బహిరంగ లేఖ... గౌ|| ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు... "ప్రకృత్రి ప్రసాదించిన వరం ఇసుక. దాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.కనుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది. దీనివల్ల ఇసుక కొరత లేకపోవడమేకాక రేట్లు కూడా అందుబాటులో వుండేవి. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. దీనివల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి 30 లక్షల మంది కార్మికులను, ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించారు. పనులు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పిల్లల స్కూల్‌ ఫీజులు కూడా చెల్లించలేక అర్ధాంతరంగా కొందరు చదువులు ఆపేయించారు. భార్యా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని మరికొందరు మొత్తం 40 మందికి బలవన్మరణాల పాలయ్యారు. ఇసుక కృత్రిమ కొరత వల్ల పెరిగిన రేట్ల వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైంది. దీనివల్ల 125 వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నవి. వీరందరికీ మనో ధైర్యం కలిగించి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలు చేయాలని, పనిచూపే వరకు కార్మికులకు రూ.10 వేలు భృతి ఇవ్వాలని, ప్రభుత్వం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని నేను విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నవంబర్‌ 14న 12 గంటలు నిరసన దీక్షను చేపడుతున్నాను."

cbn 11112019 2

"ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఇసుక మాఫియాను తెలుగుదేశం ప్రభుత్వం కట్టడి చేసింది. అలాంటి ఉచిత ఇసుకను రద్దు చేసి వైసీపీ నేతలే ఇసుక మాఫియాను ప్రోత్సహించేలా చేశారు. తెలుగుదేశం హయాంలో రూ.10వేలకు లభించిన లారీ ఇసుక నేడు రూ.50వేల నుంచి రూ.లక్షకు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతూ సామాన్యులను దోచుకుంటున్నారు. వరదల కారణంగానే ఇసుక కొరత అంటూ అబద్దాలు చెబుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఇసుక కొరత ఇక్కడే ఎందుకు వచ్చింది.? రాష్ట్రంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తాపత్రయపడుతున్న సామాన్యులకు ట్రాక్టర్‌ ఇసుక దొరకడం లేదు. కానీ.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వందలాది లారీల ఇసుకను యధేచ్ఛగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి పట్ల మానవత్వాన్ని మరచి మంత్రులు అపహాస్యం చేస్తూ.. మాట్లాడడం తప్ప.. కొరతను ఎలా సాధించాలనే ఆలోచన చేయడం లేదు."

cbn 11112019 3

"12 గంటల ఇసుక దీక్షకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో ఆర్‌టిసి సమస్యపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాయి. అలాగే, మన రాష్ట్రంలోను ఇసుక సమస్య వల్ల నష్టపోతున్న 125 వృత్తులు, వ్యాపార రంగాల ప్రతినిధులు కూడా ఈ దీక్షలో భాగస్వాములు కావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను." (నారా చంద్రబాబునాయుడు)

ఇసుక సమస్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 40లక్షల కుటుంబాలు ఉపాధి లేక పస్తులు ఉంటున్నాయి. 5 నెలలు తరవాత అయినా ఇసుక వస్తుందని, తమకు ఉపాధి వదొరుకుతుందని వీళ్ళు పెట్టుకున్న ఆశలు బూడిదలో పోసిన పన్నీరులా నీరుగారిపోయాయి. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసున్నా, ఇసుక మాత్రం అందుబాటులోకి రావటం లేదు. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు అయోమాయంలో ఉన్నారు. వరదలు తగ్గాయి ఏదోలా ఇసుక పంపిణి జరుగుతుంది వీరు ఆశ పడ్డా, ఏమి జరగటం లేదు. ఇసుక కొద్ది కొద్దిగా దొరుకుతున్నా, దాని ధర చూసి కళ్ళుతిరిగాయ్. చంద్రబాబు హయంలో మొన్నటి వరకు ట్రాక్టర్ ఇసుక 2000 నుంచి 3000 ఉండేది. ఇప్పుడు ఒకసారి గా ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయ్. ఇప్పుడు అదే ట్రాక్టర్ 6000 నుంచి 7000 పలుకుతుంది. అయితే ఇసుక ఫ్రీ అవుతుందని, అని భవన నిర్మాణ కార్మికులు ప్రజలు ఆశ పడుతున్న టైంలో, ఇప్పుడు మరో ఇబ్బని వచ్చి పడింది.

