జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, రోజు వారీ విచారణ మొదలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టులో రోజు వారీ విచారణ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు, కేసుల పై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఆ పిటీషన్లలో తమ పేరు తీసేయాలని, డిశ్చార్జ్ పిటీషన్లు వేసారు. అలాగే సిబిఐ, ఈడీ కేసులు కలిసి విచారణ జరపాలి అని కూడా పిటీషన్ లు వేసారు. గత రెండు వారాలుగా వీటి పైనే విచారణ జరుగుతుంది. జగన్ తరుపున పిటీషన్ వేసిన న్యాయవాదులు, సిబిఐ , ఈడీ పెట్టిన కేసులు రెండూ ఒకటే అని, సిబిఐ కేసులు విడిగా, ఈడీ కేసులు విడిగా విచారణ చెయ్యాల్సిన అవసరం లేదు అంటూ, ఒక పిటీషన్ దాఖలు చేసారు. దీని పై జగన్ తరుపు న్యాయవాదులు వదనాలు వినిపించారు. ఇక మరో పక్క ఈడీ తరుపున కూడా కోర్టుకు వాదనలు వినిపిస్తూ, జగన్ విజ్ఞప్తిని తోసి పుచ్చారు. సిబిఐ అభియోగాలతోనే తాము ఈడీ కేసు పెట్టినా, తాము పెట్టిన కేసు వేరని చెప్పారు. సిబిఐ కేసులు వేరే సెక్షన్ తో, ఈడీ కేసులు వేరే సెక్షన్ తో నమోదు అయ్యాయని, ఇది ప్రత్యేక చట్టం కింద నమోదు చేసామని కోర్టుకు తెలిపారు. అందుకే సిబిఐ కేసులను విడిగా, ఈడీ కేసులను విడిగా విచారణ జరపాలని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. అయితే మనీలాండరింగ్‌ నిరోధక ఆక్ట్ , సెక్షన్ 44 ప్రకారం, సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ ఒకే కోర్టులో విచారణ జరపాలని ఉందని కోర్టుకు తెలిపారు.

cbi 08112020 2

అయితే దీని పై వాదనలు కొనసాగిస్తామని, తమకు మరింత సమయం కావాలని కోరటంతో, కోర్టు ఈ కేసుని సోమవారానికి వాయిదా వేసింది. ఇక అలాగే జగన్ మోహన్ రెడ్డి పేరు, ఈ కేసుల నుంచి తీసి వేయాలని కోరుతూ, వేసిన డిశ్చార్జ్ పిటీషన్ల పై కూడా వాదనలు జరిగాయి. జగన్ మోహన్ రెడ్డి ఈ నేరం చేసారు అని చెప్పటానికి, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సిబిఐ ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కేసు నుంచి జగన్ పేరు తప్పించాలని కోరారు. సిబిఐ ఇప్పటికే ఎంతో లోతైన విచారణ జరిపిందని, అయినా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు కు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి నేరం చేసినట్టు, ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదు కదా అని ప్రశ్నించారు. కంపెనీ చట్టాల పై అవగాహన లేక, ఈ కేసులు పెట్టారని కోర్టుకు వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటీషన్ పై ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం పై, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు వినిపించారు. అయితే దీని పై ఇంకా వాదనలు కొనాగుతున్నాయి. ఇంకా సిబిఐ తరుపు వాదనలు ఈ పిటీషన్ లో జరగలేదు. ఈ కేసు కూడా సోమవారం నుంచి, మళ్ళీ వాదనలు ప్రారంభం అవుతాయి.

మాట తప్పం, మడమ తిప్పం అంటూ, వైసిపీ నేతలు చెప్పే డైలాగులకు, గ్రౌండ్ లో జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోతుంది. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో పనులు అలాగే చేస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి, సిపీఎస్ వరకు, 45 ఏళ్ళ పెన్షన్ నుంచి వివిధ పధకాల వరకు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు ఇసుకలో అవినీతి చేసారని ఇసుక పాలసీ మార్చేసారు. రెండు సార్లు మార్చారు. విచిత్రం ఏమిటి అంటే, చంద్రబాబు టైం కంటే, ఇప్పుడు ఇసుక ధర 5 రెట్లు ఉంది. ఇక మరో పక్క మద్యం కూడా అంతే. మొన్నటి దాకా ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటే తాగటం మానేస్తారని, ధరలు పెంచాం అన్నారు. తీరా ఇప్పుడు చుస్తే, ఇప్పటికి ధరలు రెండు సార్లు తగ్గించారు. అంటే తాగమని తగ్గించారా ? వివిధ రకాల చార్జీలు, కరెంటు చార్జీలు అంతే. ఈ రేట్లు అన్నీ పూర్తిగా పూర్తిగా తగ్గిస్తాను అంటూ ప్రమాణస్వీకారం రోజు చెప్పి, ఇప్పుడు రెండింతలు పెంచేసారు. ఇలా మాట తప్పుతూ, మడమ తిప్పుతూ పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మరో విషయంలో కూడా మాట తప్పి, మడమ తిప్పేసారు. అదే విద్యుత్ ఒప్పందాలు విషయం. ఈ విద్యుత్ ఒప్పందాల విషయం, అంతర్జాతీయ స్థాయిలో గోల గోల అయ్యింది. వివిధ దేశాలు కూడా, మన రాష్ట్ర వైఖరి పై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసాయి.

