవిధంగా ఫాసిస్టుగా మారాడో, గోల్డెన్ ప్యాలెస్ కట్టుకోవడానికి నీరో ఎలాగైతే రోమ్ నగరాన్ని తగలెట్టాడో, అదేవిధంగా వారందరి మనస్తత్వాల కలబోతగా జగన్ రాష్ట్రంలో పాలనసాగిస్తున్నాడని యనమల దుయ్యబట్టారు. తనకు అధికారముంటే చాలు, తాననుకున్నది జరిగితే చాలు, రాష్ట్రం తగలబడిపోయినా, అభివృద్ధి ఆగిపోయినా, పెట్టుబడులు-ఆదాయం రాకపోయినా ఏమీ పరవాలేదన్నట్లుగా జగన్మోహన్ రెడి పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది, ఏం చేస్తే ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందనే ఆలోచనలు లేకుండా, రాష్ట్రం సర్వనాశనమవుతుంటే, ఎందరు సలహాదారులుండీ ఏం ఉపయోగమని యనమల వాపోయారు. సలహాదాలు చెప్పేది ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని, వారి ఆలోచనలు పట్టించుకోకుండా వ్యవస్థల నాశనానికే జగన్ కంకణం కట్టుకున్నాడన్నారు.

దూకుడు నిర్ణయాలతో, వాటి పర్యావసానాలు ఆలోచించకుండా, ఏది తోస్తే అది చేస్తూ, ఎవరి మాట వినకుండా, స్పీడ్ గా వెళ్తున్న జగన్ కు, ఎప్పటికప్పుడు హైకోర్ట్ బ్రేకులు వేస్తూనే ఉంది. ప్రతి రోజు, ఏదో ఒక విషయంలో, ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ చేతిలో ఎదురు దెబ్బలు, మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తమకు మంద బలం ఉంది, తాము చెప్పిందే వేదం అంటూ, రూల్స్ పాటించుకుండా వెళ్తున్న జగన్ ప్రభుత్వానికి ఈ రోజు ఇప్పటి వరకు, రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటిది, వైజాగ్ లో చంద్రబాబుని, 151 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి, అరెస్ట్ చెయ్యటం పై, ఈ రోజు విచారణలో, ఏకంగా డీజీపీనే వచ్చి సమాధానం చెప్పమని కోరటం. ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ పై. జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ అంటూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కోర్ట్ లు కొట్టేస్తాయి అని అందరికీ తెలిసిందే. అయినా సరే, జగన్ ప్రభుత్వం, ఎందుకు ముందుకు వెళ్లిందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

court 02032020 2

ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ పై హైకోర్టులో విచారణ జరిపింది. ప్రభుత్వం ఇచ్చిన 59.85 శాతం రిజర్వేషన్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్ చెల్లదన్న కోర్టు...నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల పై, ప్రభుత్వం ఇచ్చిన జీవోని ప్రభుత్వం రద్దు చేసింది. హైకోర్ట్ ఆదేశాలు నేపధ్యంలో, ఎలా ముందుకు వెళ్ళాలి అనేదాని పై, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. సుప్రీం కోర్ట్ కు వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని పై చర్చలు జరుపుతున్నారు.

court 02032020 3

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాల రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. తొమ్మిది నెలల పాలనలో బలహీన వర్గాల కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెదేపా కేసు వేసిందంటూ మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు అండగా ఉన్నది బీసీలేనన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. న్యాయస్థానం చెప్పిందని బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు.

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పటికే దాదాపు 5వేల కోట్ల రూపాయల మేర పీకల్లోతు నష్టాలతో ఉన్న ఆర్టీసీ పై అదనపు భారం పడింది. ఇటీవలే నామమాత్రంగా టిక్కెట్ చార్జీ పెంచినప్పటికీ పెరిగే వడ్డీల భారంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా డీజిల్ పై లీటరు రూ. 1.07 పైసలు వ్యాట్ చార్జీ పెంచింది. రాష్ట్రంలో అత్యధి కంగా డీజిల్ వినియోగంలో మొదటి నుంచి ఏపీ ఎస్ ఆర్టీసీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల బస్సులు ఉండగా నెలకు సగటున 30కోట్ల లీటర్ల డీజిల్ ని వినియోగిస్తున్నాయి. తాజాగా లీటర్‌కు రూ. 1.07 పైసలు పెరిగిందంటే నెలకు రూ. 32 కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ. 400 కోట్లు అదనపు భారం పడినట్లయింది. ఇప్ప టికే రాష్ట్రంలో ప్రభుత్వం 2 రూపాయలు అదనంగా అంటే 22.25 శాతంపై రూ. 24.25 పైసలు మేర వ్యాట్ వసూలు చేయటం ప్రారంభించింది. అలాగే పెట్రోలు లీటర్ 31శాతంపై రెండు రూపాయలు అదనంగా మొత్తం రూ.38 వ్యాట్ వసూలు చేయటం ఆరంభించింది.

rtc 02022020 2

అయితే పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం రెండు రూపాయలు తగ్గించడంతో వాహన యజమానులు సరిహద్దులోని తెలంగాణ పెట్రోలు బంక్ లతో ఫుల్ ట్యాంకు నింపుకోవటం ప్రారంభించారు. తాజాగా డీజిలపై రూ. 1.07 పైసలు, పెట్రోల్ పై 76 పైసలు వడ్డన జరిగింది. గతంలో డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేసేవి. అయితే ప్రభుత్వంలో విలీనం కావటం, పైగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ వర్తించడంతో ఏఒక్కరూ రోడ్డెక్కే వీలులేదు. దీంతో పెరిగిన డీజిల్ ధరపై ఆందోళన చేసేవారు కనిపించడం లేదు. ఇక కృష్ణాజిల్లానే అధికంగా ఆర్టీసీ బస్సులున్నాయి. జిల్లాలో 1432 బస్సులున్నాయి. ప్రతిరోజు ఈ బస్సులు ఐదు లక్షల కి.మీ చొప్పున నడుస్తాయి. పెరిగిన 1.07 పైసల వ్యా ట్ నెలకు కోటీ 60లక్షలు చొప్పున సాలీనా రూ. 19.21 కోట్ల మేర భారం పడనుంది.

