క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి విచిత్రంగా తాను చెప్పే అబ‌ద్ధాల‌ని తానే నిజం చేయాల్సి రావ‌డం క‌ర్మ అనే చెప్పాలి. వివేకానంద‌రెడ్డిని చంపేయించి గుండెపోటు అని చెప్పేందుకు చాలా స్కెచ్‌లు వేశాడు. చివ‌రికి గొడ్డ‌లిపోట్లు అని ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకున్నాడు. ఆ గొడ్డ‌లిపోట్ల‌ని నిజం చేయ‌డానికి చాలా మందిని రంగంలోకి దింపాడు. ఇప్పుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో పీక‌ల్లోతులో ఇరుక్కుపోయి...త‌ల్లికి గుండెపోటు అని చెప్పి క‌ర్నూలు విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రిలో చేర్పించి ఓ వారం రోజులు డ్రామా ఆడాడు. ఇప్పుడు త‌ల్లికి బాగానే ఉంద‌ని ఆ ఆస్ప‌త్రి డిశ్చార్జి చేసిన నేప‌థ్యంలో ..ఈ సారి వేదిక‌ని హైద‌రాబాద్ ఏఐజీకి మార్చి డ్రామా మొద‌లుపెట్టారు. ముంద‌స్తు బెయిల్ కోసం ఈ డ్రామా షురూ చేసినా..ఇప్పుడు కోర్టు ఇచ్చిన వెసులుబాట్లు తీసుకోవ‌డానికి త‌ల్లికి ఆరోగ్యం బాగానే ఉన్నా..ఏదో ఒక డ్రామా స‌ర్జ‌రీ అయినా చేయించాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తల్లిని కర్నూలు ఆస్పత్రి నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించామని.. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్‌ వల్ల అత్యవసర చికిత్స జరుగుతోందని అవినాష్ రెడ్డి న్యాయ‌వాదులు కోర్టుకి తెలిపారు. పిటిషనర్‌ చేస్తున్న ఈ వాదనకు ఎలాంటి మెడికల్‌ రికార్డులు, ఆధారాలు లేవని సీబీఐ న్యాయవాదులు వ్యతిరేకించారు. స‌ర్జరీ జరుగుతోందన్న పిటిషనర్‌ న్యాయవాది స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నాం. ఇది తప్పు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ధర్మాసనం తెలిపింది. క‌ర్నూలు విశ్వ‌భార‌తి మాదిరిగానే త‌ల్లిని లోప‌ల పెట్టి డ్రామా న‌డిపించేందుకు హైద‌రాబాద్ ఏఐజీలో కుదర‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఆస్ప‌త్రి బాగా రెపుటేషన్ గ‌ల‌ది. ఇటువంటి పొలిటిక‌ల్ డ్రామాల‌కు ఆస్ప‌త్రిని వేదిక చేసి ఏఐజీ పేరుప్ర‌తిష్ట‌లు

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో అడ్డంగా దొరికిపోయిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విష‌యంలో నాట‌కీయ‌ప‌రిణామాల‌కు పాల్ప‌డుతున్న సీబీఐ విశ్వ‌సనీయ‌త దారుణంగా దెబ్బ‌తింది. ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాని అరెస్టు చేసిన ఇదే సీబీఐ, వివేకా హ‌త్య‌లో కీల‌క సూత్ర‌ధారి అవినాష్ రెడ్డేనని అన్ని ఆధారాలు చిక్కినా అరెస్టు చేయ‌కుండా వేడుక చూస్తుండ‌డం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సీబీఐ ప‌లుచ‌న అయిపోయింది. సీబీఐపై కామెడీ పోస్టులు సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సీబీఐ అంద‌రినీ అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పుతూ, ఆయ‌న అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కేసుల‌న్నీ మ‌రిచిపోయింద‌నే అనుమానాలు వ‌స్తున్నాయి. 42వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోపిడీ చేశాడ‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై 31కి పైగా చార్జిషీట్లు దాఖ‌లు చేసిన సీబీఐ, ఈడీలు ప‌దేళ్లయినా ద‌ర్యాప్తు పూర్తి చేయ‌లేదు. ఇదే అద‌నుగా వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసుకుంటూ, డిశ్చార్జి పిటిష‌న్లు వేసుకుంటూ కేసులు విచార‌ణ‌కి కూడా రాకుండా చేసుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి వైట్ కాల‌ర్ నేర‌స్తుల‌కి రోల్ మోడ‌ల్ గా నిలిచార‌ని న్యాయ‌కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో కేసుల హాజ‌రు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మిన‌హాయింపు ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనంత‌రం రోజువారీ విచారణ కూడా సీబీఐ కోర్టులో జ‌రుగుతున్న దాఖ‌లాలు క‌న‌ప‌డ‌లేదు. తీవ్ర‌నేరారోప‌ణ‌లున్న రాజ‌కీయ‌నేత‌ల‌పై కేసుల విచార‌ణ ఏడాదిలో పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై న‌మోదు అయిన సీబీఐ కేసులు ప‌దేళ్లు దాటిపోతున్నా, ఇప్ప‌టికీ కొలిక్కి రాలేదు.

