రేపటి అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ రేపటి అసెంబ్లీ అజెండాయే రాజ్యాంగ విరుద్దం. ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కు విరుద్దం, ఇది ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడం. ఇప్పటికే అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. రేపటి అసెంబ్లీలో మరో ఉల్లంఘనకు తెరదీశారు. కౌన్సిల్ గురించి మొన్న అసెంబ్లీలో చర్చించడమే ఒక ఉల్లంఘన కాగా, రేపు మళ్లీ చర్చిస్తామన్న అసెంబ్లీ అజెండా మరో ఉల్లంఘన. ఒక తప్పుకాదు, తప్పు మీద తప్పులు చేస్తున్నారు. దురుద్దేశాలతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కున్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ప్రలోభాలు-బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారు. 22మంది మంత్రులంతా వచ్చి ఛైర్ పర్సన్ పై దౌర్జన్యానికి దిగారు, కులం, మతం పేరుతో దూషించారు, మనవళ్ల పేరుతో బెదిరించారు. కౌన్సిల్ లో మంత్రుల వల్గర్ బిహేవియర్ రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు ఈ స్థాయిలో దుష్ప్రవర్తన గతంలో ఎప్పుడూ లేదు. మంత్రులు పోడియం బల్లలు ఎక్కడం, బాటిల్స్ విసిరేయడం, పేపర్లు చించి ఛైర్ పర్సన్ పై విసిరేయడం, కొట్టడానికి టిడిపి ఎమ్మెల్సీలపైకి రావడం, ఛైర్ పర్సన్ పై దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం ఎక్కడా చూడలేదు’’ అని ఆవేదన చెందారు.


టడిపి ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘ మున్నెన్నడూ లేనంత ఇమేజి పార్టీకి మీ వల్ల వచ్చింది. నాయకుడిగా నా ఇమేజిని మరింత పెంచారని’’ అన్నారు. ఇప్పుడు ఏ చొరవ చూపారో అదే స్ఫూర్తి ఇకపై కూడా చూపాలని, పార్టీ అధ్యక్షుడిగా మీకు అన్నివిధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఈయన (సీఎం జగన్) చెప్పినట్లు జరగాలి.. మెజారిటి లేకపోయినా కౌన్సిల్ కూడా ఈయన చెప్పినట్లే జరగాలంటారు.. పెడ ధోరణులతో రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారు. అక్కడ(అసెంబ్లీలో) స్పీకర్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ అంటారు, ఇక్కడ(కౌన్సిల్ లో) ఛైర్ పర్సన్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ కాదంటారు. అసెంబ్లీలో రింగు గీసి, అది దాటివచ్చిన వాళ్లను బైట పడేయమంటారు మార్షల్స్ తో..అదే కౌన్సిల్ లో వైసిపి మంత్రులే పోడియం బల్లలెక్కినా వాళ్లను అడ్డుకోరు మార్షల్స్..తన రూమ్ లో కరెంట్ కట్ చేస్తే, టివి ఆపేస్తే, ఇంటర్నెట్ బంద్ చేస్తే, కౌన్సిల్ గ్యాలరీకి వెళ్లిన మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేతను బైటకు వెళ్లమని అంటారు. శాసన మండలి ఇప్పటివరకు అనేక బిల్లులను ఆమోదించి పంపింది. 3 రాజధానులపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, 13జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ఈ 2 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపింది. ప్రభుత్వ విధానం ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే, రూల్ 71 ద్వారా ఆ పాలసీకి అననుకూలంగా శాసన మండలి తీర్మానించింది.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టేందుకు ఎమ్మెల్సీలు దృఢంగా నిలబడ్డారు. మంత్రుల దుర్భాషలను, దౌర్జన్యాలను ప్రతిఘటించారని’’ చంద్రబాబు ప్రశంసించారు.