sandissue 111120192

ప్రస్తుత పరిస్థితి అదనుగా భావించి, ఇన్ని రోజులుగా రాబడి లేకపోవటం వలన సిమెంట్ ఫ్యాక్టరీలు ఒక్కసారిగా సిమెంట్ ధరల్ని ఆకాశానికి అంటేటట్లుగా పెంచేశాయి. ఒక్కొక బస్తా మీద 20 నుంచి 30 శాతం ధరని పెంచారు. ఒక నెల క్రితం వరకు ఒక సిమెంట్ బస్తా 250 నుంచి 270 వరకు ఉంటే, దానిని ఇపుడు 380 నుంచి 400 చేసారు. పాత సిమెంట్ బస్తాలకి కూడా అదే రేటుతో విక్రయంచాలని సిమెంట్ ఫ్యాక్టరీ అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇంత రేట్లు పెట్టి సిమెంట్ ని ఎలా కొనగలం అంటూ నిర్మాణాలు చేసే వారు చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పటికే ఇసుక లేక ఇబ్బంది పడుతున్నామని, ఇపుడు సిమెంట్ కూడా మండితే, ఇక భవన నిర్మాణ కార్మికులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు అని చెప్పాలి.

sandissue 11112019 3

ఇపుడు మళ్ళీ సిమెంట్ రేట్లు తగ్గించమని సమ్మె లు, ధర్నా లు చేయాలిసిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. వైసీపీ ప్రభత్వం వచ్చినప్పటి నుంచి తినడానికి తిండి కూడా దొరకట్లేదు అని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా, ఇదే విషయం పై పోరాటాలు చేస్తున్నాయి. వరదలు తగ్గాయి, ఇసుక ఫ్రీ అవుతుంది అని ప్రభుత్వం అనుకునే లోపే, సిమెంట్ ధరలు పెరగటంతో, ఈ కొత్త గొడవ ఏంటిరా బాబు అని వైసీపీ ప్రభుత్వం తల పట్టుకుంటుంది. ఒక తొందర పాటు నిర్ణయం ఎన్ని అనర్ధరాలకి దారి తీస్తుందో ప్రజలకు అర్ధమవుతుంది. చేతులు కాలాక ఆకులూ పట్టుకుంటే ఎం లాభం. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఈ రోజు వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయవాడలో జరిగిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం ను పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే, ప్రభుత్వ స్కూల్స్ లో ఉంచటం పై, పవన్ కళ్యాణ్, వైసిపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేసిన విషయం పై, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అయితే, ఆయన పదవి, హోదా కూడా పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యటం, సంచలనంగా మారింది. "యాక్టర్ పవన్ ఉన్నారు. ఆయన ముగ్గురు భార్యలకు ఐదుగురు పిల్లలు.. వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు.?" అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ విమర్శ చెయ్యాలి అనుకుంటే, రాజకీయంగా చెయ్యాలని, ఇలా వ్యక్తిగతంగా చెయ్యటం కరెక్ట్ కాదని, రేపు పవన్ వైపు నుంచి తిరిగి, జగన్ కుటుంబ సభ్యులను కూడా ఇలాంటి ప్రశ్నలే వేస్తే, విషయం చాలా దూరం వెళ్తుందని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

janasena 11112019 1

అయితే ఈ విషయం పై, జనసేన పార్టీ అధికారికంగా స్పందించింది. రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మెన్, నాదెండ్ల మనోహర్, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి, ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు, ఎవరూ రియాక్ట్ అవ్వద్దు అంటూ, విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కోసం చేస్తున్న పోరాటాన్ని, పక్కదారి పట్టించి, ఇలా వ్యక్తిగత గొడవను పెంచటానికి, జగన్ ప్రయత్నం చేస్తున్నారని, జనసైనికులు ఈ విషయం పై కాకుండా ఇసుక మీదే ప్రభుత్వాన్ని నిలదియ్యలని అన్నారు. మనం పాలసీ మీద పోరాడుతుంటే, వాళ్ళు వ్యక్తిగత దాడి చేస్తున్నారని, మనం ఇవన్ని ప్రజల కోసం భరిద్దాం అని నాదెండ్ల అన్నారు.

