దేశవ్యాప్తంగా ఏపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వచ్చేసిందని, ఆరాష్ట్రం అభివృద్ధిలో, ఎకానమీలో ముందుకెళ్లే పరిస్థితిలేదనుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే డెమోక్రసీలో ఉన్నామా...లేక జగనోకసి, అంటే జగన్‌ కసిలో ఉన్నామా అనే సందేహం రాష్ట్రప్రజలందరిలో ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమెల్సీ అశోక్‌బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవాసులపై కసి తీర్చుకోవడానికే జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అధికారంలోకి రావడానికి ఒక్కఛాన్సంటూ బతిమాలి, వరమిచ్చిన ప్రజలపై, రాష్ట్రంపై తన భస్మాసుర హస్తాన్ని పెట్టాలని చూస్తున్నాడని, ఆయన బారినుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలన్నారు. మండలి రద్దు, పునరు ద్ధరణ అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండవన్న యనమల, అసెంబ్లీలో ఆర్టికల్‌-169 కింద తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు.

అసెంబ్లీ పంపిన తీర్మానంపై కేంద్రం బిల్లుని తయారుచేసి లోక్‌సభకు పంపుతుందని, తరువాత అది రాజ్యసభకు, రాష్ట్రపతి ముందుకు వెళుతుందన్నారు. ఆర్టికల్‌ 174-2 (బీ) కింద అసెంబ్లీని రద్దుచేసే అధికారం గవర్నర్‌కు ఉందని, ప్రజల ఆలోచనలకు వ్యతిరేంగా వెళుతోన్న ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అధికారం ఆయనకు ఉందన్నారు. ప్రభుత్వం మండలిని రద్దుచేస్తే, గవర్నర్‌ అసెంబ్లీని రద్దుచేయడంద్వారా ఎన్నికలకు వెళితే ప్రజలు ఎవరిపక్షమో తేలుతుం దని యనమల స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించే అధికారం రాష్ట్రాలకు ఉండబోదని, పీపీఏల విషయంలో ఏకపక్షంగా ముందుకెళ్లిన ప్రభుత్వా నికి ఎలాంటిపరిస్థితి ఎదురైందో అందరికీ తెలుసునన్నారు. ఆర్టికల్‌-257ప్రకారం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని, కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే, ఆర్టికల్‌-356కింద చర్యలు తీసుకునే అధికారం కూడా వారికి ఉందన్నారు. బిల్లుని సెలెక్ట్‌ కమిటీకి పంపేవిషయంలో, తనకున్న విచక్షణాధికారంతో ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నాడని, ఆయన అధికారాలను ప్రశ్నించేహక్కు ఎవరికీ ఉండదని, ఛైర్మన్‌ న్యాయబద్ధంగానే నిర్ణయం తీసుకున్నాడని యనమల తెలిపారు.

బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న సాక్షి...ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేయడం, కౌన్సిల్‌ తిరస్కరించడం, శాఖల తరలింపుని హైకోర్టు తప్పపట్టడం జరిగినా కూడా సాక్షి మీడియాలో ఇంకా తప్పుడువాదనలు చేస్తూనే ఉన్నారని మాజీమంత్రి మండిపడ్డారు. బిల్లుని సెలెక్ట్‌కమిటీకి పంపలేదని రాయడం, బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న జగన్‌ సొంతమీడియాకే చెల్లిందన్నారు. బుర్రలేనిమంత్రులంతా అసెంబ్లీలో గంటలో ఆమోదించిన బిల్లుని మండలి గుడ్డిగా ఆమోదించాలా అని రామకృష్ణుడు ప్రశ్నించారు. సెలెక్ట్‌కమిటీలో 9 నుంచి 15మంది సభ్యులుంటారని, వారంతా ప్రజాభిప్రాయాలు తీసుకుంటారని, అందుకు అవసరమైన కాలవ్యవధిని మండలే నిర్ణయిస్తుందని యనమల పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయం కోరడం తప్పా...? అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని రిజెక్ట్‌చేశారంటున్న మంత్రులంతా మిడిమిడిజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మండలి బిల్లుని ప్రజాభిప్రాయం కోరమని చెప్పింది తప్ప ఎక్కడా దాన్ని తిరస్కరించలేదని యనమల స్పష్టంచేశారు. ఎస్సీకమిషన్‌, ఇంగ్లీషు మీడియం బిల్లుల విషయంలో కూడా ఇలానే తప్పుడు ప్రచారంచేశారన్నారు. వాటిని ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, ఎస్సీ కమిషన్‌ బిల్లులో బీసీకమిషన్‌ బిల్‌ మాదిరే కేటగిరీలు చేయాలని సూచించామని, ఇంగ్లీషు మీడియం బిల్లులో తెలుగు బోధనను ఎంపికచేసుకనే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వాలని సూచించామన్నారు. ఆ రెండుబిల్లులను ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, వాటిని తిప్పిపంపా క తిరిగి పెద్దలసభకు పంపేముందు మనీబిల్లులుగా మార్చారన్నారు. 3రాజధానుల బిల్లు మనీబిల్లా..ఆర్డినరీ బిల్లా అని హైకోర్టుకూడా ప్రశ్నించిందన్నారు.

