టిడిపి అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి వుందనే సంకేతాలు మరోసారి వెలువడ్డాయి. ఈ సారి ఆషామాషీ వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధ పదవి స్పీకర్ స్థానంలో వున్న వ్యక్తి..చంద్రబాబుని ఫినిష్ చేస్తామంటూ హెచ్చరించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే బహిరంగసభలలో చంద్రబాబుపై రాళ్లతో ఎటాక్ చేసిన ఆగంతకులు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా నిలవడంతో సేఫ్ అయ్యారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుపైకి గూండాల్ని పంపి రాళ్లు వేయించే ముఠా ఎవరో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు భద్రతాధికారులు రెండుసార్లు తీవ్రంగా గాయపడ్డారు. బాబుని కాపాడారు. ఎన్ఎస్జీ కమాండోలు, భద్రతాసిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులపై నేటికీ చర్యల్లేవు. అంటే ఎవరు ఇవి చేయించారో తెలిసిపోతోంది. చంద్రబాబు ఇంటి మీదకి ఏకంగా గూండాలతో దాడికి దిగిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై కేసు పెట్టాల్సిన ఏపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. అంటే చంద్రబాబుకి ప్రాణహాని తలపెట్టేవారికి అందలం ఎక్కిస్తున్నారంటే దీని వెనుక ఉన్నది ఎవరో ఇట్టే స్పష్టం అయిపోతోంది. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షనేతని ఫినిష్ చేస్తామంటూ నర్మగర్భంగా హెచ్చరించారంటే, ఇప్పటివరకూ చంద్రబాబుపై చేసిన దాడులన్నీ వారు చేయించినవేనని ఒప్పుకున్నట్టే అయ్యింది. చంద్రబాబుకు ఉన్న బ్లాక్ కమాండోల భద్రతను తీసేస్తే ఫినిష్ అయిపోతారని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు కామెడీవి కావు. వైసీపీ నుంచి చంద్రబాబుని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, జెడ్ ప్లస్ భద్రత ఉన్న కారణంగా సాధ్యం కావడంలేదని స్పీకర్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. బాబుపై చేస్తున్న హత్యాయత్నాలు ఫలించకపోవడానికి అడ్డుగా ఉన్న ఎన్ ఎస్ జీ భద్రతా సిబ్బంది(బ్లాక్ క్యాట్ కమాండోలు)ను తొలగించాల్సిందిగా తాను కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై విచారణ జరపాలి. చంద్రబాబు భద్రతను ఉపసంహరించాలని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని కోరుతానని తమ్మినేని ప్రకటించడం, చంద్రబాబుపై జరుగుతున్న ఎటాక్స్ ఒక దానికొకటి సంబంధం ఉందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలని టిడిపి డిమాండ్ చేస్తోంది
news
`రహస్య సాక్షి` ప్రాణాలకు ముప్పు..సీబీఐ భయం..
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ సంచలనంగా తెరపైకి తెచ్చిన రహస్యసాక్షి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ వద్ద రహస్య సాక్షి వాంగ్మూలం ఉందని సీబీఐ కోర్టులో చెప్పడంతో మరో సెన్సేషన్‌కి తెరలేచింది. వివేకా హత్యలో విస్తృత రాజకీయ కుట్ర ఉందని రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ తో బట్టబయలైందని, ప్రస్తుత దశలో రహస్య సాక్షి భద్రత దృష్ట్యా ఆ పేరు వెల్లడించలేమని కోర్టుకి చెబుతూనే...కొన్ని అనుమానాస్పద మరణాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది సీబీఐ. వివేకా హత్యాస్థలానికి చేరుకున్న పోలీస్ శాఖకి చెందిన సీఐ శంకరయ్య, అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా సీఆర్పీసీ 161 స్టేట్‌మెంట్ ఇచ్చారని, మేజిస్ట్రేట్ వద్ద సీఆర్పీసీ 164 స్టేట్‌మెంట్ ఇవ్వడానికి రాలేదని సీబీఐ తరఫు న్యాయవాదులు తెలిపారు. పదిరోట్లు తీసుకుని హత్య చేసినట్టు ఒప్పుకోవాలని తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పిన గంగాధర్‌రెడ్డి చనిపోయాడని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తాము రహస్య సాక్షి పేరును సరైన సమయంలో చార్జిషీట్‌లో చేరుస్తామని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి సీబీఐని కలిసి స్టేట్మెంట్ ఇచ్చింది షర్మిలేనని, ఆమె ప్రాణాలకు ముప్పు తలపెట్టే అవకాశం ఉందని సీబీఐ పేరు ప్రస్తావించకుండా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటివరకూ ఎటువంటి బలమైన ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి హస్తం ఉందని చూపించేలా లేవని వాదిస్తూ వచ్చిన ఆయన న్యాయవాదులు రహస్యసాక్షి దెబ్బతో తీవ్రమైన టెన్షన్‌లో ఉన్నారు.