jagan 08112020 1

అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశంలో, అసెంబ్లీలో ఒక ప్రెజెంటేషన్ వేసి, చంద్రబాబు విద్యుత్ ఒప్పందాల్లో దోచుకున్నారు అని, అసలు కంపెనీలకు 25 ఏళ్ళతో ఒప్పందం ఏమిటి, బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవరైనా 25 ఏళ్ళకు ఒప్పందం చేసుకుంటారా, టెక్నాలజీ మారిపోతూ వస్తుంది కదా, ఎందుకు ఇలా అంటూ ఒక రేంజ్ లో చంద్రబాబు పై విరుచుకుని పడ్డారు. ఇదంతా అవినీతి అని తేల్చేసారు. అయితే ఇప్పుడు 18 నెలలు తరువాత మాట తప్పి, మడమ తిప్పేసారు. చంద్రబాబు గతంలో కేంద్రం మార్గదర్శకాలు ప్రకారం 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకుంటే, ఇప్పుడు కొత్త రూల్స్ తెచ్చిన జగన్ ప్రభుత్వం, 30 ఏళ్ళ వరకు ఒప్పందాలు చేసుకునే విధంగా రూల్స్ మార్చేసారు. అప్పట్లో తప్పు అని, బుద్ధి ఉందా అని, అవినీతి చేసేసారు అని చెప్పి, ఇప్పుడు కేంద్రం చెప్పిన దాని కంటే ఎక్కువగా 30 ఏళ్ళకు ఒప్పందం చేసుకోవటం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే అప్పట్లో చంద్రబాబు పై చేసిన విమర్శలు అన్నీ రాజకీయ విమర్శలేనా ? ప్రజలు మర్చిపోతారని అనుకున్నారా ? రాజకీయంగా వివాదాలు చేసి, ఈ 18 నెలల్లో సోలార్ , విండ్ లో పెట్టుబడులు తగ్గిపోటానికి కారణం అయ్యారా ? ఇలా ఉంటాయి మన రాజకీయాలు...

ఆంధ్రప్రదేశ్ లో వేల మంది పాస్టర్లకి, నెల నెలా ప్రభుత్వం 5 వేల రూపాయల చొప్పున జీతాలు ఇస్తున్నట్టుగా ఉన్న ఆ జాబితాను తప్పుబడుతూ, అనేక మంది దళిత ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని, వాళ్ళు పాస్టర్లగా మళ్ళీ ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకుంటున్నారు అంటే, వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవాలని గత కొన్ని రోజులుగా కొంత మంది వ్యక్తులు, కొన్ని సంఘాలు ఈ విషయం పై పోరాటం చేస్తున్నాయి. ఫోరం ఫర్ లీగల్ రైట్స్ అనే సంస్థ, అందప్రదేశ్ లో నెల నెలా ప్రభుత్వం వద్ద నుంచి సొమ్ము తీసుకుంటున్న పాస్టర్ల జాబితా సేకరించి, అందులో 65 శాతం మంది, రిజర్వేషన్లు పొందుతూ, వాళ్ళు మళ్ళీ పాస్టర్లగా డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు మతం మారారు అంటే రిజర్వేషన్ కోల్పోవాలని, వివరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసారు. కేంద్రం సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుంచి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ లేఖ అందింది. ఇలా క్రీస్టియన్ లు గా మతం మారి కూడా, అటు రిజర్వేషన్ ఫలాలు, ఇటు పాస్టర్లకు ఇచ్చే డబ్బు నుంచి, రెండు వైపులా లబ్ది పొందుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాన్ని ఆదేశించింది. నకిలీ సర్టిఫికేట్ ల తో, ఈ లబ్ది పొందతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరింది. క-రో-నా లాక్ డౌన్ సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పూజారులకు, మౌజన్లకు, పాస్టర్లకు 5 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