"స్వయంగా వైఎస్ లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ఎంపిల కొనుగోళ్లకు పాల్పడ్డారు. తనకు డబ్బు లేకపోయినా కేరక్టర్ ఉందని చలపతిరావు అప్పట్లో ధీటుగా జవాబిచ్చి పార్టీ కోసం ధృఢంగా నిలబడ్డారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా పార్టీ కోసం ధీటుగా నిలబడ్డారు. ప్రలోభాలను తట్టుకుని, బెదిరింపులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ ఎమ్మెల్సీలంతా హీరోలు. ఏ పరిస్థితుల్లో పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చామో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ‘‘పరిటాల రవి అనుచరులుగా అండర్ గ్రవుండ్ లో కష్టాలు పడ్డారనే చమన్, పోతుల సురేష్ లను టిడిపి అధికారంలోకి రాగానే గౌరవించాం. సీతక్క, పోతుల సునీత ప్రజా క్షేత్రంలోకి రాగానే ఎన్నికల్లో టిక్కెట్లిచ్చి ప్రోత్సహించాం. సునీతకు జడ్ పిటిసి ఇచ్చాం. ఆలంపూర్ లో, చీరాలలో టిక్కెట్టిచ్చినా ఓడిపోయింది. అయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం, టిడిపి మహిళా అధ్యక్షురాలిని చేశాం. ఇన్నివిధాలా గౌరవించినా ఆమె వెళ్లిపోవడం బాధాకరం. ఇది ముందే తెలిసి భార్యాభర్తలను పిలిచి మాట్లాడినా వెళ్లిపోయారు. తమపై దౌర్జన్యాలను వివరించిన బిటి నాయుడు, బుద్దా నాగ జగదీశ్వర రావు హైదరాబాద్ లో ‘దిశ’పై జరిగినట్లే, అమరావతిపై వైసిపి నేతలు అఘాయిత్యం చేశారన్న తన వ్యాఖ్యలతో కక్షకట్టిన మంత్రి బుగ్గన తన ఇంటిపైకి 50మందిని దాడికి పంపారని బిటి నాయుడు చెప్పారు.

ఎమ్మెల్సీ ఇంటిపై దాడిచేసిన వాళ్లపై కేసు పెట్టాలని కోరినా, బాధితులపైనే అక్రమ కేసులు కట్టారని తెలిపారు. మీ(చంద్రబాబు) అండతో ఇటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నామని బిటి నాయుడు చెప్పారు. అనకాపల్లిలో తమ కోల్డ్ స్టోరేజిని సీజ్ చేశారని, అందులో రైతులు నిల్వచేసిన ఉత్పత్తులు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించ లేదని బుద్దా నాగ జగదీశ్వర రావు తెలిపారు. ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టాలని వైసిపి చేస్తున్న దుష్ప్రయత్నాలను ప్రజాకోర్టులోనే ఎండగడతాం అంటూ, ళ్ల బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
తెనాలిలో జెఏసి దీక్ష శిబిరానికి నిప్పుపెట్టడం, మహిళలను భయభ్రాంతులను చేయడం, టిడిపి ముస్లిం నేత ఖుద్దూస్ పై దాడి చేయడాన్ని ఎమ్మెల్సీలు అంతా ఖండించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో కూడా దాడులకు పాల్పడ్డారు. అక్కడి ప్రజలు హింసావిధ్వంసాలను సహించరు. అలాంటిది ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద కొందరిని రెచ్చగొట్టి టిడిపి నాయకులపై దాడులు చేసి గాయపర్చడం హేయం’’గా ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఈ రోజు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో, రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ కీలకనిర్ణయం తీసుకుంది. రేపు మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో చర్చ చేస్తాం అంటూ, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే, మండలిలో జరిగే విషయాల పై, శాసనసభలో చర్చ చెయ్యటం, రాజ్యంగ విరుద్ధమని, తెలుగుదేశం పార్టీ అభిప్రాయ పడింది. ఏకంగా మండలి చైర్మెన్ ను కించ పరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆయన ప్రసంగం అసెంబ్లీలో వేసి, ఆయన్ను అవమానించిన తీరుని తెలుగుదేశం పార్టీ ఖండించింది. అలాగే బయట మంత్రులు, మండలి చైర్మెన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టటం పై కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం పడింది. దీంతో ఈ రోజు సమావేశం అయిన తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ, రేపు జరిగే మండలి మీద చర్చకు, అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. అక్కడకు వెళ్ళినా, మాట్లాడే అవకాసం ఇవ్వరని, అడిగితే సస్పెండ్ చేస్తారని, అక్కడకు వెళ్ళిన ఉపయోగం లేదని, అందుకే రేపు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు.

