కేంద్ర ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని, అది కూడా సరిగా అమలు చేయలేదని సీఎం అన్నారు. కేంద్రం మోసం చేసిందని తెలిసే తిరుగుబాటు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. పార్లమెంటు సరిగా జరగలేదని ప్రధాని మోదీ నిరాహార దీక్ష చేస్తామని అంటున్నారని, ప్రజల మనోభావాలతో మోదీ ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn punch 11042018

ఇదే సందర్భంలో వైసిపీ పై పంచ్ వేసారు... వైకాపావి రాజీనామాలు కాదని, మోడీతో రాజీపడి ప్రజలకు నామాలు పెట్టారని చంద్రబాబు నాయుడు పంచ్ వేసారు... తన మీద కక్షతో రాష్ట్రం మీద దాడి చేసే పరిస్థితికి భాజపా వచ్చిందని సీఎం మండిపడ్డారు. తెలుగుదేశం సహకారం లేకుంటే రాష్ట్రంలో భాజపా ఎక్కడుందని ప్రశ్నించారు... రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనందునే కేసులున్న వారిని చేరదీశారని విమర్శించారు. అలా చేరదీస్తే తమ చెప్పుచేతల్లో జగన్‌ ఉంటాడన్నది భాజపా ఎత్తుగడ అని వివరించారు. కక్ష సాధింపు కోసం అవినీతి పార్టీనిభాజపా అక్కున చేర్చుకుందన్న చంద్రబాబు ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

cbn punch 11042018

ఈనెల 30న తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా...గతంలో మోదీ చెప్పిన మాటలను గుర్తు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రంపై ఎలాంటి పోరాటాలకైన సిద్దమన్నారు. అమరావతికి అన్ని ఇస్తామని తిరుపతిలో చెప్పిన మోదీ... ఇప్పుడు మాట తప్పారని, టీడీపీపై బురద జల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు టీడీపీయే గెలవాలని, అప్పుడే కేంద్రంలో మనమనుకున్న ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో రాజీ పడే వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడారని, ఏపీ ప్రజలకు వైసీపీ ఎంపీలు నామాలు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగళం వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థికశాఖ కార్యదర్శుల సమావేశం ఇందుకు వేదికైంది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న విధానంపై, 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. దక్షిణ భారత దేశంలో, ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ప్లాన్ ఇది అంటూ, కేంద్రం పై విమర్శలు గుప్పించారు...

modi shah 11042018

రాష్ట్రాల ఆర్థికవ్యవస్థల పై సూక్ష స్థాయిలో కూడా పెత్తనం చలాయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఈ సమావేశంలో చర్చించారు... సైద్థాంతిక పునాదులు బలపర్చుకోవలన్న ప్రయత్నమూ ఇందులో దాగుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘‘కేంద్రాన్ని మేం కోరుతున్నది ఒక్కటే.. ఈ రూల్స్‌ మార్చండి. కొత్త విధివిధానాలు తీసుకురండి’’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. ఈ సదస్సు కేంద్రానికి కనువిప్పు కావాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి అన్నారు. టీఓఆర్‌ రూపంలో రాయితీలు కోసేయబోతున్నారని కర్ణాటక మంత్రి బైరే గౌడ ఆరోపించారు. ఈ టీఓఆర్‌ వల్ల తమ రాష్ట్రం దాదాపు రూ 80,000 కోట్లు నష్టపోతుందని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్‌ ఐజాక్‌ చెప్పారు.

modi shah 11042018

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను యథాతథంగా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వచ్చే అయిదేళ్లలో రూ.24,340 కోట్లు నష్టపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగపరంగా తప్పనిసరి అయిన రెవెన్యూలోటు భర్తీని యథాతథంగా కొనసాగించాలని రాష్ట్రాలకు రెవెన్యూలోటు ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను 15వ ఆర్థికసంఘం విధివిధానాల్లో చేర్చడం సరికాదని స్పష్టం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మాట్లాడుతూ మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను శిక్షించి, పనితీరు పేలవంగా ఉన్న రాష్ట్రాలకు నిధులందిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ సహకార సమాఖ్యస్ఫూర్తి గురించి మాట్లాడతారని, కానీ ఆచరణలో కనిపించేది నియంతృత్వమని ఆరోపించారు. ఈ నెలాఖరులో గానీ, లేక మే నెల మొదటివారంలో గానీ విశాఖపట్నంలో తదుపరి సమావేశం జరుగుతుందని ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేస్తాను అంటున్న ఒక్క రోజు నిరాహార దీక్ష పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు... మోడీ దీక్ష చేస్తాను అనటం ప్రజల దృష్టి మరల్చడానికేనని చంద్రబాబునాయుడు ఆరోపించారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఆనంద నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చిన విందు సమయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. విపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరగనీయకపోవడాన్ని నిరసిస్తూ ఏప్రిల్‌ 12న భాజపా ఎంపీలతో పాటు మోదీ కూడా దీక్షలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. పార్లమెంటు సజావుగా సాగకపోవడానికి ఎన్డీయేనే కారణమని ఆయన ఆరోపించారు.

