గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారికంగా, సుప్రీం కోర్టు జస్టిస్ తో పాటుగా, ఆరుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను టార్గెట్ చేస్తూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు, జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను, అధికారికంగా మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే లేఖ రాయటం పైన ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, కాబోయే చీఫ్ జస్టిస్ ను, అదీ ప్రజా ప్రతినిధుల పై కేసులు ఏడాదిలోగా తేల్చేయాలని ఆ జస్టిస్ బెంచ్ విచారణ చేస్తున్న సమయంలో, ఇలా టార్గెట్ చేయటం పై, అన్ని వైపుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు వస్తున్నాయి. అన్ని సంఘాలు, పెద్ద పెద్ద న్యాయవాదులు, జగన్ వైఖరిని తప్పు బట్టారు. ఈ క్రమంలోనే, మొదటిగా స్పందించింది, ఢిల్లీ హై కోర్టు బార్ అసోసియేషన్. జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖ, అందులోని అంశాలను తప్పు బడుతూ ఢిల్లీ హై కోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసి, ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తీర్మానం పై సంతకం చేసింది ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిజిత్. అయితే ఎప్పుడైతే తాను జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేసి మీడియాకు వదిలనో, అప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ, అభిజిత్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా బార్ అసోసియేషన్ సెక్రటరీకి బెదిరింపులు రావటం పై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు అభిజిత్ ఈ రోజు లేఖ రాసారు. తాము జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ పై రాసిన లేఖ పై ఖండిస్తూ ఒక తీర్మానం చేసామని, ఆ తీర్మానం పై తన సంతకం ఉందని, ఈ తీర్మానం అక్టోబర్ 14న మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచురితం అయిన విషయం చెప్తూ, తరువాత రోజు, అంటే అక్టోబర్ 15న తాను, తన ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉండగా, ఉదయం 11 గంటల సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అవతల వ్యక్తి తాను, ఇండియన్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ కు సెక్రటరీ అని చెప్పారని, తరువాత తనను హిందీలో దుషిస్తూ, బెదిరించారని, ఎందుకు ఆ తీర్మానం చేసారు అంటూ తన పై దుర్భాషలాడారని తన ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను ఎటువంటి రిప్లై ఇవ్వకుండా ఫోన్ పెట్టేసానని, తరువాత మళ్ళీ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇదే రకమైన బెదిరింపు ఫోన్ కాల్స్, తమ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహిత్ కి కూడా వచ్చాయని తెలిసిందని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ పరిణామంతో తమ కుటుంబం భయపడిపోయిందని, తమ హక్కులను కాపాడాలని పోలీస్ కమిషనర్ కు రాసిన ఫిర్యాదు లేఖలో, అభిజిత్ తెలిపారు. అయితే ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేసారు, ఎవరు చేయమంటే చేసారు ? అనే విషయం పై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సరిగ్గా వారం క్రితం, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తాము ఒక విషయం చెప్తాము, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ ప్రకటన అందరూ చూడండి అంటూ మీడియాకు లీకులు ఇచ్చింది. అందరూ ఏమైనా కొత్త సంక్షేమ పధకమో, లేకపోతే భారీ పెట్టుబడి గురించి కానీ, లేక జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు కాబట్టి, స్పెషల్ స్టేటస్ గురించి చెప్తారేమో అని ఆశగా ఎదురు చూసారు. తీరా చూస్తే, ఆ ప్రకటనా న్యాయ స్థానాలు, హైకోర్టు జడ్జీలు, సుప్రీం కోర్టు జడ్జి పై, ఫిర్యాదు చేసిన విషయం. అది కూడా ఇంగ్లీష్ లో ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చి, లేఖ మీడియాకు విడుదల చేసి, తమను ఏ ప్రశ్నలు అడగ వద్దు అంటూ చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం ముగించి వెళ్ళిపోయారు. అయితే దాని తరువాత ఈ విషయం పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ విషయం పై న్యాయస్థానాలు ఎలా రియాక్ట్ అవుతాయి, న్యాయమూర్తులు ఎలా రియాక్ట్ అవుతారు, అనే విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే వివిధ బార్ అసోసియేషన్ లు, వివిధ సీనియర్ అడ్వకేట్లు ఈ విషయం పై స్పందించారు. జగన్ పై ఘాటు విమర్శలు చేసారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, హైకోర్టు ఒక కేసు విషయంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆ గ్యాగ్ ఆర్డర్ కి విరుద్ధంగా, ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్ కానీ, లేఖ కాని ఉంది. అయితే ఈ విషయం పై హైకోర్టు కూడా స్పందించింది.

