తెలుగుదేశం నేత మాజీ మంత్రిగా పని చేసిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై, ప్రభుత్వం అభియోగాలు మోపి, ఆయన్ను ఆర్రేస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా మూడు నెలలు అచ్చెన్నాయుడు జైల్లో ఉన్నారు. చివరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని, హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు పై కావాలని కుట్ర చేసారు అంటూ, ఆరోపిస్తుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన్ను అరెస్ట్ చేసారని చెప్తూ వస్తుంది. నిజాయితీగల రాజకీయాలకు నిలయమైన కింజరాపు కుటుంబానికి కళంకం అంటించాలనే దురుద్దేశం ఒక పక్క, తమ అక్రమాలను గట్టిగా ప్రశ్నిస్తోన్న అచ్చెన్నాయుడుపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచన మరో పక్క, ఫలితంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్ర చేసి అక్రమ కేసుల్లో ఇరికించింది అంటూ, మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉంది. దానికి బలం చేకూరుస్తూ, స్వయంగా వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యింది. గోడదూకి మరీ వెళ్ళి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసిన ఏసీబీ మొదట్లో రూ. 900 కోట్లు స్కాం అంటూ హడావిడి చేసి, తరువాత రూ. 3 కోట్లు అంటూ అభియోగాలు మోపి.. చివరకు 70 రోజుల తర్వాత అచ్చెన్న మీద పెట్టిన కేసులకు ఆధారాలు లేవని ఒప్పుకుందని తెలుగుదేశం పార్టీ చెప్తుంది.

దీనికి సంబందించి తెలుగుదేశం పార్టీ ఒక వీడియో విడుదల చేసింది. ఆగష్టు 19, 2020వ తేదీన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పిన మాటలు చూపిస్తూ, ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు డబ్బు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆయన చెప్పిన మాటలు చుపించారు. ఇంకా ఆగస్టు 28, 2020న హైకోర్టులో సైతం ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ కూడా, అచ్చెన్నాయుడు ఏ విధమైన నగదు తీసుకున్నట్టు ఆధారాలు లేవని చెప్పారని, ఇదే సందర్భంగా హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ.. " విజిలెన్స్ గతంలో చేసిన ప్రాధమిక విచారణలో కానీ, అరెస్ట్ చేసిన తరువాత రెండు నెలలుకు పైగా కానీ, పిటీషనర్ పై ఏ ఆధారం కోర్టుకు చూపించలేదు" అని పేర్కొందని తీర్పు కాపీ చూపించారు. ఇక తాజాగా, వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను అచ్చెన్నాయుడుని ఇరికించాను కాబట్టి, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు చూపించి, ఇవన్నీ అచ్చెన్నాయుడు పై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెట్టింది అనటానికి ఆధారాలు అంటూ, తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇది ఆ వీడియో https://www.facebook.com/naralokesh/videos/1653724618121512

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న, నున్న బైపాస్ రోడ్డు సమీపంలో, నిన్న రాత్రి కాల్పుల కలకలం రేగింది. ప్రశాంతంగా బ్రతుకుతున్న విజయవాడలో, పిస్టల్ తో కాల్చి చంపే-యటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విజయవాడ కమీషనర్ ఆఫీస్ ఓ పని చేసే అతని పై కాల్పులు జరపగా, అతను అక్కడే చనిపోయారు. మరొక వ్యక్తి కడుపులోకి బుల్లెట్ వెళ్ళటంతో , ఆయన్ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఘటన జరిగిన విషయం తెలియగానే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ సిపీ కూడా రంగంలోకి దిగారు. అయితే ఈ ఘటన పై పూర్వాపరాలు తెలియాల్సి ఉంది. అసలు ఎందుకు వీళ్ళు రాత్రి పూట ఇక్కడకు వచ్చారు అనేది ప్రధాన ప్రశ్నగా ఉంది. సమీపంలోని బార్ షాప్ కోసం, మద్యం సేవించటానికి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం ఎంత మంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు అనేది ఆరా తీస్తున్నారు. అయితే ప్రాధమిక సమాచారం ప్రకారం చనిపోయిన మహేష్ అనే వ్యక్తితో పాటు, గాయపడిన హరితో పాటు, మరో ముగ్గురు వచ్చినట్టు తెలిసింది. అయితే ఈ సందర్భంలో గొడవ జరిగి, వాళ్ళలో వాళ్ళు ఏమైనా కొట్టుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయని మాటే కానీ, రాజకీయంగా తెలుగుదేశం పార్టీనే పైచేయి సాధిస్తూ వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, అనుభవం లేకపోవటం, తొందరపాటు, ఏదో చేసేయాలనే ఆతృత, అవినీతి ఆరోపణలు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ఎంత ప్రయత్నం చేస్తున్నా అది బ్యాక్ ఫైర్ అవుతూనే ఉంది. టిడిపి నేతల పై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసినా, సరైన ఆధారాలు లేకపోవటంతో అవి కోర్టు ముందు నిలవటం లేదు. అచ్చమనాయుడుని అంత టార్గెట్ చేసినా, రూపాయి కూడా నిరూపించలేకపోయారు. అలాగే అమరావతి భూములు విషయం, ఫైబర్ గ్రిడ్, ఇలా అనేక అంశాలు ఏమి చెప్పలేక పోయారు. కేంద్రం వద్ద సిబిఐ ఎంక్వయిరీ ప్రతిపాదన పెట్టినా, అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక మరో పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం దూకుడు మీద ఉంది. ఉన్న కొద్ది మంది నాయకులతోనే, వైసీపీని ఫిక్స్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా కార్మిక శాఖా మంత్రి జయరాం పై ఆధారాలు చూపిస్తూ తెలుగుదేశం దాడి చేస్తుంది. అయితే మంత్రి అవన్నీ తన పై కావాలని చేస్తున్న ఆరోపణలు అని చెప్తున్నా, చూపిస్తున్న వివరాలతో, తెలుగుదేశం పార్టీ వాదనే ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా మంత్రి పై అనేక ఆరోపణలు రావటం కూడా, వైసీపీకి ఇబ్బందిగా మారింది.