tdlp 26012020 2

ఇక ఎమ్మెల్సీలు ఎవరూ, ప్రభుత్వం పెట్టిన ప్రలోభాలకు లొంగకపోవటం పై, చంద్రబాబు, అందరినీ అభినందించారు. మీ పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు చేసినా, ఎవరూ లొంగ లేదని, అందుకే జగన్ మోహన్ రెడ్డి, ఈ సమావేశానికి అందరూ వచ్చారని తెలుసుకుని, ఇక మండలి రద్దుకే మొగ్గు చూపారని, అందుకే రేపు ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశ పెట్టి, అక్కడ తీర్మానం పెట్టి, ఆ బిల్ ను, రేపు అసెంబ్లీలో పెట్టటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ అభ్యర్ధులు ఎవరూ, ఈ మూడు రోజోల్లో లొంగలేదని, అందుకే , జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఒక తప్పు కోసం, పది తప్పులు చేస్తున్నారు, ఈ క్రమంలో రాష్ట్రం నష్టపోతుంది అంటూ, తెలుగుదేశం నేతలు అభిప్రాయ పడుతున్నారు.

tdlp 26012020 3

అయితే ఈ సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి పరిపలన చూసిన మొదట్లోనే, తెలుగుదేశం పార్టీ, జగన్ ను తుగ్లక్ తో పోలుస్తూ వచ్చింది. జగన్ నిర్ణయాలు అన్నీ రివర్స్ లో ఉన్నాయని, అప్పటి తుగ్లక్ పాలన గుర్తు చేస్తుంది అంటూ, టిడిపి ఆరోపిస్తుంది వస్తుంది. ఈ నేపధ్యంలోనే, తుగ్లక్‌, హింసించే 23వ రాజు పులికేసి సినిమాలోని కొన్ని సీన్లు, ఈ రోజు టీడీఎల్పీలో, టిడిపి సిబ్బంది వేసి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చూపించింది. ఆ సినిమాల్లోని సన్నివేశాలు, ఇప్పటి జగన్ పాలన లాగే ఉన్నాయని నవ్వుకున్నారు. ముఖ్యంగా తుగ్లక్ సినిమాలో, రాజధానిని ఒకసారి మార్చటం, మళ్ళీ వెంటనే వేరే చోటుకి మార్చటం, అదేమిటి అంటే, నా ఇష్టం అంటూ, తుగ్లక్ చెప్పిన సీన్ చూసి, అందరూ నవ్వుకున్నారు. సినిమాలు చూసి నవ్వుకున్నా, మన రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తుందని అంటున్నారు.

వికేంద్రీకరణ బిల్లులు, మండలిలో పరిణామాలపై గవర్నర్ బీబీ హరి చందన్ ఆరా తీసారు. స్పీకర్ తమ్మినేని, మండలి ఛైర్మన్ షరీఫులను పిలిపించిన గవర్నర్ మాట్లాడారు. అసెంబ్లీ, మండలిలో జరిగిన పరిణామాలను స్పీకర్, ఛైర్మన్, గవర్నర్ కు వివరింకాహారు. స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ విడి విడిగా భేటీ అయ్యారు. కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పాలనా వికేం ద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో చోటు చేసు కున్న పరిణామాలపై వ్యుహత్మకంగా వ్యవహ రించనున్నది. మండలిని రద్దు చేసేందుకు ముందస్తు కసరత్తు చేస్తోందనే సమాచారం విస్తృ తంగా ప్రచారంలోకి వచ్చిన సందర్భంలో ప్రభుత్వం మరో ఎత్తుగడను వేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్ర గోప్యంగా ఉంచుతుంది.బయటకు వస్తున్న లీకులకు భిన్నంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఎ బిల్లులకు అడ్డంకిగా వున్న మండలి విషయంలో రద్దుకు పోవడమా?

sharif 26012020 2

మండలిలో ప్రభుత్వానికి అనుగుణంగా ఆకర్ష తంత్రాన్ని ప్రయోగించి తెలుగుదేశం పార్టీ సభ్యులను తనకు మద్దతుగా మలుచుకోవడానికి అడుగులు వేయడమా అనే అంశంపై తీవ్ర ఆలోచనల్లో జగన్ వున్నారంటున్నారు. అందులో భాగంగానే ఆయన శనివారం ఉదయం మండలి రద్దుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తోనే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స, కురసాల కన్నబాబులతో ఆయన సమాలోచన జరిపారు. ఈ సందర్భలో వారి నడుమ శాసనమండలిని రద్దు చేస్తూ చోటు చేసుకునే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై చర్చ జరిగిందంటున్నారు. 2021 నాటికి అధికార పార్టీకి మండలిలో మెజార్టీ లభించే అవకాశా లున్నందున మండలిని రద్దు చేయడం ఉప యుక్తమా! ఆకర్షక మంత్రాన్ని ప్రయోగం చడమా అనే అంశంపై చర్చ జరిగిందంటున్నా రు.