దేశరాజధాని ఏదంటే ఢిల్లీ అని చిన్నపిల్లాడు కూడా చెప్తాడని, రాజ్యాంగంలో కేపిటల్‌ అనేపదం లేకుంటే, ఆర్టికల్‌ 239 (ఏ) ప్రకారం నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ అనేపదం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. రాజ్యాంగం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి దాని గురించి ఏంతెలుసునన్నారు. మామూలు చదువే చదవని వ్యక్తికి, రాజ్యాం గం చదివేంతజ్ఞానం ఎక్కడనుంచి వస్తుందని యనమల ఎద్దేవాచేశారు. తప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదన్నారు. టీడీపీ హాయాంలో తరచూ దావోస్‌పర్యటనకు వెళ్లి, పెట్టుబడులు రాబట్టామని, ఈప్రభుత్వం వచ్చాక అలాంటివేమీ లేవన్నారు. రేపో, ఎల్లుండో న్యాయస్థానంలో జగన్‌కేసులపై వాదనలు ప్రారంభమ వుతాయని, ఏ1, ఏ2, ఏ3లంతా ఒకరితర్వాత ఒకరు కోర్టుబోనులో నిల్చోవడం ఖాయమని యనమల తేల్చిచెప్పారు. ఫెమా, మనీలాండరింగ్‌ మోసాలకు గాను జగన్‌కు శిక్షపడటం ఖాయమని, ప్రజాధ నాన్ని దోచుకొని, 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తిని ఇన్‌కెమరాద్వారా విచారించడం సరికాదన్నారు. అత్యాచారకేసుల విచారణలో మాత్రమే ఇన్‌కెమెరా విధానాన్ని అవలం భిస్తారని, జగన్‌ కేసులవిచారణలో బహిరంగవిచారణే జరపాలని, న్యాయస్థానాలు ఈదిశగా పునరాలోచించాలని యనమల విజ్ఞప్తిచేశారు. హిట్లర్‌, ముస్సోలినీల మాదిరి గా తాను అనుకున్నదే జరగాలన్న ఉక్రోషం జగన్‌లో కనిపిస్తోందన్నారు.

ఇన్నాళ్ళు ప్రశాంతంగా, ఎలాంటి అహింస లేకుండా, అమరావతి ఉద్యమం సాగుతుంది. భూములు ఇచ్చిన రైతులు, గత 35 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడా అదుపు తప్పలేదు. అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమంలో, వాళ్ళు దెబ్బలు తిన్నారే కాని, ప్రభుత్వ ఆస్తులుని ఏమి చెయ్యలేదు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమాన్ని, హింసాత్మికం చెయ్యటానికి, నిజమైన పైడ్ ఆర్టిస్ట్ లు బయలు దేరారు. ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలిలో, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు ముక్కల రాజధాని వద్దని, తెనాలి మున్సిపల్‌ కార్యాలయం దగ్గర, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వచించాయి. తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని, గత కొన్ని రోజులుగా, నిరసన చేపడుతున్నారు. అయితే ఈ రోజు అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, వీరంగం సృష్టించారు. తమకు ఈ రాష్ట్రంలో, ఏదైనా చేసే లైసెన్స్ ఉంది అనే విధంగా, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు.

tenali 25012020 2

ముందుగా, దీక్షా శిబిరం పై, వైసీపీ కార్యకర్తలు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. తరువాత, దీక్షా శిబిరానికి నిప్పు పెట్టరు. దీంతో వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు, వారిని ఆపే ప్రయత్నంలో తోపులాట జరిగింది. అక్కడ దీక్షలో ఉన్న మహిళలకు కూడా గాయాలు అయ్యాయి. దీక్షా శిబిరానికి మంటలు వ్యాపించకుండా, మంటలు ఆర్పి వేసారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ క్రమంలోనే, తెనాలి తెదేపా పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఖుద్దూస్‌ను కూడా, వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అక్కడు రాగా, ఆయన పై కూడా, కోడి గుడ్లు వేసి దాడి చేసారు. ఈ క్రమంలో అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా ఉన్నారు.

tenali 25012020 3

మండలిలో బిల్ ఓడిపోవటంతో, వైసీపీ ఉన్మాది చేష్టలు బయట పడుతున్నాయని, ఇవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయని, టిడిపి అంటుంది. దాడి పై, నారా లోకేష్ ట్విట్టర్ లో స్పండించారు. "రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా YS Jagan Mohan Reddy గారు మరింత దిగజారారు. ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే వైకాపా రౌడీలను రంగంలోకి దింపి శాంతియుతంగా రైతులు దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారు.రైతులు, మహిళల పై విచక్షణారహితంగా వైకాపా గుండాలు దాడులు చేసారు. తెనాలిలో వైకాపా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ గారి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరు.రైతుల పై చెయ్యి వేసిన వాళ్ళు నాశనం అయిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోండి జగన్ గారు." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

