అసలు వంశీ ఏ పార్టీలో చేరుతారో, ఆయన అనుచరులుకే తెలియని పరిస్థితి ఏర్పడింది. దీపావళి రోజున చంద్రబాబుకు వాట్స్ అప్ మెసేజ్ పంపించి, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. తన పై, తన అనుచరుల పై విపరీతమైన ఒత్తిడి ఉందని, వైసిపీ అరాచకాలు తట్టుకోలేక పోతున్నానని, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాను అని, అలా అయినా తన పై ఒత్తిడి తగ్గుతుందని, వంశీ, చంద్రబాబుకి మెసేజ్ పెట్టటం, దానికి చంద్రబాబు పోరాడదాం అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తరువాత, వంశీ తన అనుచరులకు ఫోన్ చేసి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యాలని, మనం వైసిపీలో చేరుతున్నాం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే, కొంత మంది వంశీ అనుచరులు, వైసీపీ రంగులు, జగన బొమ్మలు, వంశీ బొమ్మలతో, సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు తయారు చేసి హడావిడి చేసారు.

vamsi 12112019 2

దీపావళి అవ్వగానే, వంశీ వైసీపీలో చేరిపోతారని, వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు వంశీ తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదు. మరో పక్క వంశీని అసెంబ్లీ కమిటిల్లో ఒక పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తున్న వారికి అసలు వంశీ పార్టీ మారుతున్నారా లేదా ? లేక టిడిపి లోనే ఉంటారా ? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే, ఈ గందరగోళం పై వంశీ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడి, తన అభిప్రాయాన్ని చెప్పారు. నేను వైసిపీలో చేరాలి అనుకున్నాను, దానికి ముహర్తం ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుంది, ఒత్తిడులు నుంచి తన అనుచరలును కాపాడుకోవటానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అని వంశీ చెప్పారు.

vamsi 12112019 3

పదవిలో ఉండే సేవ చెయ్యాలి అని, సన్నిహితుల ఒత్తిడితోనే, రాజీనామా విషయంలో వెనక్కు తగ్గాను అని వంశీ చెప్పారు. వైసిపీలో చేరే సమయానికి రాజీనామా చెయ్యలా వద్దా అనే చర్చ రాలేదు, సమయం వచ్చినప్పుడు దాని పై చర్చిస్తాం అని వంశీ చెప్పారు. గతంలో టిడిపి హయంలో ఉన్నా, పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని వంశీ చెప్పారు. అంటే వంశీ చెప్పిన దాని ప్రకారం, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యరు. అలా అని వైసీపీలో చేరరు. టిడిపికి అనుకూలంగా ఉండరు. తటస్థ ఎమ్మెల్యేలాగా కొనసాగాలని వంశీ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మరి, ఇది ఎంత వరకు సాధ్యం ? వంశీ కనుక వైసిపీతో సన్నిహితంగా ఉంటే, టిడిపి అనర్హత వెయ్యమని కోరుతుంది కదా ? చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం, గత ప్రభుత్వంలో, చంద్రబాబు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మనల్ని హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టి, మన కష్టాన్ని అంతా హైదరబాద్ లోనే వదిలేసి, గెంటివేసారు. అవమానం జరిగిన చోటే, వారికి మన సత్తా చూపించాలని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆంధ్రుడు పూనుకున్నాడు. చంద్రబాబు ఆశయానికి, రైతులు తోడయ్యారు. అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలు, 33 వేల ఎకరాలు ఇచ్చారు. అటు రైతులు తమ భవిష్యత్తుతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వంగా చెప్పుకునే రాజధాని వస్తుందని ఆశ పడ్డారు. ఒక్క చిన్న స్థలం తీసుకుంటే రక్త పాతం జరిగే చోట, ఒక ప్రభుత్వానికి 33 వేల ఎకరాలు, ఒక్క ఆందోళన లేకుండా ఇచ్చారు అంటే, అది చంద్రబాబు మీద ఉన్న నమ్మకం. అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఎంత రెచ్చగొట్టినా, రైతులు మాత్రం, చంద్రబాబు వెంటే నడిచారు. తరువాత ఫ్లాట్లు వెయ్యటం మొదలు పెట్టి, సింగపూర్ దగ్గర మాస్టర్ ప్లాన్ తీసుకుని, దానికి అనుగుణంగా, ప్రభుత్వ భవనాలు డిజైన్ లను, లండన్ లోని fosters కంపెనీకి ఇచ్చి, పనులు ప్రారంభించారు.