సీబీఐకి ఆల్జీమర్స్ సోకిందా? జగన్ కేసులు ఏమయ్యాయి?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అడ్డంగా దొరికిపోయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో నాటకీయపరిణామాలకు పాల్పడుతున్న సీబీఐ విశ్వసనీయత దారుణంగా దెబ్బతింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్టు చేసిన ఇదే సీబీఐ, వివేకా హత్యలో కీలక సూత్రధారి అవినాష్ రెడ్డేనని అన్ని ఆధారాలు చిక్కినా అరెస్టు చేయకుండా వేడుక చూస్తుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సీబీఐ పలుచన అయిపోయింది. సీబీఐపై కామెడీ పోస్టులు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సీబీఐ అందరినీ అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పుతూ, ఆయన అన్న జగన్ మోహన్ రెడ్డిపై కేసులన్నీ మరిచిపోయిందనే అనుమానాలు వస్తున్నాయి. 42వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేశాడని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 31కి పైగా చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ, ఈడీలు పదేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయలేదు. ఇదే అదనుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ, డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కేసులు విచారణకి కూడా రాకుండా చేసుకోవడంలో వైఎస్ జగన్ రెడ్డి వైట్ కాలర్ నేరస్తులకి రోల్ మోడల్ గా నిలిచారని న్యాయకోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో కేసుల హాజరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం రోజువారీ విచారణ కూడా సీబీఐ కోర్టులో జరుగుతున్న దాఖలాలు కనపడలేదు. తీవ్రనేరారోపణలున్న రాజకీయనేతలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, వైఎస్ జగన్ రెడ్డిపై నమోదు అయిన సీబీఐ కేసులు పదేళ్లు దాటిపోతున్నా, ఇప్పటికీ కొలిక్కి రాలేదు.
తల్లికి సర్జరీ పై, కోర్టు ఆర్డర్స్ తో ఇరుక్కున్న అవినాష్ రెడ్డి..
కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచిత్రంగా తాను చెప్పే అబద్ధాలని తానే నిజం చేయాల్సి రావడం కర్మ అనే చెప్పాలి. వివేకానందరెడ్డిని చంపేయించి గుండెపోటు అని చెప్పేందుకు చాలా స్కెచ్‌లు వేశాడు. చివరికి గొడ్డలిపోట్లు అని ఎన్నికల్లో ఓట్లు దండుకున్నాడు. ఆ గొడ్డలిపోట్లని నిజం చేయడానికి చాలా మందిని రంగంలోకి దింపాడు. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో పీకల్లోతులో ఇరుక్కుపోయి...తల్లికి గుండెపోటు అని చెప్పి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించి ఓ వారం రోజులు డ్రామా ఆడాడు. ఇప్పుడు తల్లికి బాగానే ఉందని ఆ ఆస్పత్రి డిశ్చార్జి చేసిన నేపథ్యంలో ..ఈ సారి వేదికని హైదరాబాద్ ఏఐజీకి మార్చి డ్రామా మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కోసం ఈ డ్రామా షురూ చేసినా..ఇప్పుడు కోర్టు ఇచ్చిన వెసులుబాట్లు తీసుకోవడానికి తల్లికి ఆరోగ్యం బాగానే ఉన్నా..ఏదో ఒక డ్రామా సర్జరీ అయినా చేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిని కర్నూలు ఆస్పత్రి నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించామని.. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల అత్యవసర చికిత్స జరుగుతోందని అవినాష్ రెడ్డి న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. పిటిషనర్ చేస్తున్న ఈ వాదనకు ఎలాంటి మెడికల్ రికార్డులు, ఆధారాలు లేవని సీబీఐ న్యాయవాదులు వ్యతిరేకించారు. సర్జరీ జరుగుతోందన్న పిటిషనర్ న్యాయవాది స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నాం. ఇది తప్పు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ధర్మాసనం తెలిపింది. కర్నూలు విశ్వభారతి మాదిరిగానే తల్లిని లోపల పెట్టి డ్రామా నడిపించేందుకు హైదరాబాద్ ఏఐజీలో కుదరకపోవచ్చు. ఎందుకంటే ఆస్పత్రి బాగా రెపుటేషన్ గలది. ఇటువంటి పొలిటికల్ డ్రామాలకు ఆస్పత్రిని వేదిక చేసి ఏఐజీ పేరుప్రతిష్టలు