rtc 02022020 3

జిల్లాలో ఇతర వినియోగ దారులందరిపై కలిసి రూ. 117 కోట్ల మేర భారం పడింది. జిల్లావ్యాప్తంగా 250 పెట్రోలు, డీజిల్ బంకులున్నాయి. ప్రతి బంకులో సగటున రోజుకు 3వేల లీటర్ల పెట్రోలు, 8వేల లీటర్ల డీజిల్ విని యోగం జరుగుతుంది. పెరిగిన చార్జీలను మొత్తం 250 బంకులపై రోజుకు పెట్రోలు వినియోగదారులు రూ. 5.70 లక్షల లెక్కన నెలకు రూ. 1.71కోట్లు, ఏడాదికి రూ. 20.52 కోట్లు భారం పడుతుంది. అదే డీజిల్ వినియోగదానికి వస్తే సగటున బంకుల్లో రోజుకు 8వేల లీటర్ల వినియోగం జరుగుతుంది. దీనివల్ల రోజుకు రూ. 21.40 లక్షల చొప్పున నెలకు రూ. 6.42 కోట్లు సాలీనా రూ. 77.10 కోట్ల భారం పడుతోంది. ఒక్క నెల రోజుల్లో, రెండు సార్లు డీజిల్ రెట్లు పెంచటంతో, ఆర్టీసీ షాక్ అయ్యింది. మొదటి సారి డీజిల్ రేట్లు పెంచాగానే ఆర్టీసీ చార్జీలు పెంచారు. అయితే, ఇప్పుడ నెల రోజుల్లోనే రెండో సారి పెంచటంతో, ఆర్టీసీకి ఈ నష్టం ఎలా బర్తీ చేసుకోవాలో అర్ధం కావటం లేదు.

విశాఖపట్నంలో చంద్రబాబుని వైసీపీ నేతలు అడ్డుకోవటం, ఎయిర్ పోర్ట్ లో వీరంగం చెయ్యటం, అలాగే అయుదు గంటలు పాటు చంద్రబాబుని కదలనియ్యకుండా చెయ్యటం, చివరకు వైసీపీ వారిని ఏమి చెయ్యకుండా, చంద్రబాబుకు 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి, చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చెయ్యటం తెలిసిందే. అయితే, ఈ విషయంలో మాత్రం అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే, చంద్రబాబు పర్మిషన్ తీసుకుని, యాత్రకు వచ్చారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇస్తే, దానికి తగ్గట్టే చంద్రబాబు వచ్చారు. అయితే అంతకు ముందు రోజు, చంద్రబాబుని అడ్డుకుంటాం అని వైసీపీ మంత్రులే చెప్పినా, దాని కోసం ముందే ప్లాన్ చేసినా, పోలీసులు మాత్రం వారిని అడ్డుకోలేదు. ఏకంగా 500 నుంచి వెయ్యి మంది వైసీపీ కార్యకర్తలను ఏకంగా విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోకే అనుమతి ఇచ్చారు. పోనీ చంద్రబాబు వచ్చిన తరువాత వారిని క్లియర్ చేసారా అంటే అదీ లేదు. ఇంతా జరిగి, చివరకు చంద్రబాబునే అరెస్ట్ చేసి, వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపించారు.

sawang 02032020 2

అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. విశాఖ పోలీసులు తీరు, అదే విధంగా ప్రభుత్వం తీరు పై, హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్, ఆ రోజే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా అనుమతి ఇచ్చి, వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చెయ్యటం ఏమిటి ? గొడవ చేసిన వారిని కదా అరెస్ట్ చెయ్యల్సింది అంటూ కోర్ట్ ప్రశ్నించింది. అసలు చంద్రబాబుకి 151 నోటీస్ ఇచ్చి, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది అంటూ, కౌంటర్ వెయ్యాలి అంటూ, పోలీసులను హైకోర్ట్ ఆదేశిస్తూ, విశాఖ సిపీకి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చింది హైకోర్ట్. అయితే, కోర్ట్ ఆదేశాలు ప్రకారం, ఈ రోజు పోలీసులు, కౌంటర్ వేసారు. ఈ రోజు ఈ కేసు పై విచారణ జరిగింది.

sawang 02032020 3

ఈ విచారణ పై, టిడిపి తరుపు న్యాయవాది, కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈనెల 12న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కోర్టుకు హాజరుకావాలని, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి అంటూ, కోర్ట్ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ కేసు పై తదుపరి విచారణను, ఈనెల 12కు వాయిదా వేసిందని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తే చంద్రబాబు వచ్చారని, అలాంటిది, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేసారు, గుడ్లు, రాళ్ళు వేసిన వారిని ఎందుకు నివారించలేదు అంటూ కోర్ట్ అడిగినట్టు న్యాయవాది చెప్పారు. ఈ రోజు పోలీసులు వేసిన కౌంటర్ తో, కోర్ట్ సంతృప్తి చెందలేదు కాబట్టే, డీజీపీని కోర్ట్ కు వచ్చి హాజరు అవ్వమని, వివరణ ఇవ్వమని కోర్ట్ చెప్పినట్టు, న్యాయవాది, కృష్ణారెడ్డి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read