రేపు శాసనమండలి పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. గురువారం రోజున, శాసనమండలి అవసరం లేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో చర్చించారు. అదే రోజున శాసనమండలి రద్దు చేస్తూ, బిల్ పెడతారని అందరూ అనుకున్నారు. అయితే, ఎందుకో కాని, గురువారం సభ వాయిదా వేసి, అనూహ్యంగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించి, సోమవారం కలుద్దామని జగన్ చెప్పటంతో, స్పీకర్ కూడా దానికి సరే అన్నారు. అయితే ఈ మూడు రోజులు, విపక్ష ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టటానికి, జగన్ ప్రయత్నిస్తున్నారు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. విపక్ష ఎమ్మెల్సీలను తమ వైపుకు తిప్పుకుని, మండలి చైర్మెన్ పై అవిస్వాసం పెట్టి, సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ని, వారం పది రోజుల్లోనే తీసుకు వచ్చే ప్లాన్ వేసారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ నేపధ్యంలో, మండలి రద్దు, వైసీపీ ప్రలోభాలు, తదితర అంశాల పై, చంద్రబాబు ఈ రోజు టిడిపి ఆఫీస్ లో, ఎమ్మెల్సీలతో సమావేశం కానుకున్నారు.

mlc 26012020 2

ఈ రోజు మధ్యానం ఒంటి గంటకు, మంగళగిరిలో, ఉన్న తెలుగుదేశం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎవరైనా గైర్హాజరు అవుతారా, వైసీపీ ప్రలోభాలకు ఎవరైనా లోంగారా అనే విషయం పై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది. అయితే ఈ సమావేశానికి కంటే ముందే, ఐదుగురు ఎమ్మెల్సీలు తాము గైర్హాజరు అవుతున్నట్టు పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ, ఈ రోజు జరిగే సమావేశానికి రాలేము అంటూ, సమాచారం అందించారు. దీనికి వారు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు వర్ధంతి కార్యక్రమం ఉందని, తాను ఈ రోజు రాలేనని గాలి సరస్వతి సమాచారం ఇచ్చారు.

mlc 26012020 3

అలాగే, కేఈ ప్రభాకర్ ఇంట్లో, వాళ్ళ మేనత్త కర్మ కార్యక్రమం ఉండటంతో, ఆయన కూడా రాలేనని చెప్పారు. కేఈ ప్రభాకర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి సోదరుడు. ఇక తనకు, అనారోగ్యం ఉన్న కారణంగా రాలేనని శత్రుచర్ల చెప్పారు. ఆయన మొన్న కూడా అనారోగ్యం ఉన్నా సభకు వచ్చారు, సభ ఎప్పుడూ పెడితే అప్పుడు వస్తానని సమాచారం ఇచ్చారు. ఇక తిప్పేస్వామి, తన ఇంట్లో శుభకార్యం ఉందని, పెళ్లి ఉండటంతో రాలేనని కబురు పమించారు. ఇక మరో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, విదేశాల్లో ఉండటంతో, రాలేనని చెప్పారు. అయితే, ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీకి విధేయతగా ఉండే వారే కాబట్టి, టిడిపి పెద్దగా ఆందోళన చెందలేదు. సమావేశానికి ఇంకా ఎవరైనా హాజరుకాకుండా ఉంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అనే టాపిక్ నడుస్తుంది. ఒక రాజధాని వద్దు , మూడు ముక్కల రాజధాని కావాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, పరిపాలనా వికేంద్రీకరణ అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. విశాఖపట్నంలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూల్ లో హైకోర్ట్ అంటూ వింత వాదన ముందు పెట్టరు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీతో పాటు, వివిధ వర్గాలు కూడా, పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారు. కేంద్రం నుంచి వచ్చే జాతీయ విద్యాసంస్థలు, ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి పెట్టరు. అలాగే విశాఖపట్నంలో, ఐటి, ఫైనానిష్యల్ కంపెనీలు పెట్టించారు. తిరుపతిలో ఎలెక్ట్రోనిక్ హబ్ చేసారు. అనంతపురంలో ఆటోమొబైల్ హబ్ చేసారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టారు. గోదావరి జిల్లాల్లో ఆక్వాని ప్రోమోట్ చేసారు.