రాష్ట్ర‌మంతా ల‌క్ష‌ల టిడ్కో ఇళ్లు క‌ట్టి ఉన్నాయి. అవి ల‌బ్ధిదారుల‌కి అంద‌జేయ‌డానికి చేతులు రాని వైసీపీ స‌ర్కారు..కోర్టులో కేసులున్నా..అమ‌రావ‌తిలోనే ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీకి తెర లేపుతోంది. ఇదంతా అమ‌రావ‌తి నాశ‌నం మొద‌టి ల‌క్ష్యం కాగా, రాజ‌ధాని ప్ర‌భావిత రెండు జిల్లాల్లో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైకాపా ఓట‌మి త‌ప్ప‌ద‌ని నివేదిక‌లు నేప‌థ్యంలో దాదాపు 50 వేల మంది కొత్త ఓట‌ర్ల‌ను ఇళ్ల‌ప‌ట్టాల పేరుతో దింపి ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందాల‌నే కుతంత్రం ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం ప్ర‌జారాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలకు దిగారు. వారిపై పోలీసుల‌ని ఉసిగొల్పి భ‌య‌పెట్టి, హింసించి వెళ్ల‌గొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి. మ‌రోవైపు రైతులకు మద్దతుగా న్యాయవాది  శ్రావణ్‌కుమార్‌ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నంచేశారు. డిఎస్పీ పోతురాజు అయితే రాజ‌ధానికి భూములు ఇచ్చిన మ‌హిళ‌ల్ని దుర్భాష‌లాడుతూ అంతుచూస్తానంటూ బెదిరించారు. భూములు ఇచ్చిన రైతులు త‌మ ఇళ్లు విడిచి, త‌మ ప్రాంతంలోనే బ‌య‌ట‌కి రాకుండా ఆంక్ష‌లు విధించారంటే ప‌రిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కోర్టులు ష‌ర‌తులు లోబ‌డి అని చెబుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా సెంటు ప‌ట్టాలు ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఎందుకు ఇస్తోంద‌ని అంతా ప్ర‌శ్నిస్తున్నారు. నాలుగేళ్లుగా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక పెట్ట‌ని ప్ర‌భుత్వం, ఉన్న నిర్మాణాల‌ని శిథిలం చేసి... కొత్త‌గా  ఆర్‌-5, ఎస్‌-3 జోన్ల‌లో 50వేల మందికి పైగా ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల‌ను పంపిణీ చేసే కార్య‌క్ర‌మం పోలీసులు బందోబ‌స్తు మ‌ధ్య కొన‌సాగిస్తున్నారు. రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు, ఐదు జిల్లాల నుంచి పోలీసులు ఇక్క‌డే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇక్క‌డ డ్యూటీకి వ‌చ్చిన ప్ర‌కాశం జిల్లాకి చెందిన కానిస్టేబుల్ ప‌వ‌న్ కుమార్ పాము కాటుకి మ‌ర‌ణించాడు. ఎన్ని అడ్డంకులున్నా, ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీయే ల‌క్ష్యంగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందుకు వెళ్తుండ‌డం వెనుక ఏదో కుతంత్రం ఉంద‌నే అనుమానాలు నిజ‌మ‌వుతూ వ‌స్తున్నాయి.

వినే జ‌నాలు ఉండాలి కానీ, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను స‌త్య‌హ‌రిశ్చంద్రుడిన‌ని..తాను నీతిలో ధ‌ర్మ‌రాజు వార‌సుడిన‌ని కూడా చెప్పుకోగ‌ల స‌మర్థుడు. కొత్త ఏర్ప‌డిన ఏపీకి రాజ‌ధానిగా అమ‌రావ‌తి శంకుస్థాప‌నకి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ‌చ్చాడు. ఏపీపై విషం చిమ్మే కేసీఆర్ వ‌చ్చాడు. అప్ప‌టి ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం అమ‌రావ‌తి ప్ర‌జారాజ‌ధాని శంకుస్థాప‌న‌కి డుమ్మా కొట్టేశాడు. తాను ఏం చేశానో మ‌రిచిపోయి, ఏపీలోనే దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కి సుద్దులు చెబుతాడు జ‌గ‌న్ రెడ్డి. తాను త‌న సొంత రాష్ట్రంలో రాజ‌ధాని శంకుస్థాప‌న‌కి డుమ్మాకొట్టొచ్చు. పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి కేంద్రంలోని ప్ర‌తిప‌క్షాలు డుమ్మా కొడితే మాత్రం వారికి నీతులు చెబుతూ ట్వీట్లు వేశాడు జ‌గ‌న్. 'గొప్ప, విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నందుకు ప్రధాని మోదీకి నా అభినందనలు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. మన దేశం ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇది మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందింది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నా పార్టీ హాజరవుతుంది' అని జగన్ ట్వీట్ చేశారు.ప్ర‌థ‌మ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా జరగాల్సిన కార్యక్రమాన్ని.. ప్రధాని మోదీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూ పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజ‌రు కాలేం అంటూ 19 ప్రతిపక్ష పార్టీలు ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్, ఆప్, వామ‌ప‌క్షాలు ఇందులో ఉన్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానికి అసెంబ్లీలో ఒప్పుకున్న ప్ర‌తిప‌క్ష‌నేత‌గా, ఆహ్వానం అందినా హాజ‌రు కాలేని సంకుచిత స్వభావం గ‌ల జ‌గ‌న్, ఒక కాజ్ కోసం నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రు అవుతున్న విప‌క్షాల‌కి నీతులు చెప్ప‌డంపై అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read