బాబాయ్‌ని చంపాం..బెయిల్ తెచ్చుకున్నామ‌ని సంబ‌రాలు చేసుకుంటున్న అబ్బాయిల‌కి నారా లోకేష్ చుక్క‌లు చూపిస్తున్నాడు. సొంత బాబాయ్‌ని చంపేసి, నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ త‌మ‌కి ర‌క్తం అంటించే  కుతంత్రాల‌ని అప్ప‌ట్లోనే ఎండ‌గ‌ట్టిన నారా లోకేష్ తాజాగా త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర వేదిక‌గా అబ్బాయిల ర‌క్త‌చ‌రిత్ర‌ని క‌డ‌ప గ‌డ‌ప‌ల‌కి తీసుకెళుతున్నాడు. ప్రొద్దుటూరు పాద‌యాత్ర‌లో  హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు టిడిపి కేడ‌ర్‌ ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా డిఎస్పీ వ‌చ్చి ప్ల‌కార్డులు ప‌ట్టుకుంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఎందుకు అని నిల‌దీసిన నారా లోకేష్ తో డిఎస్పీ వాగ్వాదానికి దిగారు. దీంతో అబ్బాయిలే బాబాయ్‌ని చంపార‌నే ప్ల‌కార్డులు లోకేష్ ప‌ట్టుకుని మ‌రీ చూపించారు. హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు అంటూ ప్ర‌జ‌ల‌ని అడుగుతుంటే, అబ్బాయిలే చంపేశార‌నంటూ జ‌నం రియాక్ష‌న్స్‌తో యువ‌గ‌ళం ద‌ద్ద‌రిల్లిపోయింది. అదే ప్రొద్దుటూరులో వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని వైకాపా ఉత్స‌వాలు చేసింది. అదే ప్రొద్దుటూరులో బాబాయ్‌ని చంపింది ఎవ‌రంటూ జ‌నం నుంచే అబ్బాయిలే అని స‌మాధానంతో క‌డ‌ప గ‌డ‌ప‌ల్లో అబ్బాయిల నేర‌చరిత్రని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంలో లోకేష్ మొండిగా మ‌రో అడుగు ముందుకేశాడు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూర్తిగా బీజేపీ మ‌నిషి అని తేలిపోయింది. బీజేపీ కోసం ఏం చేయ‌డానికైనా వైకాపా రెడీ అయ్యింది. వైసీపీ నేత‌ల్ని కేసుల్నించి కాపాడ‌టం, అప్పులు ఇప్పించ‌డం వంటి బాధ్య‌త‌లు కేంద్రంలో పెద్ద‌లు చూసుకుంటున్నారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి బీజేపీ అనుబంధం అధికారంలోకి రావాల‌నుకుంటున్న కాంగ్రెస్ కి చాలా ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా బీజేపీ పోల్ మేనేజ్మెంటు కోసం ఏపీ నుంచి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి నిధులు స‌ర్దుతున్నార‌ని కాంగ్రెస్‌తోపాటు ఇత‌ర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైకాపా ఈ సారి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని, ఏపీలో వైసీపీ ఓటుబ్యాంకు క్యాప్చ‌ర్ చేసేందుకు కాంగ్రెస్‌కి అనువైన ప‌రిస్థితులున్నాయ‌ని హ‌స్తం పెద్ద‌ల ఆలోచ‌న‌. ఈ దిశ‌గా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ని గ‌ద్దెనెక్కించిన డీకే శివ‌కుమార్‌ని ఏపీ-తెలంగాణ‌లో హ‌స్తం హ‌వా సాగించేలా పావులు క‌ద‌పాల‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతానికి తెలంగాణ‌లో ఉన్నా..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీ కాంగ్రెస్‌కి ష‌ర్మిల‌ని పెద్ద దిక్కుగా పెట్టి వైసీపీ ప్లేసులోకి రావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అటు ష‌ర్మిల‌, ఇటు సునీత ఇద్ద‌రి చెల్లెళ్ల‌ను చేర‌దీసి కాంగ్రెస్‌లో కీల‌క‌ప‌ద‌వులు క‌ట్టబెట్టి బీజేపీ పావుగా వాడుతోన్న అన్న జ‌గ‌న్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని డీకే శివ‌కుమార్ ఎత్తుగ‌డ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అంటే ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే పేరుంది. సీఎంగా ఉన్నా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్నా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో నాన్చుడు ధోర‌ణితో పార్టీ నేత‌లే విసిగిపోయారు. ద‌శాబ్దాల త‌న తీరుకి భిన్నంగా చంద్ర‌బాబు జెట్ స్పీడుతో తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీలో కొత్త ఉత్సాహం నింపాయి. మ‌హానాడు వేదిక‌గా మినీ మేనిఫెస్టో ప్ర‌క‌టించి అధికార వైసీపీని అయోమ‌యంలోకి నెట్టేసిన బాబు, టిడిపి కేడ‌ర్‌లో జోష్ నింపారు. మ‌రోవైపు పొత్తులు విష‌యం కూడా తేల్చేశారు. జ‌న‌సేన‌తో ఎన్నిక‌ల‌కి వెళ్తార‌నే సంకేతాలు లీడ‌ర్ల నుంచి కేడ‌ర్ వ‌ర‌కూ స్ప‌ష్టం చేసేశారు. టికెట్ల ఎంపిక విష‌యంలో సీబీఎన్ స్పీడు మామూలుగా లేదు. గ‌త ఎన్నిక‌ల‌కి తాను సీఎంగా ఉన్నా, ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టించినా..