sngapore 12112019 2

ఇప్పటికే దాదాపుగా 9 వేల కోట్లు ఖర్చు పెట్టి, అక్కడ మౌలిక సదుపాయాలు, సచివాలయం, హైకోర్ట్, ఐఏఎస్, ఐపిఎస్, ఉద్యోగుల క్వార్టర్స్ కట్టటం ప్రారంభించారు. దాదాపుగా 40 వేల మంది కార్మికులతో, ఒక సిటీ నిర్మాణం జరుగుతూ ఉంటే, ప్రపంచ స్థాయి రాజధాని కల ఎంతో దూరంలో లేదు అంటూ, ఆంధ్రులు సంతోషించారు. దీనికి తోడుగా, ఏకంగా సింగపూర్ ప్రభుత్వం, ఇక్కడ స్టార్ట్ అప్ ఏరియా డెవలప్ చెయ్యటానికి ముందుకు వచ్చింది. అవినీతి రహితింగా ఉండే సింగపూర్ ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబదులు పెడుతుంటే, ప్రపంచంలోని మిగతా పెట్టుబడిదారులు ఆకర్షితులు అయ్యారు. అయితే, ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. మొత్తం తారు మారు అయ్యింది. చంద్రబాబు దిగిపోయారు. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉంటూ, మన రాజధానిని భ్రమరావతి అంటూ హేళన చేస్తున్న, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసారు.

sngapore 12112019 3

ముందుగా జరుగుతున్న పనులు ఆపేశారు. దీంతో అప్పటి వరకు సందడిగా ఉన్న అమరావతి ప్రాంతం బోసి పోయింది. పెట్టుబడి దారులకు ఇచ్చిన భూములు, కొంత మందివి వెనక్కు తీసుకున్నారు. మరో పక్క ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే రుణాలు వెనక్కు వెళ్ళిపోయాయి. ఇవన్నీ గమనిస్తున్న సింగపూర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఉద్దేశాలు అర్ధమయ్యి, తాను కూడా స్టార్ట్ అప్ ఏరియా నుంచి తప్పుకొవటానికి, దాదపుగా సిద్ధపడింది. ఇదే టైంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే, సింగపూర్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. ఏపి ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యతలు ఉన్నాయని, వారు స్టార్ట్ అప్ ఏరియాకు అనుకూలంగా లేరని అర్ధమవుతుందని, ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టటానికి పెట్టుబడిదారులు రిస్క్ చెయ్యరని, అందుకే తప్పుకుంటున్నమని ఆ ప్రకటనలో తెలుపుతూ, భవిష్యత్తులో పెట్టుబడులు కోసం, ఏపితో పని చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విధంగా, అమరావతి కధ, ముగుస్తు వెళ్తుంది.

అత్యున్నతస్థానమైన స్పీకర్‌పదవిని, రాజకీయఅవసరాలకు వాడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురదజల్లాలని చూస్తోందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీకార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని సీతారామ్‌ తాను స్పీకర్‌నన్న విషయంమర్చిపోయి, టీడీపీఅధినేత చంద్రబాబుపై, ఆపార్టీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకున్న వైసీపీనేతలు, స్పీకర్‌స్థానాన్ని తెలుగుదేశంపార్టీ అగౌరవపరిచిందని చెప్పడం హాస్యాస్పదం గా ఉందని నక్కా ఎద్దేవాచేశారు. తానువైసీపీశానసభ్యుడినని చెప్పుకుంటూ, స్పీకర్‌ననే విషయం మర్చిపోయి మాట్లాడిన తమ్మినేనిని వెనకేసుకొచ్చేముందు, ఎవరు అనుచితంగా హద్దులుమీరి మాట్లాడారో వైసీపీనేతలు తెలుసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

tammineni 11112017 2

స్పీకర్‌స్థానంలో ఉండి, తననుఉద్దేశించి తమ్మినేని చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ, నారా లోకేశ్‌ లేఖరాశారని, సీతారామ్‌చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజీనామా చేస్తానని, నిరూపించలేకుంటే, తమ్మినేని తమనాయకుడి బట్టలు ఊడదీస్తాడా అని ప్రశ్నించడం జరిగిందన్నారు. తమ్మినేనివ్యాఖ్యలను చంద్రబాబు సహా, తమపార్టీనేతలంతా ఖండించారని, ఆ అంశంపై వైసీపీనేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ, బీసీని స్పీకర్‌చేయడం టీడీపీకి, చంద్రబాబుకి ఇష్టంలేదని చెప్పడం, వారిలోని అజ్ఞానాన్ని తెలియచేస్తోందని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. తమ్మినేని సీతారామ్‌ని 5సార్లు ఎమ్మెల్యేని చేసింది, 3సార్లు మంత్రిని చేసింది, తెలుగుదేశమనే విషయం వారు గుర్తించాలన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వారి ఎదుగుదలకు కారణమైంది తెలుగుదేశం పార్టీయేనని నిజాన్ని కూడా తెలుసుకోలేని దుస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులుండటం సిగ్గుచేటని ఆనందబాబు మండిపడ్డారు.