రాష్ట్రవ్యాప్తంగా శాసన మండలి పై వైఎస్ జగన్మోహన రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. శాసనసభలో సోమవారం ఏమి జరగబోతోందనే చర్చ సర్వత్రా నెలకొన్నది. అన్ని రాజకీయ పక్షాల్లో ఇప్పుడదే చర్చనీ యాంశంగా మారింది. మండలి రద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారనే దానిపై ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేక దృష్టిసారించిన నేపధ్యంలో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. మండలి రద్దుపై శనివారం పార్టీలో సమగ్రంగా చర్చించేందుకు బీజేపీ నేతలు నిర్ణయించి నట్లు తెలిసింది. అప్పటి వరకు నేతలు ఎవరూ శాసనమండలి రద్దుపై అనుకూల, వ్యతిరేక ప్రకటనలు చేయవద్దంటూ పార్టీపరంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు రాజధానులపై ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసా గించాలనేది బీజేపీడిమాండ్. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము సుముఖమే తప్ప పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకమంటూ తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెపుతున్నారు.

mlc 25012020 2

తెదేపా, వామపక్షాలు సహా అన్ని పార్టీలు మండలి రద్దుపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు బీజేపీ నేతలు మాత్రం స్పందించ లేదు. బీజేపీ తరుపున ఎమ్మెల్సీ లుగా సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఇటీవల తెదేపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం మూడుకు చేరింది. ఢిల్లీలో కీలక నేతలు రానున్న రోజుల్లో జనసేనతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళనా కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరుపార్టీలకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉన్నారు.గత మూడు రోజులుగా వీరు బీజేపీ అగ్రనేతలతో భవిష్యత్ ఉమ్మడి వ్యూహాలపై చర్చించడంతో పాటు కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తొలి కార్యక్రమంగా ఫిబ్రవరి 2న గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ లోని స్వరాజ్య మైదానం వరకు రాజధాని మార్పును వ్యతి రేకిస్తూ 'లాంగ్ మార్చ' ప్రకటిం చారు.

mlc 25012020 3 style=

జగన్ ప్రకటన చేసిన సమయంలో ఢిల్లీలో ఉన్న నేతలు బీజేపీ పెద్దలతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వీరంతా శుక్రవారం రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు. కీలక నేతలు వచ్చిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో భేటీ కానున్నారు. ముఖ్య నేతలతో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చ నున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా ఓ నిర్ణయానికి వచ్చి మండలి రద్దు అంశంపై స్పందించనున్నారు. విపక్ష ఎమ్మెల్సీలను బెదిరించేందుకే మండలి రద్దు అస్త్రం ముఖ్యమంత్రి జగన్ ప్రయోగించారనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మండలిలో వికేంద్రీకరణ బిల్లు వీగిపోవడంతో రద్దు అంశాన్ని ప్రయోగించడం ద్వారా అనుకూల వైఖరికి వచ్చే విధంగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ పరంగా స్పష్టమైన వైఖరి తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.

ఈ రోజుల్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రోనిక్ మీడియా ఎలా పని చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఎక్కడో ఒకటి, రెండు తప్పితే, అన్ని సంస్థలు, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయటం, వారి అజెండా మాత్రమే ప్రమోట్ చెయ్యటం, ఇలా అయిపొయింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోనే ఇలా ఉంది. అయితే, ఈ ధోరణి ఇక్కడితో ఆగితే పరవాలేదు. ఎందుకంటే, ఒక పార్టీ లైన్ తీసుకుని వారికి అనుకూలంగా వార్తలు రాయటం వల్ల, ప్రజలకు ఒరిగింది ఏమి ఉండదు. ప్రజలకు కూడా అర్ధమవుతుంది. కాని, ఫేక్ న్యూస్ రాయటం, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ప్రజలను నమ్మిస్తూ, కధనాలు రాయటం,మాత్రం సమాజానికి హానికరమే. కొంత మంది ఆ తప్పుడు వార్త నిజం అని నమ్మినా, అపార నష్టం జరుగుతుంది. కన్ని సార్లు, కొంత మంది మానం, అభిమానం, ఉన్న వ్యక్తులు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఆ సంఘటనలు కూడా చూసాం. ఒక వ్యక్తీ పై, పదే పదే తప్పుడు కధనాలు రాసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, బలవంమరరానికి కూడా వీళ్ళు కారకులు అవుతారు. అయితే, మన రాష్ట్రంలో ఇలాంటి వార్తల వల్ల తెలుగుదేశం బాగా నష్టపోయింది. ఎన్నికల తరువాత కూడా ఇలాంటి వార్తలే వస్తూ ఉండటంతో, ఇక వాటి పై న్యాయ పరంగా వెళ్లేందుకు సిద్ధమవుతుంది.

తెలుగుదిన‌ప‌త్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లైంది. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో దాఖ‌లైన వ్యాజ్యంలో త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019 అక్టోబ‌ర్ 22న ``చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి`` శీర్షిక‌తో ఓ క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. అయితే ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగుస‌మాధానం వ‌చ్చింది.

దీనిపై సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

Advertisements

Latest Articles

Most Read