cm mdoi 11042018

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే పార్టీ వెనుక ఉండి లోక్‌సభ జరగనీయకుండా చేసింది ఎన్డీయే కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాన్ని ఏర్పాటు చేయకుండా మోదీని ఎవరు ఆపారు’ అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల వివాదం పరిష్కరించేందుకు కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభలో ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు జరగకపోవడంపై తప్పు తమ వైపు పెట్టుకుని ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

cm mdoi 11042018

కేంద్రం సాయం కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు సెక్టార్‌ సహాయంతో రాజధాని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇతర పార్టీలతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాను బలహీనం చెయ్యాలని చూస్తున్నారు. కానీ, తెదేపా చాలా బలమైన పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరో పక్క ఉదయం, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పోస్ట్... చంద్రబాబు గురించి రాస్తూ, సగటు తెలుగోడు చంద్రబాబుని అడుగుతున్న సూటి ప్రశ్న ఇది... రాష్ట్రాన్ని రంపంతో కోశారు....తెగిపడిన అవయవాల్ని తీసుకొని ఆంధ్ర వచ్చావు... పట్టిసీమ ఒక పాపం అన్నారు....కానీ పంట పండించావు... పోలవరం ఒక శాపం అన్నారు....కానీ ముందుకు నడిపించావు... రాజధాని ఒక అభూత కల్పన అన్నారు....కానీ రైతులు పొలం ఇచ్చారు... నీకు చిత్తశుద్ధి లేదన్నారు...కానీ ప్రజలు గెలిపించారు... కేంద్రంతో లాలూచీ పడ్డావు అన్నారు....కానీ మోడీని ఎదిరించావు. అవినీతి చేస్తున్నావ్ అంటున్నారు....కానీ అభివృద్ధి చేసి చూపిస్తున్నావు.

cbn 11042018 2

నువ్వు ఎవరికి పుట్టావ్ అని అడుగుతున్నారు? నిన్ను కాల్చి చంపమంటున్నారు? నిన్ను బావిలో దూకి చావమంతున్నారు ?నువ్వు ఎం పాపం చేశావ్? ఒక మనిషి ఇన్ని కష్టాలు పడితేనే కానీ "చంద్రబాబు" కాలేడా? నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే నాలాంటి వాడు ఇన్ని భరించాలా? ఇన్ని అవమానాలు నీకు ఎందుకు ? నీకే ఎందుకు ? ఈ ప్రశ్న ప్రజలు ఆనాడు రాముడిని అడిగి ఉండాల్సింది... కష్టం పడిని రాముడు దేవుడైతే మరి నువ్వు ఎవరు? ఇది ప్రతి తెలుగువాడు నిన్ను అడగాలనుకుంటున్న ప్రశ్న?

cbn 11042018 3

నిజమే.. ఈ ప్రశ్నల్లో వాస్తవం కూడా ఉంది... చంద్రబాబు నాయుడుని గత నలభై ఏళ్ళుగా తెలుగు ప్రజలు ఆదరించారు... ఎన్ని అవస్తావాలు ప్రచారం చేసినా, ఆయన్ను మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించారు... రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు.. చంద్రబాబు విజన్ కు, దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు... బిల్ గేట్స్ మొన్న వైజాగ్ వచ్చి ఏమి చెప్పారో విన్నాం... అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏమన్నారో విన్నాం... ఇలాంటి చంద్రబాబుని కనీస స్థాయి లేని జగన్ లాంటి వాళ్ళు, పవన్ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, బొత్సా లాంటి వాళ్ళు ఘోరంగా విమర్శించటం ఏమిటి ? ఇవన్నీ చంద్రబాబు భరిస్తూ, ముందుకు పోతూనే ఉన్నారు... అయినా, ఇలాంటి వాళ్ళు తిడుతుంటే, ఎలా భారిస్తున్నావ్ చంద్రబాబు అని, ప్రజలు అడుగుతున్నారు...

Advertisements

Latest Articles

Most Read