sharif 26012020 3

ఇదే సందర్భంలో శాసనమండలిలో చైర్మన్‌గా వున్న షరీప్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఇంకా సెలెక్ట్ కంపెనీకి పంవలేదని వ్యాఖ్యానించిన అంశం ఆధారంగా అడుగులు ముందుకు వేయడానికి వీలుందా అని ముఖ్యమంత్రి జగన్, ఎజి సుబ్రహ్మణంను అడిగినట్లు సమాచారం. నిన్న శాసనమండలి చైర్మన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లు ప్రాసెస్ లో ఉన్నందునే సెలక్ట్ కమిటీకి పంపించామని ఆయన స్పష్టం చేశారు. తన విచక్షణాధికారం ఉపయోగించానని షరీఫ్ చెప్పారు. రూల్ 154 కింద సెలక్ట్ కమిటీకి పంపించానని పేర్కొన్నారు. పార్లమెంటరీ చట్టాల వరిధిలో శాసనమండలి చైర్మన్ అభిశంసన చేసే అవకాశాలపై వున్న అవ కాశాలపైన ముఖ్యమంత్రి చర్చించారం టున్నారు. అయితే ఈ గొడవంతటి కన్నా అస్సలు మండలిని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుందామని బుగ్గన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మూడు రోజుల నుంచి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు, విపక్ష ఎమ్మెల్సీలు లొంగక పోవటంతో, ఇక తప్పక, మండలి విషయంలో, వైసీపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవటానికి రెడీ అవుతుంది. రేపు, మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్ సెహ్సారు. రేపు ఉదయం 09.30కి ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. మండలి రద్దు తీర్మానానికి కేబినేట్ ఆమోదం తెలపనున్నది. మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ విరమించుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే, విపక్ష ఎమ్మెల్సీలను తమ వైపు లాగేసి, మండలి చైర్మెన్ పై అవిస్వాసం పెట్టి, ఆయన్ను దింపి, తమకు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుందామని వైసీపీ భావించింది. ఇలా చేసిన తరువాత, సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ కూడా వారం పది రోజుల్లో ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది. గురువారం అసెంబ్లీలో చర్చించిన దగ్గర నుంచి, అధికార పార్టీ అనేక బెదిరింపులకు పాల్పడింది. మండలి రద్దు చేస్తున్నాం అంటూ, ముందు విపక్ష ఎమ్మెల్సీలను బెదిరించింది. టిడిపి కాకుండా, పీడీఎఫ్ సభ్యులను కూడా బెదిరించింది.

cabinet 26012020 2

అయితే ఎవరూ లొంగలేదు. మండలి రద్దు అనైతిక చర్య అని అన్నారు. అలాగే సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే దాకా ప్రభుత్వం ఆగాలి కదా అని కూడా అన్నారు. ప్రభుత్వం ఏది చేస్తే అది మేము ఆమోదించాలా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష కు తెర లేపారు. అయితే, మూడు రోజుల నుంచి, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, బెదిరింపులు చేసినా, ఎవరూ లొంగలేదని సమాచారం. ఈ రోజు టిడిపి మీటింగ్ పెడితే, 23 మంది వచ్చారు. 5 గురు వివిధ కారణాల వల్ల రాలేమని ముందే చెప్పారు. దీంతో వైసీపీకి క్లారిటీ వచ్చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాదని తెలిసి పోయింది. దీంతో, వైసీపీ ప్రభుత్వం మండలి రద్దుకే మొగ్గు చూపుతుంది. మండలి రద్దు చేస్తూ, రేపు క్యాబినెట్ తీర్మానం పెట్టి, అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతారు.

cabinet 26012020 3

అయితే, సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇబ్బంది పడకుండా, జగన్ మరో ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. అదే, జోన్‌ల అభివృద్ధి కమిటీ. మండలిని రద్దు చేసిన తరువాత, జోన్‌ల అభివృద్ధి కమిటీల్లో, నామినేటెడ్‌ సభ్యుల సంఖ్యను పెంచి వారికి ఎమ్మెల్సీ హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో టిక్కెట్ లు ఇవ్వలేని వారికి, మండలిలో అవకాసం ఇస్తాం అని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మండలి రద్దు చేస్తూ ఉండటంతో, దానికి ప్రత్యామ్న్యాయం జగన్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండళ్ల అభివృద్ధి కమిటీల్లో నామినేటెడ్‌ సభ్యుల సంఖ్యను నాలుగు నుండి 10 లోపు పెంచితే అందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read