రాజధానికి సంబందించిన భూములు విషయంలో, ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ, కేసు వివరాలు కానీ మీడియాలో ప్రసారం చేయ కూడదు అని మేము ఆదేశాలు ఇస్తే, ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్ తో, అలాగే ముఖ్యమంత్రి రాసిన లేఖ బహిర్గతం చేయటంతో, మా ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయిందని, హైకోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ సవరించాలని, ఆ కేసు విషయాలు తమకు తెలియలాని, మమతారాణి అనే న్యాయవాది ఈ కేసు విషయంలో అనుబంధ పిటీషన్ దాఖలు చేసారు. తమకు ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ వేసారు. ఈ అనుబంధ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన అధిష్టానం, ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్, మీడియాకు ఇచ్చిన లేఖలతో, మేము ఇచ్చిన ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయాయని, ఇంకా దీని పై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని, ఈ అనుబంధ పిటీషన్ కూడా , మెయిన్ పిటీషన్ తో కలిపి విచారిస్తామని పేర్కొంది. ఇక పొతే, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీలో సోషల్ మీడియాలో పెడుతున్నారని, అవి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని, దమ్మాలపాటి శ్రీనివాస్‌ తరుపు న్యాయవాది మరో అనుబంధ పిటీషన్ వేయాగా, ఇది కూడా అత్యవసర విచారణ అవసరం లేదని, సీరియల్ ప్రకారం బెంచ్ ముందుకు వస్తుందని కోర్టు తెలిపింది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది ఒక విధంగా వాస్తవం అని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది కూడా. కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, ఎక్కువగా అప్పులు తీసుకునే వెసులుబాటు విషయంలో కానీ, ఇలా అనేక విషయాల్లో కేంద్రం సపోర్ట్ జగన్ కు ఉంటూ వస్తుందని ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అయితే కీలకమైన విషయాల్లో మాత్రం కేంద్రం ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని ఎంత మొత్తుకున్నా, సరైన ఆధారాలు ఏమి లేకపోవటంతో కేంద్రం ఒప్పుకోలేదు. అలాగే రాజధాని మార్పు విషయంలో కానీ, శాసనమండలి రద్దు విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యమైన విభజన హామీలు, పోలవరం, స్పెషల్ స్టేటస్, ఇలా అనేక కీలకమైన విషయాల్లో మాత్రం కేంద్ర సహకారం లేదనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి మరో కీలకమైన విషయం పై, కేంద్రం నో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిశా చట్టం బిల్లుని కేంద్రం వెనక్కు పంపించింది. గతంలో కూడా ఒకసారి కేంద్రం ఇలాగే బిల్లుని తిప్పి పంపించింది. సవరణలు చేసి మళ్ళీ పంపించగా, ఇప్పుడు రెండో సారి కూడా కేంద్రం ఆ బిల్లుని వెనక్కు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు పై అనేక ప్రచారాలు చేసింది. రాజకీయంగా కూడా ఈ బిల్లును వాడుకుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లు ఇంకా పాస్ కూడా కాలేదు, ఇంకా చట్టం కూడా అవ్వలేదు.