amaravati 25012020 2

ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధిని మొదలు పెట్టి, చూపించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం, అవేమీ జరగలేదని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా, మూడు ముక్కల రాజధాని చేస్తేనే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తుంది. కియా లాంటి కంపెనీలు వస్తే ప్రాంతం అభివృద్ధి చెండుతునా, లేక ఒక వంద ఉద్యోగాలు వచ్చే హైకోర్ట్, 50 ఉద్యోగాలు ఉండే అసెంబ్లీ వల్ల అభివృద్ధి చెందుతుందా అని టిడిపి ప్రశ్నిస్తుంది. అయితే, టిడిపి అభివృద్ధి ఏమి చెయ్యలేదు అని చెప్తున్న సమయంలో, అది కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి, స్మార్ట్ సిటీకి వచ్చిన అవార్డులు, ఇప్పుడు టిడిపి చేసిన పనిని మరోసారి, ప్రజలకు గుర్తు చేస్తున్నాయి. అటు అమరావతికి, ఇటు విశాఖపట్నంకు కూడా, చంద్రబాబు సమానంగా , ఇంకా చెప్పాలంటే, వైజాగ్ నే ఎక్కువ అభివృద్ధి చేసారని చెప్పొచ్చు.

amaravati 25012020 3

శుక్రవారం వంద 'స్మార్ట్' నగరాల మూడవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో అమరావతికి, వైజాగ్ కి అవార్డులు వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ లోని ముడసర్లోవ రిజర్వాయర్ లో, 2 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్కు ‘వినూత్న ఆలోచన అవార్డు’ దక్కింది. ఇక మూడో విడత ఎంపిక చేసిన పది స్మార్ట్‌ సిటీల్లో, ప్రాజెక్టుల అమలులో మెరుగైన ప్రతిభ చూపినందుకు అమరావతికి అవార్డు వచ్చింది. ఇక మొదటి రౌండ్‌లో స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 20 నగరాల్లో విశాఖపట్నం స్మార్ట్‌సిటీకి ఉత్తమ అవార్డు లభించింది. అమరావతి పై ఒక పక్క అనిశ్చితి ఉన్న వేళ, ప్రభుత్వ పెద్దలే, అమరావతిని స్మశానం అని, ఎడారి అని, అలాగే అక్కడ పందులు, కుక్కలు తిరుగుతాయి అంటూ చెప్తున్న వేళ, ఏకంగా కేంద్రమే ఇప్పుడు అమరావతికి అవార్డ్ ఇస్తూ, విశాఖను చంద్రబాబు ఎంతలా అభివృద్ధి చేస్తున్నారో విశాఖకు రెండు అవార్డులు ఇచ్చి, సమాధానం చెప్పింది.

తనపై ఉన్న కేసులవిచారణ ముంచుకొస్తుండటంతో రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డిలో తత్తరపాటు, కలవరం మొదలయ్యాయని, ఆకంగారులోనే తానేం నిర్ణయాలు తీసుకుంటున్నాడో తెలియని అయోమయావస్థలో ఆయన ఉన్నాడని టీడీపీ సీనియర్‌ నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ముఖ్య మంత్రి అయిన మే30 నుంచి జనవరి 25 (2020)వరకు 30శుక్రవారాలు వస్తే, ఒక్కవారమే జగన్‌ కోర్టుకు హాజరయ్యాడని, ఇకపై తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ందేనని సీబీఐ న్యాయస్థానం స్పష్టంచేయడంతో జగన్‌ హానీమూన్‌ అంకం ముగిసినట్లే నని వర్ల ఎద్దేవాచేశారు. 2012లో జగన్‌ సీబీఐ, ఈడీలు ఛార్జ్‌షీట్లు వేస్తే ఇప్పటివరకు విచారణ సాగుతూనే ఉండటం సుప్రీంఆదేశాలకు విరుద్ధమని వర్ల తెలిపారు. ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయనేతలు కేసుల్లో ఉన్నప్పుడు సదరు కేసుల విచారణ ఏడాదిలో పూర్తవ్వాలని, అవసరమైతే రోజువారీ విచారణజరపాలని 2014లో సుప్రీంకో ర్టు స్పష్టంచేసిందని, ఒక్క జగన్‌కేసులవిచారణలో తప్ప, అన్ని కేసుల్లో సుప్రీం ఆదేశాలు అమలయ్యాయని వర్ల పేర్కొన్నారు. ప్రధాని మోదీకూడా నేరచరిత ఉన్న రాజకీయ నేతలపై ఏడాదిలోనే విచారణపూర్తిచేసి వారిని శిక్షిస్తామని చెప్పారన్నారు.