janasena 11112019 1

మంగళవారం పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారని, ఆ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడతారని, అప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యల పై, ఆయనే స్పందిస్తారని, పార్టీ శ్రేణులు ఎవరూ ఈ విషయం పై, అభ్యంతరక భాషలో స్పందించవద్దు అని కోరారు. ఇది ఇలా ఉంటే, జనసేన శతఘ్ని టీం మాత్రం, సోషల్ మీడియాలో జగన్ చేసిన వ్యాఖ్యలకు బదులు ఇస్తూ, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే చెప్పింది. ఒక వీడియో రిలీజ్ చేసి, ఈ రోజు జగన్ మాట్లాడిన మాటలు చూపిస్తూ, దానికి పవన్ సమాధానంగా, గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వినిపించారు. 'జగన్ ని అడగాలనుకుంటున్నాను నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లా? తమాషాగా ఉందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని పవన్ చేసిన వ్యాఖల వీడియో పోస్ట్ చేసారు. చివరకు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో మరి ?

రాష్ట్రంలో ఇసుక సమస్య, ప్రతిపక్షాలు అన్నిటినీ ఏకం చేస్తుంది. 2014లో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అప్పటి ఎన్నికల్లో లాభ పడ్డారు. 2019 ఎన్నికలకు వచ్చేసరి, విడివిడిగా పోటీ చేసి, అందరూ నష్టపోయారు. అయితే ఎన్నికలు పక్కన పెడితే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్న వైసిపీ ప్రభుత్వం పై, కలిసి పోరాటాలు చేస్తూనే, ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుందని, ప్రజలకు మేలు జరుగుతుందని, మూడు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నాయి. గడిచిన ఆరు నెలలుగా, వైసీపీ ప్రభుత్వం, ప్రజల జీవితాలతో ఇష్టం విచ్చినట్టు చెలగాటం ఆడుతుంది. అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అయితే, మొన్నటి వరకు, ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎవరికి వారు, విడి విడిగా ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచి, ప్రజా సమస్యలు పరిష్కరించటానికి, ఇసుక కొరత సమస్య పై, పార్టీలు అన్నీ ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నాయి.

knna 11112019 2

విశాఖపట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ కార్యక్రమం, జనసేన ఆధ్వర్యంలో జరిగింది. అయితే అంతకు ముందే, పవన్ కళ్యాణ్, అన్ని రాజకీయ పార్టీలకు ఫోన్లు చేసి, కలిసి పోరాడదాం అని, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, లోక్ సత్తా పార్టీలకు ఫోన్లు చేసి మద్దతు అడిగారు. కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం, బీజేపీ వల్ల కలిసి రాలేం అని చెప్పగా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, లోక్ సత్తా మద్దతు పలికాయి. తెలుగుదేశం పార్టీ తరుపున, మాజీ మంత్రులు, అయ్యన్నపాత్రుడు, అచ్చెం నాయుడు, వెళ్లి, జనసేన కార్యక్రమంలో పాల్గున్నారు. బీజేపీ సపోర్ట్ ఇచ్చినా, ఎవరినీ ఈ కార్యక్రమానికి పంపించలేదు. ఇప్పుడు, రేపు 14న, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇసుక కోసం దీక్ష చెయ్యనున్నారు.

knna 11112019 3

ఈ దీక్ష కోసం, అన్ని రాజకీయ పార్టీలను మద్దుతు కోరుతున్నారు. ప్రతిపక్షాలు అన్నీ ఐక్యంగా కలిసి పోరాటం చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతు కూడా కోరింది. కన్నా లక్ష్మీనారాయణ వద్దకు, తెలుగుదేశం పార్టీ తరుపున, ఆలపాటి రాజా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రేపు 14న చేపట్టబోయే దీక్షకు, మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని,గతంలోనే చెప్పమని, ఇలాగే పవన్ కళ్యాణ్ కు కూడా మద్దతు ఇచ్చామని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీక్షకు కూడా మద్దతు తెలుపుతున్నామని కన్నా అన్నారు. మా మద్దతు దీక్ష వరుకే అని, తెలుగుదేశం పార్టీతో రాజకీయ పొత్తు కాదని కన్నా అన్నారు. మొత్తానికి, జగన్ పుణ్యమా అని, మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోరాటాలు మొదలు పెట్టాయి.

Advertisements

Latest Articles

Most Read