దిశా చట్టం కింద కేసులు పెడుతున్నామని పోలీసులు చెప్తున్నారు, ఉ-రి శిక్ష కూడా పడిందని అంటున్నారు, తీరా చుస్తే ఈ బిల్లు అసలు ఆమోదమే పొందలేదని, ఇలాంటి బిల్లుతో ఆ చట్టాలు కింద ఎలా కేసులు పెడుతున్నారని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన వార్త, ఈ వాదనకు బలం చేకుర్చుంది. దిశా బిల్లులోని లోపాలను ఎత్తి చూపుతూ, కేంద్రం అభ్యంతరం తెలిపింది. వాటిని సరి చేసి, మళ్ళీ తమకు బిల్లు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారే చేసింది. దీంతో ఇప్పుడు ఈ బిల్లు సవరణలు చేసి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి కానీ కేంద్రానికి పంపించటానికి కుదరదు. ఈ బిల్లులో ఏపి విభాగానికి వర్తించేలా మాత్రమే, ఐపిసిలో కొత్త సెక్షన్లను ఏపి జోడించింది, బిల్లుగా మార్చింది. ఇందులో 21 రోజుల్లో శిక్షతో పాటుగా, ఉ-రి శిక్ష లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో, మండలిలో మాత్రమే ఆమోదం పొందింది. ఈ బిల్లుని కేంద్రం మాత్రం ఆమోదించలేదు. బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని వెనక్కు తిరిగి పంపించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశం పై ఎలా స్పందిస్తుందో చూడాలి. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఈ చట్టం, ఇంకా కేంద్రం ఆమోదించక పోవటం, రాజకీయంగా కూడా విమర్శలు ఎందుర్కునే సందర్భం అనే చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చాలా రోజులు తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. గతంలో మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి, ఆవ భూములు స్కాం, ఇసుక, మద్యంలో జరుగుతున్న అక్రమాల పై మాట్లాడారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులను డీ కొట్టే అంశం పై, అమరావతి భూములు పై, జగన్ కేసులు పై తదితర అంశాల పై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలు వేల్లదిన్కాహారు. ముందుగా ఈ క-రో-నా సమయంలో కోర్టులు బౌతికంగా పని చేయటం లేదు కాబట్టి, ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే కేసులు నడుస్తున్నాయని, దీనికి కొనసాగింపుగా వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలనీ తానూ చీఫ్ జస్టిస్ కు ఉత్తరం రాసినట్టు చెప్పారు. ప్రజా ప్రతినిధుల పై కేసులు విచారణ మొదలు కాబోతుంది కాబట్టి, ఈ అంశం పై ప్రతి విషయం ప్రజలకు తెలియాలని, ప్రజలే నిర్ణయం తీసుకుంటారని, అందుకే కోర్టులలో జరిగే విషయాలు లైవ్ టెలికాస్ట్ చేయాలని తాను చీఫ్ జస్టిస్ కి సూచించినట్టు ఉండవల్లి తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ విదేశాల్లో ఉందని, మనకు కూడా ఉంటె బాగుటుందని, తాను లేఖ రాసిన విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు. ఇక మరో ముఖ్యమైన విషయం, ఈ రోజు జగన్ ప్రభుత్వం, కోర్టుల విషయం పై చేస్తున్న దా-డి విషయంలో కూడా ఉండవల్లి స్పందించారు.

జడ్జిల పై లేఖలు రాయటం కొత్త కాదని ఉండవల్లి అన్నారు. కానీ ఆ లేఖను ఇలా బహిర్గతం చేయటం తప్పు అని, దీని పైనే ఇప్పుడు చర్చ జరుగుతుందని అన్నారు. ఆ లేఖలో ఉన్న అంశాలు ప్రజల్లో చర్చ అవ్వాలని లేఖ మీడియాకు ఇవ్వటం తప్పా, ఒప్పా అనేది చర్చ అని అన్నారు. కేంద్రం తలుచుకుంటే, ఇలాంటివి కట్టడి చేయవచ్చని ఉండాల్లి చెప్పారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే కోర్టు తీర్పుల పై మొదట అసహనం వ్యక్తం చేస్తే, తరువాత తెలుసుకుని, చట్టాలకు లోబడి పాలన చేసారని, కోర్టులతో ఘ-ర్షణ పడలేదని, అలాగే రాజశేఖర్ రెడ్డికి కూడా అనేక వ్యతిరేక తీర్పులు వచ్చినా, పోరాడారే కానీ, ఘ-ర్షణ పడలేదని చెప్పారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న చర్చ హుందాగా జరిగితే ఉపయోగం ఉంటుందని అన్నారు. న్యాయ వ్యవస్థకు, శాసనవ్యవస్థకు ఘ-ర్షణ మొదలైతే, రాష్ట్రము అల్ల-కల్లోలం అవుతుందని అన్నారు. కోర్టుల పరువు తీయాలనుకుంటే, కోర్టులకు ఏమి అవుతుందని ప్రశ్నించారు ? ఎక్కడైనా కోర్టులు ఇచ్చే తీర్పులు చట్టాలకు లోబడి ఉంటాయని అన్నారు. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, ప్రశ్నించకూడదు అంటే ఎలా అన్నారు. ఇక అమరావతి భూముల పై మాట్లాడుతూ, అక్కడ రాజధాని వస్తుందని తెలిసి, ఎవరైనా కొంటారు, జడ్జీలు కొంటే తప్పు ఏంటి ? జడ్జి కూతురు కొంటే తప్పు ఏంటి ? అక్కడే రాజధాని వస్తుందని ప్రచారం జరిగింది కొన్నారు, ఇప్పుడు రాజధాని లేదు అంటే కొంత మంది అమ్ముకోవటం లేదా ? అని ఉండవల్లి ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read