ప్రజారాజధాని అమరావతిని ముక్కలుచేయడానికి కుట్రలు పన్నిన ముఖ్యమంత్రి ఇన్ సైడింగ్ ట్రేడింగ్ అంటూ పెద్దఎత్తున దుష్ప్రచారం చేస్తూ, సీబీసీఐడీ, ఏసీబీలను తనజేబు సంస్థలుగా మార్చుకొని, అనేకమందిపై తప్పుడుకేసులు పెడుతున్నాడని, రాజధాని ప్రాంతవాసులంటే జగన్ కు ఎందుకంత నిర్ధయ అని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నిం చారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ తన అధికారయంత్రాంగాన్ని ఉపయోగించి, ప్రతిపక్షనేత చంద్రబాబుపై అసత్య ఆరోపణలుచేస్తున్నాడని, ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారమంతా కేవలం కట్టుకథలేనని నేడు హైకోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. కిలారిరాజేశ్ అనేవ్యక్తికి రాజధానిప్రాంతంలో 40సెంట్ల పొలముంటే, ప్రభుత్వం ఆయనపై అక్రమంగా కేసుపెట్టింద న్నారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా రాజేశ్ కోర్టుని ఆశ్రయిస్తే, నేడు హైకోర్టు ఇచ్చినతీర్పు నిజంగా ప్రభుత్వానికి చెంపపెట్టేనన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, స్పీకర్ సహా అందరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీపై, ప్రతిపక్షనేత చంద్రబాబుపైచేసిన ఆరోపణలన్నీ నేడుఏమయ్యాయోవారే సమాధానం చెప్పాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంపై, చంద్రబాబుపై చేసిన నిరాధార ఆరోపణలకు ముఖ్యమంత్రే బాధ్యుడని, ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టంచేసింద న్నారు. భూములక్రయవిక్రయాల్లో తమకు నష్టం జరిగిందని, కొను గోలుదారులు, అమ్మకం దారులు ఎక్కడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదన్నారు. పాలకులమోచేతి నీళ్లు తాగే వ్యక్తి ఇచ్చినఫిర్యా దు, ఐపీసీ చట్టాల్లోకి రాదని హైకోర్టుకుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వంలోని వారు ఏంసమాధానం చెబుతారని మాజీ మంత్రి నిలదీశారు. తూతూమంత్రంగా కేసులుపెట్టి, అరెస్టులు చేసి, వేధింపులు, కక్ష్యసాధింపులే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన డానికి కిలారి రాజేశ్ ఉదంతమే నిదర్శనమన్నారు. తామంటే గిట్టనివారిపై తప్పుడు కేసులుపెట్టి, జైలుకుపంపి, వేధించాలనే క్రిమినల్ ఆలోచనలను నేడుప్రజలు పాలకుల్లో చూస్తున్నారన్నా రు.

పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని స్వాగతించిన వైసీపీనేతలు, ప్రభుత్వపెద్దలు, నేడు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు లోబడి, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమపదవులకు రాజీనామా చేస్తారా అని ఆలపాటి నిగ్గదీశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు తీర్పు చూశాక, ప్రభుత్వానికి పాలన చేసే హక్కులేదని తమకు అనిపిస్తోందన్నారు. హైకోర్టు తీర్పుకి బాధ్యతవహిస్తూ జగన్మోహన్ రెడ్డి తక్షణమే తనపదవినుంచి వైదొలగాలని ఆలపాటి డిమాండ్ చేశారు. సంబంధంలేని వ్యక్తులతో రాజకీయ క్రీడ ఆడుతున్న ప్రభుత్వం, కడివెడు పాలలో విషపు చుక్కలా, అమరావతిని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో సర్వనాశనం చేసిందన్నారు. విశాఖలో పాలకులు సాగిస్తున్న భూబాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అక్కడి భూములను అమ్ముకోవడానికే ప్రభుత్వం అమరావతి లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడిందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన మంత్రులు, వైసీపీఎమ్మె ల్యేలు కిలారి రాజేశ్ ఉదంతంపై, హైకోర్టు తీర్పుపై ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. విజయవాడ- గుంటూరు మధ్యన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పడుతుందనే ప్రకటనవచ్చాక కొందరు వ్యక్తులు భూములుకొన్నారని, ఆమొత్తం కేవలం 176ఎకరాలు మాత్రమే నని, వైసీపీ ప్రభుత్వం, జగన్ అండ్ కో మాత్రం 4వేల ఎకరాలని నానాయాగీ చేయడం జరిగిందన్నారు. అసత్యంతో, కుయుక్తులతో ప్రజారాజధానిని తరలించాలని చూసేక్రమంలోనే పాలకులు ఈ విధంగా కుట్రపూరిత ప్రచారంచేశారన్నారు. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం తనవైఖరి మార్చుకోకుంటే, ప్రజల పోరాటానికి బలికాక తప్పదని మాజీమంత్రి హెచ్చరించారు. 160 సార్లకు పైగాకోర్టులు ప్రభుత్వ తీరునితప్పుపట్టినా, అర్థరాత్రి పూట ఇచ్చిన జీవోలను కొట్టేసినా, పాలకులవైఖరిలో మార్పురాకపోవడం సిగ్గుచేటన్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుని స్వాగతించిన వైసీపీనేత లు, ప్రభుత్వ పెద్దలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై న్యాయస్థానమిచ్చిన తీర్పుని కూడా అదేవిధంగా స్వాగతించాలని రాజేంద్రప్రసాద్ డిమాం డ్ చేశారు. కోర్టు తీర్పుపై ముఖ్యమమంత్రికి ఏమాత్రం గౌరవం ఉన్నాకూడా ఆయనతక్షణమే తన పదవికిరాజీనామా చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలనే కాదు, తమకు ఇష్టం లేని ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా కక్ష సాధింపు చర్యలు ఏమాత్రం మానటం లేదు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్, ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఉదంతాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఇందులో ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్, కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటంతో, ఆయన్ను టచ్ చేసిన అవకాసం ఇంకా వీళ్ళకు లేకుండా పోయింది. అయితే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని మాత్రం, ఇప్పటికీ వేదిస్తునే ఉన్నారు. పది రోజుల క్రితమే ఏబి వెంకటేశ్వర రావు, తన పై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేపించి, తన పై కుట్ర పన్నుతుంది అంటూ, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు లేఖ రాసారు. అంతే కాదు, తనను జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి, మళ్ళీ సస్పెండ్ చేయాలని చూస్తున్నారు అంటూ కోర్టులో కూడా కేసు వేసారు. అయితే హైకోర్టు, ఆయన్ను అరెస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వర రావు ఊహించినట్టే, ఆయన పై మళ్ళీ సస్పెన్షన్ వెతి వేసింది. ఆయన ఆరోపణలు చేసిన కొద్ది రోజులుకే, సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వటంతో, ఆయన ఊహించిందే నిజం అయ్యింది.

abv 19012021 2

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పాటు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇస్తూ, సస్పెన్షన్ అనేది గత ఏడాది ఆగష్టు నుంచే అమలు అవుతాయని తెలపటం మరో కొసమెరుపు. అయితే, ఇప్పటికే ఏబీవీ ఈ విషయం పై కోర్టులో పిటీషన్ కూడా వేసారు. తనకు ఇప్పటి వరకు జీతం కూడా ఇవ్వలేదని వాపోయారు. అంతే కాదు, అసలు తన వల్ల రూపాయి నష్టం కూడా జరగక పోయినా, ఏదో జరిగిపోయింది అంటూ, తన పై తప్పుడు ఆరోపణలు మీడియాలో చేసారని, చివరకు చార్జెస్ లో తనకు సంబంధం లేని విషయాలు ప్రస్తావనించారని, అందులో కూడా, ఎక్కడా ప్రభుత్వానికి రూపాయి నష్టం జరిగినట్టు లేదని వాపోయారు. అసలు డబ్బులు లావాదేవీలు జరగని చోట, అవినీతి జరిగింది అంటూ, తన పై అనవసర అభాండాలు వేసి, ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తనకు సంబంధం లేని విషయంలో, రూపాయి కూడా లావాదేవీ జరగని విషయంలో తనను లాగి, తన పై అభియోగాలు మోపి, తనను ఏదో విధంగా అరెస్ట్ చేసి, సస్పెండ్ చేయాలని చూస్తున్నట్టు ఏబి వెంకటేశ్వర రావు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీర్పు పై హైకోర్టు, మరోసారి అక్షింతలు వేసింది. కడప జిల్లా పులివెందులలో, దళిత మహిళ అ-త్యా-చా-రం ఘటన పై, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ అసమర్ధతను తప్పుబడుతూ, పెద్ద ఎత్తున ఆందోళన చేసి, చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించారు. అయితే బాధిత కుటుంబానికి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల పై, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. అయితే ఇదే నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అయినా వంగలపూడి అనిత పై కూడా, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. అయితే వంగలపూడి అనిత, ఎస్సీ సామాజికవర్గం కావటంతో, అది కూడా గ్రహించకుండా, అనిత పై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటంతో, అనిత న్యాయ పోరాటం చేసారు. హైకోర్టులో దీనికి సంబంధించి పిటీషన్ వేసారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన పై కూడా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుని నమోదు చేసారని ఆమె హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. వంగలపూడి అనిత తరుపున న్యాయవాది బాలాజీ యలమంజుల వాదనలు వినిపించారు. పులివెందుల ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుతో పాటు, తెలుగుదేశం నేతలు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారని తెలిపారు.