మొదటగా మంత్రి గారికి తమ్ముడు వరుస అయ్యే వ్యక్తి పేకాట శిబిరం నడుపుతూ దొరికారు. ఇది పోలీసులే పట్టుకున్నారు. అయితే కేసు పై పురోగతి ఏమైందో తెలియదు. మంత్రి మాత్రం నాకు సంబంధం లేదని చెప్పారు. ఇక రెండోది బెంజ్ కారు ఆరోపణ. ఈఎస్ఐ కేసులో ఏ7గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి, మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్న ఫోటోలు, అలాగే ఆ కారు వాడుతూ ఉన్న ఫోటోలు, దాని పై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఫోటోలు విడుదల చేసి, అది మంత్రికి లంచంగా ఇచ్చారని, ఏ7 కార్తిక్ బినామీ అని టిడిపి ఆధారాలు చూపించింది. ఇవి అవాస్తవం అని, నా కొడుకు ఫాన్స్ ఎవరో చెప్తే, కారు తీసుకుని, కారు తోలాడని మంత్రి చెప్పారు. ఇక తాజాగా మంత్రి 203 ఎకరాలు వేరే కంపెనీని భూమిని తమ పై పేరు పై బదలాయించారు అంటూ తెలుగుదేశం ఆధారాలు చూపించి, క్షేత్రస్థాయి పర్యటన చేసింది. అయితే మంత్రి మాత్రం 100 ఎకరాలు కొన్నట్టు ఒప్పుకున్నారు. కానీ ఇందులో స్కాం ఉందని, పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్తామని తెలుగుదేశం అంటుంది. ఇలా వరుస పెట్టి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో జగన్ చర్యలు తీసుకుంటారా ? విచారణ చేపించి, నిజా నిజాలు తెలుస్తారా ? చూద్దాం ఏమి జరుగుతుందో.

అందరూ అనుకున్నట్టే జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తన పై కక్ష తీర్చుకోవటానికి ప్రభుత్వం చూస్తుందని, నిన్న జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన, 24 గంటల్లోనే జేసీకి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఆయనకు ఉన్న మైనింగ్ పై, మైనింగ్ శాఖ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. దివాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహించటంతో పాటుగా, గనుల్లో కార్మికుల బద్రతను గాలికి వదిలేసారని, జేసి కుటుంబం పైన, వాళ్ళ కుటుంబం పైనా, అధికారులు అభోయోగాలు మోపారు. ఇందుకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసారు. ఈ నోటీసులకు సంబంధించి, తమకు ఎలాంటి ఒత్తిడులు కానీ, ఎలాంటి దురుద్దేశాలు తమకు లేవని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణా రావు వివరించారు. కేవాలం గనులును నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించటం వల్లే నోటీసులు ఇచ్చామని తెలిపారు. దీని పై ఉన్నతాధికారులకు సమాచారం పంపి, మరిన్ని చర్యలు తీసుకుంటామని, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణా రావు చెప్పారు. అనంతపురం జిల్లా ముచ్చుకోట వద్ద అటవీ ప్రాంతంలో జేసి కుటుంబానికి రెండు మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. ఆ గనుల్లోనే శుక్రవారం నాడు తనిఖీలు చేసారు తెలుస్తుంది.

దీంతో అప్పుడే నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేసినట్టు గుర్తించామని చెప్తున్నారు. ఇవి డోలమైట్ ఖనిజానికి సంబందించిన గనులు. తనిఖీలు తరువాత అక్కడ, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నట్టు చెప్పారు. అయితే ఇదే విషయం పై జేసీ దివాకర్ రెడ్డి నిన్నే, ఈ విషయం పై ఫైర్ అయ్యారు. గనుల శాఖ కార్యాలయం వద్దకు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ నియంత పాలన ఎంతో కాలం ఉండదని, తరువాత మేము వచ్చి, మాకు చేసిన సన్మానం కంటే, రెట్టింపు సన్మానం ఉంటుందని, ఎవరినీ మరచిపోమని అన్నారు. తమకు అన్నం పెట్టేది ఈ గనులు అని, ఇవి మూసివేస్తే తాము రోడ్డున పడతామని, అన్నం లేకుండా చేయాలనీ, ఆర్ధికంగా దెబ్బ కొడుతున్నారని జేసి నిన్న మీడియాతో తెలిపారు. తన సోదరుడు పై కక్ష తీర్చుకున్నారని, ఇప్పుడు తన పై పడ్డారని, అన్నిటికీ సమాధానం చెప్పే రోజు తొందర్లోనే వస్తుందని, రాజకీయ దురుద్దేశంతో, ఇలా వేధించటం ఎప్పుడూ చూడలేదని, అందరి లెక్కలు తెల్చుతామని జేసి అన్నారు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read