జగన్మోహన్‌రెడ్డి కోర్టులను నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆయన అనేకకేసుల్లో ముద్దాయినన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడని వర్ల తెలిపారు. కోర్టుకు హాజరవ్వకుండా ఉండటానికే జగన్‌ శుక్రవారం నాడు పనులు పెట్టుకుంటున్నాడన్నారు. అన్నిరకాల అవినీతులకు మూలమైన సీఎం కార్యాలయాన్ని వదిలేసి, ఏసీబీవారు రెవెన్యూకార్యాలయాలపై దాడులుచేస్తే ఉపయోగం ఉండదన్నారు. జగన్‌తోటి ముద్దాయి అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలోని బెల్‌గ్రిడ్‌లో పోలీస్‌ నిర్బంధంలో ఉన్నాడని, ఆయన్ని ఆదేశం నుంచి రప్పించడానికి 22మంది వైసీపీఎంపీలు పలుమార్లు కేంద్ర విదేశాంగశాఖా మంత్రి జైశంకర్‌ను, కేంద్రహోంశాఖ కార్యదర్శిని కలిశారని,ఇంతకంటేఘోరం ఇంకెక్కడాఉండబోదని వర్ల అభిప్రాయపడ్డారు. వాన్‌పిక్‌ కేసులో రస్‌అల్‌ఖైమా కంపెనీని మోసగించిన నేరానికి సదరు కంపెనీ ఫిర్యాదుతో ప్రసాద్‌ని నిర్బంధించడం జరిగిందని, గతేడాది జూలై 30న ఆయన్ని సెర్బియాలో నిర్బంధించడం జరిగిందన్నారు. ముఖ్యమ ంత్రి తెలివితేటలన్నీ తనతోటి ముద్దాయిలను విడిపించుకోవడానికి, తనకేసుల విచారణ కు ఎలాంటి లాయర్లను నియమించుకోవాలన్న ఆలోచనలకే సరిపోతున్నాయన్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించడానికి వైసీపీఎంపీలు, విజయసాయిరెడ్డిలు పలుమార్లు ఎందుకు కేంద్ర విదేశాంగమంత్రిని ఎందుకుకలిశారనే దానిపై రాష్ట్రప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. నిమ్మగడ్డను భారత్‌కు రప్పించడంకోసం ఇద్దరు తెలుగుహీరోలు కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నారన్నారు. జగన్‌కేసుల విషయంలో సీబీఐ ఆరుదేశాల కు లెటర్‌ ఆఫ్‌ రెగోలేటరీ ఇచ్చిందని, మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయాదేశాల్లో జగన్‌ ఏంచేశాడనే వివరాలను సీబీఐకోరిందన్నారు. ఆరుదేశాల నుంచి సమాచారం రానుండటంతో జగన్‌లో తత్తరపాటు, కలవరం అధికమయ్యాయన్నారు. జగన్‌పై సీబీఐ 11ఛార్జ్‌షీట్లు, ఈడీ 5ఛార్జ్‌షీట్లు నమోదు చేసిందని, 120 (బీ) నేరపూరిత కుట్రకుపాల్పడటం, 420 (మోసం చేయడం), 409 (నమ్మకద్రోహం), 477 (అకౌంట్ల తారుమారు) వంటి అనేకనేరాలకు పాల్పడ్డట్లు స్పష్టంచేయడం జరిగిందని వర్ల వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు ప్రజలనుంచి కాజేసిన 25వేల ఎకరాలను అప్పగిస్తే, ఆయన జగన్‌కు చెందిన సాక్షిలో రూ.834కోట్లు పెట్టుబడి పెట్టాడన్నారు. నిమ్మగడ్డ దొరికితే తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ఆయన్ని విడిపించడానికి జగన్‌, విజయసాయిరెడ్డిలు కేంద్రమంత్రిచుట్టూ ప్రదక్షిణలు చేశారని వర్ల దుయ్యబట్టారు బినామీ యాక్ట్‌ కింద జగన్‌పై కేసునమోదు చేయాలి.

జగన్‌కు ఉన్న ఆస్తులన్నీ ఆయన బినామీలపేరుతోనే ఉన్నాయని, ఇథోపియా ఇన్‌ఫ్రా, కేప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, హరీశ్‌ఇన్‌ఫ్రాల పేరుతో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ ఉందని, ఆ మూడు జగన్‌ బినామీ కంపెనీలా అని వర్ల నిలదీశారు. అలానే తాడేపల్లిలోని నివాసం, బెంగుళూరులోని ప్యాలెస్‌లు కూడా జగన్‌ తనబినామీల పేరుతోనే ఉంచాడ న్నారు. ఈ విధంగా ప్రజలనుంచి కొట్టేసిన ఆస్తులు, భూములను బినామీలపేరుతో ఉంచి అనుభవిస్తున్న జగన్‌పై కేంద్రం బినామీయాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్‌చేశారు. ఎవరు ఎన్నిసార్లు అడిగినా జగన్‌ తనఆస్తుల ప్రకటన ఎందుకు చేయడంలేదో సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్‌ పోడియంని చుట్టుముట్టిన టీడీపీ సభ్యుల్ని ఎత్తి బయటపడేయాలన్న ముఖ్యమంత్రి, మండలిలో లారీ ఎక్కినట్లుగా ఛైర్మన్‌బల్లపైకి ఎక్కిన తనమంత్రులను ఏంచేస్తాడో చెప్పాలని వర్ల ప్రశ్నించారు. (అసెంబ్లీలో జగన్‌మాట్లాడినమాటల్ని, మండలిలో మంత్రులుచేసిన వీరంగాన్ని వీడియో రూపంలో వర్ల విలేకరులకు ప్రదర్శించారు.) తన నిర్ణయం (3రాజధానులు) తప్పని జగన్‌కు తెలుసునని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే తత్తరపాటులో భాగంగా తప్పటడుగు లు వేస్తున్నాడన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఉండగా, ప్రజల్ని ఓడించడానికి ఢిల్లీ నుంచి ముకుల్‌రోహత్గీని ఎందుకు తీసుకొచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

పాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లు ఆమోదానికి శాసనమండలిలో ప్రతికూల వరిస్థితులు తలెత్తడంతో భవిష్యత్తు కార్యచరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి ని సారించింది. జగన్ శాసనమండలిలో బిల్లులపై ఎదురైన పరిస్థితులకు దీటుగా స్పందించేందుకు వీలుగా తన మంత్రివర్గ సహచరలు, పార్టీ ముఖ్యకార్యకర్తలతో మంత్రాంగం చేసారు. ఈ విషయంపై ఆయన ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించే అంశంపై పలువురు కీలకమైన సూచనలు చేసారంటున్నారు. ఆయన అక్కడ నుంచే ఇక తన కార్యకలపాలు చవట్టేందుకు సంసిద్ధమయ్యారంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలనే పట్టుదలను ఆయన స్పష్టీకరిస్తున్నారు. ఆయన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్ర నాద్, బొత్స సత్యనారాయణ, మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ముఖ్యమంత్రి సహచరులు విజయసాయిరెడ్డి, వైవిసుబ్బారెడ్డి తదితరులు ఈ విషయంలో టిడిపి శాసనమండలిలో అనుసరించిన వ్యుహన్ని తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారంటున్నారు.

jagaan 25012020 2

సమావేశంలో మండలిలో చోటు చేసుకున్న పరిణామాలను అనుసరించి కీలక సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు పలువురు న్యాయనివుణలతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలు స్తోంది, న్యాయస్థానాలను ఆశ్రయించి రాజధానుల అంశానికి ఇబ్బంది కలిగించాలని ఇంకా విపక్షం భావిస్తున్న అంశాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. శాసనమండలిలో చోటు చేసు కున్న అంశాలకు అనుగుణంగా ఆయన అస్సలు మండలిని రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చారంటున్నారు. మండలిని రద్దు చేయ కుండానే నిర్దిష్ట వ్యవధిని తీసుకుని ఆకర్ష కార్యక్రమం ద్వారా విపక్షం ఎంఎల్‌సిలను తమ పార్టీలో కలుపుకోవచ్చుననే కొందరి సహ చరుల ప్రతిపాదన పట్ల జగన్ సై అన్నట్టు తెలుస్తుంది.

jagaan 250120203

ఇందులో భాగంగా, కొంత మంది మంత్రులు, నిన్నటి నుంచి, టిడిపి, పీడీఎఫ్ ఎమ్మెల్సీల పై గురి పెట్టారని వార్తలు వస్తున్నాయి. విపక్ష ఎమ్మెల్సీలను, తమ వైపు తిప్పుకుని, మండలిని మరోసారి సమావేశ పరిచి, ప్రస్తుతం ఉన్న మండలి చైర్మెన్ పై, అవిస్వాసం పెట్టి, ఆయన్ను దించేసి, ఆయన స్థానంలో తమకు అనుకూలమైన వారిని పెట్టి, సెలెక్ట్ కమిటీని రద్దు చెయ్యటం కాని, లేక సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వారం, పది రోజుల్లో వచ్చే విధంగా చేయాలని, వైసీపీ ప్లాన్ గా తెలుస్తుంది. అయితే ఈ విధానం వల్ల, జగన్ వైఖరి ప్రజలకు ఎక్ష్పొజ్ అవుతుందని, విపక్షాలకు పోయేది ఏమి ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు కాకపొతే, మూడు నెలలకు అయినా జగన్ అనుకున్నది చేస్తారని, కాకపొతే, ఇప్పటికే టిడిపి ఏమి చెయ్యగలుగుతుంది, ఎలా పోరాడింది అనే విషయం ప్రజలు గమనించారని, ఇప్పుడు జగన్ విపక్ష ఎమ్మెల్సీలను లాగితే, తాను చెప్పిన మాటలకే, తాను వ్యక్తిరేకంగా చేస్తున్నారని, ప్రజలకు అర్ధమవుతుందని, అలా కాకుండా శాసనమండలి రద్దు చేసినా, జగన్ కే నష్టం అని టిడిపి చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read