hc police 19012021 2

ఆ మహిళకు న్యాయం చేయాలని నిరసన తెలపటం కూడా తప్పేనా అంటూ, వాదించారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, బాధిత కుటుంబం తరుపున అండగా నిలబడితే కూడా, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా అంటూ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. గతంలో కూడా పలుమార్లు, ఇలాగే హైకోర్టు పోలీసులు పై అక్షింతలు వేసారు. ఎస్సీ మహిళ పైనే, ఎలా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. చట్టాలకు లోబడి కేసులు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. గతంలో కూడా అమరావతి రైతులు పై ఇలాగే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి, బేడీలు వేసి చేసిన ఘటన సంచలనం అయ్యింది. అయితే అప్పుడు కూడా ఎస్సీల పైనే, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం పై, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చివరకు డీజీపీని రెండు సార్లు కోర్టు ముందు హాజరు అవ్వమని చెప్పారు. అయినా పోలీసులు తీరు మారలేదు. మళ్ళీ అదే తప్పు చేయటంతో, ఈ రోజు మళ్ళీ హైకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.

నిన్న గొల్లపూడిలో, యధావిధగా మంత్రి కొడాలి నాని, బూతులతో, దేవినేని ఉమా, చంద్రబాబు పై నోరు పారేసుకున్నారు. కొడాలి నానికి తోడు,గన్నవరం నుంచి టిడిపి నుంచి గెలిచి, వైసీపీకి జంప్ కొట్టిన వంశీ కూడా గొల్లపూడి వచ్చి, ఇష్టం వచ్చినట్టు దేవినేని ఉమా పై మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతూ, నీ ఇంటికి వస్తా, నిన్ను కొడతా, అదీ ఇదీ అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఆయిన మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందో లేదో కానీ, ఒక మంత్రి ఇలా బహిరంగంగా బూతులు మాట్లాడుతూ, నీ ఇంటికి వచ్చి కొడతా, బడిత పూజ చేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్య పోయినా, కొడాలి నాని నోరు గురించి తెలిసి లైట్ తీసుకున్నారు. అయితే, నిన్న కొడాలి నాని మరీ రెచ్చిపోయి మాట్లాడటంతో, ఎప్పుడు లేనిది దేవినేని ఉమా కూడా చాలా ఘాటుగా స్పందించారు. పోరంబోకు కుక్క అంటూ, కొడాలి నాని భాషలోనే సమాధానం చెప్పారు. సమాధానం చెప్తూ, కొడాలి నాని నా ఇంటికి వచ్చి నన్ను టచ్ చేస్తా అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడు, ఇంటికి ఎందుకు, నేను రేపు ఉదయం గొల్లపూడి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం ముందు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చుంటాను, జగన్ మోహన్ రెడ్డి వస్తాడో, బూతులు మంత్రి వస్తాడో, ఎవడు వస్తాడో వచ్చి టచ్ చేయండి అంటూ చాలెంజ్ చేసారు. కొడాలి నాని పెద్దగా, మాట్లడాతాడు కాబట్టి, ప్రభుత్వం ఆయనదే కాబట్టి, దేవినేని ఉమా చాలెంజ్ ని స్వీకరిస్తారని అందరూ అనుకున్నారు.

uma 19012021 2

అయితే దేవినేని ఉమా కార్యక్రమానికి పర్మిషన్ లేదు అంటూ, రాత్రి నుంచి పెద్ద ఎత్తున పోలీసులు గుమిగూడారు. ఆయన ఇంటి వద్ద, సందులో,మొత్తం పోలీసులతో నింపేశారు. చీమ చిట్టుకుమనటానికి కూడా లేదు. అయితే ఈ సందర్భంలో ఆ పోలీస్ వలయాన్ని చేదించుకుని దేవినేని ఉమా, చెప్పిన టైంకి, గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చారు. అయితే ఆయన ఎలా వచ్చారో పోలీసులకు ఆర్ధం కాక షాక్ తిన్నారు. దేవినేని ఉమా ఇంటి ముందు పోలీసులు ఉన్నారు కానీ, ఆయన నిన్న రాత్రే తన ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళారని తెలుస్తుంది. ఉదయం పది గంటల సమయంలో ఒక క్యాప్, మొఖానికి మాస్క్ పెట్టుకుని, సాధారణ ప్రజలు లాగ, ఉమా నడుచుకుంటూ గొల్లపూడి సెంటర్ వచ్చారు. అయితే పోలీసులు ఎవరూ ఆయన్ను గుర్తు పట్టలేదు. ఆయన నడుచుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్ళగా, అక్కడ పోలీసులు పసిగట్టి, వెంటనే దేవినేని ఉమాని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత పోలీస్ వలయాన్ని చేధించుకుని మరీ, చెప్పిన టైంకి, చెప్పినట్టే, ఉమా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావటంతో, పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు. https://youtu.be/UUANAxwN4mU

Advertisements

Latest Articles

Most Read