అభ్య‌ర్థుల ఎంపిక నామినేష‌న్లు వేసేవ‌ర‌కూ నాన్చి తీవ్రంగా న‌ష్ట‌పోయారు. టిడిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి సీటు కూడా నామినేష‌న్ వేసే ముందు ప్ర‌క‌టించ‌డం, ఎన్నిక‌ల స‌న్నాహాల‌కి కూడా స‌మ‌యం లేని ప‌రిస్థితి ఎదురైంది. 2024లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ముంద‌స్తుగా వ‌చ్చినా తాము రెడీ అంటూ సంకేతాలిస్తున్నారు బాబు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పొత్తులు ఖ‌రారైపోయాయి. అభ్య‌ర్థుల‌ని దాదాపు ప్ర‌తీ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌క‌టించేస్తున్నారు. దాదాపు 130 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ని ఖ‌రారు చేసేసి ప‌నిచేసుకోమ‌ని బాబు చెప్పేశార‌ని టిడిపిలో చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా స‌త్తెన‌ప‌ల్లి టిడిపి ఇన్చార్జిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ని ప్ర‌క‌టించిన బాబు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. ముందెన్న‌డూ లేని చంద్ర‌బాబు స్పీడు చూసి టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఉరుకుప‌రుగులు  పెడుతూ ప‌నులు చేస్తున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌హానాడులో రాత్రి మేనిఫెస్టో ప్ర‌క‌టిస్తే, తెల్లారేస‌రికి చాలా మంది నేత‌లు ఆ క‌ర‌ప‌త్రాలు ప‌ట్టుకుని ఇంటింటికీ ప్ర‌చారానికి దిగారు. చంద్ర‌బాబు స్పీడు చూసి వైకాపా క్యాంపులో ఉన్న నిస్తేజం కాస్తా డైల‌మాగా మారింది. వైకాపా నుంచి సీనియ‌ర్లే పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రికొంద‌రిని జ‌గ‌న్ త‌ప్పిస్తార‌నే టాక్‌తో గంద‌ర‌గోళం నెల‌కొంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని గ‌త కొంత‌కాలంగా వైకాపా నేత‌ల‌ని పొగుడుతూ వారితో క‌లిసి వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నారు. టిడిపి ఎంపీగా గెలిచినా, టిడిపికి కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వ‌స్తున్న కేశినేని నాని అధిష్టానంపై అప్పుడప్పుడు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టిడిపి పెద్ద‌లు కేశినేని నానిని గౌర‌విస్తూనే ఆయ‌న అస‌హ‌నం వెనుక వ్యూహాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ వ‌స్తోంది. ఎన్నిక‌ల మూడ్ రాష్ట్రంలో నెల‌కొన్న వేళ‌, కేశినేని నాని బ‌య‌ట‌ప‌డిపోయారు. పూర్తిగా వైకాపా నేత‌ల‌తో త‌న కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు. విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైకాపా ఎమ్మెల్యేల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ, నా రాజకీయం ఇలాగే ఉంటుంది, నచ్చిన వాళ్ళతో కలిసి పని చేస్తానని, రాజకీయం ఎప్పుడూ చేయకూడదని, ఎన్నికల సమయంలోనే చేయాలని చెప్తున్నారు. నాని మాటలతో ఇన్నాళ్లు ఇబ్బందులు ప‌డుతూ వ‌చ్చిన టిడిపి, ఇప్పుడు కేశినేని నాని మాటలను గమనిస్తుంది. వైసీపీతో విజ‌య‌వాడ ఎంపీ ట‌చ్‌లో ఉన్నార‌నే ప్రచారం కూడా జరుగుతుంది. మరో పక్క, కేశినేని నాని వైఖరితో ఇప్పటికే  ప్ర‌త్యామ్నాయం కోసం టిడిపి ఆయ‌న త‌మ్ముడు చిన్నిని ట‌చ్‌లో పెట్టుకుంద‌ని తెలుస్తోంది. విజ‌య‌వాడ పార్ల‌మెంటులో అభివృద్ధి కోసం గొంగ‌ళి పురుగుని ముద్దు పెట్టుకుంటానంటూ చెప్తున్న కేశినేని నాని...విజ‌య‌వాడ మెట్రో రైలుని వైకాపా స‌ర్కారు ఎత్తేస్తే నోరు మెద‌ప‌క‌పోవ‌డం వెనుక, విమర్శలు వస్తున్నాయి. టిడిపి విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఏ పిట్ట‌ల‌దొర‌కైనా ఇచ్చుకోవ‌చ్చంటూనే, తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌న‌డం కేశినేని నాని తన అహంకార ధోర‌ణిని మ‌రోసారి బ‌య‌ట‌ పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్న మొండితోక‌, నిన్న వ‌సంత‌తో కలిసి ప్రెస్ మీట్ లు పెడుతున్న నాని నేడో రేపు ఊహించని నిర్ణయం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read