tammineni 11112017 3

స్పీకర్‌స్థానంపై తెలుగుదేశానికి అచంచలమైన విశ్వాసం, గౌరవం ఉన్నాయని, ఆస్థానాన్ని రాజకీయంగా వాడుకుంటూ, బజారుకీడ్చింది ముమ్మాటికీ వైసీపీనేతలేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ బీసీలకు, దళితులకు ఎంతటిముఖ్యస్థానాలు కట్టబెట్టిందో రాష్ట్రప్రజలందరికీ తెలుసునన్నారు. స్పీకర్‌స్థానంలో ఉండి తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ప్రజలంతా ఛీకొట్టినా, ఆయన్ని వైసీపీనేతలు వెనకేసుకు రావడం సిగ్గుచేట న్నారు. తమ్మినేనివ్యాఖ్యలను రాజకీయంచేసి, స్పీకర్‌స్థానాన్ని భ్రష్టు పట్టించవద్దని ఆనందబాబు వైసీపీనేతలకు హితవుపలికారు.

నిన్న ఐటి శాఖ రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒక పెద్ద ఇన్ఫ్రా కంపెనీ నుంచి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రాముఖ వ్యక్తికి, 150 కోట్లు ఇచ్చినట్టు, తమ సోదాల్లో తేలింది అంటూ చెప్పిన విషయం, పెను సంచలనంగా మారింది. 150 కోట్లు పుచ్చుకున్న ఆ ప్రముఖుడు ఎవరు ? ఇచ్చిన ఆ ఇన్ఫ్రా కంపెనీ ఏంటి అంటూ, ఇప్పుడు చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులు అంటే, రాజకీయ నాయకులే ఉండే అవకాసం ఉంది. అయితే ఆ ప్రెస్ నోట్ చూసిన వారికి ఆ కంపెనీ ఏంటి, ఇచ్చింది ఎవరికీ అనే విషయం, చూచాయగా తెలుస్తున్నా, బయటకు చెప్పటానికి మాత్రం, ఎవరూ సాహసించలేదు. ఐటి శాఖ డైరెక్ట్ గా కంపెనీ పేరు, తీసుకున్న వ్యక్తీ పేరు చెప్తే తప్ప, ఎవరూ ధైర్యం చేసి, బయట పెట్టే అవకాసం లేదు. అయితే 150 కోట్లు ఒక వ్యక్తీకి ఇచ్చాం అంటూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్పటం అంటే మాములు విషయం కాదు. ఈ ప్రెస్ మీట్ వివరాలు ఇలా ఉన్నాయి.

incometax 12112019 1

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వెచ్చించిన నిదులను, వేరే మార్గంలో దారి మళ్ళించి, ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రాముఖ వ్యక్తికి 150 కోట్లకు పైగా, హార్డ్ కాష్ అందించినట్టు మాకు సాక్ష్యాలు లభించాయి అంటూ, ఇన్కమ్ టాక్స్ అధికారులు తమ ప్రెస్ నాట్ లో పట్టారు. ఒక ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ పై, ఈ మధ్య చేసిన ఐటి దాడుల్లో, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, ఈరోడ్‌, పుణె, ఆగ్రా, గోవాలలోని 42 చోట్ల సోదాలు చేసి, కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. ఈ వివరాలకు సంబంధించి, ఇన్కమ్ టాక్స్ కమీషనర్ సురభి అహ్లూవాలియా మీడియాకు ప్రకటన విడుదల చేసారు. బోగస్ బిల్లులు ఉపయోగించి, హవాలా మార్గం ద్వారా అవకతవకలకు పాల్పడుతున్న వారి పై, ఐటి దాడులు నిర్వహించామని అన్నారు.

incometax 12112019 1

మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు/బిల్లుల ద్వారా చేస్తున్న పెద్ద రాకట్ ను కనుగొన్నామని అన్నారు. ప్రభుత్వాలు చెప్పట్టే ఈ ప్రాజెక్ట్ ల నుంచి, హవాలా డీలర్లు ద్వారా దారి మళ్ళించారని అన్నారు. ఇలాంటి కంపెనీ ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రధాన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లలో బోగస్‌ బిల్లింగ్‌ చేసింది. వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయి. బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ.3300 కోట్ల మేరకు నగదును పోగేయడం నుంచి పంపిణీ చేయడం వరకు మొత్తం ఆధారాలతో కనుక్కున్నాము అని, మా సోదాల్లో రూ.4.19 కోట్ల నగదు, 3.2 కోట్లకు పైగా విలువైన బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద ప్రాజెక్ట్ లు, 3300 కోట్ల నకిలీ కాంట్రాక్టు చేసే సంస్థ ఏది అని ఆలోచిస్తే, ఈ పజిల్ ఇట్టే అర్ధమవుతుంది. ఐటి అధికారులు అధికారికంగా ఆ పేరు చెప్పే దాకా, ఎవరు అనేది సస్పన్స్ గానే ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read