minister 07112020 2

అయితే పాస్టర్ల విషయంలో రెండు వైపులా లబ్ది పొందతున్నారని, వీరిని నిలువరించాలని ఫిర్యాదు అందింది. దీంతో వారి పై చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలు మాకు పంపాలి అంటూ, కేంద్రం, రాష్ట్రాన్ని ఆదేశించింది. మొత్తం 29,800 మంది పాస్టర్లకు 5 వేలు ఇస్తుంటే, అందులో దాదాపుగా 70 శాతం, ఎస్సీ, ఓబీసి రిజర్వేషన్ల సర్టిఫికేట్ లు కలిగి ఉన్నారని, వారు రెండు వైపులా డబ్బులు తీసుకుంటున్నారని, పూర్తి వివరాలతో కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక పైనే కేంద్రం స్పందించి, చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ తీసుకుంటే, ఎస్సీ హోదా కోల్పోయి, ఎస్సీ రిజర్వేషన్ ద్వారా వచ్చే అన్ని కోల్పోతారు. అయితే రాష్ట్రంలో మతం మారినా, ఎస్సీ అని చెప్పుకుంటూ, ఆ ఫలాలు అనుభవిస్తూ, ఉద్యోగాలు, వివిధ పధకాలు పొందుతున్నారు అనేది ఆరోపణ. అయితే దీని పై వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా, ఇటీవిల ఈ అంశం పై పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇదే అంశం పై ప్రధానికి కూడా లేఖ రాసారు. మరి దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్‌ ఎన్వీ రమణ, చట్టాలు, వాటిని అమలు చేసే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వంలోని వ్యక్తులు, వివిధ రాజ్యాంగా సంస్థల మధ్య ఉండవలసిన సమన్వయం, ఇలా వివిధ అంశాల పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఏషియన్ లా ఇన్‌స్టిట్యూట్‌ 17వ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గున్న జస్టిస్, వివిధ అంశాల పై తన అభిప్రాయాలు తెలిపారు. మన ప్రజాస్వామ్యానికి, మన వ్యవస్థలకి అవినీతి అనేది ఒక చెదలా పట్టి పీడిస్తుందని అని అన్నారు. అవినీతి పరుల వల్ల, వ్యవస్థల పై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉందని జస్టిస్ రమణ అన్నారు. రాజ్యాంగం అనేది ఎంత మంచిది, సమర్దవంతమైనిది అయినప్పటికీ, దాన్ని అమలు చేసే వారు చెడ్డ వారు అయితే, అది ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందని అన్నారు. అలాగే రాజ్యాంగం సమర్ధవంతంగా లేకపోయినా, దాన్ని అమలు చేసే వారు మంచివారు, సమర్ధులు అయితే, ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దేశంలో ఏ వ్యవస్థ అయినా, చట్టమైనా, న్యాయమైనా, రాజ్యాంగం ప్రకరామే నడవాలని అన్నారు. మన దేశ చట్టల్లోనే అంశాలను విబేధించి, దానికి బాష్యం చెప్పే వాళ్ళు ఉంటారని, తన సుదీర్ఘ ప్రస్థానంలో తెలుసుకున్నాని, దేశ సుస్థిరత మాత్రం, రాజ్యాంగంలోని న్యాయ సూత్రాలను పాటిస్తూ, విజయవంతంగా వాటిని పరిష్కరించంటం పైనే, ఉంటుందని అన్నారు.

nramana 08112020

అలాగే న్యాయం అనేది కేవలం, కోర్టులు మాత్రమే చేయవని, అన్ని రాజ్యాంగా సంస్థలు దానికి తోడ్పడాలని అన్నారు. న్యాయం చేసే అధికారం, రాజ్యాంగం సుప్రీం కోర్టుకు ఎలా ఇచ్చిందో, అలాగే రాజ్యానికి కూడా మంచి సమాజం ఏర్పాటు చేసే బాధ్యత ఇచ్చిందని అన్నారు. న్యాయం అంటే, ఈ దేశ ప్రజలకు, సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం చేయటమే అని, దీని కోసం అందరూ కలిసి రావాలని అన్నారు. మంచి సమాజం కోసం ప్రభుత్వాలు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని అన్నారు. అలాగే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వివిధ అంశాల పై కూడా చర్చించారు. ముఖ్యంగా ఈ వైరస్ వచ్చిన తరువాత, మొత్తం స్వరూపమే మారిపోయిందని అన్నారు. అన్ని రంగాల్లో లాగే, న్యాయ రంగానికి ఈ వైరస్ వల్ల ఇబ్బందులు తప్పలేదని అన్నరు. ఈ వైరస్ వచ్చిన తరువాత, అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి కోల్పోతున్నారని, అలాగే పిల్లల చదువులకు కూడా ఇబ్బంది వచ్చిందని అన్నారు. వీటి అన్నిటి నుంచి, తొందరగా బయట పడాలని ఆకాంక్షించారు.

Advertisements

Latest Articles

Most Read